అది సహనానికి ఏలిక సమరానికి జ్వాలిక

Originally posted 2013-05-14 20:02:42.

  ముస్లిం సముదాయపు తన, మాన, ధనాలకు విలువ లేకుండా పోయింది. భూమి అత్యంత విశాలంగా ఉండి కూడా ఏకేశ్వరోపాసకులకు చోటు లేదా? అన్నంత దుర్భర స్థితి ఏర్పడింది. అప్పుడే ఒక చమత్కారం జరిగింది. ధీరశాంతులయిన గుప్పెడు సేనల చేతిలో అతి పెద్ద శక్తి పరాభవం పాలయింది, అవమానం పాల యిన శత్రు సేనలు వెన్నుచూపి పారిపోయాయి. ఇది ఇలా ఉండగా మరో వైపు వివిధ దేశాల్లో ఇస్లాం ప్రియులకు స్పష్టమయిన విజయాలు లభించనారంభించాయి. తళుక్కున మెరిసిందొక ఆశాకిరణం. అది మానవ శ్రేయానికి శుబోదయం కాగలదన్న ఆశ చిగురించింది. మరొక్కసారి ఇస్లాం 'రాజకీయ శక్తి'గా విశ్వవేదిక మీదకు రానున్నదన్న నమ్మకమూ బలపడింది.
అది 20వ శతాబ్ది చివరి రోజుల మాట. సోవిట్‌ యూనియన్‌ అఫ్గానిస్తాన్‌ మీద మెరుపుదాడులు చేస్తూ ఉంది. పేలుడు పదార్థాలు మోసే ఫ్లైట్లు విచక్షణారహితంగా పసిపిల్లపై, అమాయక ప్రజలపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. అటు బోసినియా లో ముస్లిం పౌర సంహారానికి పథకాలు వేెస్తున్నారు. వయోభేదం లేకుండా కుత్తుకల్ని కోసి పారేస్తున్నారు. ఫాలస్తీనా మీద ఇస్రా యీల్‌ డేగ కళ్ళు పడ్డాక అక్కడి పసికూనలకు కంటి మీద కునుకు కరువయింది. ఇరాక్‌ మరియు ఇరాన్‌ పరస్పరం సోదరులు అన్న విషయం విస్మరించి తీవ్రంగా కలహించుకుంటున్నాయి.  ముస్లిం సముదాయపు తన, మాన, ధనాలకు విలువ లేకుండా పోయింది. భూమి అత్యంత విశాలంగా ఉండి కూడా ఏకేశ్వరోపాసకులకు చోటు లేదా? అన్నంత దుర్భర స్థితి ఏర్పడింది. అప్పుడే ఒక చమత్కారం జరిగింది. ధీరశాంతులయిన గుప్పెడు సేనల చేతిలో అతి పెద్ద శక్తి పరాభవం పాలయింది, అవమానం పాల యిన శత్రు సేనలు వెన్నుచూపి పారిపోయాయి. ఇది ఇలా ఉండగా మరో వైపు వివిధ దేశాల్లో ఇస్లాం ప్రియులకు స్పష్టమయిన విజయాలు లభించనారంభించాయి. తళుక్కున మెరిసిందొక ఆశాకిరణం. అది మానవ శ్రేయానికి శుబోదయం కాగలదన్న ఆశ చిగురించింది. మరొక్కసారి ఇస్లాం ‘రాజకీయ శక్తి’గా విశ్వవేదిక మీదకు రానున్నదన్న నమ్మకమూ బలపడింది. వివేచనాపరులు, మేధావులు 21వ శతాబ్దం ‘ఇస్లామీయ శతాబ్దం’ కానున్నదని భవిష్యవాణులూ విన్పించారు. అయితే, ఓ సంఘటన జరిగింది. కన్న కలలన్నీ ఒక్కసారిగా కుప్పకూలాయి. పెంచుకున్న ఆశలన్నీ ఒంటి స్థంభం మేడలా నేలకొరిగాయి.
  సెప్టంబరు 11 సంఘటన తన ప్రభావం చూపనే చూపింది. అంచనాలకు మించిన ఫలితాల్ని రాబట్టింది. అప్పటి మీడియా ప్రచార ప్రబావం ఎంత వరకు వెళ్ళిందంటే, ఇప్పటి వరకు కూడా  గల్లీలో పల్లీలమ్ముకునే పేద ముస్లింని, పాఠశాలలో చదుకునే  బాలబాలికల్ని, నిండు వస్త్రాలు ధరించే ముస్లిం మహిళల్ని సయితం అనుమానాస్పదంగా చూసే, చూపించే గడ్డు దినానలొ చ్చాయి. ముస్లిం జనాల నుండి వారి హక్కులన్నింటితోపాటు వాక్కు స్వాతంత్య్రం కూడా లాక్కోబడింది. చరిత్ర మళ్ళీ పునరావృతం అయింది. మళ్ళీ అదే దమనకాండ, దహనకాండ అనేక దేశాల్లో విలయతాండవం చేస్తోంది. అటుకుల్లా మానవ బ్రతుకుల్ని దంచివేసే ఆట ఊపందుకుంది. అప్గాన్‌ నుండి మొదలయిన అది, ఇరాక్‌కు ప్రాకి, ప్రస్తుతం సీరియా, ఫాలస్తీనాలలో నిరసన ర్యాలీల స్థాయికి చేరుకుంది. కొన్ని లక్షల ప్రాణాలను బలిగొన్న నేరం దానిది. ఇటు ఈజిప్టు స్థితి అంతంత మాత్రామే ఉంది. ఒక గాయం మానిందో లేదో మరో గాయం అయింది. బర్మాకు చెందిన అరాకాన్‌ ముస్లింలు మరొక్కసారి బౌద్ధ దహన నీతికి బలవు తున్నారు. అక్కడి ప్రభుత్వ నిరంకుశత్వానికి ఇప్పటి వరకు దారుణ హత్యకు గురైన ఆమ్‌ ఆద్మీ సంఖ్య 50 వేలకు పైచిలుకే. అయినా ఏమి జరగనట్టు ప్రపంచ మీడియా మౌనం పాటిస్తోంది. అతి స్వల్పమయిన అంశాల మీద గంటల తరబడి చర్చించే మీడియా, మానవ హక్కుల సంఘాల నోళ్ళకు తాళం పడి ఉంది. పట్టపగలు ప్రత్యక్షంగా జరుగుతున్న ఈ ఘోరాలు వారి కంట పడటం లేదు. దూరాన ఉన్న సవూదీ ఆ పీడిత ప్రజల కోసం తమ దేశపు ద్వారాలు తెరచినా, ప్రక్కనే ఉన్న బంగ్లాదేశ్‌ ప్రభుత్వం వారికి ఆశ్రయం ఇచ్చేందుకు నిరాకరించింది. ఇవి నేడు ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు ఎదుర్కొంటున్న పరిస్థితులు.
  తరుణోపాయం కోసం ముస్లింలందరూ ఎదురు చూస్తున్న క్లిష్ట స్థితిలో మరొక్కమారు రమజాను మాసం ముస్లిం సముదా యంపై కారుణ్య మేఘమయి వాలింది, ఈ శుభమాసంలో ముస్లిం సముదాయానికి లభించిన విజయాలు అగణ్యం, అశేషం. ధర్మాధర్మాలకి మధ్య గీటురాయిగా నిలిచిన బద్ర్‌ సంగ్రామం మొదలు ఇమాదుద్దీన్‌ జన్గీ శిలువ క్రూసెడులపై విజయకేతనాన్ని ఎగుర వేసేంత వరకు ఈ మాసపు సత్య సమర స్మృతులు ఎన్నో. వాస్తవం ఏమిటంటే, పరీక్షలు, ఇక్కట్లు, ఇబ్బందులు ఈ సమ దాయపు అంతర్భాగాలు. అది సహనానికి ఏలిక. సమరానికి జ్వాలిక. దాని చరిత్రలో సమస్యల సునామీలు, పరీక్షల తుఫానులు సదా ఉంటూనే వచ్చాయి. అయినా చరిత్ర ఇచ్చే సాక్ష్యం – ఈ సముదాయం పడుతూ పడుతూ కూడా లేచింది. మరణశయ్యపై చివరి శ్వాస లెక్కిస్తున్నది అని అందరూ అనుకున్న అత్యంత నాజూకు సమయంలో కూడా అది నిండు యవ్వనాన్ని సంతరించు కొని విజయభేరి మోగించింది. కారణం – ప్రతి ఎడారి తర్వాత ఖచ్చితంగా ఒక ఉద్యాన వనం ఉంటుందని, ప్రతి తముస్స తర్వాత ఉషస్సు తన పూర్తి శోభతో కొలువుదీరి ఉంటుందని ఈ సముదాయపు ప్రజల  ప్రగాఢ నమ్మకం. కాబట్టి శుభప్రదమయిన ఈ నెల మన జీవితాల్లో విప్లవ జ్యోతియై వెలగాలి. విప్లవం అన్నది మనలోని ప్రతి వ్యక్తి తన్నుతాను మార్చుకోవాలి, గొప్పగా మలచు కోవాలి అన్న ఆత్మపరిశీలన తోనే వస్తుంది.  ”నిజంగా అల్లాహ్‌ా కూడా ఆ జాతి దుస్థితిని మార్చడు. ఏ జాతి అయితే తన మనోమయ స్థితిని మార్చుకోదో”. (అర్రాద్:11) అని అల్లాహ్‌ సెలవిచ్చిన మాట అక్షర సత్యం అని ఎరిగిన మనం ఒకటి రెండు చోట్ల లభించిన  పైపై ఫలితాలతో తృప్తి పడక దీర్ఘప్రణాళికలతో సుదీర్ఘ కాలం పరిశ్రమించేందుకు సిద్ధమవ్వాలి. శిష్ఠరక్షణ, దుష్ట శిక్షణ కోసం ఆత్మ వంచన లేకుండా కష్టపడాలి. ఇస్లాంను అనేక మార్గాలననుసరించి అనుమానాస్పదంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న మాట నిజమే కావచ్చు; కానీ…                            ‘సమద్రానికి చమురు పూస్తే జిడ్డు పడుతుందా?
                                                                హిమనగానికి బొగ్గు పూస్తే నల్లబడుతుందా?’
  మరి పోరాడుతూ పోరాడుతూనే ఉండాలి మనం. అంతిమ శ్వాస ఆగే వరకు. పోతూ పోతూ ప్రేమను పంచాలి మనం. లోక శాంతి, విశ్వ కళ్యాణం సిద్ధించే వరకు.

Related Post