ధర్మం చెప్పిన తీర్పు

 

”మీరందరూ కాపలదారులే. మీ పోషణలో ఉన్న వారిని గురించి మిమ్మల్ని అడగడం జరుగుతుంది” (బుఖారీ) అన్న ప్రవక్త (స) వారి ప్రవచనం రీత్యా ఏది ధర్మం ఏది అధర్మం అన్న అవగాహన మనలో ని ప్రతి వ్యక్తికి ఉండాలి. అలాంటి  ఓ ప్రయత్నమే ఈ వ్యాసం. అల్లాహ్‌ మా ఈ కృషిని స్వీకరించి అందరికి ఇహపరాల మేలును కలుగ జేయాలని మనసారా వేడుకుంటున్నాము.

ధర్మం చెప్పిన తీర్పు

వైద్య పరిశోధనల వల్ల ‘ఇవి లాంగ్‌ క్యాన్సర్‌కి దారి తీస్తాయ’ని తేలింది. అలాగే ఇది ఒక విధంగా వృధా ఖర్చు అవ్వడంతోపాటు ఆ వ్యక్తి యెడల అల్లాహ్‌ అయి ష్టతకు దారి తీస్తుంది.’ధూమ పానం, షీషా ఆదేశం:

‘లా జరర్‌ వలా జిరార్‌’

అన్న ఇస్లామీయ సూత్రం రీత్యా మనిషికి హాని చేసే ప్రతిదీ నిషిద్ధమే. ఈ కోవకు చెంది నదే ధూమపానం, షీషా సేవనం. ఈ వస్తువులను పీల్చడం, కొనడం, అమ్మడం, అమ్మెవారికి అంగడిని అద్దెకు ఇవ్వడం – అంతా నిషిద్ధమే. ఎందుకంటే ఇది ఒక విధంగా చెడును బల పర్చడమే గనక.
”అల్లాహ్‌ మీ జరుగుబాటుకు ఆధారంగా చేసిన మీ ధనాన్ని మూర్ఖుల పాలు చేయకండి”. (అన్నిసా:5)

మనకు ప్రాప్తమయి ఉన్న సంపదను మూర్ఖులకు, అధర్మప్రియులకు, అవివేకులకు ఇవ్వకూడదు అన్న ఆదేశంలోని ఆంతర్యం ఏమిటంటే – వారు ప్రజా ప్రయోగ కార్యాల్లో కాకుండా ప్రజా ప్రమాద కార్యాల్లో వృధా పరుస్తారు అన్నది. ధూమపానం, షీషా సేవనంలో ఎటువంటి ప్రజా ప్రయోజనం లేదు ప్రమాదం తప్ప. ”మిమ్మల్ని మీరు చంపుకో కండి” (అన్నిసా:29) అన్న ఆయతు దృష్ట్యా ధూమపానం, షీషా సేవనం నిషిద్ధం అని తెలుస్తుంది. అదెలాగంటే, వైద్య పరిశోధనల వల్ల ‘ఇవి లాంగ్‌ క్యాన్సర్‌కి దారి తీస్తాయ’ని తేలింది. అలాగే ఇది ఒక విధంగా వృధా ఖర్చు అవ్వడంతోపాటు ఆ వ్యక్తి యెడల అల్లాహ్‌ అయి ష్టతకు దారి తీస్తుంది.”తినండి, త్రాగండి. వృధా పర్చకండి. నిశ్చయం గా అల్లాహ్‌ దుబారా ఖర్చు చేసేవారిని ఎంత మాత్రం ఇష్ట పడడు”. (ఆరాఫ్‌: 31)

ధర్మ కార్యాల్లోనే దుబారా ఖర్చు మంచిది కాదు అంటే పనికిమాలిన వ్యసనాల్లో ఖర్చు చేయడం ఎంత గర్హనీయమో అలోచించండి. అంతే కాదు అలా చేసే వ్యక్తి షైతాను సోదరునిగా లెక్కించ బడతాడు.”దుబారా ఖర్చు చేసేవారు షైతాన్‌ సోదరులు. మరి షైతానే మో తన ప్రభువునకు కృతఘ్నుడు”. (అల్‌ ఇస్రా; 27)
(అల్లామా ఇబ్నుల్‌ ఉథైమీన్‌ (రహ్మ)గారి ఫత్వా నుండి తీసుకోబడినది)

వడ్డీ తీసుకునే, ఇచ్చే బ్యాంకుల్లో పని చేయడం:

”వడ్డీ తీసుకునే వ్యక్తిని, వడ్డీకి ఇచ్చే వ్యక్తిని, వడ్డీకి సాక్ష్యంగా ఉండే ఇద్దరు వ్యక్తుల్ని, వడ్డీ పత్రాలు వ్రాసే వ్యక్తిని ప్రవక్త (స) అభిశపించారు.వారందరూ పాపంలో సరి సమానమయిన భాగస్తులే” అన్నారు. (ముస్లిం) అన్న ప్రవక్త (స) వారి ప్రవచనం దృష్ట్యా వడ్డీ సహిత బ్యాంకుల్లో పని చేయడం ధర్మసమ్మతం కాదు. ఎందుకంటే, ఉద్యోగం అన్నది ఒక ఒప్పందం ప్రకారమే జరు గుతుంది గనక. హాఁ! వేరే మార్గం లేనప్పుడు అలాిం బ్యాంకుల్లో డబ్బును పెట్టుకోవచ్చు. అయితే దానికి బ్యాంక్‌ ఇచ్చే వడ్డీని తీసుకో కూడదు. (ఇబ్నుల్‌ ఉథైమీన్‌ – రహ్మ)

అవసరం లేకపోయినా జ్ఞాపకార్థమని ఫోలు దిగడం:

జ్ఞాపకార్థమని పోలు దిగడం నిషిద్ధం. కారణం-ఫో దిగిన వ్యక్తి మరణించినా అతని చిత్రం అలాగే మిగులుంటుంది. ఫో దిగే వ్యక్తి సంఘంలో హోదా గల వ్యక్తి అయితే అతని తర్వాత వచ్చే తరం ప్రజలు అతని విగ్రహం చేసుకొని ఆరాధించవచ్చు. లేదా ఇంకా ఏదయినా ఇత రత్రా ఉపద్రవాలు చోటు చేెసుకోవచ్చు. నూహ్‌ా (అ) పూర్వం ప్రజల్లో విగ్రహారాధన ఈ మార్గం గుండానే వచ్చిందన్నది గమనార్హం! (ఇబ్నుల్‌ ఉథైమీన్‌ – రహ్మ)

చెడును మంచి ఎలా తొలగిస్తుంది? అవును, అల్లాహ్‌ అలా జరుగు తుందనే చెప్పాడు: ”నిశ్చయంగా పుణ్య కార్యాలు పాప కార్యాలను దూరం చేస్తాయి” (హూద్‌:114) ”నువ్వెక్కడున్నా సరే అల్లాహ్‌ాకు భయ పడుతూ ఉండు. నీ వల్ల ఒక తప్పు జరిగితే వెంటనే ఓ మంచి కార్యాన్ని శ్రీకారం చుట్టు, అది దాన్ని నిర్మూలిస్తుంది. ప్రజలతో మంచిగా వ్యవహరించు” అన్నారు ప్రవక్త (స). (తిర్మిజీ) అంటే చెడు తర్వాత మనిషి చేసే సత్కార్యం తౌబా అయ్యుంటే, తౌబా గతం లో జరిగిన పాపాలన్నింటినీ ప్రక్షాళిస్తుంది. అల్లాహ్‌ ఇలా సెలవిస్తు న్నాడు: ”ఎవరయినా దుష్కార్యానికి పాల్పడి లేదా తనకు తాను అన్యాయం చేసుకుని, ఆ తర్వాత క్షమాపణకై అల్లాహ్‌ను అర్థిస్తే, అతడు అల్లాహ్‌ను క్షమాశీలిగా, కృపాశీలిగా పొందుతాడు”. (అన్నిసా: 110)
”అయితే (పాప కార్యాల తర్వాత) ఎవరయితే పశ్చాత్తాపం చెంది, విశ్వసించి, సత్కార్యాలు చేస్తారో అలాంటి వారి పాపాలను అల్లాహ్‌ పుణ్యాలుగా మార్చివేస్తాడు. అల్లాహ్‌ క్షమాభిక్ష పెట్టేవాడు, కరుణామయుడు”. (ఫుర్ఖాన్‌: 70)
ప్రవక్త ముహమ్మద్‌ (స) ఇలా అన్నారు: ”అందరికన్నా చివర్లో స్వర్గంలో ప్రవేశించేవాడు, అందరికన్నా ఆఖరులో నరకం నుండి బయటకు తీయబడే వాడెవడో నాకు తెలుసు. ప్రళయ దినాన అతన్ని తీసుకు రావటం జరుగుతుంది. ఇలా అనబడుతుంది: ”అతని చిన్న తరహా పాపాలను అతని ముందర ప్రవేశ పెట్టి, పెద్ద పాపాలను అతన్నుండి ఎడంగా ఉంచండి”. చిన్న పాపాలను అతని ముందు తీసుకొచ్చి ఇలా అడగబడుతుంది: ”నువ్వు ఫలానా రోజు ఫలానా పాపం చేశావు, అవునా” దానికి అతను అవును అని ఒప్పు కుంటాడు. దాన్ని త్రోసి పుచ్చ లేడు. ఎందుకంటే, ఎక్కడ తన పెద్ద పాపాలు ప్రవేశ పెట్ట బడతాయోమోనన్న భయం అతనికుంటుంది. ”నీ ప్రతి పాపానికి బదులుగా ఒక పుణ్యం ఇవ్వబడుతున్నది” అని అతనితో అనడం జరుగుతుంది. (అల్లాహ్‌ ఔదార్యాన్ని చూసి) ఇలా అంటాడు: ‘ప్రభూ! నేను చేసిన అనేక నిర్వాకాలు, భయంకర విషయాలు నాకు ఇక్కడ కానరావడం లేదేమి?’ అని. ఉల్లేఖకుల యిన అబూ జర్ర్‌ (ర) ఇలా అంటున్నారు: ‘ఇది చెప్పిన తర్వాత ప్రవక్త(స) ఆయన దవడ పల్లు కనబడే విధంగా పెద్దగా నవ్వేశారు”. (ముస్లిం – కితాబుల్‌ ఈమాన్‌)

Related Post