అబ్దుల్ హమీద్ బిలాలీ
షైతాన్ రెండు ప్రధాన మార్గాల ద్వారా మనిషిలోకి ప్రవేశిస్తాడు. ఆ రెండు మార్గా ల్లో ఒకటి: అనుమానాలు. రెండోది: మనో వాంఛలు. సాధారణంగా ఈ రెండు విష యాలే మనిషిని తన ప్రభువు పట్ల అవి ధేయతకు పాల్పడమని పురికొల్పుతూ ఉం టాయి. దైవ ప్రసన్నతను బడసేందుకు దోహదపడే పనుల నుండి ఆపుతాయి. అనుమానాలు మనోవాంఛలు మనిషిని స్వర్గం నుండి దూరం చేసి నరకాగ్నికి ఇంధనం అయ్యేలా చేస్తాయి. ఇక్కడ మేము మనుషుల్లో జనించే కొన్ని ముఖ్య మైన సంశయాలను, అనుమానాలను గురించి పేర్కొంటున్నాం.
1. లైంగిక శక్తిపై అదుపు
ప్రజల్లో చాలామంది ఈ విధంగా ఆలో చిస్తారు. ”దేవుడు మానవుల్ని (స్త్రీ,పురుష) జంటగా సృష్టించాడు. వారిలో ఒండొకరి పట్ల లైంగిక ఆకర్షణ సృజించాడు. ఇది అమిత ప్రభావవంతమైన, అత్యంత ప్రమా దకరమైన శక్తి. దానిని ఎంతగా అణచు కోవాలని ప్రయత్నిస్తే అది అంతగా పైకి ఉబికి వస్తుంది. దాన్ని మరీ ఎక్కువగా అదుపులో ఉంచటానికి ప్రయత్నిస్తే కొన్ని కొన్ని సందర్భాల్లో అది కట్టలు తెంచుకునే ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే స్త్రీలు కప్పుకునే వస్త్రాలు వారి సౌందర్యా న్ని మరుగపరచి ఉంచుతాయి. అలాంట ప్పుడు యువకులు తమ కోర్కెల్ని అదుపు లో ఉంచుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా గనక లైంగిక కోర్కెల్ని అదుపులో ఉంచుకోవటానికి ప్రయత్నిస్తే అవి విజృంభిస్తాయి. ఆ విజృంభణే కొన్ని కొన్ని సార్లు కిడ్నాపింగ్ (అపహరణ), రేపింగ్ (బలాత్కారం) లాంటి రూపాల్లో అవతరిస్తుంది. కనుక సమస్యలన్నిటికి పరిష్కారం ఒక్కటే! అదేమిటంటే స్త్రీలను ‘ముసుగు’ల్లో నుంచి బయటికి తీయాలి. అలా చేస్తే యువకులకు లైంగిక కోర్కెల్ని అదుపు చేసుకోవాల్సినఅవసరం ఉండదు. స్త్రీల ఒంపుసొంపుల్ని చూసుకొని వారు కాస్తయినా ఊరటను పొందుతారు. ఆ విధంగా స్త్రీలు అర్ధనగ్నంగా కళ్ళ ముందు కనబ డుతూ ఉంటే ఆ విధంగా వారి ఈ అవస రాన్ని తీర్చుకోగలరు. పైన చెప్ప బడిన తర్కం ప్రకారం లైంగిక కోర్కెల విజృంభణ జరగకుండా ఉంటుంది”.
పై సందేహ నివృత్తి – పైన ఉటంకించబడిన మాటలు పైకి ఎంతో హేతుబద్ధమైనవిగా, సమంజసమైన విగా కనిపిస్తాయి. అంధయుగవు సమా జాలను అల్లకల్లోలం నుండి కాపాడటానికి ప్రతిపాదించబడిన గొప్ప అభ్యుదయ సూత్రాల్లాగా కనిపిస్తాయి. వాస్తవానికి ఇలాంటి సూచనలు, సలహాలు సమాజా నికి ఎంతో హానికరమైనవి. ఇవి మానవ వ్యవస్థను మరింత అల్లకల్లోలానికి గురి చేస్తాయి. ఒకవేళ పై అభిప్రాయమే నిజ మైనదయితే అమెరికా, యూరప్ దేశాల్లో కిడ్నాప్‌లు, మానభంగాలు, స్త్రీల పట్ల పురుషుల లైంగిక వేధింపులు మొదలగు అనైతిక నేరాల సంఖ్య తగ్గిపోవాల్సింది కదా? కొన్ని దేశాల్లోనయితే వ్యభిచార గృహాలు తామరతంపరలుగా కనిపిస్తాయి. అక్కడ వ్యభిచారిణుల తమ అందచందా లను ప్రదర్శిస్తూ, జనాన్ని ఆకర్షిస్తూ ఉం టారు. మరి ఇలాంటి లైంగిక విచ్చలవిడి తనం వల్ల అక్కడ స్త్రీల కిడ్నాపింగ్‌లు తగ్గిపోయాయా? పరుషుల లైంగిక దాహం తీరి పోయిందా? స్త్రీలు ఆన్ని రకాల ప్రమా దాల నుండి సురక్షితంగా ఉంటున్నారా?
అమెరికాప్రభుత్వం అధికారిక వివ రాలు – దేశంలో పెట్రేగుతున్న నేరప్రవృత్తి వాస్తవిక స్థితిని తెలుసుకునే ఉద్దేశ్యంతో అమెరికన్ ప్రభుత్వం ఒక సర్వే జరిపించింది. ఆ సర్వే రిపోర్టులోని ముఖ్యాంశాలను ‘అమె రికాలో నేర ఉదంతాలు’ అన్న పేరుతో ఒక పుస్తకాన్ని కూడా వెలువరించటం జరిగింది. ఈ పుస్తకం అమెరికన్ ప్రభు త్వం తరపు నుండే ప్రచురించబడింది. అందులో ఆరవ పేజిలో ‘అమెరికాలో ప్రతి ఆరు నిషిషాల్లో ఒక మానభంగం జరుగు తుంది. దాని కోసం ఆయుధాలను కూడా ఉపయోగించటం జరుగుతుంది’ అని పేర్కొనబడింది. ఇది 1988వ సంవత్సరా నికి సంబంధించిన రికార్డు. ఆ పుస్తకం లోనే నేరాల సంఖ్య, అంకెలలో ఈ విధం గా పొందుపరచబడి ఉన్నాయి.
అమెరికాలో మానభంగాలు:
సంవత్సరం – మానభంగాల సంఖ్య
1978 లో 1,47,389
1979 లో 1,68,134
1981 లో 1,89,450
1983 లో 2,11,691
1987 లో 2,21,764
పైన పేర్కొనబడిన లైంగిక నేరాల అంచనాల ద్వారా ఇంకా ఇలాంటి ఇతర విశ్వసనీయమైన వార్తల ద్వారా బోధపడే విషయమేమిటంటే, ఆయా దేశాల్లో లైంగిక నేరాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయే గాని తగ్గటం లేదు. ఈ విషయాన్ని మనం క్రింద పేర్కొన బడిన దివ్యఖుర్‌ఆన్ సూక్తికి క్రియాత్మక వ్యాఖ్యానంగా భావించవచ్చు.
”ప్రవక్తా! నీ భార్యలకూ, నీ కూతుళ్లకూ, విశ్వాసుల స్త్రీలకూ తమ దుప్పట్ల కొంగులను తమపై వ్రేలాడ తీసుకోమని చెప్పు; వారు గుర్తింపబడటానికీ, వేధింబడ కుండా ఉండేందుకూ ఇది ఎంతో సము చిత మైన పద్ధతి”. (అల్ అహ్ జాబ్:59) ఇమామ్ ఖుర్తుబీ తన వ్యాఖ్యాన గ్రంథం లో ఈ సూక్తి నేపథ్యం గురించి ఇలా వివ రించారు: మరుగుదొడ్లు నిర్మించబడక ముందు స్త్రీలు కాలకృత్యాలు తీర్చుకోవ టానికి సాధారణంగా దూరంగా ఉండే మైదాన ప్రాంతాలకు వెళ్ళేవారు. అలా వెళ్ళే స్త్రీలలో బానిసరాళ్ళు, స్వేచ్ఛాపరులైన స్త్రీలు కూడా ఉండేవారు. అయితే స్వేచ్ఛాపరురాళ్ళైన స్త్రీలు మాత్రం బురఖాలు ధరించి సౌశీల్యవతులుగా గుర్తించబడే వారు. దారిలో ఆకతాయి కుర్రవాళ్ళు బానిసరాళ్ళను వేధించేవారు. పైన పేర్కొన బడిన సూక్తి అవతరించక ముందు ఒక సారి ఒక విశ్వాసురాలైన స్త్రీ కాలకృత్యాలు తీర్చుకోవటం కోసం బహిర్భూమికి వెళ్ళింది. ఆమెను బానిసరాలిగా భావించి కొందరు తుంటరులు వెకిలి చేష్టలకు పాల్పడ్డారు.
ఆ స్త్రీ భయంతో కేకలు పెట్టింది. దాంతో వారు పలాయనం చిత్తగించారు. ఆమె వెళ్ళి దైవప్రవక్త (స) కు ఫిర్యాదు చేసింది. అప్పుడే ఈ సూక్తి అవతరించింది. చెప్పొచ్చేదేమిటంటే, వీధుల గుండా వస్తూ పోతూ ఉండే మగవారి ముందు తమ సౌందర్యాన్ని ప్రదర్శించే స్త్రీలు వాస్తవానికి తోడేలు మనస్తత్వం గల పురుషుల ముందు తమల్ని తాము సమర్పించుకుం టున్నారనే నిజాన్ని గ్రహించాలి. ఎందు కంటే పరదా రాహిత్యం అనేది కోర్కెల్ని కవ్విస్తుంది. దీనికి భిన్నంగా పరదా ధరిం చే స్త్రీలు లైంగిక వాంఛల్ని జనింపజేసే తమ అలంకరణను, శరీరావయవాలను మరుగున ఉంచుకుంటారు. కేవలం మొహం, అరచేతులు తప్ప వారి శరీరం లో మరేమీ కానరావు.మరి కొంత మంది పండితులయితే కేవలం కళ్ళు మాత్రమే కనిపించాలంటారు. మొత్తానికి ఆ విధం గా నిండుగా పరదా ధరించి తమ అంద చందాలను, శరీరభాగాల్ని కప్పి పుచ్చు కునే, ముఖం అరచేతులు తప్ప వారి శరీరభాగం ఏదీ బయటకు కనిపిం చని విధంగా, మరి కొందరి దృష్టిలో కళ్ళు తప్ప మరేమీ కనిపించని విధంగా పరదా పాటించే ఆ స్త్రీలు ఎటువంటి లైంగిక కోర్కెల్ని ఏ విధంగా రెచ్చగొడ్తారు? అలాంటి స్త్రీ సమాజంలో ఏర్పడే అప సవ్యతలకు కారణభూతం అవుతుందా? స్త్రీలు కష్టాలకు, ఇబ్బందులకు లోను కాకూడదన్న ఉద్దేశ్యం తోనే దేవుడు వారికి పరదా పద్ధతిని విధించాడు. ఫ్యాషన్లు ఇతర నగ్న దృశ్యాలు లైంగిక నేరాలను పెంచి పోషిస్తాయనీ, అణిగి ఉండే లైంగిక కోర్కెల్ని కవ్విస్తాయనే విషయం దేవునికి బాగా తెలుసు. ఈ విషయాలన్నిటిని చదివి కూడా ఎవరయినా తమ అభి ప్రాయమే సహేతుకమైనదని పట్టుపట్టి మొండిగా వాదిస్తే వారి ఆలోచనా వికాసం కోసం మేము క్రింద నాలుగు వాస్తవాలను పేర్కొంటున్నాం, గమనించగలరు.
మొదటి వాస్తవం: పైన పేర్కొనబడిన నేరాల సంఖ్య వారి వాదనను త్రోసిపుచ్చు తోంది.
రెండవ వాస్తవం: స్త్రీ పురుషులిద్దరిలో నూ లైంగిక వాంఛలు ఉన్నాయి. దేవుడు ఎన్నో కారణాల దృష్ట్యా వాటిని ఇరువురి లోనూ పొందుపరచాడు. వాటిలో సంతా నోత్పత్తి పరిరక్షణ కూడా ఒకటి. ఈ పరి స్థితి గనక లేకపోతే జాతి ఎలా మిగిలి వుంటుంది? అన్న విషయాన్ని మనం గమ నించాలి. సహజమైన ఈ కోర్కెల్ని ఎవరూ తిరస్క రించలేరు. మరలాంటప్పుడు పురు షులు నగ్న, అశ్లీలమైన దృశ్యాలు చూసి కూడా తమ సహజమైన కోర్కెల్ని అదుపు లో పెట్టుకోగలరని ఎలా ఆశించగలం?
మూడో వాస్తవం: స్త్రీల అలంకరణ, అందచందాలు పురుషుల్లో అంతర్లీనమై ఉండే లైంగిక వాంధల్ని కవ్విస్తాయన్నది ఒక వాస్తవికమైన విషయం. స్త్రీ ముఖార విందం గాని, ఇతర అవయవాలు గాని ఏవీ ఇందుకు తీసిపోవు. ఏ ప్రకృతి ధర్మం పై దైవం తనను సృష్టించాడో, దాన్ని వ్యతిరేకించడం, ఇటువంటి భావోద్రేకాల ను రెచ్చగొట్టే దృశ్యాలను చూసిన తర్వాత కూడా తన సహజ కోర్కెలను అణచుకో వడం అసాధ్యం.
నాల్గో వాస్తవం: లైంగిక వాంఛల్ని కవ్వింపజేసే అశ్లీల దృశ్యాలను సర్వ సామాన్యం చేయటం ద్వారానే తమ లైంగిక కోర్కెల్ని నియంత్రించుకోవడానికి అదే సరైన చికిత్స అని భావించుకున్నట్ల యితే, దానివల్ల రెండు ఫలితాలు ఎదురవుతాయి.
మొదటిది: నగ్న, అశ్లీలమైన దృశ్యాలు చూసి కూడా ఎలాంటి భావోద్రేకాలకు లోనుకాని పురుషులు వాస్తవానికి నపుంస కులు. ఎందుకంటే వారి లైంగిక శక్తి అంతరించిపోయి ఉంటుంది. కనుకనే వారికి అలాంటి తలంపులు రావటం లేదు.
రెండోది: బహిరంగంగా నగ్న, అశ్లీల మైన దృశ్యాలు చూసినప్పటికీ లైంగిక వాంఛలు కలగటం లేదంటే బహుశా అలాంటి పరుషుల్లో లైంగిక పరమైన వ్యాధులు ఉండి ఉండవచ్చు. ఈ సందేహంలోని సత్యత గురించి వాది స్తున్నట్లయితే వారు మన సమాజంలోని పురుష గ్రూపులకు చెందిన పరుషులలో చేరిపోగోరుతున్నారా?
అసంతృప్తి (నొ కన్విక్షన్ ) – ఇది రెండో అనుమానం. దీన్ని అనుమా నం అనడంకన్నా మనోవాంఛలకు దాసోహం అంటే బాగుంటుంది. పరదా పాటించని స్త్రీని ఉద్దేశ్యించి ‘మీరు పరదా పాటించరెందుకండీ?’ అని అడిగితే, దానికి ఆమె నేనింకా సంతృప్తి చెంద లేదు. సంతృప్తి కలిగినప్పుడు ఇన్షా అల్లాహ్‌ా పరదా పాటిస్తాను అని సమా ధానమిస్తుంది ఈ విధంగా జవాబు చెప్పే సోదరీమణులు రెండు విషయాల మధ్య భేదం పాటించాలి. అవి: మొదటి విషయం ”దైవాజ్ఞ” రెండో విషయం ”మానవాజ్ఞ”
ఓ నా చిట్ట చెల్లీ! పరదా పాటించమని చెప్పిందెవరు? ఒకవేళ పరదా పాటించటం మానవాజ్ఞ అయి ఉంటే అందులో పాపం, పుణ్యం రెంటికీ ఆస్కారముంది. ఇమామ్ మాలిక్ (ర) ఇలా అంటున్నారు: మనిషి మాట సత్యమైనా కావచ్చు లేక అసత్యమైనా కావచ్చు. కనుక ఒక్క దైవప్రవక్త(స) తప్ప మిగతావారి మాటను మీరు అంగీకరించవచ్చు లేదా తిరస్కరించనూ వచ్చు. కాని ఏదైనా ఆజ్ఞ దైవాజ్ఞలకు సంబంధించినదయితే; అంటే దేవుడు తన పవిత్ర గ్రంథం లో ఏదయినా విషయం గురించి ఆజ్ఞాపించి ఉంటే లేక దాని గురించి మానవాళికి తెలియజేయమని తన ప్రవక్తను ఆదేశించి ఉన్నట్లయితే అలాంటప్పుడు అది తనకు సంతృప్తికరంగా లేదన్న సాకుతో ఏ మాన వుడూ దాన్ని తిరస్కరించలేడు. ఏ స్త్రీ లేక పరుషుడయినా ఫలానా ఆజ్ఞ దైవగ్రంథంలో పేర్కొనబడి ఉందని తెలిసి కూడా దాని పట్ల అభ్యం తరం తెలుపుతూ, దాన్ని అంగీకరించటానికి నిరాకరిస్తే వారు తమకు తాముగా ఇస్లాం ధర్మం నుండి బహిష్కరించబడటానికి అవకాశాలు కల్పించుకుంటున్నారని గ్రహించాలి. ఎందుకంటే వారి ప్రవర్తన మూలంగా వారికి దైవాజ్ఞలు సహేతుకమైనవన్న విషయంలో నమ్మకం లేదనీ ఆ విషయంలో వారు డోలాయమాన స్థితికి లోనై ఉన్నారని అర్థ మవుతోంది. ఈ ప్రవర్తన వారి విశ్వాసానికే గొడ్డలి పెట్టు! ఇది చాలా ప్రమాదకరమైన మాట.
ఒకవేళ ఏ సొదరి అయినా తాను పాపాత్మురాలిననీ, మనోవాంఛల్ని అదుపులో పెట్టుకోలేకపోతున్నాననీ, తనకు మనోబలం బొత్తిగా లేదనీ, తన హృదయం బలహీనమైనదని అంటే – ఇలాంటి మాటలు మాత్రం అసంతృప్త భావనల క్రిందికి రావు. ఎందుకంటే ఆమె తన బలహీన తల్ని, తప్పుల్ని ఒప్పుకుంటోంది. అదీగాక ఆమె తనకు ఇష్టమైతేనే దైవాజ్ఞల్ని నెరవేరుస్తాననీ, కష్టమైతే మానేస్తానని చెప్పట్లేదు కదా! అందుకని ఇలాంటి మాటలు అసంతృప్తి భావనల క్రిందికి రావు. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
”అల్లాహ్ , ఆయన ప్రవక్తా ఏ విషయంలోనయినా ఒక తీర్పు చేసి నప్పుడు విశ్వాసి అయిన ఏ పురుషునికయినా, విశ్వాసురాలైన ఏ స్త్రీ కయినా, తరువాత తమ యొక్క ఆ విషయంలో స్వయంగా మళ్లీ ఒక నిర్ణయం తీసుకునే హక్కు లేదు. ఇంకా ఎవడైనా అల్లాహ్‌ాకు, ఆయన ప్రవక్తకు అవిధేయత చూపితే, అతను స్పష్టంగా మార్గభ్రష్టతకు గురి అయినట్లే”. (అల్ అహ్‌ాజాబ్ : 36) సరైన ఆలోచనాసరళి:
మనస్ఫూర్తిగా దైవాన్ని విశ్వసించి, ఆయన్ని సర్వాధికారిగా అంగీ కరించినవారు మారు మాట్లాడకుండా ఆయన ఆజ్ఞల్ని శిరసా వహించాలి. ఒక నిజమైన విశ్వాసి ముఖ్య లక్షణమేమిటంటే అతను దైవదేశాలను విన్న వెంటనే వాటిని అమలు పరచటానికి ప్రయత్ని స్తాడు. విశ్వాసులు దైవాజ్ఞల్ని విన్నదే తడవుగా ఆచరించి చూపిస్తారని స్వయంగా దివ్యఖుర్‌ఆన్ కూడా ధృవీకరిస్తోంది. విశ్వాసులు ఇలా అంటారు: ‘మేము ఆదేశం విన్నాం, శిరసా వహించాం. స్వామీ! క్షమా భిక్ష పెట్టు. చివరికి మేమంతా నీ వద్దకే మరలి వస్తాం”. (అల్ బఖర: 285)
దేవుని ప్రతి ఆజ్ఞ విషయంలోనూ మనం అది మన మంచి కోసమే ఉద్దేశ్యించబడినది, అందులో మన కొరకు మేలు దాగి ఉందని భావిం చాలి. ఆయన స్త్రీల కొరకు పరదా పద్ధతిని నిర్ణయించాడు. కనుక పరదా పద్ధతిలో తమ కొరకు మేలు ఉందనీ, అవి తమ మానమర్యా దలను కాపాడుతుందని స్త్రీలు గ్రహించాలి. దేవుడు అన్నీ తెలిసిన వాడు. అంతా ఎరిగినవాడు. ఆయన జ్ఞానం విశ్వాన్నంతటినీ పరి వేష్ఠించి ఉంది. ఆయనకు మనిషి పుట్టుకకు ముందు ఏం జరిగిందో, భవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా తెలుసు. ముస్లింలమైన మనం ఈ విషయాన్ని మనసారా విశ్వసిస్తాం. అలాంటప్పుడు అనంత జ్ఞాన సంపన్నుడైన దేవుని మాటను పక్కన పెట్టి పరిమిత జ్ఞానం కల వాడైన మానవుని మాటను పట్టుకొని వ్రేలాడటం మార్ఖత్వం కాకపోతే మరేమిటి?
వాస్తవంపై ఆధారమయిన ఉదాహరణ: పైన చెప్పబడిన విషయానికి సంబంధించి ఒక క్రియాత్మక ఉదాహ రణ ను గమనించండి. మనం ఒక కంప్యూటర్ కొన్నామనుకోండి. ఆ కంప్యూటర్‌ను తయారు చేసినవాడు మనకు దగ్గర్లోనే ఉన్నాడు. అతనికి కంప్యూటర్ ఉపయోగించే పరిజ్ఞానంతోపాటు దానికి సంబం ధించిన ఇతర వివరాలు కూడా తెలుసు. అలాంటప్పుడు మనం దారిన పోయే ఏ దానయ్యనో, బండ్లుతోలే ఏ బుచ్చయ్యనో పిలుచుకు వచ్చి మాకు కంప్యూటర్ నేర్పించమని అంటే ఎలా ఉంటుంది.? తలలో తెలి వున్న వాడెవడూ ఆ పని చేయడు. ఆ యంత్రాన్ని ఎలా ఉపయోగిం చాలో ఒకవేళ అది చెడిపోతే దాన్ని ఎలా బాగు చేసుకోవాలో తెలుసు కోవటం కోసం నిపుణుల్ని సంప్రతించమని బుద్ధి మనల్ని ఆదేశిస్తుంది.
ఏ శక్తి సంపన్నుడయితే మనిషిని పుట్టించి, అతన్ని అన్ని విధాలా తీర్చిదిద్దాడో ఆయనే మనిషికి ప్రభువు. కనుక ఒక వస్తువు వల్ల మనిషి కి లాభం చేకూరుతుందో లేక నష్టం కలుగుతుందో సహజంగానే ఆయనకు బాగా తెలిసి ఉంటుంది. అలాంటప్పుడు అల్లాహ్‌ాను వదలి, మార్గదర్శకత్వం కోసం ఇతరుల్ని ఆశ్రయించటం, సలహాలు, ఆదేశాల కోసం ఇతరుల్ని సంప్రతించటం అవివేకమే అవుతుంది. ముఖ్యంగా మూర్ఖుల సలహాలను పాటిస్తే మాత్రం వినాశాన్ని కొనితెచ్చుకోవలసి వస్తుంది. దైవేతరుల ముందు తలవంచటాన్ని పిచ్చితనంగా, మూర్ఖత్వంగా తెలివితక్కువతనంగా అభివర్ణించవచ్చు. అవివేకుల హితబోధను ఆచరించే వ్యక్తి వినాశానికి గురౌతాడు. శోచనీయమైన విషయం ఏమిటంటే మనకు జవాబు ఇచ్చే శక్తిలేని వారిని మనం జవాబు కోరటం మనలో చాలా మందికి అసలు ‘ఇస్లాం’ అన్న పదానికి అర్థం ఏమిటో కూడా తెలీదు. వాస్తవానికి ఇస్లాం అంటే దైవాజ్ఞలకు శిరసావహించటం, ఆయనకు పూర్తిగా విధేయత చూపటం, ఆయన ఆదేశాల్ని, నిషేధాల్ని పాలించటం అని అర్థం.
సందిగ్ధంలో పడకు సోదరీ! మీరెప్పుడయినా పరదా పాటించని సోదరీమణులకు దాని ప్రాముఖ్యతను గురించి బోధిస్తే వారిలో కొంతమంది సోదరీమణులు నేనూ ముస్లింనే. విశ్వాసురాలినే. నేను కూడా ఫర్జ్, నఫిల్ నమాజులు చేస్తుంటాను. రమజాన్ నెలలో ఉపవాసాలుంటాను. హజ్ లాంటి పవిత్ర విధిని కూడా నెరవేర్చాను. ఎన్నో సార్లు ఉమ్రా చేశాను. కొన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాను. కానీ పరదా విష యానికొచ్చేసరికి ఎందుకో అది నా మనసుకు నచ్చటం లేదు” అని చెబుతుంటారు. అలాంటి మహిళకు మా సమాధానం ఇది: చూడండి….! మీరు ఆ గొప్ప పనులన్నీ చేశారు. సంతోషకరమే! వాటన్నిటి మూలం దైవాజ్ఞలే కదా! ఆ విధుల్ని విడిచిపెడితే శిక్షకు గురవుతామన్న భయమున్నప్పుడు కొన్ని ఆజ్ఞల్ని విశ్వసించి మరి కొన్నిటిని వదలివేయటమేమిటి? మరి చూడబోతే వాటన్నిటి మూలం ఒక్కటే కదా! ఉదాహరణకు దైవగ్రంథంలో నమాజ్ చేయటం విధి అని చెప్పబడింది కనుక మీరు నమాజ్ చేస్తున్నారనుకోండి; మరలాంట ప్పుడు పరదాను పాటించటం కూడా విధే కదా! ఎందుకంటే ఖుర్‌ఆన్, హదీసులలో పరదాను పాటించటం విధి అని నిరూపించబడింది. ఈ విషయంలో ఎలాంటి సందేహానికీ తావులేదు.
దేవుడు ఇస్రాయీల్ జాతి వారిని మందలించిన విషయాన్ని మీరె ప్పుడూ వినలేదా? వారు కూడా దైవాజ్ఞల్లో కొన్నింటిని అంగీకరించి మరికొన్నిటిని వదలి పెట్టేవారు. వారి గురించి దేవుడు ఇలా అంటు న్నాడు: ”మీరు దైవగ్రథంలోని ఒక భాగాన్ని విశ్వసించి, మరొక భాగాన్ని తిరస్కరిస్తారా? మీలో ఇలా చేసే వారిని ఇహలోక జీవితంలో ఘోర అవమానానికీ, పరలోకంలో తీవ్రమైన బాధకూ గురి చెయ్యటం తప్ప మరొక శిక్ష ఏముంటుంది? మీ చేష్టలు అల్లాహ్‌ాకు తెలియ కుండా లేవు.” (అల్ బఖర:85) ఒక ప్రామాణికమైన హదీసు ప్రకారం దైవప్రవక్త(స) ఈ విధంగా ప్రవచించారు: ”ప్రళయదినాన నరకంలో అందరికంటే తక్కువ శిక్ష అనుభవించే వారి అరికాళ్ల క్రింద రెండు నిప్పు తునకలు ఉంచటం జరుగుతుంది. దాని వేడికి వారి మెదడు పొయ్యి మీదున్న కుండ ఉడికినట్లు కుతకుత ఉడికిపోతూ ఉంటుంది.” (బుఖారీ 11/376)
ప్రియ సోదరీ! ఇహలోకపు డాబు, దర్పాల కోసం నీవు పరలోక జీవితాన్ని నాశనం చేసుకుంటావా? నిన్ను నువ్వు భయంకర మైన శిక్షకు గురి చేసుకోదలచావా? మా వరకు మేము పరలోకంలో నీకు మంచి జర గాలనే కోరుకుంటున్నాం. దాని కోసం నువ్వు కాస్త తెలివిగా వ్యవహ రించాలనీ, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మనసారా వేడు కుంటున్నాం.
3) విశ్వాసం మనసులో ఉంటుంది! మీరెప్పుడయినా పరదా పాటించని స్త్రీలను తమ వైఖరికి కారణ మేమిటని అడిగితే వారు ఒక్కసారిగా ”విశ్వాసం (దైవభీతి) మనసులో ఉంటే చాలు. ఎలాంటి పరదాలూ అవసరం లేదు” అని అనేస్తారు. మరి మీరు ఈ విషయం గురించి ఎప్పుడయినా తోతుగా ఆలోచించారా? పై సందేహానికి మూలం కొంతమంది చాలా అవాంఛనీయ అర్థంతో హదీసులకు భాష్యం చెబు తారు. ఉదాహరణకు క్రింద పేర్కొనబడిన దైవ ప్రవక్త(స) ప్రవచనాన్నే తీసుకోండి.”దేవుడు మీ ముఖాలను, మీ సిరిసంపదల్ని చూడడు. ఆయన మీ మనోగతాన్ని, మీ ఆచరణల్ని మాత్రమే చూస్తాడు” అని దైవప్రవక్త (స) ప్రవచించారు.(ముస్లిం)
విశ్వాసం మనసులో ఉంటుందన్న మాట ముమ్మాటికీ వాస్తవమే. అయితే విశ్వాసం అనేది మనసులోనే పరిపూర్ణమవుతుందని దైవప్రవక్త ప్రవచన ఉద్దేశ్యం ఎంత మాత్రం కాదు. ఆచరణలు స్వీకృతిని పొంద టానికి చిత్తశుద్ధి దైవభీతి ఎంత అవసరమో తెలియజెప్పటమే ఈ హదీసు అసలు ఉద్దేశ్యం. వాస్తవం ఏమిటంటే చిత్తశుద్ధి లేకుండా దేవుడు ఏ పనినీ అంగీకరించడు. ఒకానొక సందర్భంగా దైవప్రవక్త(స) తన ఛాతీవైపు సైగ చేసి చూపిస్తూ ”దైవభీతి(తఖ్‌వా) ఇక్కడుంటుంది” అని (మూడుసార్లు) అన్నారు. (ముస్లిం) నుజ్‌హతుల్ ముత్తఖీన్ సంకలనకర్త దానిని వివరణ ఇలా వివరిస్తున్నారు. ”అల్లాహ్‌ా ఏదయినా కర్మకు ప్రతిఫలం ఇచ్చేట ప్పుడు ఆంతర్యం, మనస్సును బట్టియే నిర్ణయిస్తాడు. ఇదే విధంగా మనస్సును దైవాభీష్టానికి అనుగుణంగా మలచుకోవడం, కోరికల కు సరయిన మార్గనిర్దేశనం చెయ్యడం, అల్లాహ్‌ాకు ఆగ్రహం కలి గించే దూషిత గుణాల నుండి పవిత్రం చేయడం కూడా అవసరం.
విశ్వాసానికి నిర్వచనం – మనసులో ఉన్నంత మాత్రాన విశ్వాసం పరిపక్వత చెందదు. పరిపక్వత చెందని విశ్వాసం నరకం నుండి విముక్తి పొందటం కోసం, స్వర్గంలో ప్రవేశించటం కోసం పనికి రాదు అహ్లె సున్నత్ వల్‌జమాత్‌కు చెందిన అత్యధిక మంది విద్వాంసులు విశ్వాసాన్ని ఈ క్రింది విధంగా నిర్వచిస్తున్నారు. ”మనసుతో నమ్మటం, నోటితో ధృవీకరించటం, అవయవాల ద్వారా దాన్ని ఆచరించటం, వ్యక్తపరచడం – ఇదే విశ్వాసం.”