ముస్లిం వ్యక్తిత్వ వికాసానికి సూచనలు

ముస్లిం వ్యక్తిత్వ వికాసానికి సూచనలు   ఇహలోక జీవితం ఏదోక రోజు నశించే తటాకమే శాశ్వత నివాసం కాదు. ఈ యదార్థాన్ని గ్రహించిన మనం ఇక్కడ మన కు లభించిన స్వల్ప వ్యవధిలోనే పరలోక సాఫల్యానికి పనికొచ్చే సాధనాల్ని సాధించుకోవాలి. మనల్ని, మన పరివారాన్ని నరకాగ్ని నుండి కాపాడు కోవాలి.  ఎందుకంటే ఈ రోజు కర్మలున్నాయి, లెక్క లేదు. రేపు లెక్కలుంటాయి, కర్మలుండవు. కాబట్టి మన లెక్క దేవుడు మనతో తీసుకోక ముందే మన లెక్కల్ని మనం సరిచేసుకోవాలి.  ఇప్పుడు నేనేం చేయాలి?   1) ''మీ కోసం దేన్నయితే ఇష్ట పడతారో దాన్నే మీతోటి సోదరుల కోసం ఇష్ట పడాలి'' అన్నారు మన ప్రియ ప్రవక్త ముహమ్మద్‌ (స). కాబట్టి మీరు మెచ్చి స్వీకరించిన ఇస్లాం ధర్మం వైపు మీ పరిచ స్తుల్ని, పరివారాన్ని ఆహ్వానించండి.  2) ఆనందం, సంతోషం అది ఎలాంటిదయినా తొలిసారి కలిగిన అనూభూతి వేరుగా ఉంటుంది. కనుక ఇస్లాం స్వీకరించినప్పుడు మీకు కలిగిన మధురానుభుతిని మీ పరిచయిస్తులతో, పరివారంతో పంచుకోండి.  3) 'నా నుండి ఓ వాక్యన్ని విని, దాన్ని అర్థం, ఆకళింపు చేసుకుని, కంఠస్థం చేసుకుని (అమలు పరచి) ఇతరులకు చేరవేసిన వ్యక్తిని, అల్లాహ్  సకల సౌభాగ్యాలతో, సౌఖ్యాలతో వర్థిల్లజేయుగాక!' అని కారుణ్యమూర్తి (స) వారు దీవించడమేకా 'బహుశా వినే వ్యక్తి చెప్పే వ్యక్తికన్నా ఎక్కువ ప్రజ్ఞ కలవాడయి ఉండవచ్చు' అన్ని అన్నారు. కాబట్టి  ఇస్లాం గురించి మీకు తెలి సింది ఒకే ఒక్క విషయమయినా పరవా లేదు; దాన్నే ఇతరుల కు చేరవేయండి. అల్లాహ్‌ా ఇలా సెలవిస్తున్నాడు:  ''అల్లాహ్  వైపు (జనులను) పిలుస్తూ, సత్కార్యాలు చేస్తూ, 'నిశ్చయంగా నేను ముస్లింల (విధేయుల)లోని వాడను' అని (ఆత్మ విశ్వాసంతో) పలికే వాని మాటకంటే మంచి మాట మరెవరిది కాగలదు?''.  (దివ్యఖుర్‌ఆన్‌-41:33)    ధార్మిక విద్యార్జన:  అల్లాహ్ , అంతిమ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారిపై అవతరించిన తొలి దైవవాణికి సంబంధిచిన అయిదు సూక్తు ల్లో జ్ఞాన సముపార్జన ప్రాముఖ్యతను నొక్కి వక్కాణించాడు:  ''చదువు నిన్ను పట్టించిన నీ ప్రభువు పేరుతో. ఆయన మనిషి గడ్డకట్టిన రక్తంతో పుట్టించాడు. చదువు, నీ ప్రభువు ఎంతో దయాళువు. ఆయనే మనిషికి కలం ద్వారా జ్ఞానాన్ని నేర్పిన వాడు.  మనషికి తెలియని  జ్ఞానాన్ని బోధించాడు.'' (అలఖ్‌: 1-5)  మన ప్రియ ప్రవక్త ముహమ్మద్‌ (స) ఇలా సెలవిచ్చారు: ''జ్ఞాన సముపార్జన ప్రతి ముస్లిం (స్త్రీపురుషుని)పై తప్పనిసరి విధి''. (ఇబ్బు మాజా)  నేనేం చదవాలి?  ఇస్లాం మౌలికాధారాల గురించి, ఈమాన్‌ మౌలికాంశాల గురించి, దైనందిన జీవితానికి సంబంధించిన దినచర్యల గురించి, నీతి, నడవడిక, న్యాయం గురించి, కుటుంబ జీవనం, వివాహం, హరామ్‌, హలాల్‌-ఇత్యాది విషయాల గురించి కనీస ధార్మిక జ్ఞానం మనకుండాలి.  అదెలా సాధ్యం అంటే, ఇస్లాం ధర్మానికి మూలం రెండు విషయాలు. వాటిని గురించి తెలియ జేస్తూ దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ''నేను మీలో రెండు విషయాలను వదలి వెళుతున్నాను. మీరు వాటిని గట్టిగా పట్టుకున్నంత కాలం మార్గం తప్పరు. వాటిలో ఒకటి అల్లాహ్‌ా గ్రంథం అవగా, రెండవది నా సంప్రదాయం (సున్నత్‌)''.  పవిత్రఖుర్‌ఆన్‌ పారాయణం  అల్లాహ్  మానవాళి మీద దయదలిచి వారి ఇహపరాల సాఫల్యం కోసం తన ప్రత్యే కరుణ ద్వారా అవతరింపజేసిన మహిమాన్విత గ్రంథం ఖుర్‌ఆన్‌. 'ఖుర్‌ఆన్‌ పారాయణం వల్ల, మనస్సులు నెమ్మదిస్తాయని, ఆత్మజ్యోతి రగులుకుంటుందని, ఐహిక వాంఛల వల్ల హృదయానికి పట్టిన తుప్పు తొలిగిపో తుందని, ప్రళయ దినాన అది తనను పారాయణం చేసే వారి విషయంలో సిఫారసు చేస్తుందని, దాని సిఫారసును అల్లాహ్‌ా అమోదిస్తాడని, మనిషి సౌభాగ్య, దౌర్భాగ్యం, ఆదృష్టదురదృ ష్టాలు ఖుర్‌ఆన్‌తోనే ముడిపడి ఉన్నాయని' దైవ ప్రవక్త (స) వివిధ సందర్భాల్లో సెలవిచ్చి ఉన్నారు.      కాబట్టి ఆ భాగ్యాన్ని సొంతం చేసుకునే సంకల్పంతో ప్రతి రోజు ఖుర్‌ఆన్‌ చదివి తన్మయం చెందేందుకు పది నిమిషాలు కేటాయించండి. ఖుర్‌ఆన్‌ను అరబీలోగానీ, అనువాదంగాని చదవగలిగితే చాలా మంచిది. ఒక వేళ చదవడం, వ్రాయడం రాకపోతే ఖుర్‌ఆన్‌ పారాయణాన్ని, అనువాదాన్ని విని తరించేందుకు ప్రయత్నించండి. 'ఖుర్‌ఆన్‌ చదవడం నేర్చుకుని ఇతరులకు నేర్పించే వ్యక్తి మీలో ఉత్తముడు', ఖుర్‌ఆన్‌ విధ్యలో ప్రావిణ్యం సంపాదించుకున్న వ్యక్తి మిక్కిలి గౌరవనీయులైన దైవ దూతల సరసన ఉంటాడు'  అని అన్నారు దైవ ప్రవక్త (స).  కాబట్టి ఖుర్‌ఆన్‌ను అది అవతరించిన భాషలో-అరబీలో చది వేందుకు శక్తివంచన లేకుండా అవిశ్రాంతంగా ప్రయత్నిం చండి. ఎందుకంటే ఖుర్‌ఆన్‌ అరబీ భాషలో చదివేటప్పుడు కలిగే మధురానుభూతియే వేరు.  అలాగే మీ ప్రాంతీయ భాష లో గల ఇస్లామీయ సాహిత్యం చాలా పరిమితమయినది. మీరు ఆధ్యాత్మికంగా పరిణతి చెందాలన్నా, మీలో విశ్వాసం రీత్యా పరిపక్వత రావాలన్నా అరబీ భాషను నేర్చుకోవడం ఎంతో అవ సరం. అలాగే తెలుగు భాషలో అందుబాటులో ఉన్న హదీసు గ్రంథాలను చదువుతుండాలి.  మస్జిద్‌ - ప్రార్థనాలయం  ''ఓ ఆదం సంతివారలారా! మీరు మస్జిద్‌కు హాజరయిన ప్రతి సారీ వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహిమచండి''. (అల్‌ ఆరాఫ్‌: 31) అని అంటున్నాడు అల్లాహ్‌ా సుబ్హానహు వ తఆలా. ''మస్జిద్‌లో సామూహికంగా చేసే నమాజు ఒంటరిగా చేసే నమాజుకన్నా 27 రెట్లు ఎక్కువ పుణ్యాన్నిస్తుంది'' అన్నారు ప్రవక్త (స). (ముస్లిం)  మస్జిదులు అల్లాహ్ గృహాలని, అవి భువిలో మెరిసే తారకలని, అల్లాహ్కు ఎంతగానో నచ్చిన ప్రదేశాలని, నిరతం తన హృద యాన్ని మస్జిద్‌తో ముడిపెట్టుకునే వారికి ప్రళయ దినాన అల్లాహ్  అర్ష్‌ నీడ ప్రాప్తిస్తుందని, వాటిని నిర్మించినవారికి, వాటి నిర్మాణంలో పాలు పంచుకున్న వారికి మహా గొప్ప పుణ్యం లభిస్తుందని, వాటి సంరక్షణ కోసం పాటు పడాలని దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి పలు ప్రవచనాల ద్వారా రూఢి అవుతుంది.  'ఇషా నమాజు జమాతుతో చదివి, ఫజ్ర్‌ నమాజు కూడా జమాతుతో చదివిన వ్యక్తి ఆ రాత్రంతా నమాజు చేసినంత పుణ్యం లభిస్తుందని' సయితం ప్రవక్త (స) వారు సెలవిచ్చి ఉన్నారు.  కాబట్టి మనం మస్జిద్‌లను ప్రేమించాలి. వీలయినంత వరకు నమాజులన్నీ మస్జిద్‌లోనే చదివేందుకు ప్రయత్నించాలి. 'నిశ్చయంగా నమాజు వేళకు విధిగా విశ్వాసులపై ఖరారు చేయబడింది' (నిసా:103) అని అల్లాహ్  సెలవిచ్చాడు గనక మనం నమాజును వేళకు చేసేందుకు కృషి చేయాలి.     మస్జిద్‌లో నమాజు చేసేటప్పుడు కలిగే మహదానందమే వేరు. ప్రశాంత వాతావరణంలో నమాజు చేస్తాము గనక మనసు నెమ్మదిస్తుంది. అందరం కలిసిమెలిసి నమాజు చేస్తాము గనక పరస్పర సోదర భావం, సమైక్యత, సహిష్ణుత, త్యాగ, సహకార భావం పెరుగుతుంది. అలాగే, 'మీ ఇళ్ళను స్మశానాలుగా చేసుకోకండి' అని ప్రవక్త (స) వారు హెచ్చరించి ఉన్నారు. కాబట్టి ఇంటి వారిని నమాజు చేయమని ఆజ్ఞాపించడంతోపాటు, మనము సయితం నఫిల్‌ నమాజుల్ని ఇంట్లో చేసేందుకు ప్రయత్నించాలి.   సజ్జన సాంగత్యం   - స్నేహం తప్పనిసరి అంటారా?   స్వేహం - అదో నీడ లాంటిది...ఎండ తీవ్రత పెరిగిన కొద్దీ దాని అవసరం అధికమవుతూనే ఉంటుంది. భూఫలాలు, పూలు రుతువును బట్టి కాస్తుంటాయి. స్నేహం-అది నిరతం సుమధుర ఫలాలిచ్చే మహా వృక్షం...అన్ని వేళలా సుగంధ పరిమళలాల్ని వెదజల్లే పూవనం. లోపాలను దూరం చేసి మనకు నిండుతనా న్నిచ్చే వాడు, మనదైన ప్రతి వస్తువును తనదిగా భావించి కాపాడేవాడు, మనపై ఉన్న భారాన్ని తగ్గించేెవాడు, మన ముఖ కవళికలతో మనో వేెదనను   గ్రహించువాడు, కష్ట సమయంలో మనల్ని ఆదుకొనువాడు, విజయం సాధిస్తే వెన్ను తట్టి ప్రో స్నేహం ఎవరితో చేయాలి?  'మనిషి అతని స్నేహితుని మతధర్మం మీద ఉంటాడు' అని దైవ అంతిమ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారు సెలవిచ్చారు. కాబట్టి తలచెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తే మనశ్శాంతి తలకూడదన్న విషయాన్ని గుర్తుంచుకొని మరీ మసలుకోవాలి. ప్రతి విషయంలో యుక్తాయుక్తాల గురించి ఆలోచించేవారు, దైవానికి భయపడేవారు, మృదుస్వభావులు, మన్నించే గుణం గలవారు, సృజనాత్మకత గలవారు, సకారాత్మకంగా స్పందించేవారినే స్నేహితులుగా ఎంచుకోవాలి.  స్నేహాన్ని ఎలా కొనసాగించాలి?    'పర్స్పరం సలామ్‌ చేసుకోవడం అనేది ప్రేమానురాగాలను పెం పొందిస్తుంది' అని, 'మీ సోదరునితో నగుమోము మీ సంభాషణ సయితం మీకు పూణ్యాన్నిస్తుంది' అన్నారు ప్రియ ప్రవక్త ముహమ్మద్‌ (స).  మనం మన స్నేహితులతో మంచి స్థితిలో కలిసి ఉన్నట్టే కష్టకాలంలో సయితం అండగా నిలవాలి, వారు దుఃఖస్థితికి లోనైతే స్నేహపరామర్శను అందివ్వాలి. వారు రోగ గ్రస్తులయితే నెరుగా వెళ్ళి వారిని పరామర్శించాలి. 'మీరు రోగిని పరామర్శిస్తున్నంత కాలం స్వర్గంపు తాజా ఫలాలు ఏరు కుకుంటూ ఉంటారు' అని ప్రియ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారు సెలవిచ్చారు. ఒకవేళ వీలు కుదరకపోతే కనీసం ఫోను ద్వారా గానీ, ఈమెయిల్‌, ఎస్‌ఎమ్‌ఎస్‌ ద్వారాగాని యోగక్షేమాలు తెలుసుకోవాలి.  సహనం -స్థయిర్యం : ధర్మమార్గంలో కష్టాలొస్తే ఏం చేయాలి?  'అల్లాహ్కు ఎవరెంత ఇష్టులై ఉంటారో అల్లాహ్  వారిని అంతే పరీక్షిస్తాడు. ఆ విషయంలో ప్రవక్తలు అగ్రగణ్యులు' అన్నారు దైవ అంతిమ ప్రవక్త ముహమ్మద్‌ (స). కాబట్టి మనం ఎంత కాలమయితే పరీక్షల్ని ఎదుర్కొంటూ ఉంటామో అంత కాలం మనం అల్లాహ్  ప్రేమకు, కరుణానుగ్రాహాలకు ఎక్కు పాత్రులం అవుతూ ఉంటాము. కష్ట కాలంలో సహనం, దుఆకు మించిన ఆయుధం  లేదు. సత్యధర్మాన్ని స్వీకరించేందుకు సాహసించిన మనం నిత్యం ధర్మమార్గాన సహనస్థయిర్యాలు ప్రసాదించమని కరుణామయుడయిన అల్లాహ్‌ాను వేడుకుంటూ ఉండాలి.  ప్రోత్సహించేవాడు, పరాజయం పాలైతే ధైర్యం చెప్పి వెనుదన్నుగా నిలచేవాడు ఒకడు మనలోని ప్రతి ఒక్కరికి అవసరం. ఆ వ్యక్తి మనమే అయి ఉంటే మరీ మంచిది.  కష్ట సమయంలో ఎవరయితే సహన స్థయిర్యాల్ని కనబరుస్తారో వారికి అల్లాహ్‌ా లెక్కలేనంత ఉపాధిని ప్రసాదిస్తాడు. ఒకవేళ ధర్మాన్ని కాపాడుకునేందుకు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వలస పోవలసి వచ్చినా వెనుకాడ కూడదు.  అల్లాహ్‌ా తన ప్రియ దాసుల లక్షణాల్ని తెలిజేస్తూ ఇలా అంటు న్నాడు: ''మేము ఏదో ఒక విధంగా మిమ్మల్ని పరీక్షిస్తూ      ఉంటాము. భయంతో, ఆకలిదప్పికలతో, ధన, ప్రాణ,  నష్టాలతో, పండ్ల కొరతతో పరీక్షిస్తాము. సహనమూర్తులకు శుభవార్త ఇవ్వండి. వారికెప్పుడు ఏ ఆపద వచ్చినా 'మేము ఖుద్దుగా అల్లాహ్‌ాకు చెందిన వారము. మేము మరలిపోవలసింది కూడా ఆయన వద్దకే కదా!' అని అంటారు. వారిపై వారి ప్రభువు దయానుగ్రాలు, కరుణ కటాక్షాలు ఉన్నాయి. సన్మార్గాన్ని పొందినవారు కూడా వీరే''.  (బఖరా: 155-157)  మృదుత్వం - క్షమాగుణం   ధర్మం చాలా సులువైనది. సులభమయినవాటినే అది ఆదేశి స్తుంది. కాబట్టి మనం సయితం ప్రజల పట్ల మన్నింపుల వైఖరిని కలిగి ఉండాలి. 'నిశ్చయంగా అల్లాహ్‌ా మృదుస్వభా వుడు, మృదుత్వాన్ని ఆయన ఇష్టపడతాడు' అని దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారు సెలవిచ్చారు. మనం మృదుత్వం, మన్నింపుల వైఖరి కలిగి ఉండడం వల్ల అల్లాహ్‌ా ప్రేమకు పాత్రు లం అవుతాము. కాగా కాఠిన్యం, కరకుదనాల వల్ల నష్టం కలిగే అవకాశాలే ఎక్కువ. అల్లాహ్‌ా మన సౌలభ్యాన్ని కోరుకుంటాడు. మనల్ని సంకట స్థితికి లోను చేయడం ఆయన అభిమతం కానే కాదు. 'ఏ విషయంలో మృదుత్వం ఉంటుందో అది వికాస మొందుతుంది. మరే విషయంలో మృదుత్వం ఉండదో అది కుంచించుకుపోతుంది' అని మౌఢ్యాన్ని, మత దురభిమానాన్ని ప్రదర్శించేవారు సర్వనాశనమవుతారు' అని అన్నారు ప్రవక్త మహనీయ ముహమ్మద్‌ (స). కాబట్టి మనం, ఆప్తులతో, బంధు వులతో, ఇరుగుపొరుగువారితో  మృదువుగా మెలగాలి.  మన కోసం దేన్నయితే మనం ఇష్టపడతామో దాన్నే ఇతరుల కోసం సయితం ఇష్ట పడాలి. మన మేలుతోపాటు అందరి మేలును కోరుకోవాలి.    దైవ నామ సంస్మరణ - 'గుర్తుంచుకోండి! అల్లాహ్‌ా నామస్మరణతోనే మనసులు నెమ్మది స్తాయి'. (అర్రాద్‌: 28)   దైవనామ స్మరణ హృదయాలకు జీవం వంటిది. 'ఆల్లాహ్  సుకీర్తన గలది సచేతన హృదయం అని, అది లేని హృదయం మృత హృదయం' అని దైవ ప్రవక్త (స) సెలవిచ్చారు. కాబట్టి అనుక్షణం అల్లాహ్‌ాను స్మరిస్తూ ఉండాలి. ఆయన ఘనకీర్తి చాటుతూ ఉండాలి. ఆయన వరానుగ్రహాలకుగానూ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉండాలి. రేయింబవళ్ళల్లో ఆయన్ను ఎలా స్తుతించాలో, ఏ దుఆలు చదవాలో నేర్చుకోవాలి. అత్యధికంగా ఇస్తిగ్ఫార్‌ చదువుతూ ఉండాలి. ఇస్తిగ్ఫార్‌ వల్ల సంతానంలో, సంపాదనలో సమృద్ధి కలుగుతుంది. కరువు పరిస్థితి దూరం  అవుతుంది.  దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారు రోజుకు 70 సార్లు ఇస్తిగ్ఫార్‌ చదివేవారంటే అదెంతటి ఘనతర ప్రార్థన అయి ఉంటుందో ఆలోచించండి.  దిక్సూచి అవసరం  'నేను బోధకునిగా చేసి పంప బడ్డాను' అని 'ధార్మిక పండితులు ప్రవక్తల వారసులు - ప్రవక్తలు వారస్త్వంగా ఏ ఆస్తిని వదిలి వెళ్ళరు, జ్ఞానం తప్ప' అని దైవప్రవక్త ముహమ్మద్‌ (స) వారు సెలవిచ్చారు. మనం ఎక్కడ ఉన్నా మనకు దిక్సూచి కాగలిగే ఒక గురువు తప్పనిసరిగా ఉండేటట్లు చూసుకోవాలి. మనం నివసించే ప్రాంతంలో ధర్మపరాయణు డయిన పండితుడు ఎవరో తెలుసుకొని వారి శిష్యరికంలో చేెరడం ఎంతో  అవసరం. మంచి గురువు శిక్షణతో మనం ఇటు మన కుటుంబానికి, అటు పూర్తి సమాజానికి ప్రయోజన కారిగా మారగలం.  పిల్లల పట్ల ప్రేమ, పెద్దల పట్ల గౌరం ఎంత అవసరమో గొప్పవారయిన గురువుల పట్ల విధేయత అంతే అవసరం. అలాగే మన ప్రాంతంలో ప్రజా, ధార్మిక సేవలు అందించే సంస్థలతో సత్సంబంధం ఏర్పరచుకోవాలి. విలయితే సభ్యులుగా చేరాలి.           కొన్ని ప్రార్థనలు  పరస్పరం కలుసుకునేటప్పుడు: అస్సలాము అలైకుమ్‌ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు  ప్రతి నమాజు తర్వాత: 33 సార్లు సుబ్హానల్లాహ్  33 అల్హమ్దు లిల్లాహ్ 34 సార్లు అల్లాహు అక్బర్‌ చదవాలి.  నిద్రపోయేటప్పుడు: బిస్మికల్లాహుమ్మ అమూతు వ అహ్యా.  నిద్ర మేల్కొన్నప్పుడు: అల్‌హమ్దులిల్లాహిల్లజీ అహ్యానా బాదమా అమాతనా వ ఇలైహిన్నుషూర్‌.  పాపమన్నింపు కోసం: అస్తగ్ఫిరుల్లాహ రబ్బీ మిన్‌ కుల్లి జన్‌బిన్‌ వ  ఖతీఅతిన్‌ వ అతూబు ఇలైహి.  రోగిని  పరామర్శించేటప్పుడు: లా బాస తహూరున్‌ ఇన్షాఅల్లాహు లా బాస తహూరున్‌ ఇన్షాఅల్లాహు అజ్‌హిబిల్‌ బాస రబ్బన్నాసి వష్‌ఫి  అన్తష్షాఫి లా షిఫాఅ ఇల్లా షిఫావుక షిఫాఅల్‌ లా యుగాదిరు సుఖ్‌మా.  తల్లిదండ్రుల కోసం: రబ్బిర్హమ్‌హుమా కమా రబ్బయానీ సగీరా.  భార్యపిల్లల కోసం: రబ్బనా హబ్‌లనా మిన్‌ అజ్‌వాజినా వ జుర్రియ్యాతినా ఖుర్రత అయునిన్‌ వజ్‌అల్నా లిల్‌ముత్తఖీన ఇమామా.  చెడు తలంపు కలిగినప్పుడు: అల్లాహుమ్మ లా ఖైర ఇల్లా ఖైరుక వలా తైర ఇల్లా తైరుక వలా ఇలాహ గరుక.  ఏదైనా తిన్నప్పుడు త్రాగినప్పుడు: బిస్మిల్లాహ్   మస్జిద్‌లో ప్రవేశించేటప్పుడు:  అల్లాహుమ్మప్‌తహ్లీ అబ్వాబ రహ్మతిక  దిష్టికి విరుగుడు: ఖుల్‌ అవూజను బిరబ్బిల్‌ ఫలఖ్‌, ఖుల్‌ అవూజు బిరబ్బిన్నాస్‌ సూరాలతోపాటు-ఉయీజు బికలిమాతిల్లాహిత్తామ్మతి మిన్‌ కుల్లి షైతానిన్‌ వ హామ్మతి, వ మిన్‌ కుల్లి ఐనిల్లామ్మతి.  నిరపేక్షత కోసం: అల్లాహుమ్మక్ఫినీ బిహలాలిక అన్‌ హరామిక వ  అగ్నినీ బిఫజ్లిక అమ్మన్‌ సివాక్‌.  దర్మసమ్మతమైన జీవనోపాధి కోసం: అల్లాహుమ్మ ఇన్నీ అస్‌అలుక ఇల్మన్‌ నాఫిఅ, వ రిజ్‌ఖన్‌ త్వయ్యిబా, వ అమలన్‌ ముతఖబ్బలా.   నరకముక్తి, స్వర్గ ప్రాప్తి కోసం: అల్లాహుమ్మ ఇన్నీ అస్‌ఆలుకల్‌ జన్నత వ అవూజుబిక మినన్నార్‌ (3సార్లు)   దీవెనలు: అల్లాహ్‌ా మనందరికి ధర్మ మార్గం మీద సహన స్థయిర్యాలతోపాటు చిత్తశుద్ధిని, అంకితభావాన్ని, త్యాగనిరతిని మంచి ప్రతిఫలాన్ని, ప్రసాదించుగాక! (ఆమీన్‌))

ముస్లిం వ్యక్తిత్వ వికాసానికి సూచనలు

ఇహలోక జీవితం ఏదోక రోజు నశించే తటాకమే శాశ్వత నివాసం కాదు. ఈ యదార్థాన్ని గ్రహించిన మనం ఇక్కడ మన కు లభించిన స్వల్ప వ్యవధిలోనే పరలోక సాఫల్యానికి పనికొచ్చే సాధనాల్ని సాధించుకోవాలి. మనల్ని, మన పరివారాన్ని నరకాగ్ని నుండి కాపాడు కోవాలి.  ఎందుకంటే ఈ రోజు కర్మలున్నాయి, లెక్క లేదు. రేపు లెక్కలుంటాయి, కర్మలుండవు. కాబట్టి మన లెక్క దేవుడు మనతో తీసుకోక ముందే మన లెక్కల్ని మనం సరిచేసుకోవాలి.

ఇప్పుడు నేనేం చేయాలి?

1) ”మీ కోసం దేన్నయితే ఇష్ట పడతారో దాన్నే మీతోటి సోదరుల కోసం ఇష్ట పడాలి” అన్నారు మన ప్రియ ప్రవక్త ముహమ్మద్‌ (స). కాబట్టి మీరు మెచ్చి స్వీకరించిన ఇస్లాం ధర్మం వైపు మీ పరిచ స్తుల్ని, పరివారాన్ని ఆహ్వానించండి.

2) ఆనందం, సంతోషం అది ఎలాంటిదయినా తొలిసారి కలిగిన అనూభూతి వేరుగా ఉంటుంది. కనుక ఇస్లాం స్వీకరించినప్పుడు మీకు కలిగిన మధురానుభుతిని మీ పరిచయిస్తులతో, పరివారంతో పంచుకోండి.

3) ‘నా నుండి ఓ వాక్యన్ని విని, దాన్ని అర్థం, ఆకళింపు చేసుకుని, కంఠస్థం చేసుకుని (అమలు పరచి) ఇతరులకు చేరవేసిన వ్యక్తిని, అల్లాహ్  సకల సౌభాగ్యాలతో, సౌఖ్యాలతో వర్థిల్లజేయుగాక!’ అని కారుణ్యమూర్తి (స) వారు దీవించడమేకా ‘బహుశా వినే వ్యక్తి చెప్పే వ్యక్తికన్నా ఎక్కువ ప్రజ్ఞ కలవాడయి ఉండవచ్చు’ అన్ని అన్నారు. కాబట్టి  ఇస్లాం గురించి మీకు తెలి సింది ఒకే ఒక్క విషయమయినా పరవా లేదు; దాన్నే ఇతరుల కు చేరవేయండి. అల్లాహ్‌ా ఇలా సెలవిస్తున్నాడు:

”అల్లాహ్  వైపు (జనులను) పిలుస్తూ, సత్కార్యాలు చేస్తూ, ‘నిశ్చయంగా నేను ముస్లింల (విధేయుల)లోని వాడను’ అని (ఆత్మ విశ్వాసంతో) పలికే వాని మాటకంటే మంచి మాట మరెవరిది కాగలదు?”.  (దివ్యఖుర్‌ఆన్‌-41:33)

ధార్మిక విద్యార్జన:

అల్లాహ్ , అంతిమ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారిపై అవతరించిన తొలి దైవవాణికి సంబంధిచిన అయిదు సూక్తు ల్లో జ్ఞాన సముపార్జన ప్రాముఖ్యతను నొక్కి వక్కాణించాడు:

”చదువు నిన్ను పట్టించిన నీ ప్రభువు పేరుతో. ఆయన మనిషి గడ్డకట్టిన రక్తంతో పుట్టించాడు. చదువు, నీ ప్రభువు ఎంతో దయాళువు. ఆయనే మనిషికి కలం ద్వారా జ్ఞానాన్ని నేర్పిన వాడు.  మనషికి తెలియని  జ్ఞానాన్ని బోధించాడు.” (అలఖ్‌: 1-5)

మన ప్రియ ప్రవక్త ముహమ్మద్‌ (స) ఇలా సెలవిచ్చారు: ”జ్ఞాన సముపార్జన ప్రతి ముస్లిం (స్త్రీపురుషుని)పై తప్పనిసరి విధి”. (ఇబ్బు మాజా)

నేనేం చదవాలి?

ఇస్లాం మౌలికాధారాల గురించి, ఈమాన్‌ మౌలికాంశాల గురించి, దైనందిన జీవితానికి సంబంధించిన దినచర్యల గురించి, నీతి, నడవడిక, న్యాయం గురించి, కుటుంబ జీవనం, వివాహం, హరామ్‌, హలాల్‌-ఇత్యాది విషయాల గురించి కనీస ధార్మిక జ్ఞానం మనకుండాలి.  అదెలా సాధ్యం అంటే, ఇస్లాం ధర్మానికి మూలం రెండు విషయాలు. వాటిని గురించి తెలియ జేస్తూ దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ”నేను మీలో రెండు విషయాలను వదలి వెళుతున్నాను. మీరు వాటిని గట్టిగా పట్టుకున్నంత కాలం మార్గం తప్పరు. వాటిలో ఒకటి అల్లాహ్‌ా గ్రంథం అవగా, రెండవది నా సంప్రదాయం (సున్నత్‌)”.

పవిత్రఖుర్‌ఆన్‌ పారాయణం

అల్లాహ్  మానవాళి మీద దయదలిచి వారి ఇహపరాల సాఫల్యం కోసం తన ప్రత్యే కరుణ ద్వారా అవతరింపజేసిన మహిమాన్విత గ్రంథం ఖుర్‌ఆన్‌. ‘ఖుర్‌ఆన్‌ పారాయణం వల్ల, మనస్సులు నెమ్మదిస్తాయని, ఆత్మజ్యోతి రగులుకుంటుందని, ఐహిక వాంఛల వల్ల హృదయానికి పట్టిన తుప్పు తొలిగిపో తుందని, ప్రళయ దినాన అది తనను పారాయణం చేసే వారి విషయంలో సిఫారసు చేస్తుందని, దాని సిఫారసును అల్లాహ్‌ా అమోదిస్తాడని, మనిషి సౌభాగ్య, దౌర్భాగ్యం, ఆదృష్టదురదృ ష్టాలు ఖుర్‌ఆన్‌తోనే ముడిపడి ఉన్నాయని’ దైవ ప్రవక్త (స) వివిధ సందర్భాల్లో సెలవిచ్చి ఉన్నారు.

 

కాబట్టి ఆ భాగ్యాన్ని సొంతం చేసుకునే సంకల్పంతో ప్రతి రోజు ఖుర్‌ఆన్‌ చదివి తన్మయం చెందేందుకు పది నిమిషాలు కేటాయించండి. ఖుర్‌ఆన్‌ను అరబీలోగానీ, అనువాదంగాని చదవగలిగితే చాలా మంచిది. ఒక వేళ చదవడం, వ్రాయడం రాకపోతే ఖుర్‌ఆన్‌ పారాయణాన్ని, అనువాదాన్ని విని తరించేందుకు ప్రయత్నించండి. ‘ఖుర్‌ఆన్‌ చదవడం నేర్చుకుని ఇతరులకు నేర్పించే వ్యక్తి మీలో ఉత్తముడు’, ఖుర్‌ఆన్‌ విధ్యలో ప్రావిణ్యం సంపాదించుకున్న వ్యక్తి మిక్కిలి గౌరవనీయులైన దైవ దూతల సరసన ఉంటాడు’  అని అన్నారు దైవ ప్రవక్త (స).  కాబట్టి ఖుర్‌ఆన్‌ను అది అవతరించిన భాషలో-అరబీలో చది వేందుకు శక్తివంచన లేకుండా అవిశ్రాంతంగా ప్రయత్నిం చండి. ఎందుకంటే ఖుర్‌ఆన్‌ అరబీ భాషలో చదివేటప్పుడు కలిగే మధురానుభూతియే వేరు.  అలాగే మీ ప్రాంతీయ భాష లో గల ఇస్లామీయ సాహిత్యం చాలా పరిమితమయినది. మీరు ఆధ్యాత్మికంగా పరిణతి చెందాలన్నా, మీలో విశ్వాసం రీత్యా పరిపక్వత రావాలన్నా అరబీ భాషను నేర్చుకోవడం ఎంతో అవ సరం. అలాగే తెలుగు భాషలో అందుబాటులో ఉన్న హదీసు గ్రంథాలను చదువుతుండాలి.

మస్జిద్‌ – ప్రార్థనాలయం

”ఓ ఆదం సంతివారలారా! మీరు మస్జిద్‌కు హాజరయిన ప్రతి సారీ వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహిమచండి”. (అల్‌ ఆరాఫ్‌: 31) అని అంటున్నాడు అల్లాహ్‌ా సుబ్హానహు వ తఆలా. ”మస్జిద్‌లో సామూహికంగా చేసే నమాజు ఒంటరిగా చేసే నమాజుకన్నా 27 రెట్లు ఎక్కువ పుణ్యాన్నిస్తుంది” అన్నారు ప్రవక్త (స). (ముస్లిం)

మస్జిదులు అల్లాహ్ గృహాలని, అవి భువిలో మెరిసే తారకలని, అల్లాహ్కు ఎంతగానో నచ్చిన ప్రదేశాలని, నిరతం తన హృద యాన్ని మస్జిద్‌తో ముడిపెట్టుకునే వారికి ప్రళయ దినాన అల్లాహ్  అర్ష్‌ నీడ ప్రాప్తిస్తుందని, వాటిని నిర్మించినవారికి, వాటి నిర్మాణంలో పాలు పంచుకున్న వారికి మహా గొప్ప పుణ్యం లభిస్తుందని, వాటి సంరక్షణ కోసం పాటు పడాలని దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి పలు ప్రవచనాల ద్వారా రూఢి అవుతుంది.

‘ఇషా నమాజు జమాతుతో చదివి, ఫజ్ర్‌ నమాజు కూడా జమాతుతో చదివిన వ్యక్తి ఆ రాత్రంతా నమాజు చేసినంత పుణ్యం లభిస్తుందని’ సయితం ప్రవక్త (స) వారు సెలవిచ్చి ఉన్నారు.  కాబట్టి మనం మస్జిద్‌లను ప్రేమించాలి. వీలయినంత వరకు నమాజులన్నీ మస్జిద్‌లోనే చదివేందుకు ప్రయత్నించాలి. ‘నిశ్చయంగా నమాజు వేళకు విధిగా విశ్వాసులపై ఖరారు చేయబడింది’ (నిసా:103) అని అల్లాహ్  సెలవిచ్చాడు గనక మనం నమాజును వేళకు చేసేందుకు కృషి చేయాలి.

మస్జిద్‌లో నమాజు చేసేటప్పుడు కలిగే మహదానందమే వేరు. ప్రశాంత వాతావరణంలో నమాజు చేస్తాము గనక మనసు నెమ్మదిస్తుంది. అందరం కలిసిమెలిసి నమాజు చేస్తాము గనక పరస్పర సోదర భావం, సమైక్యత, సహిష్ణుత, త్యాగ, సహకార భావం పెరుగుతుంది. అలాగే, ‘మీ ఇళ్ళను స్మశానాలుగా చేసుకోకండి’ అని ప్రవక్త (స) వారు హెచ్చరించి ఉన్నారు. కాబట్టి ఇంటి వారిని నమాజు చేయమని ఆజ్ఞాపించడంతోపాటు, మనము సయితం నఫిల్‌ నమాజుల్ని ఇంట్లో చేసేందుకు ప్రయత్నించాలి.

సజ్జన సాంగత్యం   – స్నేహం తప్పనిసరి అంటారా?

స్వేహం – అదో నీడ లాంటిది…ఎండ తీవ్రత పెరిగిన కొద్దీ దాని అవసరం అధికమవుతూనే ఉంటుంది. భూఫలాలు, పూలు రుతువును బట్టి కాస్తుంటాయి. స్నేహం-అది నిరతం సుమధుర ఫలాలిచ్చే మహా వృక్షం…అన్ని వేళలా సుగంధ పరిమళలాల్ని వెదజల్లే పూవనం. లోపాలను దూరం చేసి మనకు నిండుతనా న్నిచ్చే వాడు, మనదైన ప్రతి వస్తువును తనదిగా భావించి కాపాడేవాడు, మనపై ఉన్న భారాన్ని తగ్గించేెవాడు, మన ముఖ కవళికలతో మనో వేెదనను   గ్రహించువాడు, కష్ట సమయంలో మనల్ని ఆదుకొనువాడు, విజయం సాధిస్తే వెన్ను తట్టి ప్రో స్నేహం ఎవరితో చేయాలి?

‘మనిషి అతని స్నేహితుని మతధర్మం మీద ఉంటాడు’ అని దైవ అంతిమ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారు సెలవిచ్చారు. కాబట్టి తలచెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తే మనశ్శాంతి తలకూడదన్న విషయాన్ని గుర్తుంచుకొని మరీ మసలుకోవాలి. ప్రతి విషయంలో యుక్తాయుక్తాల గురించి ఆలోచించేవారు, దైవానికి భయపడేవారు, మృదుస్వభావులు, మన్నించే గుణం గలవారు, సృజనాత్మకత గలవారు, సకారాత్మకంగా స్పందించేవారినే స్నేహితులుగా ఎంచుకోవాలి.

స్నేహాన్ని ఎలా కొనసాగించాలి?

‘పర్స్పరం సలామ్‌ చేసుకోవడం అనేది ప్రేమానురాగాలను పెం పొందిస్తుంది’ అని, ‘మీ సోదరునితో నగుమోము మీ సంభాషణ సయితం మీకు పూణ్యాన్నిస్తుంది’ అన్నారు ప్రియ ప్రవక్త ముహమ్మద్‌ (స).  మనం మన స్నేహితులతో మంచి స్థితిలో కలిసి ఉన్నట్టే కష్టకాలంలో సయితం అండగా నిలవాలి, వారు దుఃఖస్థితికి లోనైతే స్నేహపరామర్శను అందివ్వాలి. వారు రోగ గ్రస్తులయితే నెరుగా వెళ్ళి వారిని పరామర్శించాలి. ‘మీరు రోగిని పరామర్శిస్తున్నంత కాలం స్వర్గంపు తాజా ఫలాలు ఏరు కుకుంటూ ఉంటారు’ అని ప్రియ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారు సెలవిచ్చారు. ఒకవేళ వీలు కుదరకపోతే కనీసం ఫోను ద్వారా గానీ, ఈమెయిల్‌, ఎస్‌ఎమ్‌ఎస్‌ ద్వారాగాని యోగక్షేమాలు తెలుసుకోవాలి.

సహనం -స్థయిర్యం : ధర్మమార్గంలో కష్టాలొస్తే ఏం చేయాలి?

‘అల్లాహ్కు ఎవరెంత ఇష్టులై ఉంటారో అల్లాహ్  వారిని అంతే పరీక్షిస్తాడు. ఆ విషయంలో ప్రవక్తలు అగ్రగణ్యులు’ అన్నారు దైవ అంతిమ ప్రవక్త ముహమ్మద్‌ (స). కాబట్టి మనం ఎంత కాలమయితే పరీక్షల్ని ఎదుర్కొంటూ ఉంటామో అంత కాలం మనం అల్లాహ్  ప్రేమకు, కరుణానుగ్రాహాలకు ఎక్కు పాత్రులం అవుతూ ఉంటాము. కష్ట కాలంలో సహనం, దుఆకు మించిన ఆయుధం  లేదు. సత్యధర్మాన్ని స్వీకరించేందుకు సాహసించిన మనం నిత్యం ధర్మమార్గాన సహనస్థయిర్యాలు ప్రసాదించమని కరుణామయుడయిన అల్లాహ్‌ాను వేడుకుంటూ ఉండాలి.

ప్రోత్సహించేవాడు, పరాజయం పాలైతే ధైర్యం చెప్పి వెనుదన్నుగా నిలచేవాడు ఒకడు మనలోని ప్రతి ఒక్కరికి అవసరం. ఆ వ్యక్తి మనమే అయి ఉంటే మరీ మంచిది.

కష్ట సమయంలో ఎవరయితే సహన స్థయిర్యాల్ని కనబరుస్తారో వారికి అల్లాహ్‌ా లెక్కలేనంత ఉపాధిని ప్రసాదిస్తాడు. ఒకవేళ ధర్మాన్ని కాపాడుకునేందుకు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వలస పోవలసి వచ్చినా వెనుకాడ కూడదు.  అల్లాహ్‌ా తన ప్రియ దాసుల లక్షణాల్ని తెలిజేస్తూ ఇలా అంటు న్నాడు: ”మేము ఏదో ఒక విధంగా మిమ్మల్ని పరీక్షిస్తూ      ఉంటాము. భయంతో, ఆకలిదప్పికలతో, ధన, ప్రాణ,  నష్టాలతో, పండ్ల కొరతతో పరీక్షిస్తాము. సహనమూర్తులకు శుభవార్త ఇవ్వండి. వారికెప్పుడు ఏ ఆపద వచ్చినా ‘మేము ఖుద్దుగా అల్లాహ్‌ాకు చెందిన వారము. మేము మరలిపోవలసింది కూడా ఆయన వద్దకే కదా!’ అని అంటారు. వారిపై వారి ప్రభువు దయానుగ్రాలు, కరుణ కటాక్షాలు ఉన్నాయి. సన్మార్గాన్ని పొందినవారు కూడా వీరే”.  (బఖరా: 155-157)

మృదుత్వం – క్షమాగుణం

ధర్మం చాలా సులువైనది. సులభమయినవాటినే అది ఆదేశి స్తుంది. కాబట్టి మనం సయితం ప్రజల పట్ల మన్నింపుల వైఖరిని కలిగి ఉండాలి. ‘నిశ్చయంగా అల్లాహ్‌ా మృదుస్వభా వుడు, మృదుత్వాన్ని ఆయన ఇష్టపడతాడు’ అని దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారు సెలవిచ్చారు. మనం మృదుత్వం, మన్నింపుల వైఖరి కలిగి ఉండడం వల్ల అల్లాహ్‌ా ప్రేమకు పాత్రు లం అవుతాము. కాగా కాఠిన్యం, కరకుదనాల వల్ల నష్టం కలిగే అవకాశాలే ఎక్కువ. అల్లాహ్‌ా మన సౌలభ్యాన్ని కోరుకుంటాడు. మనల్ని సంకట స్థితికి లోను చేయడం ఆయన అభిమతం కానే కాదు. ‘ఏ విషయంలో మృదుత్వం ఉంటుందో అది వికాస మొందుతుంది. మరే విషయంలో మృదుత్వం ఉండదో అది కుంచించుకుపోతుంది’ అని మౌఢ్యాన్ని, మత దురభిమానాన్ని ప్రదర్శించేవారు సర్వనాశనమవుతారు’ అని అన్నారు ప్రవక్త మహనీయ ముహమ్మద్‌ (స). కాబట్టి మనం, ఆప్తులతో, బంధు వులతో, ఇరుగుపొరుగువారితో  మృదువుగా మెలగాలి.  మన కోసం దేన్నయితే మనం ఇష్టపడతామో దాన్నే ఇతరుల కోసం సయితం ఇష్ట పడాలి. మన మేలుతోపాటు అందరి మేలును కోరుకోవాలి.

దైవ నామ సంస్మరణ – ‘గుర్తుంచుకోండి! అల్లాహ్‌ా నామస్మరణతోనే మనసులు నెమ్మది స్తాయి’. (అర్రాద్‌: 28)

దైవనామ స్మరణ హృదయాలకు జీవం వంటిది. ‘ఆల్లాహ్  సుకీర్తన గలది సచేతన హృదయం అని, అది లేని హృదయం మృత హృదయం’ అని దైవ ప్రవక్త (స) సెలవిచ్చారు. కాబట్టి అనుక్షణం అల్లాహ్‌ాను స్మరిస్తూ ఉండాలి. ఆయన ఘనకీర్తి చాటుతూ ఉండాలి. ఆయన వరానుగ్రహాలకుగానూ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉండాలి. రేయింబవళ్ళల్లో ఆయన్ను ఎలా స్తుతించాలో, ఏ దుఆలు చదవాలో నేర్చుకోవాలి. అత్యధికంగా ఇస్తిగ్ఫార్‌ చదువుతూ ఉండాలి. ఇస్తిగ్ఫార్‌ వల్ల సంతానంలో, సంపాదనలో సమృద్ధి కలుగుతుంది. కరువు పరిస్థితి దూరం  అవుతుంది.  దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారు రోజుకు 70 సార్లు ఇస్తిగ్ఫార్‌ చదివేవారంటే అదెంతటి ఘనతర ప్రార్థన అయి ఉంటుందో ఆలోచించండి.

దిక్సూచి అవసరం

‘నేను బోధకునిగా చేసి పంప బడ్డాను’ అని ‘ధార్మిక పండితులు ప్రవక్తల వారసులు – ప్రవక్తలు వారస్త్వంగా ఏ ఆస్తిని వదిలి వెళ్ళరు, జ్ఞానం తప్ప’ అని దైవప్రవక్త ముహమ్మద్‌ (స) వారు సెలవిచ్చారు. మనం ఎక్కడ ఉన్నా మనకు దిక్సూచి కాగలిగే ఒక గురువు తప్పనిసరిగా ఉండేటట్లు చూసుకోవాలి. మనం నివసించే ప్రాంతంలో ధర్మపరాయణు డయిన పండితుడు ఎవరో తెలుసుకొని వారి శిష్యరికంలో చేెరడం ఎంతో  అవసరం. మంచి గురువు శిక్షణతో మనం ఇటు మన కుటుంబానికి, అటు పూర్తి సమాజానికి ప్రయోజన కారిగా మారగలం.  పిల్లల పట్ల ప్రేమ, పెద్దల పట్ల గౌరం ఎంత అవసరమో గొప్పవారయిన గురువుల పట్ల విధేయత అంతే అవసరం. అలాగే మన ప్రాంతంలో ప్రజా, ధార్మిక సేవలు అందించే సంస్థలతో సత్సంబంధం ఏర్పరచుకోవాలి. విలయితే సభ్యులుగా చేరాలి.

కొన్ని ప్రార్థనలు

పరస్పరం కలుసుకునేటప్పుడు: అస్సలాము అలైకుమ్‌ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు

ప్రతి నమాజు తర్వాత: 33 సార్లు సుబ్హానల్లాహ్  33 అల్హమ్దు లిల్లాహ్ 34 సార్లు అల్లాహు అక్బర్‌ చదవాలి.

నిద్రపోయేటప్పుడు: బిస్మికల్లాహుమ్మ అమూతు వ అహ్యా.

నిద్ర మేల్కొన్నప్పుడు: అల్‌హమ్దులిల్లాహిల్లజీ అహ్యానా బాదమా అమాతనా వ ఇలైహిన్నుషూర్‌.

పాపమన్నింపు కోసం: అస్తగ్ఫిరుల్లాహ రబ్బీ మిన్‌ కుల్లి జన్‌బిన్‌ వ  ఖతీఅతిన్‌ వ అతూబు ఇలైహి.

రోగిని  పరామర్శించేటప్పుడు: లా బాస తహూరున్‌ ఇన్షాఅల్లాహు లా బాస తహూరున్‌ ఇన్షాఅల్లాహు అజ్‌హిబిల్‌ బాస రబ్బన్నాసి వష్‌ఫి  అన్తష్షాఫి లా షిఫాఅ ఇల్లా షిఫావుక షిఫాఅల్‌ లా యుగాదిరు సుఖ్‌మా.

తల్లిదండ్రుల కోసం: రబ్బిర్హమ్‌హుమా కమా రబ్బయానీ సగీరా.

భార్యపిల్లల కోసం: రబ్బనా హబ్‌లనా మిన్‌ అజ్‌వాజినా వ జుర్రియ్యాతినా ఖుర్రత అయునిన్‌ వజ్‌అల్నా లిల్‌ముత్తఖీన ఇమామా.

చెడు తలంపు కలిగినప్పుడు: అల్లాహుమ్మ లా ఖైర ఇల్లా ఖైరుక వలా తైర ఇల్లా తైరుక వలా ఇలాహ గరుక.

ఏదైనా తిన్నప్పుడు త్రాగినప్పుడు: బిస్మిల్లాహ్

మస్జిద్‌లో ప్రవేశించేటప్పుడు:  అల్లాహుమ్మప్‌తహ్లీ అబ్వాబ రహ్మతిక

దిష్టికి విరుగుడు: ఖుల్‌ అవూజను బిరబ్బిల్‌ ఫలఖ్‌, ఖుల్‌ అవూజు బిరబ్బిన్నాస్‌ సూరాలతోపాటు-ఉయీజు బికలిమాతిల్లాహిత్తామ్మతి మిన్‌ కుల్లి షైతానిన్‌ వ హామ్మతి, వ మిన్‌ కుల్లి ఐనిల్లామ్మతి.

నిరపేక్షత కోసం: అల్లాహుమ్మక్ఫినీ బిహలాలిక అన్‌ హరామిక వ  అగ్నినీ బిఫజ్లిక అమ్మన్‌ సివాక్‌.

దర్మసమ్మతమైన జీవనోపాధి కోసం: అల్లాహుమ్మ ఇన్నీ అస్‌అలుక ఇల్మన్‌ నాఫిఅ, వ రిజ్‌ఖన్‌ త్వయ్యిబా, వ అమలన్‌ ముతఖబ్బలా.

నరకముక్తి, స్వర్గ ప్రాప్తి కోసం: అల్లాహుమ్మ ఇన్నీ అస్‌ఆలుకల్‌ జన్నత వ అవూజుబిక మినన్నార్‌ (3సార్లు)

దీవెనలు: అల్లాహ్‌ా మనందరికి ధర్మ మార్గం మీద సహన స్థయిర్యాలతోపాటు చిత్తశుద్ధిని, అంకితభావాన్ని, త్యాగనిరతిని మంచి ప్రతిఫలాన్ని, ప్రసాదించుగాక! (ఆమీన్‌))

Related Post