బతుకు తప్పదు బతక్క తప్పదు

బతుకు తప్పదు బతక్క తప్పదు

 

పిండికొద్ది రొట్టె…పనిని బట్టి ఫలితం. మనకున్న పరిధిలో మనకు నచ్చిన, పభ్రువు మెచ్చిన పనిని ఎంచుకోవాలి. అలా మనం ఎన్నుకున్న పని మన వ్యక్తిగత పయ్రోజనంతోపాటు, సమాజంలో అందరికీ కాకపోయినా ఏ కొందరికయినా ఉపయోగ పడాలి. అప్పుడే మనం, మనం చేసే పని ఇటు పజ్రల దృష్టిలోనూ, అటు పభ్రువు దృష్టిలోనూ ఆమోదం పొంది మన ఇహపర సాఫ ల్యానికి, సౌభాగ్యానికి, మోక్షానికి మార్గమవగలదు.

అదును చూసి విత్తనాలు వేశాము. నిజాయితీగా వ్యవసాయం చేస్తున్నాము. ఓపికతో ఎదురు చూస్తున్నాము. మనం వేసిన పత్రి విత్తనం మొలకెత్తాలని, మొక్కయి, మాన్రయి, పువ్వయి, పిందయి, కాయయి, పండై చేతికి అందాలన్న ఆశ అందరికీ ఉంటుంది. కానీ, ఒకే సామర్థ్యాన్ని కలిగిన విత్తనాల్ని భూమిలో వేసినా, అవి సారాన్ని బట్టే మొలకెత్తుతాయి. కొన్ని నేలలోనే సమాధి అవుతాయి. కొన్ని కుళ్ళిపోతాయి. పక్షులకి, చీమలకి కొన్ని ఆహారమవుతాయి. కొన్ని మాతం మొలకెత్తి శక్తివంతమైన వృక్షాలుగా ఎదుగుతాయి. అచ్చం ఇలాగే, మనలోని పత్రిభాపాటవాలు, కష్టించి పని చేసే మనస్తత్వం సమానమయినప్పటికీ వాటికి లభించే విలువ, ఫలితం పాంతం, దేశం, పరిసరాల్ని బట్టి నిర్ణయించబడుతుంది. ‘అమ్మబోతే అడివి-కొనబోతే కొరివి’ అన్న చందంగా కొన్ని సందర్భాల్లో కష్ట జీవుల స్థితి మహా దారుణంగా ఉంటుంది. అయినా బతుకు తప్పదు, బతక్క తప్పదు.

ఉల్లి నుండి ఢిల్లీ వరకూ, పల్లె నుండి పసిడి వరకూ అందుబాటులో లేని సంక్షోభం తీవత్ర – చుట్టూ తిరిగి పజ్రల మెడలకే చుట్టేస్తున్న తరుణమిది. పప్రంచ ధరల సూచీతో పోల్చుకుంటే మన దేశంలో ధరలు చాలా తక్కువేనని, అందుకని వాటితో సమానంగా చేయాల్సి ఉందని, అందుకు పజ్రలు సిద్ధంగా ఉండాలని శీర్రంగ నీతులు చెప్పే నాయకశీల్రు ఉన్న నేటి భారతంలో సగటు మనిషికి చదువు కోవ(కొన)డం గగన కుసుమై నిలిచింది. ‘అక్షరం ఆమడ దూరం, అంగట్లో చదువుల బేరం, కళ్ళ ముందు జరిగే నేరం, నిలదీస్తే ఎందుకు నేరం?’ అన్నట్టు  ‘విద్య పభ్రుత్వ బాధ్యత కాదు – కుటుంబ బాధ్యత’ అనే ధోరణిని పాలక విధానాలు విచ్చలవిడిగా వ్యాప్తి చేస్తున్నాయి. అభివృద్ధి కాస్త అందలమెక్కి సామాన్యుని సంసారంలో అల జడి సృష్టిస్తోంది. అభ్యుదయం శకలాలు శకలాలుగా చీలిక పీలికవుతోంది. ‘వ్యక్తుల దుర్భావాల వల్లనే  సంఘం అధోగతిలో ఉందనీ, అది మారితే ఇదీ మారుతుంద’నీ నేడు భావించనక్క ర్ల్లేదు. ఆర్థిక-రాజకీయ పరిస్థితులకనుగుణంగా మనఃపవ్రృత్తులు ఉంటాయనేది సులభంగా గహ్రించవచ్చు. ఈ నేపథ్యంలో కాళోజీ చెప్పిన మాట గుర్తొస్తుంది.

చట్టం తప్పుతుంది. మతం తప్పుతుంది.

పభ్రుత్వం తప్పుతుంది. న్యాయం తప్పుతుంది.

కానీ బతుకు తప్పదు. బతక్క తప్పదు.

ధనం కలిగిన కొద్ది మందికీ, కోట్లాది మంది లేనివారికీ నడుమ అగాధం  పెరిగిపోతోంది. నిచ్చెన మెట్ల కులవ్యవస్థ అంతం కాకపోగా వికృత రూపాల్లో కులదోపిడీ, దాడులు సాగుతు న్నాయి. కుల వివక్ష  ధ్వేషాలు వ్యవస్థీకృతమవుతున్నాయి. స్తీల్ర పట్ల వివక్ష వినూత్నాకారాల్లో పెచ్చరిల్లుతోంది. ఆడది అంటే భోగ వ్యాపార వస్తువనే దుష్కృతి విపరీతమైపోతోంది. వరకట్నా లు వేల నుండి లక్షలూ, కోట్లకు ఎగబాక్రుతున్నాయి. ముస్లిం మత ధ్వేషరాజకీయాలు పెచ్చు మీరుతూ కార్చిచ్చును రగిలిస్తున్నాయి. వందలాది యువకుల జీవితాలు అర్థాంతంగా ముగిసి పోతున్నాయి. ఒక మన రాష్ట్రంలోనే రోజుకి 300 కోట్ల రూపాయల మద్యం తాగ్రబడుతోంది. అశ్లీలతను నేరంగా పరిగణించే చట్టాలున్నప్పటికీ  టీవీ చానెళ్ళు, కొన్ని పతిక్రలు సెక్స్‌, హింస ను, పగ,  పత్రీకార, ధ్వేషం, నేర పవ్రృత్తులనూ, ధన, వస్తు వ్యామోహ సంస్కృతిని పెంచే దృశ్య చితీక్రరణలతో తమ కార్యకమ్రాలను ముంచెత్తుతున్నాయి. పింటింగ్‌, ఎలక్టాన్రిక్‌ మీడియా ద్వారా వ్యాప్తి చెందుతున్న పతన విలువలు విద్యార్థి యువకులపై తీవ పభ్రావాన్ని కలుగజేస్తు న్నాయి. తాగుడు, జూద, నేర, ఘోర, చోర, వ్యభిచార పవ్రృత్తులు ప్చెరిలుతున్నాయి.  అయినా బతుకు తప్పని స్థితి. బతక్క తప్పని దుర్భర స్థితి.

బతుకంటే పోరాటం! పోరాడితేనే చలనం. చలనమంటే పరిణామం. మనం బత్రకాలి. మన చుట్టూ ఉన్నవారు బత్రకాలి. మనం చేసే పనులను అందరూ హర్షించాలి. మంచిగా బత్రకాలి. పరోపకార భావంతో బత్రకాలి. అందరినీ బత్రకనివ్వాలి. ‘బతుకు తప్పదు. బతక్క తప్పదు’ అనే వాతావరణాన్ని మార్చడానికి, మనం మారడానికి మనవంతు కృషి చేయాలి!

Related Post