ఈ రోజుల్లో రిమోట్ కంట్రోల్ లేకపోతే ఏదో కోల్పోయినట్టు ఫీలవు తుంటారు. కారణం, రిమోట్ రాక ముందు టీవీ ఛానల్స్ మార్చా లంటే ప్రతీసారి టీవీ దగ్గరకు వెళ్ళి బటన్స్ నొక్కాల్సి వచ్చేది. కానీ రిమోట్ వచ్చాక ఆ ఇబ్బందులన్నీ తీరిపోయాయి.
రిమోట్‌తో కూర్చున్న చోటు నుంచి కదలకుండానే టీవీ ఛానల్స్ మార్చుకోవచ్చు. వాల్యూమ్ పెంచుకొవడంగానీ, తగ్గించుకోవడంగానీ, పిక్చర్ క్లారిటీ, బ్రైట్‌నెస్, కలర్స్ ఒక్కటేమిటి అన్నీ మార్చుకోవచ్చు. ఇంతకీ ఈ రిమోట్ ఏ విధంగా పని చేస్తుంది?
రిమోట్ కంట్రోల్‌లో వివిధ రకాల పనులకు వివిధ రకాల బటన్లు ఉంటాయి కదా! మనం ఏదయినా ఒక బటన్ ప్రెస్ చేశామనుకోండి ఆ బటన్ చేయాల్సిన పని ఇన్ఫ్రారెడ్ కిరణాలుగా సంకేత రూపంలోకి మారుతుంది. ఆ కిరణాలు టీవికి అమర్చిన బటన్లను అందుకుం టాయి. ఫలితంగా మనం ప్రెస్ చేసిన బటన్ వలన మనం అనుకున్న పని జరుగుతుంది.
రిమోట్ కంట్రోల్ వెనుక భాగంలో ఒక ఎలక్ట్రానిక్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు, బ్యాటరీ కనెక్షను కూడా ఉంటాయి. దీనిని చిప్ అంటారు. టి.ఎ 11835 అని ఉన్న చోట ఒక సమగ్రమయిన వలయం ఉం టుంది.
చిప్‌కు కుడి వైపున నలుపు రంగులో ఉండే ట్రాన్సిస్టర్ ఉంటుంది. ఆకు పచ్చ రంగులో రెండు విద్యుత్ నిరోధకాలు పసుపు రంగులో రెజొనేటర్, ముదురు నీలం రంగులో కెపాసిటర్ ఉంటాయి. బ్యాటర్ కు కలపబడిన ఆకుపచ్చ రంగు విద్యుత్ నిరోధకంతో పాటు బ్రౌన్ రంగులో ఉన్న ఓ కెపాసిటర్ కూడా ఉంటుంది.
మనం రిమోట్ కంట్రోల్ ప్రెస్ చేయగానే ఆ విషయాన్ని చిప్ గ్రహి స్తుంది. మనం ప్రెస్ చేసిన బటన్ తాలుకు పనిని మోర్స్‌కోడ్ లాంటి సంకేతంగా మారుస్తుంది,
రిమోట్ కంట్రోల్‌లో ఒక్కొక్క బటన్‌కు విడివిడిగా సంకేతాలు ఉంటాయి. చిప్ ఈ సంకేతాలను ట్రాన్సిస్టర్‌కు పంపగానే అది ఆ సంకేతాలను అర్థం చేసుకుని ఆంప్లిఫై చేసి కన్‌ఫర్మ్ చేెస్తుంది. ఈ సంకేతాలు రిమోట్ కంట్రోల్ చివరి భాగంలో ఉండే ఒక చిన్న బల్ప్ రూపంలో ఉన్న లైట్ ఎమిటింగ్ డయోడ్‌ను చేరుకుంటాయి. ఈ లెడ్ సంకేతాలను ఇన్ఫ్రారెడ్ కిరణాలుగానే మార్చేస్తుంది. ఈ కిరణాలు టీవిలో ఉండే రెసిప్టర్ (గ్రాహకం) గ్రహిస్తుంది. కిరణాలు తీసుకు వచ్చిన సంకేతాలను టీవీ వలయానికి అందించడంలో సంకేతాలకు అనుగుణంగా టీవీ వలయంలో మారుస్తుంది. ఈ విధంగా రిమోట్ కంట్రోల్ పని చేస్తుంది.
ఫస్ట టైమ్
– 1892లో లండన్‌కి చెందిన డాక్టర్ వాషింగ్టన్ షెఫీల్డ్ అనే దంత వైద్యుడు మొట్టమొదటి సారి టూత్ పేస్ట్‌ను ట్యూబ్‌ల రూపంలో తయారు చేయడం ప్రారంభించాడు.
– డ్రైవింగ్ లైసెన్సులను మొట్టమొదటి సారి 1893 ఆగస్టు 14న ఫారిస్‌లో జారీ చేశారు.
– టీవీలో తొలి డ్యాకుమెంటరీ ప్రోగ్రామ్ 1928 నవంబరులో ప్రసారం అయింది.
– ఆటోమేటిక్ టెల్లర్ మెషీన్ (ఎ.టి.ఎమ్) ద్వారా డబ్బు డ్రా చేెసుకునే పద్ధతికి శ్రీకారం ”బార్ క్లీస్ బ్యాంక్’ 1969లో లండన్ సమీపంలో చుట్టింది.
– టెలివిజన్‌లో కలర్ ప్రసారాలు మొట్టమొదటి సారి 1928 జూలై 3న లండన్‌లో ప్రారంభమయ్యాయి.
– వృద్ధ శరణాలయాలు మొట్టమొదటి సారి చైనాలో క్రీస్తు పూర్వం 2200 సంవత్సరంలో ఏర్పాటయ్యాయి.
– అలారం మ్రోగే గడియారాన్ని తొలిసారి జర్మన్ వారు రూపొందిం
చారు. 1350-1380 మధ్య కాలంలో ఈ గడియారాన్ని రూపొం దించారు.
– ప్రింటింగ్‌లో అశ్చర్యార్థకం (!) ఉపయోగించడం అనేది 1553లో ప్రారంభమయింది.
– ఆఫీసు వ్యవహారాల్లో కంప్యూటర్లు వినియోగించడం 1954లో మొదలయింది.
– తొలి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ మెల్‌బోర్నో క్రికెట్ గ్రౌండ్‌లో 1877న నిర్వహించారు. ఇంగ్లండ్, ఆస్ట్రేలయాకు మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో ఇంగ్లడ్ విజేతగా నిలిచింది.
– మొట్టమొదటి యూనివర్సిటీ మ్యాగజైన్ పేరు ‘స్టూడెంట్’. దీనిని ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వారు ప్రచురించారు.
– రిక్షాను మొట్టమొదటి సారి అమెరికాలోని ‘యొకహామ’లో 1869లో రూపొందించారు.
-1902లో జర్మనీలో ఫ్యాక్స్ యంత్రాన్ని తయారు చేసిన వ్యక్తి ప్రొఫె సర్ ఆర్దర్ కార్న్. ఫ్యాక్స్ యంత్రం 1902లో రూపొందించబడినా
మొట్టమొదటి ఫ్యాక్స్ మెసెజ్‌ను పంపేందుకు 1904 వరకు వేచి ఉండాల్సి వచ్చింది.
-1893 ఆగస్టు 14 నుంచి పారిస్‌లో పార్కింగ్ పద్ధతులు ప్రారంభమయ్యాయి.
– రేడియోలో మొట్టమొదటి సారి వాతావరణ వివరాలు 1923 మార్చి 26న బి.బి.సి ప్రసారం చేసింది.
– చెత్తను శుభ్ర పరిచే వ్యాక్యూమ్ క్లీనర్‌ను 1901లో మొట్టమొదటి సారి లండన్‌లో తయారు చేశారు.