మృదువుగా సలహా ఇవ్వాలి

Originally posted 2013-03-10 21:28:00.

షేఖ్‌ అబ్దుల్‌ హఖ్ఖ్‌ (పొరుమామిళ్ళ)

Muslims-Man-Performing-Jumma-Namaz-in-Jama-Mosque-Delhi
‘ఎవరయితే ఇతరుల తప్పులను క్షమిస్తారో అల్లాహ్‌ా వారి తప్పులను క్షమిస్తాడు’ అని మానవ మహోపకారి ముహమ్మద్‌ (స) వారు సెలవి చ్చారు. మనం బజార్లలో తిరుగుతూ ఉంటాము. చెత్తాచెదారం చుట్ట ప్రక్కల పేరుకొని ఉంటుంది. అలాంటప్పుడు మనం ఒకటి రెండు ముల్లులయితే తీసేస్తాము. అధికంగా ఉంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం ద్వారా తెలియజేస్తాం. అంతేకాని చెత్తను అధికంగా వ్యాపింపజేయలేం కదా! అలాగే మనం ఇతరులతో ఏవైనా లోపాలుంటే వారి మనసు గాయపడకుండా సర్ది చెప్పి, వారిని మార్చడానికి ప్రయత్నిస్తాం. అంతేగాని అందరితో చెప్పి పరువు తియ్యం కదా! ఒక వేళ మనం చెప్పినా వినకపోతే అతని విజ్ఞతకే వదిలి వేస్తాం.

హజ్రత్‌ ఉమర్‌ ఫారూక్‌ (ర) ప్రజల స్థితిగతులను తెలుసుకునేందుకు రాత్రిళ్ళు గస్తీ తిరుగుతుంటారు. ఆయన వెంట అబ్దుల్లా అనే అనుచ రుడు కూడా ఉన్నాడు. వీరికి ఒక ఇంటిలో నుంచి వెలుతురు కనబ డింది. హజ్రత్‌ ఉమర్‌ (ర) ఆ ఇంటిలోకి ప్రవేశించి చూడగా ఒక వృద్ధుడు మద్యం సేవిస్తూ కనబడ్డాడు. వెంటనె ఆయన ఆగ్రహోదగ్రు డయ్యారు. ‘ఈ వయసులో మద్యం సేవించడానికి నీకు సిగ్గుగా లేదు?’ అని నిలదీశారు. అప్పుడా వృద్ధుడు ‘మీరు రెండు తప్పులు చేశారు. ఒకటి – నా ఇమట్లో నా అనుమతి లేకుండా ప్రవేశించారు. రెండోది – పనికట్టుకొని నా లోపాలను వెతుకుతున్నారు’ అన్నాడు. ఈ మాటలు విన్న హజ్రత్‌ ఉమర్‌ (ర) వెంటనే తిరిగి వచ్చేశారు. కొంత కాలం తర్వాత ఆ వృద్దుడు హజ్రత్‌ ఉమర్‌ గారి సభలో కూర్చొని ఉన్నాడు. ఉమర్‌ (ర) పిలిచారు. వృద్ధుడు శిక్షిస్తారేమోనని భయ పడ్డాడు. అప్పుడు ఉమర్‌ (ర) వృద్ధునితో ‘నేను నీ తప్పుని ఎవరితోనూ చెప్పలేదు. కనీసం నా వెంట ఉన్న అబ్దుల్లాతో కూడా!’ అన్నారు. అప్పుడా వృద్ధుడు ‘నేను కూడా మద్యం సేవించడం మానేస్తున్నాను. అందుకు మీరే సాక్షి’ అన్నాడు.

ఇలా మనం చెప్పేది సమసరస భావంతో సలహా ఇస్తే ఎంతటి కఠినుడైనా ఇన్షా అల్లాహ్‌ా తప్పక మారగలడు. అలాగే అద్ధం అందరినీ ప్రతిబింబిస్తుంది. కాని అది ఒకరి లోపాలను మరొకరికి నివేదించదు. అందరి రహస్యాలను తనలో దాచుకుంటుంది. ఎవరి లోపాలైనా చెప్పి నప్పుడు అతను కోపంతో ఒకవేళ దాన్ని పగులగొట్టినా ఆ ముక్కల్లోంచి చూస్తే మళ్ళీ అదే లోపం కనిపిస్తుమది. అంతేగాని పగిలిపోయాను కదా అని అబద్ధం చెప్పదు. అదే విధంగా మనం కూడా ఎంతటి క్లిష్ట స్థితులు ఎదురైనా, ఎంతటి బాధలు పడాల్సి వచ్చినా, ఎన్ని కష్టాలు భరించాల్సి వచ్చినా మంచిని విడనాడకూడదు. వీలైనంత వరకూ సమాజంలో సంస్కరణలకు పునాది వేయాలే తప్ప మనకెందుకులే అని మన స్వార్థం మనం చూసుకోకూడదు. దైవం ప్రసాదించిన ఈ విలు వైన శరీరాన్ని ఎంతో కొంత నిస్వార్థంగా జీవితం సాగించడంలోనే నిజమైన ఆనందం ఉంది. ఆందులోనే పరలోక సాఫల్యం ఉంది.

Related Post