నేడు ధార్మిక అవగాహన లోపించడం మూలంగా మారు మూల ప్రాంతాల్లో ఉంటున్న అనేెక మంది ముస్లింలు, నవ ముస్లింలు ధర్మాధర్మాలను ప్రక్కన బ్టెి హైందవ వివాహ విధానాన్ని అమలు పరుస్తున్నారు. ఏక సమయంలో ఇద్దరు అక్కా చెల్లెల్లను మనువాడటం, అక్క కూతురిని పెళ్ళి చేసుకోవడం ఈ కోవకు చెందినవే. వారందరికి ఈ వ్యాసం కనివిప్పు కాగలదన్న నమ్మకంతో.
1) నసబ్ – రక్తసంబంధం మూలంగా నిషిద్ధమయ్యేవి.
2) ముసాహరత్-అత్తవారితో ఏర్పడిన సంబంధం మూలంగా నిషిద్ధ మయ్యేవి.
3) రదాఅత్ – పాలు త్రాగించిన కారణంగా నిషిద్ధమయ్యేవి.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (ర) ఇలా అన్నారు: ”రక్త సంబంధం కారణంగా ఏడు సంబంధాలు నిషిద్ధం అవుతాయి. అత్తవారి మూలంగా ఏడు సంబంధాలు నిషిద్ధమవుతాయి. ఆ తర్వాత ఆయన ”హుర్రిమత్ అలైకుమ్ ఉమ్మహాతుకుమ్” – (నిసా: 23) ఆయతును చివరి వరకూ పఠిం చారు. (బుఖారీ)
అ) 1) తల్లి (నాయనమ్మ, అమ్మమ్మతో సహా).2) కూతురు (మనవరాళ్ళతో సహా)
3) తోబుట్టవు (సవతి సోదరితో సహా). 4) మేనత్త (సవతి మేనత్తతో సహా). 5) పిన్ని (సవతి పిన్నీతో సహా). 6) అన్నదమ్ముల కుమార్తెలు (సవతి అన్న దమ్ముల కుమార్తెలతో సహా). 7) అక్కచెల్లెల కుమార్తెలు (సవతి అక్కా చెల్లెల కుమార్తెలతో సహా). ఇదే నిబంధన స్త్రీలకూ వర్తిస్తుంది. ఉదాహరణకు – నాన్న (తాతతో సహా). కుమారుడు (మనవళ్ళతో సహా)…..
ఆ) తండ్రీ, తాతయ్య, మాతామహులు వివాహమాడిన స్త్రీలు. అత్త, నాయనమ్మ, అమ్మమ్మ, సమాగమం జరిపిన భార్య యొక్క మొది భర్త ద్వారా పుట్టిన కూతుళ్ళు, అతని సొంత కొడకు, మనవళ్ళ భార్యలతో వివాహ సంబంధం నిషిద్ధం.
ఇ) పాలిచ్చిన స్త్రీ. ఆమె కూతురు వివాహానికి అనర్హులే.
హజ్రత్ ఆయిషా (ర) కథనం – ప్రవక్త (స) ఇలా అన్నారు: ”ఏ సంబంధం పుట్టుక వల్ల హరామ్ అవుతుందో అదే పాలు త్రాగించడం వల్ల కూడా హరామ్ అవుతుంది”. (ముస్లిం) ఈ రకంగా చెప్పుకుంటే, 1)పాలిచ్చిన తల్లి 2) పాల వరస కూతురు. 3) పాల వరస సోదరి. 4) పాల వరస మేనత్త. 5) పాల వరస పిన్నమ్మ. 6) పాల వరస భ్రాతృజురాలు. 7) పాల వరస మేన కోడలు.
హజ్రత్ ఆయిషా (ర) ఇలా అన్నారు: ”దివ్య ఖుర్ఆన్లో పేర్కొనబడిన పాల వరస సంబంధం ఏర్పడానికి కనీసం 10 సార్లు త్రాగి ఉండాలన్న ఆజ్ఞ అవతరించింది. తరుబాత (ఈ ఆజ్ఞ రద్దయి) ఐదు సార్లు త్రాగినా సరే పాల వరస సంబంధం ఖరారై పోతుందనే ఆదేశం వచ్చింది”. (ముస్లిం)
”ఒకటి లేక రెండు సార్లు చనుబాలు త్రాగినంత మాత్రాన సంబంధం హరామ్గా రూఢీ అవ్వదు”. (తిర్మిజీ)
”పిల్లాడు జీర్ణ కోశం నిండే విధంగా పాలు త్రాగనంత వరకూ పాల వరస సంబంధం (రిజాఅత్) రూఢీ అవదు. అలాగే పిల్లవాడు పాలు విడిపించక ముందే త్రాగితే తప్ప పాల సంబంధం ఏర్పడు”. (తిర్మిజీ)
గమనిక: పాల సంబంధం మరియు దాని ఆదేశాలు కేవలం పాలు త్రాగిన వ్యక్తికి మాత్రమే వర్తిస్తాయి. ఆ వ్యక్తి చెల్లికిగానీ, అన్నకు గానీ ఈ సంబంధం ఆదేశం వర్తించదు.
తాత్కాలిక నిషిద్ధ సంబంధాలు
భార్య తోబుట్టువు, సవతి చెల్లితో సహా: ఫైరోజ్ దైలమీ అనే సహాబీ ప్రవక్త (స) వారి సన్నిధికి వచ్చి – ‘ఓ దైవప్రవక్తా! నేను కొత్తగా ఇస్లాం స్వీకరిం చాను. అక్కాచెల్లెళ్ళిద్దరూ నా దాంపత్యంలో ఉన్నారు, ఇప్పుడు నేనేం చేయను?’ అని విన్నవించుకున్నారు. అందుకాయన (స): ”ఇద్దరిలో నీకు ఇష్టమున్న ఆమెను ఉంచుకో. రెండో ఆమెకు విడాకులిచ్చెయ్య్” అని ఆదేశిం చారు. (అబూ దావూద్)
గమనిక: భార్య మరణించిన పక్ష లో లేదా అమెకు విడాకులిచ్చన పక్షంలో వారిని మనువాడే అనుమతి ఉంటుంది.
భార్యతోపాటు ఆమె మేనత్త లేదా ఆమె పిన్నిని ఏక కాలంలో నికాహ్ చేసుకోవడం:
హజ్రత్ జాబిర్ (ర) కథనం: ”ఏక సమయంలో భార్యతోపాటు ఆమె మేనత్తనుగానీ, ఆమె పిన్నినిగానీ వివాహ బంధంలో ఉంచడాన్ని దైవప్రవక్త (స) నిషేధించారు”. (బుఖారీ)
గమనిక: భార్య మరణించిన పక్షంలో లేదా అమెకు విడాకులిచ్చన పక్షంలో వారిని మనువాడే అనుమతి ఉంటుంది.
వేరొకరి వివాహ బంధంలో ఉన్న స్త్రీ:
”భర్తలు గల స్త్రీలు కూడా మీ కోసం నిషేధించ బడ్డారు”. (అన్నిసా: 24)
గమనిక: భర్త మరణించిన పక్షంలో లేదా అమెకు విడాకులిచ్చన పక్షంలో షరీయత్ గడువు ముగిసి తర్వాత వారిని మనువాడే అనుమతి ఉంటుంది.
ఇద్దత్ (గడువు) కాలంలో విడాకులు పొందిన స్త్రీనినిగానీ, వితంతువునిగానీ వివాహమాడటం ధర్మసమ్మతం కాదు.
మూడు వేెర్వేరు విడతల్లో వడాకులిచ్చిన మీదట ఆ మహిళను మళ్ళి నికాహ్ చేెసుకోవడం హరామ్. ఆమె మరో పురుషుణ్ని మనువాడి అతను ఆమెతో సమాగమం జరిపి తనంతట తానుగా ఆమెకు విడాకులు ఇచ్చినట్లయితే, అప్పుడు ఆ స్త్రీ ఇద్దత్ (గడువు) ముగిసిన తర్వాత మొది భర్త వివాహం చేసుకోగలడు.
శీలవతి అయిన స్త్రీ వ్యభిచారి అయిన పురుషుని కోసం హరామ్. శీలవంతు డైన పురుషుని కొరకు వ్యభిచారి అయి స్త్రీ హరామ్.
”అపవిత్ర స్త్రీలు అపవిత్ర పురుషుల కొరకు తగినవారు. అపవిత్ర పురుషులు అపవిత్ర స్త్రీల కొరకు తగినవారు”.
గమనిక: వారు ఒకవేళ పశ్చాత్తాపం చెంది, దిద్దుబాటు చేసుకుంటే అప్పుడు వారి నికాహ్ సమ్మతమే. అయితే స్త్రీ విషయంలో ఓ నిబంధన తప్పనిసరి. అదేమంటే, పశ్చాత్తాపం చెందిన స్త్రీ వివాహానికి ముందు ఆమె గర్భవతి కాదు అన్న నిర్థారణ జరగాలి. అంటే ఆమె నెలసరి బహిష్టు వచ్చిన మీదట శుద్ధి పొంది ఉండాలి.
విశ్వాసులైన స్త్రీపురుషులు ముష్రిక్కు – బహుదైవారాధకులు, విగ్రహారాధ కులయిన స్త్రీపురుషులను వివాహమాడటం హారమ్.
”ముష్రిక్కు స్వతంత్ర స్త్రీ మీకు ఎంతగా నచ్చినప్పికీ ఆమెకన్నా అల్లాహ్ను విశ్వసించే ఒక బానిస స్త్రీ ఎంతో ఉత్తమమయినది”. (ఖుర్ఆన్-2:221)
”షిర్క్ చేసే స్త్రీలు విశ్వసించి ముస్లింలు కానంత వరకూ మీరువారిని వివాహమాడకండి”. (ఖుర్ఆన్-2:221)
గమనిక: దత్త పుత్రుడు, పుత్రికతో తాత్కాలికంగా గానీ, శాశ్వతంగా గానీ నికాహ్ నిషిద్ధం అయినట్లు రూఢీ కాలేదు. (అల్ అహ్జాబ్ 37)