ఆది దంపతులయిన ఆదమ్ మరియు హవ్వా (అ) స్వర్గ బహిష్కరణకు కారణం – వారు తమ స్వయంపై చేసుకున్న దౌర్జన్యం. ఖాబీల్ దైవ అభిశాపానికి గురవ్వడానికి కారణం – తాను తన సోదరుడయిన హాబీల్‌పై చేసిన దౌర్జన్యం. నూహ్ (అ) వారి జాతి జల ప్రళయానికి గురవ్వడానికి కారణం – మానవ చరిత్రలో మొది సారి అల్లాహ్ విషయంలో వారు పాల్పడిన షిర్క్ – దౌర్జన్యం. నమ్రూద్ చావు ఒక చిన్నపాటి దోమ వల్ల జరగడానికి కారణం – సత్య నిరాకరణతో పాటు, తాను ప్రవక్త ఇబ్రాహీమ్ (అ)పై జరిపిన దౌర్హన్యం. నియంత ఫిరౌన్ నశించడానికి కారణం – తానే దైవం అన్న అహంకారంతోపాటు ఇస్రాయీల్ ప్రజలపై చేసిన దౌర్జన్యం. ఖారూన్ వినాశనానికి కారణం – ధనం ఉందన్న అహంతో సామాన్య జనంపై చేసిన దౌర్జన్యం. ఆద్ మరియు సమూద్ జాతులు అంతమవ్వడానికి కారణం – దౌర్జన్యం, అబూ జహల్, అబూ లహబ్ విం వారు నశించడానికి కారణం – దౌర్జన్యం. ఒక్క మాటలో చెప్పాలంటే దౌర్జన్యం చేసేవారు ప్రతి కాలంలోనూ బలం, అధికారం, పేరు-పలుకుబడి గలవారే. అయినా వారికి ప్టిన గతి మాత్రం దుర్గతే. ఇదే దైవ నియమం. ‘న్యాయ పరిపాలన అది అవిశ్వాసులదయినా దేవుని అండదండలు దానుకుంటాయి. దౌర్జన్య పాలన అది ముస్లిములదయినా దానికి దేవుని సహాయ సహకారాలు ఉండవు’ అని ఇమామ్ ఇబ్ను తైమియా (రహ్మ) చెప్పిన మాటలోని ఆంతర్యం ఇదేనేమో!.
”ఎన్నో పట్టణాలను మేము తుడిచి పెట్టేశాము. ఎందుకంటే అవి దుర్మార్గానికి, దౌర్జన్యానికి ఒడిగ్టాయి. అవి తమ కప్పులపై తల క్రిందులుగా పడి ఉన్నాయి. ఎన్నో బావులు పాడు పడి ఉన్నాయి. మరెన్నోపటిష్టమయిన ఎత్తయిన కోటలు నిర్మానుష్యంగా ఉన్నాయి”. (అల్ హజ్జ్: 45)
న్యాయం వల్ల నిర్మాణం జరిగితే, దౌర్జన్యం వల్ల విచ్ఛిన్నం చోటు చేసుకుంటుంది. పై ఆయతులో ఇదే విషయం విశద పర్చడం జరిగింది. అరబీలో దౌర్జన్యాన్ని ‘జుల్మ్; అంటారు. భాషా పరంగా ‘జుల్మ్’ అంటే, ‘ఒక వస్తువును దాని చోటు కాని చోట పెట్టడం, షరీయతు గీసిన సరిహద్దు రేఖను దాటడం’అన్నారు కఫవీ (రహ్మ). ‘సమస్త వ్యవహారాల్లో మధ్యే మార్గం నుండి వైదొలగడం, ఒకరి హక్కు విషయంలో ఎక్కువ, తక్కువ చేయడం, ఒకరి సొమ్మును అన్యాయంగా కాజేయడం జుల్మ్’ అన్నారు ఇమామ్ జాహిజ్ (రహ్మ).
దౌర్జన్య స్థాయి:
అ) దౌర్జన్యం చెయ్యడంలో మితిమీరిపోయి సత్యానికి దూరంగా జీవించే వ్యక్తి సత్యం వైపు మరలి రావడం బహు కష్టం. ఆ) దౌర్జన్యానికి వీలయినంత వరకూ దూరంగా ఉంటూ సత్యానికి దగ్గరగా ఉండే వ్యక్తి మానవ దౌర్భల్య కారణంగా ఒకవేళ దౌర్జన్యానికి పాల్పడినా కనువిప్పు కలిగి సత్యం వైపునకు మరలడం అతి సులభం.
దౌర్జన్య రకాలు:
1) దాసునికి మరియు దైవానికి మధ్య చోటు చేసుకునే దౌర్జన్యం: ఈ రకపు దౌర్జన్యంలో ఘోరమయినది, దైవాగ్రహాని కి గురి చేసేది-తిరస్కారం (కుఫ్ర్), నాస్తికత్వం (ఇల్హాద్), బహుదైవ భావన (షిర్క్), కాపట్యం (నిఫాఖ్). అల్లాహ్ ఇలా అన్నాడు:
”అల్లాహ్‌కు అబద్ధాన్ని అంట గట్టేవాడికన్నా పరమ దుర్మార్గుడు ఎవ డుాండు? ఇలాిం వారంతా తమ ప్రభువు సమక్షంలో హాజరు పరచ బడతారు.”తమ ప్రభువుపై అసత్యాలు కల్పించినవారు వీళ్ళే” అని సాక్షులు సాక్ష్యమిస్తారు. వినండి! (అలాిం) దుర్మార్గులపై అల్లాహ్ శాపం పడుతుంది”. (హూద్: 18)
2) దాసునికి సృష్టిరాసులకు మధ్య చోటు చేసుకునే దౌర్జన్యం: ”అప కారానికి బదులు అటువిం అపకారామే. కాని ఎవరయినా (ప్రత్యర్థిని) క్షమించి, సయోధ్యకు వస్తే అతనికి పుణ్యఫలం ఇచ్చే బాధ్యత అల్లాహ్‌ది. ఎట్టి పరిస్థితిలోనూ అల్లాహ్ దుర్మార్గులను ప్రేమించడు”. (షూరా: 40)
”ఇతరులపై దౌర్జన్యానికి ఒడిగట్టే, అకారణంగా,సత్యరహితంగా భువిలో అరాచకాన్ని సృష్టించేవారిని మాత్రమే (నిందార్హులుగా నిలబెట్టే) మార్గ ముంటుంది. అలాంటి వారి కోసం బాధాకరమయిన శిక్ష ఉంది”. (షూరా: 42)
3) దాసునికి అతని స్వయానికి మధ్య చోటు చేసుకునే దౌర్జన్యం: ”మరి వారిలో కొందరు తమ ఆత్మలపై దౌర్జన్యానికి ఒడిగడుతున్నారు”. (ఫాతిర్: 32)
పై పేర్కొనబడిన మూడు రకాల దౌర్జన్యాలు వాస్తవంగా వ్యక్తి తన స్వయంపై చేసుకునే దౌర్జన్యంగానే ఉంాయి. ఎందుకంటే ఏ దౌర్జన్యా నికయినా పడే శిక్షను అనుభవించాల్సింది వ్యక్తి అయిన తనే గనక.
దౌర్జన్య పరుల రకాలు:
1) అగ్ర శ్రేణి దుర్మార్గుడు: దుర్మార్గుల్లో, దౌర్జన్యపరుల్లో పరమ దుర్మా ర్గుడు నిజ ఆరాధ్యుడయిన అల్లహ్ శాసన పరిధిలోకి రావడానికి ఒప్పుకోని వాడు.”లుఖ్మాన్ తన కుమారినికి హితబోధ చేస్తూ ఇలా అన్నాడు: ‘ఓ నా కుమారా! అల్లాహ్‌కు భాగస్వాముల్ని కల్పించకు, నిస్సందేహంగా అల్లాహ్‌కు భాగస్వాముల్ని కల్పించడం (షిర్క్ చేయడం) ఘోరమయిన దౌర్జన్యం”. (లుఖ్మాన్: 13)
2) మధ్య స్థాయి దౌర్జన్యపరుడు: ప్రభుత్వంగానీ, రాజుగానీ షరీయతు పరిధిలో ప్రజా జీవన సౌలభ్యం కోసం చేసిన చ్టాన్ని గౌరవించని, పాటించని వాడు. ”ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు విధేయత చూపండి. మరియు ప్రవక్త (స)కు విధేయత చూపండి. మరియు మీలోని అధికారులకు కూడా విధేయత చూపండి. ఆపైన ఏదేని విషయంలో మీ మధ్య వివా దం తలెత్తితే దాన్ని అల్లాహ్ మరియు ప్రవక్త (స) వైపునకు మరల్చండి – మీకు నిజంగా అల్లాహ్‌పై, అంతిమ దినంపై నమ్మకం ఉన్నట్లయితే (మీరిలా చేయడం అవశ్యం)! ఇదే మేలయిన పద్ధతి. పరిణామం రీత్యా కూడా ఇదే అన్నింకంటే ఉత్తమమైనది”. (అన్నిసా: 59)
3) మైనర్ స్థాయి దౌర్జన్యపరుడు: తన స్వయానికి మేలు చేసే పనుల్ని సయితం వదిలేసి కాలయాపన చేసేవాడు. ప్రజా సంబంధాల విషయం లోగానీ, స్వయం విషయంలోగానీ మధ్యేమార్గ రేఖను దాటేవాడు. ఉత్తమ నడవడికను అలవర్చుకోని వాడు. తనలోని అవలక్షణాలను దూరం చేసు కోలేని వాడు. నిర్ణయాత్మక ఆలోచనకు, నిర్మాణాత్మక పనులకు శ్రీకారం చుట్టని వాడు.
దౌర్జన్యం ఎవరి విషయంలో జరుగుతుంది?
1) అల్లాహ్ విషయంలో జరిగే దౌర్జన్యం: అల్లాహ్‌తోపాటు అన్యులను సాటి సమానులుగా చేసి నిలబెట్టినప్పుడు ఈ దౌర్జన్యం చోటు చేెసుకుంటుంది. ఇది సరిదిద్ద బడాలంటే, నిజ ఆరాధ్యుడయిన అల్లాహ్ గురించిన సంపూర్ణ స్థాయి సమాచారాన్ని సేకరించడమే కాక మనసా, వాఛా,కర్మణా -త్రికరణ శుద్ధితో బేషరతుగా స్వీకరించాలి కూడా. అనుమానానికి, శంక కు తావియ్యకూడదు.
2) మనిషి ఆత్మ విషయంలో జరిగే దౌర్జన్యం: తన మనో వాంఛలను మేధకు అప్పగించక గాలికి వదిలేయడం. ఉదాహరణకు – సిగ్రేట్, సారాయి త్రాగొద్దని మేధ పదే పదే హెచ్చరిస్తున్నా త్రాగడం. ఇది నరక బాట అని తెలుస్తున్నా సంఘానికి, సంసారానికి భయ పడి అదే బాటన కొనసాగడం.
3) కుటుంబ పెద్దల విషయంలో జరిగే దౌర్జన్యం: వారు చేెసి వెళ్ళిన మంచి హితవుల్ని పెడచెవిన పెట్టడం, వారికిచ్చిన మాటను నిలబెట్టుకో లేక పోవడం, వారి తదనంతరం వారి బంధువులతో సంబందాలు త్రెంచు కోవడం, వారి కోసం దుఆ చెయ్యక పోవడం.
4) సజీవంగా ఉన్న తన తోటి ప్రాణుల విషయంలో జరిగే దౌర్జన్యం: ఒకరి హక్కుల్ని చెల్లించడంలో జాప్యం చెయ్యడం, దైనందిన వ్యవహా రాల్లో న్యాయానికి కట్టుబడ లేక పోవడం. ఇచ్చిన మాటను తప్పడం. అప్పగించిన ఏదేని వస్తువును స్వాహా చెయ్యడం. జంతువుల యెడల అనుచితంగా వ్యవహరించడం వగైరా.
5) సామాన్య ప్రజల వియంలో జరిగే దౌర్జన్యం: దుర్మార్గుడయిన రాజు గానీ, నియంత పరిపాలకుడుగానీ సింహాసనాధీశుడయి ప్రజలపై జరిపే దౌర్జన్యకాండ. ప్రజలకు చెందాల్సిన హక్కుల్ని వారికివ్వకుండా, వారికి అందాల్సిన సహాయ నిధుల్ని అందకుండా చెయ్యడం, వారికి దక్కాల్సిన రిజర్వెషన్‌లను దక్కకుండా చెయ్యడం మొదలయినవి.
దౌర్జన్యాన్ని, దౌర్జన్యపరుల్ని అల్లాహ్ సుతరాము ప్రేమించడు అన్న విషయం పై కొన్ని ఖుర్‌ఆన్ ఆయతుల ద్వారా తెలుసుకున్నాము. ఇక ప్రవక్త ముహమ్మద్ (స) వారు దౌర్జన్యం గురించి ఏమన్నారో తెలుసు కుందాం !
”దౌర్జన్యం చెయ్యడం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. నిశ్చయంగా నేటి దౌర్జన్యం రేపి ప్రళయ భయంకర చీకట్లుగా మారుతుంది”. (బుఖారీ)
హజ్రత్ మఆజ్ బిన్ జబల్(ర)గారిని యమన్ దేశానికి సాగనంపుతూ ఆయన చేసిన హితవు – ”ఓ మఆజ్! బాధితుని అభిశాపం నుండి దూరంగా ఉండు. అతని దుఆకు మరియు అల్లాహ్‌కు మధ్య ఏ అడ్డు తెర ఉండదన్న విషయాన్ని విస్మరించకు!”. (బుఖారీ)
”తస్మాత్ జాగ్రత్త! పిసినారితనం నుండి దూరంగా ఉండండి. ఈ అవలక్షణం మీకు పూర్వం ప్రజలన్ని నాశనం చేసింది. అది వారిని దౌర్జన్యం చెయ్యమని ఉసిగొలిపింది వారు దౌర్జన్యం చేశారు. అది వారిని బంధుత్వ సంబంధాలను త్రెంచమని పురిగొలిపింది వారు సంబంధ బాంధవ్యాలను త్రెంచారు. అది వారిని అశ్లీలానికి, అనైతి కానికి పాల్పడమని ప్రోత్సహించింది వారు అశ్లీలానికి, అనైతికానికి కొమ్ము కాసారు. ముఖ్యంగా దౌర్జన్యం నుండి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోండి. నిశ్చయంగా అది రేపి ప్రళయ భీకర చీకట్ల రూపంలో వస్తుంది. అలాగే మిమ్మల్ని మీరు అశ్లీల చేష్టల నుండి కాపాడుకోండి. నిశ్చయంగా అల్లాహ్ అశ్లీలానికి పాల్పడేవారిని, అశ్లీలాన్ని వ్యాపింపజేసేవారిని ఎన్నికీ ప్రేమించడు”. (అబూ దావూద్)
హదీసె ఖుద్సీలో స్వయంగా అల్లాహ్‌ా చెబుతున్న మాట – ”ఓ నా దాసులారా! నేను నా మీద దౌర్జన్యాన్ని నిషేధించుకున్నాను. మీ మధ్యన కూడా దాన్ని నిషేధంగా ఖరారు చేశాను. కాబట్టి ఒండొకరిపై దౌర్జన్యానికి ఒడి గట్టకండి”. (ముస్లిం)
గుండెలోని ప్రాణం గొంతు దాటక ముందే: ”మీ సోదరునికి చెందిన మీరు స్వాహా చేసిన ఏదేని వస్తువు మీ దగ్గర ఉన్నట్లయితే లేదా పరువు ప్రతిష్టకు సంబంధించిన ఏదయినా అపనింద మీరు వారిపై మోపి ఉంటే, నేడే ఈనాడే వెళ్ళి వారి హక్కును వారికి అప్పగించి, వారికి క్షమాపణలు చెప్పుకొని స్వేచ్ఛ పొందండి. ఎందుకంటే రేపు ప్రళయ దినాన దీనార్‌గానీ, దిర్హమ్‌గానీ ఏది పనికి రాదు. సదరు వ్యక్తి వద్ద పుణ్యాలుంటే తాను చేెసిన దౌర్జన్యానికి సమానంగా వాి నుండి తీసుకోవడం జరిగుతుంది. ఒకవేళ పుణ్యాలు లేకపోతే, బాధితుల పాపాలను తీసి అతనిపై మోపడం జరుగుతుంది” అన్నారు ప్రవక్త ముహమ్మద్ (స). (బుఖారీ)
దౌర్జన్య పరునికి శిక్ష పడుతుంది. కానీ; ”నిశ్చయంగా అల్లాహ్ దౌర్జన్యపరునికి గడువు ఇస్తూ పోతాడు. ఒక్క సారిగా పట్టుకున్నప్పుడు అతను తప్పించుకోలేడు”. (బుఖారీ)
”ముగ్గురి దుఆ తప్పక స్వీకరించ బడుతుంది. న్యాయశీలి అయిన నాయకుడు, ఉపవాసి ఉపవాసం విరిమించేంత వరకూ మరియు బాధితుని దుఆ. అల్లాహ్ అతని దుఆను మేఘాల తెర లేకుండా పైకి ఎత్తుకుాండు. దాని కోసం ఆకాశ తలుపులు తెరుచుకో బడతాయి. అల్లాహ్‌ా ఇలా అంాడు: ”నా గౌరవోన్నతుల సాక్షిగా! నిశ్చయంగా నేను నీకు సహాయ పడతాను, కాస్త తర్వాత (ఆలస్యంగా)నయినా సరే”. (తిర్మిజీ)
దౌర్జన్య దుష్ఫలితాలు:
అ) అది అల్లాహ్ ఆగ్రహానికి గురి చేసి ఆయన అనుగ్రానికి దూరం చేస్తుంది.
ఆ) బాధితుని శాపం బాధ పెట్టేవాడికి తప్పక తగులుతుంది.
ఇ) అది దేశ, సమాజ, కుటుంబ విచ్ఛిన్నానికి దారి తీస్తుంది.
ఈ) ప్రజలు దౌర్జన్యపరుణ్ణి అసహ్యించుకుాంరు. సృష్టిలోని అణువ ణువు అతన్ని శపిస్తుంది. వారు చస్తే, భువన గగనాలేమీ బాధ పడవు.
ఉ) దౌర్జన్య గుణం వల్ల గుండె బండ బారుతుంది. బుద్ధి మందగిస్తుంది.
ఊ) దౌర్జన్యపరుని రేపు ప్రళయ దినాన ప్రవక్త (స) వారి సిఫారసు లభించదు.
ఒక్క మాటలో చెప్పాలంటే, సకల మేళ్ళకు మూలాంకురం జ్ఞానం, న్యాయం. సకల చెడులకు బీజం అజ్ఞానం, దౌర్జన్యం. న్యాయ పరి ణామం సుభిక్షం, భద్రం అయితే, దౌర్జన్య పరిణామం దుర్భిక్షం, పరమ దరిద్రం. ఈ రోజు ప్రజలపై దౌర్జన్యం చేసేవారి మెడలు వంచే ఓ దినం ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు ప్రజలు వారిని తమ కాళ్ళ క్రింద వేసి నలిపేస్తారు. క్రింది లోకాల్లో కుదరకపోతే, పై లోకాల్లో! ఇది నిజం!! కఠోర సత్యం!!!