వుజూ వివరణ

వుజూ ఆదేశాలు
ఇస్లామీయ ఆరాథనలు పుస్తకం నుండి
దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ఏ వ్యక్తి అయినా వుజూ చేసిన తరువాత ఈ క్రింది ‘దుఆ’ పఠిస్తే అతని కోసం స్వర్గానికున్న ఎనిమిది ద్వారాలు తెరువబడతాయి. అతను తాను కోరిన ద్వారం గుండా స్వర్గంలోకి ప్రవేశిస్తాడు. (ముస్లిం)
వుజూ తర్వాత చేసే దుఆ
 అష్‌హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్‌ాదహూ లా షరీకలహూ వఅష్‌హదు అన్న ముహమ్మదన్‌ అబ్దుహూ వ రసూలుహూ, అల్లాహుమ్మజ్‌ అల్‌నీ మినత్తవ్వాబీన వజ్‌అల్‌నీ మినల్‌ ముతతహ్హిరీన్‌. (ముస్లిం,తిర్మిజీ)
(అల్లాహ్‌ా తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని ఆయన ఒక్కడేననీ, ఆయనకు సాటి రాగలవారెవరూ లేరని నేను సాక్ష్యమిస్తున్నాను. ఇంకా ముహమ్మద్‌(స) దేవుని దాసులు మరియు దైవప్రవక్త అని కూడా నేను సాక్ష్యం పలుకుతున్నాను. దేవా! నన్ను పశ్చాత్తాపం చెందేవానిగా, పరిశుభ్రతను పాటించేవానిగా చెయ్యి.)
వుజూను భంగపరిచే విషయాలు వుజూ నాలుగు విషయాల వల్ల భంగమవుతుంది.
1. మలమూత్ర మార్గాల గుండా ఏదయినా వస్తువు విసర్జింపబడటం. (బుఖారీ)
2. మత్తు లేక అపస్మారక స్థితికి లోనవటం, గాఢ నిద్ర. (అబూదావూద్‌)
3. వస్త్రం అడ్డం లేకుండా మర్మాంగాన్ని ముట్టుకోవటం. (తిర్మిజి)
4. ఒంటె మాంసం తినటం వల్ల. (ముస్లిం)
గమనిక: ఏ కారణాల మూలంగానయితే గుసుల్‌ భంగమవుతుందో వాటి మూలంగా వుజూ కూడా భంగమవుతుంది. ఉదా: సంభోగం, బహిష్టు స్రావం మొదలగునవి.
వుజూకు సంబంధించిన ఆదేశాలు
1. ఒక వుజూతో ఎన్ని నమాజులైనా చేసుకోవచ్చు. (ముస్లిం)
2. కడగవలసిన అవయవాల్లో గోరంత భాగం పొడిగా ఉన్నా మళ్ళీ
   సరిక్రొత్తగా వుజూ చేయవలసి ఉంటుంది. (ముస్లిం)
3. వుజూలో అవసరానికి మించి నీళ్ళు వాడకూడదు. (అహ్మద్‌)
4. జిగటగా ఉండే పదార్ధాలు తిన్నప్పుడు లేదా త్రాగినపుడు 5.వుజూలో నోటిని నీళ్ళతో పుక్కిలించాలి. (బుఖారీ-ముస్లిం)
6. గోళ్ళకు రంగు వేసుకొని వుజూ చేస్తే ఆ వుజూ నెరవేరదు.(తిర్మిజీ)

Related Post