అసలు సహాయం అల్లాహ్ తరఫు నుంచి
అల్లాహ్ మీకు ఈ విషయాన్ని తెలిపింది మీకు శుభవార్త ఇవ్వటానికి మరియు మీ హృదయాలకు తృప్తి కలుగ జేయటానికి మాత్రమే. మరియు సర్వశక్తి మంతుడు, మహా వివేకవంతుడైన అల్లాహ్ తప్ప, ఇతరుల నుండి సహాయం (విజయం) రాజాలదు కదా! (ఆల్ ఇమ్రాన్; 126 )
మరియు ఆ సమయాన్ని జ్ఞాపకం చేసుకోండి: అప్పుడు మీరు అల్ప సంఖ్యలో ఉన్నారు. భూమిపై మీరు బలహీనులుగా పరిగణించబడేవారు. ప్రజలు మిమ్మల్ని పారద్రోలుతారని (హింసిస్తారని) భయపడే వారు. అప్పుడు ఆయన మీకు ఆశ్రయమిచ్చి తన సహాయంతో మిమ్మల్ని బలపరచి, మీకు మంచి జీవనోపాధిని సమకూర్చాడు, బహుశా మీరు కృతజ్ఞులవుతారని. ((అన్ఫాల్ ; 26)
యౌముల్ ఫుర్ఖాన్ అన్న నామకరణం
ఒకవేళ మీరు – అల్లాహ్ను మరియు మేము సత్యా సత్యాల అంతరాన్ని విశదం చేసే దినమున, ఆ రెండు సైన్యాలు మార్కొనిన (బద్ర్ యుద్ధ) దినమున, మా దాసునిపై అవతరింపజేసిన దానిని – విశ్వసించేవారే అయితే! మరియు అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు. (అన్ఫాల్ ; 41)
ఖుమ్స్ వాటా కు సంభందించిన ఆదేశం
మరియు మీ విజయధనంలో నిశ్చయంగా, అయిదవ భాగం, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు మరియు (అతని) దగ్గరి బంధువులకు మరియు అనాథులకు మరియు యాచించని పేదవారికి మరియు ప్రయాణీకులకు ఉందని తెలుసుకోండి, (అన్ఫాల్ ; 41)
శత్రుత్వం మిత్రుత్వానికి గీటురాయి
అల్లాహ్ మరియు పరలోకాన్ని విశ్వసించే జనులలో, అల్లాహ్ మరియు ఆయన సందేశహరుణ్ణి వ్యతిరేకించేవారితో స్నేహం చేసుకునే వారిని నీవు పొందలేవు! ఆ వ్యతిరేకించేవారు, తమ తండ్రులైనా లేదా తమ కుమారులైనా లేదా తమ సోదరులైనా లేదా తమ కుంటుంబంవారైనా సరే! అలాంటి వారి హృదయాలలో ఆయన విశ్వాసాన్ని స్థిరపరచాడు. మరియు వారిని తన వైపు నుండి ఒక ఆత్మశక్తి (రూ’హ్) ఇచ్చి బలపరిచాడు. మరియు వారిని క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింప జేస్తాడు. అందులోవారు శాశ్వతంగా ఉంటారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్ను డవుతాడు మరియు వారు ఆయన పట్ల ప్రసన్ను లవుతారు. ఇలాంటి వారు అల్లాహ్ పక్షానికి చెందినవారు. గుర్తుంచు కోండి! నిశ్చయంగా, అల్లాహ్ పక్షం వారే సాఫల్యం పొందేవారు. (ముజాదలః : 22)
అవిశ్వాస సైన్యంలో పాల్గొన్న విశ్వాసులకు దండన
నిశ్చయంగా, తమకు తాము (తమ ఆత్మలకు) అన్యాయం చేసుకుంటూ ఉండే వారి ప్రాణాలను తీసే దేవదూతలు వారితో: ”మీరు ఏ స్థితిలో ఉండేవారు?” అని అడిగితే, వారు: ”మేము భూమిలో బలహీనులముగా, నిస్సహాయులముగా ఉండేవారము!” అని జవాబిస్తారు. దానికి (దేవదూతలు): ”ఏమీ? మీరు వలసపోవటానికి అల్లాహ్ భూమి విశాలంగా లేకుండెనా?” అని అడుగుతారు. ఇలాంటివారి శరణం నరకమే. మరియు అది ఎంత చెడ్డ గమ్యస్థానం!కాని, నిజంగానే నిస్సహాయులై, వలస పోవటానికి ఏ సాధనా సంపత్తీ, ఎలాంటి మార్గం లేని పురుషులు, స్త్రీలు మరియు పిల్లలు తప్ప! (అన్నిసా: 97, 98)
అల్ వాలా వాల్ బారా ఆదేశాలు
ఓ విశ్వాసులారా! మీరు విశ్వాసులను వదలి సత్యతిరస్కారులను, మీ స్నేహితులుగా చేసుకోకండి. ఏమీ? మీరు, మీకే వ్యతిరేకంగా, అల్లాహ్కు స్పష్టమైన ప్రమాణం ఇవ్వదలచుకున్నారా? (అన్నిసా: 144, 145)
ఓ విశ్వాసులారా! యూదులను మరియు క్రైస్తవులను మిత్రులుగా చేసుకోకండి. వారు ఒకరి కొకరు స్నేహితులు. మీలో ఎవడు వారితో స్నేహం చేస్తాడో వాస్తవానికి అతడు వారిలో చేరిన వాడవుతాడు. నిశ్చయంగా, అల్లాహ్ దుర్మార్గులకు మార్గదర్శకత్వం చేయడు. (మాయిదః – 51)
ఓ విశ్వాసులారా! నాకు శత్రువులైన వారిని మరియు మీకు కూడా శత్రువులైన వారిని – వారి మీద ప్రేమ చూపిస్తూ – వారిని మీ స్నేహితులుగా చేసుకోకండి. మరియు వాస్తవానికి వారు మీ వద్దకు వచ్చిన సత్యాన్ని తిరస్కరించారు. మీ ప్రభువైన అల్లాహ్‌ను మీరు విశ్వసించి నందుకు, వారు ప్రవక్తను మరియు మిమ్మల్ని (మీ నగరం నుండి) వెడలగొట్టారు! ఒకవేళ మీరు నా ప్రసన్నత కోరి, నా మార్గంలో ధర్మయుధ్ధం కొరకు వెళితే (ఈ సత్య తిరస్కారులను మీ స్నేహితులు గా చేసుకోకండి). వారి పట్ల వాత్సల్యం చూపుతూ మీరు వారికి రహస్యంగా సందేశం పంపుతారా! మీరు దాచేది మరియు వెలిబుచ్చేది, నాకు బాగా తెలుసు. మరియు మీలో ఎవడైతే ఇలా చేస్తాడో, అతడు వాస్తవంగా, ఋజుమార్గం నుండి తప్పిపోయినవాడే! (ముంతహినః – 1)
ఓ విశ్వాసులారా! మీ తండ్రితాతలు మరియు మీ సోదరులు సత్య-తిరస్కారానికి విశ్వాసంపై ప్రాధాన్యతనిస్తే, మీరు వారిని స్నేహితులుగా చేసుకోకండి. మీలో వారివైపు మొగ్గేవారే (వారిని మీ స్నేహితులుగా చేసుకునే వారే) దుర్మార్గులు. (అత్తౌబః – 23)
వారితో ఇలా అను: ”మీ తండ్రి-తాతలు, మీ కుమారులు, మీ సోదరులు, మీ సహవాసులు (అ’జ్వాజ్), మీ బంధువులు, మీరు సంపాదించిన ఆస్తిపాస్తులు, మందగిస్తా యేమోనని భయపడే మీ వ్యాపారాలు, మీకు ప్రీతికరమైన మీ భవనాలు – అల్లాహ్ కంటే, ఆయన ప్రవక్త కంటే మరియు ఆయన మార్గంలో పోరాడటం కంటే – మీకు ఎక్కువ ప్రియమైన వైతే, అల్లాహ్ తన తీర్పును బహిర్గతం చేసేవరకు నిరీక్షించండి. మరియు అల్లాహ్ అవిధేయులైన జాతివారికి సన్మార్గం చూపడు.” (అత్తౌబః 24)
సందర్భానుస్సారం అవిశ్వాసుల సహాయ నిరాకరణ
బద్ర్ దినాన ఓక అవిశ్వాస వ్యక్తీ ప్రవక్త (స) వారిని వెంట వస్తుంటే ప్రవక్త (స) అతన్నుద్దేసించి ఇలా అనారు; తిరిగి వెళ్ళిపో! నేను ఓ బహు దైవారాధకుని ద్వారా సహాయం పొందాలనుకోవడం లేదు. (ముస్లిం)
వాగ్దానా పాలన – భావోద్వేగా పరిగణ
హుజైఫా (ర) ఇలా అన్నారు; నేను బద్ర్ సంగ్రామం లో పాల్గొన లేకపోవడానికి కారణం – నేను నా తండ్రి హుసైల్ (ఒక పని మీద) మదీనాకు బయలు దేరాము. మధ్యలో ఖురైష్ ప్రజలు మమ్మల్ని అడ్డగించి – మీరు ముహమ్మద్ వద్దకు వెళుతున్నట్టునారు అని శంకను వ్యక్త పరచారు. దానికి మేము మా ఉద్దేశం ఏమిటో వివరిస్తూ – మేము మదీనాకు మాత్రమె వెళుతున్నాము అని సమాధానం ఇచ్చాము. అప్పుడు వారు మాతో ‘’మేము మదీనా నుండి తిరిగి వచ్చెయ్యాలని, ముహమ్మద్ (స) తో కలిసి పోరాడకూడదు అని వాగ్దానం తీసుకున్నారు. ఇదే విషయాన్ని ప్రవక్త (స) వద్దకు వచ్చిన తర్వాత వివరించాము. అన్డుకాయన్ – మీరు తిరిగి వెళ్ళండి, వారితో మీరు చేసిన వాగ్దానాన్ని మేము నేరవేరుస్తాము. వారిపై అల్లాహ్ తో సహాయాన్ని కోరుతాము అని చెప్పారు. (ముస్లిం)
వేగవంతమైన మీడియా
బద్ర్ సంగ్రామ సందర్భంగా ప్రవక్త (స) అనుక్షణం అప్రమత్తంగా ఉండేవారు. అవిశ్వాసుల సమాచారాన్ని సేకరించే నిమిత్తమం వార్తావహులను నలు మూలల పంపే వారు. అలాగే ధర్మ యోధుల్ని ప్రోతహించే నిమిత్తం హజ్రత్ హస్సాన్ బిన్ సాబిత్ (ర) గారు కవితలు చెప్పే వారు.
బద్ర్ సంగ్రామం లో ప్రవక్త మహిమలు
అల్లాహ్ విశ్వాసులను, మీరు (సత్య తిరస్కారులు) ఇప్పుడు ఉన్నస్థితిలో, ఏ మాత్రమూ ఉండనివ్వడు. చివరకు ఆయన దుష్టులను సత్పురుషుల నుండి తప్పకుండా వేరుచేస్తాడు. మరియు అగోచర విషయాలను మీకు తెలపడం అల్లాహ్ విధానంకాదు, కాని అల్లాహ్ తన ప్రవక్తలలో నుండి తానుకోరిన వారిని ఎన్ను కుంటాడు. కావున మీరు అల్లాహ్ను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించండి. మరియు ఒకవేళ మీరు విశ్వసించి, దైవభీతి గలిగిఉంటే, మీకు గొప్ప ప్రతిఫలం ఉంటుంది. (ఆల్ ఇమ్రాన్: )
బద్ర్ సమగ్రం సందర్భంగా ప్రవక (స) చేతుల మీదుగా అనేక మహిమాలు జరిగాయి. ఉమయ్యః బిన్ ఖలఫ్ మరణం గురించి చెప్పాడం. గుప్పెడు మాటి తీసుకొని అవిశ్వాసుల వైపు విసరగా ఆ మట్టి వారందరి కళ్ళలో పడటం, అబ్బాస్ (ర) గారు దాచిన సంపద గురించి చెప్పడం, ఉకాషా (ర) గారికి ఓ కర్ర ఇవ్వగా అది కరవాలంగా మారి పోవడం మొదలైనవి.
ఓ ప్రవక్తా! నీ అధీనంలో ఉన్న యుధ్ధ ఖైదీలతో ఇలా అను: ”ఒకవేళ అల్లాహ్ మీ హృద యాలలో మంచితనం చూస్తే ఆయన మీ వద్ద నుండి తీసుకున్న దాని కంటే ఎంతో ఉత్తమమైన దానిని మీకు ప్రసాదించి ఉంటాడు. మరియు మిమ్మల్ని క్షమించి ఉంటాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.” (అన్ఫాల్; 70)
మీరు వారిని చంపలేదు, కాని అల్లాహ్ వారిని చంపాడు. ( ప్రవక్తా!) నీవు (దుమ్ము) విసిరినపుడు, నీవుకాదు విసిరింది, కాని అల్లాహ్ విసిరాడు. మరియు విశ్వాసులను దీనితోపరీక్షించి, వారికి మంచిఫలితాన్ని ఇవ్వ టానికి ఆయన ఇలా చేశాడు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు. (అన్ఫాల్; 17)