అల్లాహ్‌కు నచ్చని జనం

bad-157437_960_720

అనంత కరుణామయుడు అపార దయానిధి అయిన అల్లాహ్‌ పేరుతో

అవిధేయులు: ”నిజంగా అల్లాహ్‌ అవిశ్వాసుల్ని, అవిధేయుల్ని, కృతఘ్నుల్ని, ద్రోహుల్ని, పాపుల్ని ఇష్ట పడడు”. (దివ్య ఖుర్‌ఆన్‌-2276)
చెడు ప్రచారకులు: ”ఏ వ్యక్తయినా సరే చెడు మాటలు బిగ్గరగా అనడాన్ని, వినడాన్ని, చేయడాన్ని. చూడాన్ని. ప్రచారం కల్పించడాన్ని అల్లాహ్‌ ఇష్ట పడడు”. (దివ్యఖుర్‌ఆన్‌: 4: 148)
మితిమీరేవారు: నిశ్చయంగా అల్లాహ్‌ హద్దుల్ని అతిక్రమించేవారిని ప్రేమించడు”. (దివ్యఖుర్‌ఆన్‌: 2: 190)
దౌర్జన్యం: ”దౌర్జన్యపరుల్ని అల్లాహ్‌ ఎంత మాత్రం ప్రేమించడు”. (దివ్యఖుర్‌ఆన్‌: 42: 40)
మిడిసిపడేవారు: ”మిడిసి పడే, దురహంకార ధురంధరుల్ని అల్లాహ్‌ ఎంత మాత్రం ప్రేమించడు”. (దివ్యఖుర్‌ఆన్‌: 4: 36)
కల్లోల జనకులు: ”అల్లకల్లోలాన్ని, అరాచకాన్ని సృష్టించే వారిని అల్లాహ్‌ ఎంత మాత్రం ప్రేమించడు”. (దివ్యఖుర్‌ఆన్‌: 5: 65)
గొప్పలు పోయేవారు: ”సొంత గొప్పలు పోయేవారిని, బడాయి చాటుకునే వారిని అల్లాహ్‌ ఎంత మాత్రం ఇష్ట పడడు”. (దివ్యఖుర్‌ఆన్‌: 28: 76)
దుబారా ఖర్చు చేసేవారు: ”దుబారా ఖర్చు దొరల్ని అల్లాహ్‌ సుతరామూ ఇష్ట పడడు”. (దివ్యఖుర్‌ఆన్‌: 7: 31)
గయ్యాళి: ”గయ్యాళి (నోరు పారేసుకునే) – దుర్భాషలాడే వారిని, దుర్మార్గుణ్ణి అల్లాహ్‌ సుతరాము ఇష్ట పడడు”. (అబూ దావూద్‌)
ముఖస్తుతిని ఇష్ట పడేవారు: ”ముఖస్తుతిని ఇష్ట పడే అహంకారిని అల్లాహ్‌ ఇష్ట పడడు”. (ముస్నద్‌ అహ్మద్‌)
ముఖం మాడ్చుకోవడం: ”తోటి సోదరులతో ముఖం మాడ్చుకుంటూ కలిసే వారిని అల్లాహ్‌ సుతరామూ ఇష్ట పడడు”. (జమ్‌వుల్‌ జవామిఅ)
మొండిఘటం యాచకుడు: ”జగ మొండి యాచకుణ్ణి అల్లాహ్‌ ఇష్ట పడడు”. (సిల్‌సిలతుస్సహీహా లిల్‌ అల్బానీ)
దౌర్జన్య పరుడయిన ధనికుడు: ”దౌర్జన్యపరుడయిన ధనికుణ్ణి అల్లాహ్‌ ఇష్ట పడడు”. (తబ్రానీ)
వృద్ధ వ్యభిచారి: ”వ్యభిచారి అయిన వెంట్రుకలు మాసిన వృద్ధున్ని అల్లాహ్‌ ప్రేమించడు”. (తబ్రానీ)
గర్విష్టి పేద: అర్థికంగా అట్టడుగు స్థాయిలో ఉండి కూడా అహాన్ని వీడని కడు పేదవాడిని అల్లాహ్‌ ఇష్ట పడడు”. (తబ్రానీ)

అల్లాహ్‌ మనందరిని ఆయన నచ్చిన గుణం గల దాసులు మలచుగాక! ఆమీన్‌

Related Post