ఐహిక అనాసక్తత

సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమ్రీ

ఐహిక అనాసక్తత అంటే ప్రాపంచిక జీవన సామాగ్రిని పూర్తిగా కాలదన్ని భిక్షాటన చేసుకోని లేదా పస్తులుండి జీవితం గడపమని ఆర్ధం ఎంతమాత్రం కాదు. వాస్తవానికి ఐహిక అనాసక్తత అంటే ధర్మసమ్మతమైన మార్గాల ద్వారా వచ్చే సంపదపై సంతృప్తి చెందటం . దొడ్డిదోవల్లో డబ్బు సంపాదించకుండా ఉండటం ని ఆర్థం. మనిషి బ్రతుకుతెరువు కోసం మార్గాలు అన్వేషించకుండా ఉండటాన్ని, ఇహలోకపు సంబంధ బాంధవ్యాలన్నింటిని త్రెంచుకోని ఒంటరి జీవితం గడుపుతూ దేహన్ని శుష్కించుకోవాటాన్ని ఇస్లాం ధర్మం సుతరామూ ఇష్టపడదు. కనుక అవసరం మేరకు ప్రాపంచిక సంబంధాలు కలిగి ఉండటం . జీవనోపాధి కోసం కృషిచేయటం ఐహిక అనాసక్తత కు విరుద్దం కాదు . పైగా ధర్మసమ్మతమైన మార్గాల ద్వారా డబ్బు సంపాదించటాన్ని,దాంతో సంతృప్తి చెందటాన్ని ఇస్లాం ఒక ఆరాధన గా పరిగణిస్తుంది.
అయితే మనిషి పరులవద్ద ఉన్న సిరిసంపదల కోసం అర్రులు చాచకూడదు. ఎల్లప్పుడూ వాటి పట్ల నిరపేక్షాభావంతో ఉండాలి. ప్రజల ధనం పట్ల అనాసక్తత కనబరిచేవాడిని ప్రజలు అభిమానిస్తారు. అలాంటి మనిషికి ప్రజల దృష్టిలో గౌరవప్రదమైన స్థానం లభిస్తుంది దీనికి భిన్నంగా పరుల ధనం కోసం వెంపర్లాడేవాడిని, ఏ కష్టం చేయకుండా భిక్షాటన చేసేవాడిని ప్రజలు నీచుడిగా చూస్తారు అలాంటి వ్యక్తి సమాజంలో అప్రతిష్ఠ పాలౌతాడు.

Related Post