వడ్డీ కొరడా

మధ్య తరగతి వర్గాలయితే వడ్డీ కొర డాలు చచిచూస్తూనే ఉన్నారు. చాలీ చాలని జీతంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ చదువులకై, పెళ్ళిళ్ళకై చేసిన అప్పులు అసలును దాటిపోతుంటే మరి ఆ వ్యక్తి అప్పు తీర్చటానికి సంపాదనే ధ్యేయంగా పెట్టుకొని అడ్డదారులైనా సరే, సంపాదించి అప్పు తీర్చుకుందామనే పరిస్థితికి ఎవరు తెస్తున్నారు.

మధ్య తరగతి వర్గాలయితే వడ్డీ కొర డాలు చచిచూస్తూనే ఉన్నారు. చాలీ చాలని జీతంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ చదువులకై, పెళ్ళిళ్ళకై చేసిన అప్పులు అసలును దాటిపోతుంటే మరి ఆ వ్యక్తి అప్పు తీర్చటానికి సంపాదనే ధ్యేయంగా పెట్టుకొని అడ్డదారులైనా సరే, సంపాదించి అప్పు తీర్చుకుందామనే పరిస్థితికి ఎవరు తెస్తున్నారు.

అనుపమ మాస పత్రిక సౌజన్యంతో

అన్ని ధర్మాల్లోనూ వడ్డీని నిషేధిం చడం జరిగింది. భువిలో మనిషి దైవానికి ఉత్తరాధికారి. దైవం ప్రసాదించిన వనరు లను మనిషి స్వప్రయోజనాల కోసం కాకుండా సర్వమానవుల సంక్షేమం కోసం, అభ్యుదయం కోసం వినియోగిం చాలి.

దివ్య ఖుర్‌ఆన్‌, ప్రవక్త మహనీ యులు (స) వడ్డీని నిషేధించారు. అల్‌ బఖర 279వ ఆయత్‌లో దివ్యఖుర్‌ఆన్‌ వడ్డీ పుచ్చుకునే వారికి వ్యతిరేకంగా దైవం, దైవప్రవక్త (స) తరఫున యుద్ధం ప్రకటిం చింది. ఖుర్‌ఆన్‌ ఇంతటి తీవ్ర పద జాలాన్ని ఇంకే నేరానికి ఉపయోగించ లేదు. ప్రవక్త మహనీయులు (స) కూడా స్పష్టమైన పదాల్లో రిబాను నిషేధితంగా పేర్కొన్నారు. ఇంకా ఆయన (స) ఇలా అన్నారు: రిబా (వడ్డీ)ని ఇచ్చి పుచ్చుకునే వారిని మాత్రమే దైవం దూషించలేదు, వడ్డీ ఒప్పందాన్ని వ్రాసే వాణ్ణి, దానికి సాక్షు లుగా ఉండేవారిని కూడా దైవం దూషిం చాడు. తెలుసుకోండీ వడ్డీ ఇచ్చిపుచ్చుకునే చర్యను ముప్ఫయి ఆరుసార్లు వ్యభిచారం చేసినంతగానూ, తన స్వంత తల్లిని చెరచినదానికన్నా ఎక్కువ పాపంగానూ ఆయన (స) పేర్కొన్నారు. మరి ఇంత కఠినంగా దైవప్రవక్త వడ్డీని వ్యతిరేకించి నప్పటికీ మనం అనుసరిస్తున్న ఆర్థిక వ్యవస్థ సమంజసమైనదేనా! సమంజసమే అయితే నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షో భంలో ఎందుకు ఉన్నది?

నేటి సమాజంలో మానవ జీవన శైలిని శాసిస్తున్నది ఆర్థిక వ్యవస్థ. మంచి చెడు, దైవధర్మాలతో ప్రసక్తి లేకుండా డబ్బే సర్వం అనే జబ్బుతో బాధపడుతున్నాడు మనిషి. సహాయం అంటే దానికి అర్థం మనకు తెలియదు. సహాయం కోరేవాణ్ణి వడ్డీ అనే పేరుతో నరకయాతనను చూపిస్తాము. భూస్వాముల ద్వారా మొదలైన వెట్టి చాకిరీ వ్యవస్థను నిర్మూలించగలిగాము అంటున్నాము కాని నేటి తరంలో పేద వాడికి వడ్డీకి అప్పులు ఇస్తూ పేదవాడిని ఇంకా పేదరికం ఊబిలోకి లాగుతున్న మన ఆర్థిక వ్యవస్థ పేదరికాన్ని నిర్మూలిం చగలదా? అకస్మాత్తుగా ఏదైనా సమస్య ఎదురైనప్పుడు అవసరం కొద్ది అప్పు అడిగితే మనం కనీసం 3 లేక 4 శాతం వడ్డీ చెల్లించాలి. అది కూడా ఏదైనా తనకా పెడితేనే సాధ్యం. అంటే గుండెపోటు వస్తే డాక్టర్‌ ఖర్చు 3 లేక 4 లక్షలు అంటే మనం అప్పుగా తెచ్చిన 3 లేక 4 లక్షల మీద 3 శాతం వడ్డీ అంటే 9 వేల రూపా యలు నెలకు ఆ వ్యక్తి వడ్డీ చెల్లించాలి. ఆరోగ్య పరంగా ఆ వ్యక్తి స్థిమితపడి తిరిగి సంపాదించి ఆ అప్పు తీర్చుకుందామంటే ఆ వడ్డీ అసలుకు సరిసమానంగా ఉంటుంది. ఆ వ్యక్తి తిరిగి ఆ వడ్డీ తీర్చ గలడో లేదా తిరిగి మళ్లీ గుండెపోటు వస్తదో చెప్పలేము. అంటే మనం నైతి కంగా ఎంతగా దిగజారుతున్నామో అర్థం చేసుకోవాలి.

వడ్డీ వ్యాపారులు, డైలీ ఫైనాన్సర్‌లు అవలంబిస్తున్న వ్యాపార నియమాలు మానవ ధర్మాలేనా? పర్సనల్‌ లోన్‌ , క్రెడిట్‌ కార్డ్‌, ఇంటిపై రుణాలు, వాహనాలపై రుణాలు  అంటూ అధిక వడ్డీలను వసూలు చేస్తూ అప్పు తీర్చలేకపోతున్న సమయంలో వారిని రోడ్డుకు ఈడ్చు తున్నారు. అప్పుల బాధలు భరించలేక ఉరివేసుకొని, విషం త్రాగి చనిపోయిన కుటుంబాలు లెక్కకు రావు, పంట నష్టపోవడంతో రైతు తాను తీసుకున్న అప్పు తీర్చలేక పురుగుల మందు తాగి చనిపోయిన కథనాలు మనకు తెలిసినవే.

మధ్య తరగతి వర్గాలయితే వడ్డీ కొర డాలు చచిచూస్తూనే ఉన్నారు. చాలీ చాలని జీతంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ చదువులకై, పెళ్ళిళ్ళకై చేసిన అప్పులు అసలును దాటిపోతుంటే మరి ఆ వ్యక్తి అప్పు తీర్చటానికి సంపాదనే ధ్యేయంగా పెట్టుకొని అడ్డదారులైనా సరే, సంపాదించి అప్పు తీర్చుకుందామనే పరిస్థితికి ఎవరు తెస్తున్నారు. దీనికి మూలం వడ్డీ వ్యాపారం, అసలు వడ్డీ లేని బ్యాంకింగ్‌ సాధ్యం అని అంటే ఆశ్చర్య పోయే వారు ఎందరో ఉన్నారు. నూటికి నూరు శాతం సాధ్యమేనని చెప్పక తప్పదు. వడ్డీ లేని బ్యాంకింగ్‌ ద్వారానే సర్వ మానవాళి సంక్షేమం సాధ్యపడుతుంది.

 

Related Post