మత్తు పదార్ధాలను సేవించి, ప్రజలు సంచరించే చోట్లలో ఉమ్మి వేయడం అతి హేయమైన పని!
?అతి హేయమని పని అంటే ఇదే మరి! ఎక్కడ చూసిన గుట్కాలు, పాన్ పరాగ్, రాజ, సిగరేట్, బీడి వంటి మత్తు పదార్ధాలు చిన్న, పెద్ద అంటూ తన మన బేదం లేకుండా అందరూ కలిసి కట్టుగా మత్తు పదార్ధాలను తింటున్నారు. ఆ మత్తు పదార్ధాలను వీధులలో, ప్రజలు సంచరిచే రోడ్లపైన ఇంటి ముందర, ప్రాంగణాలలో ఉమ్మడం, పాత్రలను మత్తు పదార్దాలతో ఎంగిలి చేయడం ఎంత హేయమని పని!. ఇది చూడటానికి అసహ్యంగా ఉందే! మరి తినేవారు ఇలాంటి మత్తు పదార్దాలను ఎలా సేవిస్తున్నారు. ఎంతటి దుబారా ఖర్చు మరి ఎంతటి ప్రాణహాని. అయిన మత్తు పదార్ధాలను వదలడం లేదు. ఇదేక్కడి మాయా రోగం. ఇదేక్కడి చెడు అలవాటు. ఈ అలవాటును పిల్లలు చూస్తే వారు కూడా ఈ చెడు అలవాటును నేర్చుకునేలాగా ఉంది!! ఈ దురలవాటు నుంచి అల్లాహ్ కాపాడుగాక!
?ఇస్లాం మత్తుని ఇచ్చే ప్రతిది నిషిద్దం చేసింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అంటున్నారు;
-మైకానికి గురి చేసే ప్రతిది మత్తు పదార్దం. ప్రతి మత్తు పదార్దం నిషిద్దం.
?బుఖారీ, 242#, ముస్లిం #1733
మత్తులో పడవేసే మరియు బుద్దిని మాంద్యంచేసే ప్రతిదీ నిషిద్దం. అది కొంచమైనా, ఎక్కువైనా.”ఏది ఎక్కువ ఉపయోగిస్తే నిషా (మైకం) వస్తుందో అది కొంచెం ఉపయోగించుట కూడా నిషిద్దం”. – ?అబూదావూద్ : 3681
?మత్తు పదార్ధాలు నిషిద్దం అవి తినే వస్తువులు కాని త్రాగే వస్తువులు కాని. ఈ మత్తు పదార్ధాల నుండి మన సమాజానికి కాపాడుకోవాలి. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ఉపదేశిస్తున్నాడు;
وَلَا تُلْقُوا۟ بِأَيْدِيكُمْ إِلَى ٱلتَّهْلُكَةِ ۛ وَأَحْسِنُوٓا۟ ۛ إِنَّ ٱللَّهَ يُحِبُّ ٱلْمُحْسِنِينَ
చేజేతులా మిమ్మల్ని మీరు వినాశం పాలు చేసుకోకండి. ఉత్తమంగా మసలుకోండి. నిస్సందేహంగా అల్లాహ్ ఉత్తమంగా వ్యవహరించేవారిని ప్రేమిస్తాడు. ?(Quran – 2 : 195)
?నిరంతర మత్తు పదార్ధాలను తినటం సేవించడం ద్వారా మీ వినాశనానికి మీరే స్వయంగా కొని తెచ్చుకుంటున్నారు.
?- ప్రపంచంలో పొగాకు వల్లే ఏడాది 10 లక్షల మంది మరణాలు. పొగాకు ఉత్పత్తులకు 25 కోట్లకుపైగా బానిసలు. పొగాకు హానికరమని సిగరేట్ డబ్బాలపై, గుట్కాలపై ముద్రించినా వదలరు. నోట్లో సిగరేట్ పెట్టుకుని పొగను రింగులు..రింగులు తిప్పేవాళను మనం చాలా ప్రాంతాల్లో చూస్తునే ఉన్నాం..అది వారికి సరదానే కావచ్చు…కానీ ఆరోగ్యానికి హానికరమనే విషయం కొన్నేండ్ల తర్వాత తెలుస్తుందంటున్నారు వైద్యులు.
♉ప్రపంచంలో సంవత్సరానికి 60 లక్షల కంటే ఎక్కువమంది, మనదేశంలో సంవత్సరానికి 10 లక్షలమంది పొగాకు పదార్థాలు అలవాటు వల్ల చనిపోతున్నారని నివేదికలు తెలియజేస్తున్నాయి.
ఈ సంఖ్య ఎయిడ్‌స, క్షయ, మలేరియా, మరణాల కంటే ఎక్కువ. ఉస్మానియా దంత (డెంటల్) ఆస్పత్రిలో పొగాకు వల్ల వచ్చే రోగాలు, నివారణ కోసం వారంరోజులుగా ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు.
?-పొగాకు ఆధారిత పదార్థాలు బీడీలు సిగరేట్లతో సమానంగా ఆరోగ్యానికి హానిని కలిగిస్తాయి. పీల్చేందుకు వాడే పొగాకు కూడా.. సిగరేట్‌లో 4 వేల రసాయన మిశ్రమాలు, 200 రకాల విష పదార్థాలు, 60 క్యాన్సర్‌కు కారణమయ్యే పదార్థాలు ఉన్నాయి. ఖైనీ, గుట్కా, జర్దా, పొగాకు కలిగిన పాన్ మసాలాలు, మవా, మిస్రీ వంటివి హానికరమే.
?పొగాకు వాడకం వల్లే మనదేశంలో ప్రతిరోజూ 220 కంటే ఎక్కువమంది చనిపోతున్నారు. భారతదేశంలో ప్రతి 100 క్యాన్సర్ కేసులలో 40 కేసులు పొగాకు వాడడం వల్ల వచ్చేవే.
సుమారు 90 శాతం నోటి క్యాన్సర్లు పొగాకు అలవాటు ఉన్నవారికే వస్తున్నాయి.
?పొగాకు వాడే వ్యక్తులు గుండెపోటు, మెదడు దెబ్బతినడం, ఊపిరితిత్తుల వ్యాధులు అంధత్వం, వ్యాధుల బారినపడే అవకాశాలు చాలా ఎక్కువ.
పొగాకు మహమ్మారి ఎవరినీ వదలదు. పొగ తాగడం వల్ల అందరికీ నష్టమే ఇతరులు వదిలే పొగ పీల్చడం వల్ల ప్రాణాపాయం కలిగే ప్రమాదం ఉంది.
1. ప్రపంచ వ్యాప్తంగా 60 లక్షల మంది పొగాకు వాడకం ద్వారానే చనిపోతున్నారు.
2. మనదేశంలో 10 లక్షల మంది ఈ దురలవాటు వల్ల చనిపోతున్నారు.
3. ప్రతిరోజు 2200 మంది చనిపోతున్నారు.
4. ప్రపంచలో ఎక్కువ నోటి కాన్సర్ మరణాలు మన దేశంలోనే సంభవిస్తున్నాయి.
5. మొత్తం క్యాన్సర్ మరణాలలో 90 శాతం పొగాకు సేవించడం ద్వారానే..
6. ఇందులో 50 శాతం పొగాకు తినడం లేదా తాగడం ద్వారానే వస్తున్నాయి.
7. పొగ తాగే వారిలో 70 శాతం 30-69 సంవత్సరాల వారే
8. సెకండ హ్యాండ్ స్మోక్ ద్వారా అనగా పొగ తాగేవారికి ఎంత హానికరమో ఆ పొగను పీల్చడం ద్వారా కూడా ఇతరులకు అంతే నష్టం .
9. పొగాకులో 4000 రకాల రసాయనాలు ఉంటే దానిలో 60 రకాల క్యాన్సర్‌ని కలిగిస్తాయి.
?అన్ని పొగాకు ఉత్పత్తులు హానికరమైనవే. చిన్న మోతాదులో తీసుకున్నా అవి హానికరమైనవే
?అందుకే ఇస్లాం చెపుతుంది మైకానికి గురి చేసే ప్రతిది మత్తు పదార్దం. ప్రతి మత్తు పదార్దం నిషిద్దం.
?ఇస్లాం ధర్మం అధిక ప్రాధాన్యత శుచి శుభ్రతలను పాటించమని ఆదేశిస్తుంది;
إِنَّ ٱللَّهَ يُحِبُّ ٱلتَّوَّٰبِينَ وَيُحِبُّ ٱلْمُتَطَهِّرِينَ
అల్లాహ్ పశ్చాత్తాపపడేవారిని, పారిశుద్ధ్యాన్ని అవలంబించేవారిని ఇష్ట పడతాడు. ?(Quran – 2 : 222)
హదీసలో ఇలా వుంది: “శుభ్రత సగం విశ్వాసం” (?సహీ ముస్లిం 1 పేజి 361)
? శుచి శుభ్రత పాటించటం ఇస్లాం యెుక్క మూల సూత్రం.
??అల్లాహ్ మనందరికి చెడు అలవాట్ల నుండి మత్తు పదార్ధాల నుండి కాపాడుగాక! ఆమీన్.