Originally posted 2013-03-08 21:00:47.
ఇస్లాం సందేశం
ఇస్లాం మతం ద్వారా స్త్రీలకు గౌరవం, సమానత్వం దైవం కల్పించాడు. ఇస్లామ్‌కు పూర్వం అరేబియాలో లైంగికపరమైన నీతి తక్కువగా ఉండేది. అసహ్యకరమైన మాటలు వారిని ఇబ్బంది పెట్టేవిగా ఉండేవి. ఇటువంటి అజ్ఞానాంధకారం నుంచి మహిళలను రక్షించడానికి మహా ప్రవక్త (స.అ.స) పూనుకున్నారు. ‘ఒక సమాజాన్ని నిర్మించాలంటే దానిలో భాగస్తులైన అందరిని గౌరవభావంతో చూడాలని, అంతేకాకుండా సంప్రదాయబద్ధమైన సమాజంలో స్త్రీల పాత్రకూడా అనూహ్యమైనదని ప్రవక్త (స.అ.స) భావించారు. దానికిగాను స్వయంగా ప్రవక్త (స.అ.స) కూడా కొన్ని సంఘటనలను ఎదుర్కోవలసివచ్చింది. ఇస్లాం మతం కొత్తలో మదీనా పట్టణానికి మహావూపవక్త (స.అ.స)ను కలిసేందుకు దూరదూర ప్రాంతాల నుంచి ప్రజలు తండోపతండాలుగా వచ్చేవారు. ఇస్లాం కొత్తలో మహా పవక్త (స.అ.స) ప్రత్యేకమైన గది కూడా లేకుండేది. వారు ఒకే గదిలోతన భార్యలతో ఉండేవారు. ప్రవక్త (స.అ.స)ను కలిసేందుకు ప్రజలు మధ్యవర్తిగా వారి భార్య అయేషా (ర.జి) ద్వారా సిఫారసు చేసేవారు. ఈ సందర్భంలో అయేషా (ర.జి) తరచుగా ఇతర పురుషులతో మాట్లాడే అవసరం ఏర్పడేది. దీనిని ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశమున్నదని గ్రహించగలిగారు. అంతేకాకుండా మహావూపవక్త కుటుంబంలో జైనబ్ (ర.జి) వివాహ విందులో కొంతమంది అతిథులు చాలాసేపు ఉండిపోయి అసహ్యంగా ప్రవర్తించారు. ఆ సందర్భంలో మహావూపవక్త (స.అ.స) అల్లాహ్ నుంచి ఒక సందేశం ‘వహి’రూపంగా వచ్చింది. ‘తనకుటుంబాన్ని ఉమ్మాలోని తక్కిన వారికి దూరంగా ఉంచమని’ (సూరా 3336-40)ఆదేశం వచ్చినది. అప్పటినుంచి ముసుగు (పర్‌దా) అవశ్యకత ఏర్పడినది.
ఇస్లాంలో దుస్తులు
హజ్రత్ అబూహురైరా (ర.జి) కథనం ప్రకారం : మహావూపవక్త (స.అ.స) స్త్రీల దుస్తుల్లాంటి దుస్తులను ధరించే పురుషులను, పురుషుల దుస్తులలాంటి దుస్తులను ధరించే స్త్రీలను శపించారు. (అబుదావూద్) ఇస్లామిక్ ధర్మవేత్తల అనుసారం వస్త్రధారణలో 6 ప్రమాణాలు కలవు.
1. దుస్తులు వదులుగా ఉండాలి. మరీ బిగుతుగా ఉండి శరీరాకృతిని బహిర్గతం చేసేదిగా ఉండకూడదు.
2. దుస్తులు పారదర్శకంగా ఉండకూడదు.
3. అతి ఆకర్షణీయంగా, ప్రదర్శిస్తున్నట్టుగా ఆకర్షించే విధంగా దుస్తులు ఉండకూడదు.
4. అవిశ్వాసులకు చెందిన చిహ్నాలు పోలినవై ఉండకూడదు.
5. పురుషులు స్త్రీల దుస్తులు, స్త్రీలు పురుషుల దుస్తులు వేసుకోరాదు. ఎందుకంటే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉన్నది.
6. దుస్తులు కప్పి వుంచాల్సిన భాగం పురుషులకయితే భుజాలనుంచి మోకాళ్ల వరకు, స్త్రీలకయితే ముఖం, చేతులు తప్ప పూర్తి శరీరం.
హిజాబ్ (ముసుగు) – పర్‌దా లేక బురఖా
సృష్టికర్త అయిన అల్లాహ్ పురుషులను సంబోధిస్తూ ఖుర్‌ఆన్‌లో ‘‘మీరు మహిళలను ఏదయినా అడగవలసి వస్తే పరదా వెనుక నిలబడి అడగండి. ఆ విధంగా పరదాను పాటించడమనేది మీయొక్క, వారియొక్క హృదయ పవివూతతకు దోహదకారి అవుతుంది’’ (అహ్ ఔబ్ ఫ 53), అదే విధంగా ఖుర్‌ఆన్‌లో మరోచోట ‘‘ఓ మహిళల్లారా ఒకవేళమీరు ధర్మపారాయణులైన మహిళల్లాగా ఉండదలుచుకుంటే ఏ పురుషునితోనైనా మాట్లాడే సందర్భంలో మృదువైన, నాజూకైన, తియ్యని స్వరంతో మాట్లాడే ధోరణి అవలంబించకండి. ఎందుకంటే పురుషుని హృదయంలో దురాశ ఉన్నట్లయితే అతడు మీ పట్ల ఆసక్తి చూపనారంభించే అవకాశం ఉన్నది. (అహ్ ఔబ్ : 32) వాస్తవానికి 1400సంవవత్సరాల క్రితమే ఇస్లామ్‌లో మహిళల గురించి, పరదా గురించి, మహా ప్రవక్త (స.అ.స)అన్ని కోణాల్లో పరికించారు. బురఖా (ముసుగు) మహిళలకు స్వేచ్ఛ నుంచి దూరం చేస్తుందని కొందరి వాదన.
అంతేకాకుండా మహిళ పట్ల అణిచివేత అని భావిస్తారు. ఇది ముమ్మాటికీ తప్పుడు ధోరణి. సామాజికంగా విశ్లేషించినట్లయితే సమాజంలో అత్యధికంగా వేధింపులకు గురయ్యేది మహిళలు మాత్రమే అనేది గ్రహించవలసి ఉన్నది. పర్‌దాలో ఉన్న స్త్రీ గౌరవ మర్యాదలతో, ఆత్మ విశ్వాసంతో తనదైన ప్రత్యేకతతో ఉంటుంది. ఆమె ముఖంపై అణచివేత గాయాలు మచ్చ ఉండదు. బురఖా ఒక సంరక్షణ కవచం మాత్రమే. బురఖా ధరించిన స్త్రీలు అభివృద్ధిలో ఎక్కడ ఆటంకం కలుగలేదు. బురఖా(పర్‌దా)ధరించి కూడా గొప్ప, గొప్ప పదవులు, విద్యావంతులు, మేధావులుగా సమాజంలో మనగలుగుతున్నారు. ఇందులో మహిళల గౌరవ భావం కలిగింది కానీ కించపరచినట్లు ఎక్కడా అనిపించలేదు. నేటి ఆధునిక సమాజంలో ఫ్యాషన్ పేర వికృతమైన సంస్కృతిని అభివృద్ధి చేసి అలవాటు చేసుకుంటున్నారు. స్త్రీ స్వేచ్ఛ పేరిట విచ్చలవిడితనం అధికంగా ప్రచారం జరుగుతుంది. సమాజంలో స్త్రీలు ఒక ఆటవస్తువులుగా, ఒక వినియోగ వస్తువుగా పెద్ద వ్యాపార సంస్థలు, తమ వ్యాపార ప్రకటనల పేర స్త్రీలను నడి బజారులో అంగాంగ ప్రదర్శనలు చేయిస్తున్నారు. అందులో ప్రసార మాధ్యమాలైన టీవీ, సినిమా, పత్రికా ప్రకటనల్లో స్త్రీలను తమ ఇష్టవూపకారం వినియోగించుకోవడం విచారకరం. దీనికి స్వేచ్ఛ అనే పేరు పెడుతున్నారు. ఇది కేవలం స్త్రీలను మోసంగించడమే తప్ప వేరే లేదని గ్రహించవలసి ఉన్నది.
స్త్రీ అన్ని హక్కులను పొందుతూ సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉండాలంటే.. ఇస్లాం పరదా పద్ధతిలో రక్షణ, భద్రత గౌరవం ఉన్నదని గ్రహించవలసి ఉన్నది. మహావూపవక్త (స.అ.స). పరస్త్రీ మీద యాదృచ్చికంగా దృష్టి పడితే వెంటనే దృష్టి మరల్చుకోవాలని తదేకంగా చూస్తూ ఉండి పోకూడదని, ఎందుకంటే దానివల్ల మనసులో కోరిక పుడితే అది పాపంగా, కంటి వ్యభిచారంగా పరిగణించాలని అన్నారు. దైవం కల్పించిన సముచిత స్థానాన్ని కాపాడుకునే బాధ్యత అందరిపైన ఉన్నది. ఇస్లామ్ ధర్మానుసారం వస్త్రధారణ, బురఖా పాటిస్తూ దుస్తులతో పాటు చూపులు, మనస్సు, ఆలోచన, ఉద్దేశాలు, భావవ్యక్తీకరణతో పాటు ప్రవర్తనల్లో కూడా హిజాబ్ అనుసరించవలసి ఉన్నది. నిజమైన విశ్వాసి ఇహ, పరలోకాల్లో నమ్మకం ఉంచి మహావూపవక్త (స.అ.స)గారు అనుసరించి, ఆచరించిన విధానాన్ని అమలు చేయవలసి ఉన్నదని ఆశిస్తూ ఆమీన్.. సుమ్మా ఆమీన్.