
జకాత్ ఇవ్వడం ఒక పవిత్ర బాధ్య తగా భావించబడుతుంది. పేదవారు తమ హక్కు పొందటలో తృప్తి పడతారు. ఇస్లాం ప్రకారంగా కలిమి అయినా లేమి అయినా అల్లాప్‌ా తమకు ప్రసాదించిన స్థితిని దైవా జ్ఞగా స్వీకరిస్తారు. కాబట్టి వ్యక్తుల మధ్య కలతలకు కల్మషాలకు తావు ఉండదు.
కాత్ ఇస్లాం ప్రధాన సూత్రాల్లో ఒకటి. ఖుర్‌ఆన్‌లో ఎక్కడ నమాజ్ ప్రాముఖ్యత చెప్పబడిరదో అక్కడ జకాత్ ఆవశ్యకత కూడా చెప్పబడిరది. ఖుర్‌ఆన్‌లో 82 సార్లు జకాత్ పదాన్ని నమాజ్‌లో జోడిరచి ఆదేశించబడిరది. మరో 30 చోట్లా సామాజిక సమానత్వానికి జకాత్ అవసరాన్ని గురించి పేర్కొనడం జరిగింది.
జకాత్ అన్న పదం, ‘జకాప్‌ా’ అన్న పదం నుండి వచ్చింది. జకాప్‌ా అంటే వృద్ధి, పెరుగుదల, విస్తారంగా విస్తరించిన వృక్షం, దీని మరో అర్థం పరిశుద్ధత.
ప్రవక్త ముహమ్మద్(స)జకాత్ గురించి ఈ విధంగా తెలియజేశారు. ‘‘జకాత్ సంప న్నుల నుండి వసూలుచేయబడి నిరుపేద లకు అందజేయబడుతుంది.’’
ఒక వ్యక్తి తన జీవితావసరాలు తీరిన తరువాత మిగిలిన ధనం ఒక సంవత్సర కాలం నిలువ ఉన్నట్లైతే ఆ ధనం నుండి 2.5% జకాత్ తీయబడుతుంది. ఇది దైవ నియమం.
నిల్వ ఉన్న సంపదపై జకాత్‌తీయడం ధనవంతుల విధి అయితే, తీసుకోవడం పేదవారి హక్కు. జకాత్ ఇచ్చేవారికి ఇచ్చే టప్పటి పెద్దరికం కనబడదు. అదేవిధంగా తీసుకునే వారు తక్కువగానూ భావిం చరు. ఎందుకంటే, జకాత్ దైవశాసనం కాబట్టి. ఇది దైవభీతితో భక్తితో చేయబడే ఆరాధన. జకాత్ ఇవ్వడం వల్ల మనుషుల లోని డబ్బు ప్రీతి, పిసినారితనం దూరమై దీని స్థానంలో అగత్యపరుల పట్ల కరుణ, జాలి, బాధ్యతాభావం అలవడుతాయి. జకాత్ ఇవ్వడం వల్ల సంపదలో ఎలాంటి తరుగుదల ఉండదు. పైగా శుభం కలుగుతుంది మరియు ఆత్మ ప్రక్షాళనం గావించబడుతుంది.
వ్యక్తులు స్వచ్ఛందంగా ఇచ్చే జకాత్ సమాజ ఆర్థిక సమతుల్యానికి, ఆర్థిక పరిపుష్టికి దోహదం చేస్తుంది. జకాత్ పేదవారి అవసరాలు తీర్చుతుంది కాబట్టి సమాజంలో సాంఘికంగా ఆరోగ్యవంత మైన మార్పులు సంభవిస్తాయి. అగత్య పరుల అవసరాలు తీరుతాయి. కావున ధనవంతులపై పేదవారికి ఈర్ష్య కలుగదు. సంపన్నులకు ఎలాగైనా సరే దోచుకోవాలన్న భావన పేదవారిలో అంకు రించదు. ధనవంతుల నుండి పేదవారికి పంచాలన్న విప్లవాలు పుట్టవు.
జకాత్ ఇవ్వడం ఒక పవిత్ర బాధ్య తగా భావించబడుతుంది. పేదవారు తమ హక్కు పొందటలో తృప్తి పడతారు. ఇస్లాం ప్రకారంగా కలిమి అయినా లేమి అయినా అల్లాప్‌ా తమకు ప్రసాదించిన స్థితిని దైవా జ్ఞగా స్వీకరిస్తారు. కాబట్టి వ్యక్తుల మధ్య కలతలకు కల్మషాలకు తావు ఉండదు.
సాధారణంగా జకాత్ చెల్లింపు చాలా మంది నిర్దిష్టంగా లెక్కించరు. కాని జకాత్ దైవ నిర్దేశము. ఇది ఇస్లాంను విశ్వసించే వారిపై విధి. ఇది ఒక ఆదాయపు పన్ను లాంటిదే. కాని ప్రభుత్వం నిర్ణయించిన పన్ను కాదు. ప్రభుత్వాలు నిర్ణయించిన పన్నులు కాలానుగుణంగా మార్పు చెందు తాయి. కాని జకాత్ పరిమితి 2.5% ఎప్పుడూ మారదు. అదీ నిర్దిష్ట ఆదాయం కలిగినవారే చెల్లించాలి. నిజానికి ఉన్న వారని, లేనివారన్న అంతరాన్ని తొలిగించ డానికి ఇస్లామ్ చాలా చక్కని ఏర్పాటు చేసింది. ప్రతి ఏటా ఖచ్చితంగా వచ్చే జకాత్ చెల్లింపులతో పేదరికాన్ని పారద్రోల డమే కాదు, పేద ధనిక వర్గాల మధ్య వైమనస్యాలు లేని ఒక గొప్ప సత్స మాజాన్ని స్థాపించవచ్చు. ఇలాంటి సామాజిక సమతుల్యం ఏర్పాటు చేయ డం ఇస్లాంలో జకాత్ ముఖ్య ఉద్దేశం. ఇది రెండవ ఖలీఫా హజ్రత్ ఉమర్ (రజి) కాలంలో విరాజితం కావటం చరిత్రలో నిదర్శనంగా నిలిచిపోయింది. ఉమర్ (రజి) పరిపాలనా కాలంలో ప్రతి ఒక్కరు జకాత్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు కాని తీసుకునేవారు లేరు.
జకాత్ చెల్లించని వారికి పరలోకంలో భయానక శిక్ష తప్పదు. అల్లాప్‌ా ప్రసాదిం చిన వనరులతో జకాత్ చెల్లించే శక్తి ఉండి జకాత్ ఇవ్వకపోతే అల్లాప్‌ా దృష్టిలో ఆ స్థానం చాలా నికృష్టమైనది. జకాత్ వ్యక్తి గతంగా కాకుండా సామూహికంగా చెల్లిం చాలి. దీనిలో అనేక లాభాలు నిబిడీకృ తమై ఉన్నాయి. ప్రతి ఒక్కరు జకాత్ ఆవశ్యకత గుర్తించగలిగితే సమాజానికి ఆర్థికంగా ఎంతో ఉపకరిస్తుంది.
‘‘దైవమార్గంలో ధనం ఖర్చుపెట్టేవారి ధనాన్ని ఈ విధంగా పోల్చవచ్చు. ఒక విత్త నాన్ని నాటగా అది మొలచి ఏడు వెన్ను లను ఈనింది. ప్రతి వెన్నుకూ నూరేసి గింజలు ఉన్నాయి. ఈ విధంగా దేవుడు తాను తలచిన వారి సత్కార్యాన్ని వృద్ధి చేస్తాడు.’’
షరియత్ (ధర్మశాస్త్రం) ప్రకారంగా నిసాబ్ అంటే పరిమితికి మించిన మూల ధనం కలిగిన వ్యక్తిని సాహెబె నిసాబ్ అంటారు. అంటే, జకాత్ చెల్లించేందుకు మూలధనం కలిగిన వ్యక్తిని అని అర్థం.
1. వెండి, బంగారాల పరిమితి
అధిక ధర్మవేత్తల ప్రకారం వెండి 521/2 తులాలు అంటే, దాదాపు 609 గ్రాముల వెండి ఉన్నట్లయితే, ఒక సంవత్సరం గడిచిపోతే వారిపై జకాత్ విధి అవుతుంది. అంత కంటే తక్కువ వెండిపై జకాత్ లేదు.
71/2 తులాల బంగారం అనగా దాదాపు 67 గ్రాముల బంగారం ఉండి ఒక సంవత్సరం గడిచిపోతే వారిపై జకాత్ విధి అవుతుంది. జకాత్ చెల్లించే వ్యక్తి ప్రతీ సంవత్సరం ఆ సొమ్ముపై 21/2శాతం నగదు చెల్లించాలి. ఒకవేళ డబ్బు రూపేణ జకాత్ చెల్లించే స్థోమత లేనట్లయితే ఆయా వెండి, బంగారం రూపేణ జకాత్ చెల్లించాలి.
వెండి, బంగారం ఏరూపంలో ఉన్నా సరే, జకాత్ చెల్లించవలసిందే. వెండి, బంగారాలతో చేయబడిన నాణాలు, కడ్డీలు, బిస్కెట్లు, తీగలు, రేకులు, ఆభరణాలు, బట్టలలో కలిపివేయబడిన వెండి బంగారు, జల్తారు ఎంబ్రాయిడరీ మొదలయిన ప్రతీదానిపై జకాత్ తప్పకుండా చెల్లించాలి.
2. వ్యాపార సరుకుల మీద జకాత్
వ్యాపారం ప్రారంభించిన తేదీ నుండి ఒక సంవత్సరం గడచిన తర్వాత వ్యాపారంపై పెట్టుబడి ఎంత ఉందో లాభం ఎంత ఉందో లెక్కగట్టాలి. ఈ రెంటివిలువ కలిసి జకాత్ పరిమిత మూల ధనానికి అంటే నిసాబ్‌కు చేరినట్లయితే జకాత్ తప్పకుండా ఇవ్వాలి.
3. వృక్ష సంపదపై జకాత్ (ఉష్ర్)
‘ఉష్ర్’ అనే అరబీ పదానికి శాబ్దిక అర్థం ‘పదోవంతు’ అని.
వర్షం వల్ల పండే ధాన్యాలు, ఫలా లలో 10వ వంతు, నీరు తోడి పండిరచే వాటిలో 20వ వంతు ఉష్ర్ చెల్లించాలి. సంవత్సరంలో ఎన్ని పంటలు పండినా, ఎన్నిసార్లు పండినా ఉష్ర్ తప్పకుండా చెల్లించాలి. ఉదాహరణకు అన్నిరకాల ధాన్యాలు, వేరుశనగ, పండ్లు, కూర గాయలు తేనె … మొదలయినవి.
4. పశుసంపదపై జకాత్
మైదానంలో మేపబడే పశువులు 40 మేకలు లేదా గొర్రెలు ఉన్నట్లయితే ఒక మేక లేక గొర్రె విధిగా జకాత్‌గా తీయ వలసి ఉంటుంది.
జకాత్ సంపదకు అర్హులయినవారు
దివ్య ఖుర్‌ఆన్‌లో 8 రకాల వారిని జకాత్ స్వీకారయోగ్యులు అని పేర్కొంది. ఆ 8 మంది వరుసగా :
1. అగత్యపరుడు (ఫకీర్)
వీరు కడు పేదవారు. జకాత్ విధికి కావలసినంత సంపదలేనివారని అర్థం. జీవనోపాధికి కావలసిన ఆస్థిపాస్తులు లేక పని చేసే శక్తిగాని, యోగ్యతగాని లేని వ్యాధిగ్రస్తులు, వికలాంగులు, అనాథలు, వితంతువులు మొదలయిన వారు.
2. ఆత్మాభిమానిjైున నిరుపేద (మిస్కీన్)
మిస్కీన్ అంటే ఎంత కష్టపడినా ఇళ్ళు గడవనివారు. ఒక్కోసారి పూట కూడా గడవని, ఎంత అవసరమున్నా ఇతరుల ముందు చేయ చాపటానికి ఇష్ట పడని ఆత్మాభిమానం గల నిరుపేద అని అర్థం.
3. జకాత్ వసూలు చేసే ఉద్యోగి (ఆమిల్ సదఖా)
ఇస్లామీయ ప్రభుత్వం జకాత్ వసూలు చేయడానికి నియమించిన ఉద్యోగి ఎంతటి స్థితిపరుడైనా సరే, అతని జీతం జకాత్ నుండే చెల్లిస్తారు.
4. హృదయాలను చూరగొనటానికి (తాలిఫె ఖులూబ్)
అతి ముఖ్యమైన ధార్మిక, జాతీయ ప్రయోజనాల కోసం వ్యక్తుల హృదయా లను ఆకట్టుకోవటానికి వారికి కూడా జకాత్ ఇవ్వవచ్చు.
5. బానిస విముక్తి (రిఖాబ్)
జకాత్ డబ్బుతో బానిసలను విముక్తి గావించాలి. కాని ఈరోజులో ్ల బానిసత్వ ఆచారం లేనందువల్ల జైలు శిక్ష అనుభవించే అమాయకుల్ని విడిపించడా నికి ఉపయోగించవచ్చు అని ధర్మవేత్తలు తెలియజేశారు.
6. రుణభారంతో సతమతమవు తున్న రుణగ్రస్తుడు (గారిమ్)
రుణగ్రస్తునికి, ఆస్థి నష్టానికి గురైన వారికి, వ్యాపారంలో దివాళా తీసినవారు. ప్రకృతి వైపరీత్యం వల్ల సర్వస్వం కోల్పో యినవారు. జకాత్ తీసుకోవడానికి అర్హులయినవారు. అయితే వ్యభిచారం, మద్యపానం, జూదం లాంటి దురలవాట్లకు లోనై అప్పులపాలైనవారు. జకాత్‌కు అర్హులు కారు అని ధర్మవేత్తల అభిప్రాయం.
7. నిర్థనుడైన బాటసారి (ఇబ్నుస్బబీల్)
ప్రయాణంలో ఉన్నవారు ఎవరైనా సరే, ప్రయాణస్థితిలో హటాత్తుగా ఏదైనా ఆపదకు గురైన బాటసారులకు జకాత్ ఇవ్వవచ్చు.
8. దైవమార్గం (ఫీ సబీలిల్లా)
దైవ ధర్మస్థాపనకోసం, ధర్మప్రచార నిమిత్తం చేసే ప్రతిపని కోసం జకాత్ వినియోగించాలి. ఇలా ప్రతి ధనికుడు ప్రతి రైతు తన సంపద నుండి జకాత్, ఉష్ర్ తీసి పేదసాదలకు అందజేయాలి. ప్రజలను ఆదుకోవడంలోనే మానవత్వం దాగి ఉంది.
నిజానికి సంక్షేమ కార్యక్రమాలను స్వచ్ఛంద సంస్థలు నిర్వహించడం, ఈ సంస్థలకు అనేకమంది విరాళాలు ఇవ్వడం చాలా దేశాల్లో జరుగుతుంది. పాశ్చాత్య దేశాల్లో ఎన్‌జిఓ సంస్థలు ప్రజా సంక్షేమ పని చేస్తున్నాయి. కాని ఆర్థిక వ్యవస్థ కుదేలయినప్పుడు ప్రజలలో విరాళాలు ఇవ్వాలన్న స్ఫూర్తి ఎక్కడి నుండి లభిస్తుంది.
సంక్షేమ కార్యక్రమాలు ఎల్లప్పుడు అమలుచేయడానికి జకాత్‌కన్నా ఉత్తమమైన మార్గం మరొకటి లేదు.
ఐక్యరాజ్య సమితికి చెందిన లెక్కల ప్రకారం 2000 కోట్ల నుంచి 10000 కోట్ల అమెరికా డాలర్లు అంటే ఇప్పటి లెక్కల ప్రకారం 120000 కోట్ల రూపాయల నుంచి 6000000 కోట్ల రూపాయల వరకు ఏటా ప్రపంచవ్యాప్తంగా ముస్లిములు జకాత్ చెల్లిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మానవీయ సహాయంగా అంటే హ్యూమనిటేరియన్ ఎయిడెడ్‌గా అందుతున్న మొత్తాలతో పోల్చితే ఇది ఎంతో ఎక్కువ. ఎంత తక్కువగా లెక్కలు వేసినా హ్యూమానిటేరియన్ ఎయిడ్ కన్నా దాదాపు 15 నుంచి 20 రెట్లు ఎక్కువ మొత్తం జకాత్‌గా పంపిణి అవుతుంది.
ఇస్లామీ ఆర్థిక వ్యవస్థ సమాజంలో ఆర్థిక రుగ్మతలకు ప్రతిపాదించే పరిష్కారాలు సమాజ నిర్మాణానికి ఎంతో అనువైన పరిష్కారాలు. బ్యాంకింగ్ విషయంలోనూ ఇస్లాం వడ్డీని నిషేధిస్తుంది. వడ్డీ రహిత ఇస్లామ్ బ్యాంకింగ్ నియమాల గురించి నేడు బ్యాంకులు ఆసక్తిని చూపిస్తున్నాయి. భాగస్వామ్యం ప్రాతిపదికన బ్యాంకింగ్ జరగాలన్నది ఇస్లామీ విధానం. ఈ విధానంలో సమాజ సంపద ఒకేచోట పోగుపడకుండా, సంపద పంపిణీ జరిగే ఏర్పాటు చేస్తుంది.