Originally posted 2013-06-01 15:31:46.
”మీకు ఈ స్త్రీలు (హరామ్) నిషే ధించబడ్డారు – మీ తల్లులు, మీ కుమార్తెలు, మీ సోదరీమణులు, మీ మేనత్తలు, మీ తల్లి సోదరీమ ణులు (పిన తల్లులు) మీ సోద రుల కుమార్తెలు, మేనకోడళ్ళు మీకు పాలిచ్చిన తల్లులు, మీతో పాటు పాలు త్రాగిన సోదరీమ ణులు, మీ భార్యల తల్లులు, మీ సంరక్షణలో పెరిగిన మీ భార్యల కుమార్తెలు అంటే మీరు రమిం చిన భార్యల కుమార్తెలు, అయితే ఒకవేళ (వివాహం మాత్రమే అయి) రమించటం జరిగి ఉండ కపోతే (వారికి విడాకులిచ్చి, వారి కుమార్తెలను వివాహమాడటం) మీకు దోషం కాదు. మీ వెన్ను నుండి పుట్టిన మీ కుమారుల భార్యలు, ఇంకా ఏక కాలంలో అక్కాచెల్లెళ్ళు ఇద్దరినీ చేర్చి భార్య లుగా చేసుకోవటం కూడా నిషి ద్ధమే. పూర్వం జరిగిందేదో జరిగి పోయింది. అల్లాహ్ క్షమించే వాడూ, కరుణించే వాడూను.” (ఖుర్‌ఆన్ 4:23)
వైద్యశాస్త్రం కూడా మేనరికం చెయ్యరాదని (అంటే అక్క కుమార్తెను వివాహం) చేసుకో వటం వలన అనేక సమస్యలు వస్తాయని చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని ఖుర్‌ఆన్ లో 1400 సంవత్సరాలకు పూర్వమే చెప్ప బడింది. ఇప్పుడు శాస్త్రీయపరంగా పరిశీలి ద్దాం. క్రీ.శ. 1665 సంవత్సరంలో రాబర్ట్ హుక్ అను శాస్త్రజ్ఞుడు జీవరాశుల శరీరము అనేక గ్రంధులు వంటి కణములతో నిర్మింప బడి ఉంటాయని కనుకొన్నాడు.
17వ శతాబ్దంలో ఆ వెన్ హుక్ అనే శాస్త్ర జ్ఞుడు ఆ కణం యొక్క కేంద్రాన్ని గుర్తిం చాడు. వీటి ఆధారంగా మొదటి జంతువుల పై, పక్షులపై పరిశీలించడం ప్రారంభించారు.
క్రోమోజోమ్ పై మాత్రం 19వ శతాబ్దంలో పరిశోధనలు ప్రారంభమైనాయి. వాటిని బట్టే అనువంశీకత గూర్చి తెలుసుకున్నారు. తల్లి దండ్రుల లక్షణాలు, వారి పూర్వీకుల లక్షణా లు, సంతానానికి రావడమనేది నిర్ధారించా రు. వీటన్నింటికి కారణం జన్యు సంబంధమే నని తెలుసుకున్నారు. ఈ జన్యువు- ఆక్సిరైబో కేంద్రకామ్లము ఏర్పడి తల్లిదండ్రుల బీజ కణముల ద్వారా జన్యువులు సంతానానికి సంక్రమిస్తాయి. అంతర్గత జన్యువులు వలన (అంటే రక్త సంబంధీకుల, పాల సంబంధీకుల గురించి ఖుర్‌ఆన్‌లో తెలుపబడినట్లుగా) అసాధారణమైన, ప్రాణాంతకమైన అంతర్గత హానికర లక్షణాలు ఏర్పడి, సంతానానికి సంక్రమించే ఆస్కారం ప్రతి నూరు మందిలో 99 మందికి ఉంటుంది. కాబట్టి శాస్త్రీయ పరంగా మేనకోడళ్ళను (అక్క కూతురు)ని వివాహమాడరాదు అని నిర్ధారించడం జరి గింది.
నాగరిక, సామాజిక వ్యవహారాల్లో అజ్ఞాన కాలపు తప్పుడు పద్ధతుల్ని మాన్పిస్తూ సాధారణంగా దివ్య ఖుర్‌ఆన్‌లో ”జరిగిందేదో జరిగి పోయింది” అన్న మాట చెప్ప బడింది. దీనిభావం – అజ్ఞాన కాలం లో అవివేకపు రోజుల్లో మీరు తెలి యక అవలంబించిన చెడు నడత ను తప్పు పట్టడం జరగదు. అయితే ఒకటి, ఇప్పుడు దైవాదేశం అందిన తర్వాత మీ వైఖరిని సంస్కరించుకో వాలి, తప్పుడు పనుల్ని, రాతారీతుల్ని, అక్రమ సంబంధాలని వదలి వెయ్యా లి. కాబట్టి స్వంత సోదరి, తల్లి తరఫు సోదరి, తండ్రి తరఫు సోదరి, పాల సంబంధిత సోదరి, సోదరుల కుమార్తెలు కుడా నిషిద్ధమే. అలాగే ఏక సమయంలో ఇద్దరు అక్కా చెల్లెల్లను వివాహమాడటం కూడా నిషిద్ధమే. ”కనుక ఎవరు తమ ప్రభువు వద్ద నుంచి వచ్చిన హిత బోధను విని చెడును మానుకు న్నాడో, అతని వ్యవహారం అల్లాహ్ ఆధీనం. అన్ని తెలిసిన తర్వాత కూడా అదే వైఖరిని అవలంబిస్తే మాత్రం వారే నరకవాసులు”. (అల్‌బఖర:275)