అయ్యో! ముస్లింలు లోకానికి నైతికతను నేర్పించడం మరచి పోయారు.
సత్యధర్మ మార్గం మీదకు జనుల్ని తేవడం మరచి పోయారు.
అల్లాహ్ను మరచిన దాసుల గురించి ముస్లింలకు చింతన లేదు.
అల్లాహ్ దాసులకు అల్లాహ్ సందేశాన్ని విన్పించడం మరచి పోయారు.
ధర్మం విశ్వ వ్యాప్తంగా లేదు అన్న షికాయతు అయితే ఉంది. కానీ
దీపపు పురుగులు ఎలా వస్తాయి? దీపం వెలిగించడం మరచి పోయారు.
ఎంత గడ్డు కాలం, ప్రజల్లో మచ్చుకయిన మానవత్వం లేదు.
గొడవ పడే ఇద్దరిని కలపడం ఇప్పుడు జనులు మరచి పోయారు.
క్రీయా రంగంలో వారి క్రీయాశూన్యతే వారిని వెక్కిరిస్తోంది.
నిన్నటి వరకు ముందుండేవారు నేడు పాదం కదపడం మరచి పోయారు.
వారు ఏమేం మరచారని చెప్పాలి, వారికెమేం గుర్తుందనాలి.
పడ్డ వాళ్ళను ఎత్తడం మరచి పోయారు. నిద్రిస్తున్న వారిని తట్టి లేపడం మరచి పోయారు.
అసలు చేయాల్సిన కార్యం ఆ కార్యం గుర్తు లేదు ఎవరికీ.
అలిగినవారిని రాజీ పరచ్చడం మరచి పోయారు. ఏడ్చేవారిని నవ్వించడం మరచి పోయారు.
పండిత వర్గం ఇప్పటికీ మత్తు నిద్రలో ఉండటం మిక్కిలి విచారకరం.
తిరోగతిని గుర్తు చేసి ముస్లిం సమాజాన్ని చైతన్య పర్చడం మరచి పోయారు.
ఎవరి ఆరాధ్య దైవం ఒక్కడో, ఆదర్శప్రవక్త ఒక్కరో, ఖిబ్లా కూడా ఒక్కటో.
వారు విభేదాలు సృష్టిస్తున్నారు, ఒండొకరిని కలపడం మరచి పోయారు.
ఎప్పటి నుండి ముస్లిం జన స్థితి ఇలా మారి పోయిందో అప్పటి నుండి
దుఃఖ తీవ్రతతో శాంతి ప్రియులు సంతోష సంబరాలు మరచి పోయారు.
మౌలానా అబుల్ బయాన్ హమ్మాద్ గారి కవితకు స్వేచ్ఛానువాదం.