ప్రయాణానికి ముందు

Originally posted 2013-04-04 22:04:25.

     try_try_try_by_eenisee
1) హజ్‌ ఉమ్రాలు కేవలం అల్లాహ్‌ ప్రసన్నతను కోరుతూ పరలోక సాఫల్యాన్ని కాంక్షిస్తూ చిత్తశుద్ధితో చేయాలి. దాన్ని విహార యాత్రగా, నలుగురు తమను హాజీ అని పిలువాలన్న ఆత్రుతతో, ప్రదర్శనా బుద్ధితో చెయ్యకూడదు. ఇలాంటి హజ్‌ మనిషి భుక్తిని పెంచగలదేమో గాని భయభక్తుల్ని మాత్రం పెంచదు. జీవితంపై హజ్‌ ప్రభావం పడదు. పుణ్యమూ లభించదు.
2) హజ్‌ యాత్ర కోసం మంచి స్నేహితుల్ని ఎంచుకోవాలి. సత్యవంతులు, ధర్మజ్ఞానం తెలిసినవారితో ప్రయాణం సాగించాలి. వారి సహచర్యం ద్వారా మంచి గుణాలు పుణికి పుచ్చుకోవచ్చు. తెలియని విషయాలు తెలుసుకోవచ్చు.
3) హజ్‌ ఉమ్రా యాత్రకు ముందు ప్రజల అప్పులు చెల్లించాలి. ఎవరి అమానతులను వారికి అప్పగించాలి. ఎవరితోనైనా విపరీతంగా ప్రవర్తించి వుంటే  క్షమాపణ చెప్పుకో వాలి. జరిగిన తప్పులపై పశ్చాత్తాపం చెంది అల్లాహ్‌ సన్నిధిలో నిజమైన తౌబా చెయ్యాలి.
4) తను తిరిగి వచ్చే వరకూ సరిపడే ఇంటి ఖర్చులని తన ఇంటి వారికి ఇచ్చి పాప కార్యాలకు అతి దూరంగా మసలుకోమని బోధించాలి.
5) ఈ ప్రయాణం మొదలు తిరిగి వచ్చేవరకు అల్లాహ్‌ మరియు ప్రవక్త (స) యొక్క ప్రతి ఆజ్ఞనూ శిరసావహిస్తాననీ, పాపాలకు దూరంగా వుంటాననీ, ఎవరి మనస్సునూ గాయ పరచననీ, మరణం వరకు ఓ నిజమైన విశ్వాసిలా, అల్లాహ్‌ దాసునిలా జీవిస్తా ననీ సంకల్పించుకోవాలి.
6) సవారిపై ఎక్కిన పిదప 3 సార్లు అల్లాహు అక్బర్‌ అనాలి. తరువాత ”సుబహా   నల్లజీ సఖ్ఖర లనా హాజా, వమా కున్నా లహూ ముఖ్‌రినీన్‌, వ ఇన్నా ఇలా రబ్బినా లమున్‌ఖలిబూన్‌” (ముస్లిం ) అనే దుఆ పఠించాలి.
7) ప్రయాణం మధ్య రాత్రి బస చేయ్యాల్సి వస్తే ”అవూజు బికలిమాతిల్లాహిత్‌- త్తామ్మాతి మిన్‌ షర్రి మా ఖలఖ్‌” (ముస్లిం) అన్న దుఆ చదివితే ఏ నష్టమూ వాటిల్లదు. (సర్వ జీవరాసుల కీడు నుండి నేను అల్లాహ్‌ సంపూర్ణ వచనాల శరణు కోరుతున్నాను)
8) ఏ ఊరిలో ప్రవేశించినా ”అల్లాహుమ్మ బారిక్‌లనా ఫీహా” అని మూడు సార్లు అనాలి. (ఓ అల్లాహ్‌! ఈ ఊరిలో మాకు శుభాలను ప్రసాదించు)
9) ప్రయాణంలో నమాజుని ఖసర్‌ చెయ్యటంతోపాటు జుహర్‌-అస్ర్‌ నమాజులు, మగ్రిబ్‌-ఇషా నమాజులు కలిపి చెయ్యడానికి షరీఅత్‌ వీలు కల్పించింది. అయితే ఫజ్ర్‌లోని రెండు రకాతుల సున్నత్‌ నమాజును ప్రయాణంలో సయితం ప్రవక్త (స) చేశారు. (ముస్నద్‌ అహ్మద్‌))))   ))) )

Related Post