అకారణంగా హర్తాళ్ళకు దిగటం అవాంఛనీయం – ప్రశ్న :- కార్మికుల డిమాండ్లను సాధించడానికి, పరిస్థితులను మెరుగుపరచుకోవడానికి సమ్మెలు, హర్తాళ్ళు చేయటం గురించి షరీఅత్ ఆదేశాలేమి?
జవాబు :– సమ్మెలు, హర్తాళ్ళకు పూనుకోవటం అనేది యజమానికి – కార్మికులకు మధ్య జరిగిన ‘ఉద్యోగ ఒప్పందాన్ని’ భగ్నం చేయటం క్రిందికి వస్తుంది. యజమానికి ఆ ఒప్పందం ప్రకారం కార్మికులతో వ్యవహారం చేసినప్పుడు సమ్మెలకుగానీ, హర్తాళ్ళకుగానీ దిగటం వాంఛనీయం కాదు. అల్లాహ్ తన దివ్య గ్రంథంలో సాటి మనుషులతో చేసుకున్న ఒడంబడికలకు కట్టుబడి ఉండమని ఆదేశించారు. ఆయనిలా అన్నాడు:
”ఓ విశ్వాసులారా! ప్రమాణాలను, ఒడంబడికలను నెరవేర్చండి”. (అల్ మాయిద – 1)
సమ్మెలు, హర్తాళ్ళ వల్ల వ్యవస్థలో ఆరాచకం, విద్వంసం వంటివి జరిగేందుకు ఆస్కారముంటుంది. పరస్పర సంబంధాలు దెబ్బతింటాయి. ఉద్రిక్తత నెలకొంటుంది. ఇలాంటి వాటిని షరీయతు వాంఛించదు. ఎందుకంటే ధర్మశాస్త్రంలోని ఒక మౌలిక సూత్రం ప్రకారం ”ప్రయోజనాలు పొందజూడటం కన్నా చెడుగును దూరం చేయటం మిన్న”.
అయితే యజమాని కార్మికుల వేతనాన్ని చెల్లించకుండా ఉన్నప్పుడు కార్మికులు పని చేసేందుకు నిరాకరించటం ధర్మ సమ్మతమే. ఎందుకంటే ఇక్కడ యజమాని కార్మికునితో చేసుకున్న ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరించాడు. తద్వారా వ్యవస్థకు తూట్లు వేశాడు. కనుక ఇట్టి పరిస్థితిలో తమ జీతాలు అందనంతవరకూ డూటీని పరిత్యజించే హక్కు కార్మికులకు, ఉద్యోగులకు ఉంటుంది. ఎందుకంటే ”కూలివాని చెమట ఆరకమునుపే అతని కూలిని ఇచ్చేయండి” అన్నది మానవ మహోపకారి ముహమ్మద్ (స) ప్రవచనం (ఇబ్ను మాజ).
(ముహమ్మద్ మహ్మూద్ అల్ నజ్దీచే సంకలనం చేయబడిన ‘రసాయెల్ వ మసాయెల్ ‘ నుండి)
పీడకల వస్తే ఏం చేయాలి?
ప్రశ్న :- నేను 18 ఏండ్ల అమ్మాయిని. నాకు తరచూ పీడ కలలు వస్తూ ఉంటాయి. కలగన్న కొన్నాళ్ళకు అవి వాస్తవ రూపం కూడా ధరిస్తున్నాయి. దాంతో మా కుటుంబీకుల కష్టాలు మొదలవుతుంటాయి. ఇలాంటి భయంకరమైన కల వచ్చినప్పుడల్లా మా ఇంటి వారికి చెప్పేస్తూ ఉంటాను. వారు అల్లాహ్ శరణు కోరుతూ ప్రార్థిస్తుంటారు. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి?నమాజులో తల్లిదండ్రుల కొరకు ‘దుఆ’ చేయవచ్చా?
సందేహం: ఫర్జ్ నమాజులో తల్లిదండ్రుల కోసంగానీ, వేరితరుల కొరకుగానీ ‘దుఆ’ చేయటం సమ్మతం కాదని కొందరంటున్నారు. ఇది నిజమేనా?
సమాధానం: నమాజులో దుఆ – తన కోసం చేసుకున్నా, తన తల్లి దండ్రుల, వేరితరుల కోసం చేసుకున్నా – ఆక్షేపణీయం ఏమీకాదు. ”దాసుడు తన ప్రభువుకు అత్యంత సమీపంలో ఉండేది ‘సజ్దా’ స్థితిలోనే కాబ్టి మీరు (ఆ స్థితిలో) అత్యధికంగా దుఆ చేసుకోండి” అని మహనీయ ముహమ్మద్ (స) వారు ఉపదేశించారు. (ముస్లిం)
ఆయన (సఅసం) ఇంకా ఈ విధంగా ప్రవచించారు; రుకూలో మీ ప్రభువు ఔన్నత్యాన్ని కీర్తించండి. సజ్దాలో మాత్రం అత్యధికంగా వేడుకోలు చేయండి. బహుశా మీ వేడుకోలు ఆమోదించబడవచ్చు. (ముస్లిం)
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్వూద్ (రజి) ఇలా అన్నారు; మహా ప్రవక్త (సఅసం) తనకు తషహ్హుద్ నేర్పిన తర్వాత ఇలా ఉద్బోధించారు – ”ఇక నీవు నీకు ఎంతో ఇష్టమైన దుఆను ఎంపిక చేసుకుని దుఆ చెయ్యి. లేదా నీకు కావలసినది కోరుకో (అడుక్కో)” అన్నారు. (బుఖారి, ముస్లిం)
కాబట్టి ఎవరయినా నమాజు ముగించక ముందే సజ్దా స్థితిలో గాని, ఖఅదా స్థితిలోగానీ తన కోసం లేదా తన మాతాపితల కోసం, ఇంకా సమస్త ముస్లిముల కోసం వేడుకుంటే అది అభ్యంతరకరం ఏమీ కాజాలదు. ఇది ధర్మసమ్మతమే.
-షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ (రహ్మ.లై)