ఆశ అందరికీ ఉంటుంది. ఆశయం కొందరికే ఉంటుంది. అనుకున్న ఆశయానికి ఏ కొందరు మాత్రమే చేరుకుాంరు. హిజ్రత్ అనే ఈ ఘట్టం ఆశయ సిద్ధి మార్గంలో ఓ మలుపు వింది. ఈ ఘ్టాన్ని దాటని వ్యక్తి శిఖరానికి చేరుకోలేడు, ‘అందని ద్రాక్ష పుల్లన’ అన్న భావనతోనే జీవిస్తాడు.
హిజ్రత్ భావం: హిజ్రత్ అంటే వియోగం; సయోగానికి విరుద్ధ పదం. ప్రాంతాన్ని వీడి మరో ప్రాంతం వైపనకు, ఒక మజిలీని వదలి మరో మజిలీ వైపునకు వెళ్ళడం. ఒక వస్తువును వదలి మరో మేలిమి వస్తువు వైపునకు మళ్ళడం.
ఇస్లామీయ పరిభాషలో హిరజత్: అంటే, దారుల్ కుఫ్ర్-అవిశ్వాస అవనిని వదలి, దారుల్ ఈమాన్-విశ్వాస పుడమి వైపునకు తరలి వెళ్ళడం. అల్లాహ్ ఇలా ఉపదేశిస్తున్నాడు: ”విశ్వసించిన ఓ ప్రజలారా! నిశ్చయంగా నా భూమి ఎంతో విశాలమయినది. కాబట్టి మీరు కేవలం నన్ను మాత్రమే ఆరాధించండి”. (అన్‌కబూత్: 56)
పై వచనంలో అల్లాహ్, ధర్మాన్ని పాటించే, ఆయన్ను ఆరాధించుకునే సౌకర్యం లేని భూప్రాంతాన్ని వీడి ఆయన్ను ప్రార్థించుకునే, ఆయన ధర్మాన్ని పాటించుకనే సౌకర్యం గల ప్రాంతం వైపునకు తరలి వెళ్ళాల్సిందిగా ఆదేశి స్తున్నాడు.
ప్రవక్త (స) ఇలా అన్నారు: ”నేను మీకు నాకు అల్లాహ్ ఆదేశించిన అయిదు విషయాల గురించి తెలియజేస్తున్నాను. సత్యాన్ని వినడం, విధేయత చూపడం, జిహాద్, హిజ్రత్ మరియు సంఘం-జమాఅత్”.(అహ్మద్, తిర్మిజీ)
మేలిమి మలుపు హిజ్రత్:
ఈ సందర్భంగా ప్రవక్త (స) వారి బాబాయి పెట్టిన ప్రతిపాదనను సున్నితంగా త్రోసు పుచ్చుతూ ఆయన చెప్పిన మాట గమనార్హం! ”బాబాయ్! నేను నా ఆశయాన్ని వదిలేస్తే వీరు నన్ను తమ నాయకునిగా చేసుకుాంమంటున్నారు లేదా నా అంతు జూస్తామంటు న్నారు. వీరు నన్ను హతమారుస్తారన్నదే తమరి భయమయితే వినండి! వీరు నా కుడి చేతిలో సూర్యుణ్ణి, నా ఎడమ చేతిలో చంద్రుణ్ణి తీసుకొచ్చి పెట్టి ఈ మహా కార్యాన్ని మానుకోమన్నా అది జరిగే పని కాదు. అల్లాహ్ ఈ మహా కార్యానికి (లోక కణ్యాణానికి) స్పష్టమయిన విజయాన్నయినా ప్రసాదించాలి. లేదా ఈ మార్గంలో నా ప్రాణాలయినా పోవాలి. ఈ బృహత్కార్య సిద్ధి కోసం నన్ను ఎన్ని సార్లు వధించ ఎన్ని సార్లు బ్రతికించినా నేను ఈ మహా కార్యాన్ని వీడే ప్రసక్తే లేదు. అది జరిగే పని కూడా కాదు, అయినా ఎందులోనయితే వారి శ్రేయోసాఫల్యాలు దాగున్నాయో, దేనితోనయితే వారి ఇహపరాల సంక్షే మాలు ముడి పడి ఉన్నాయో దాని వైపు వారిని పిలవడం మానేయమంటు న్నారా?” అని సమాధానమిచ్చిన మహనీయ ముహమ్మద్ (స) వారి భవిష్య ప్రణాళికకు మేలిమి మలుపు హిజ్రత్.
ధర్మాధర్మానికి గీటురాయి హిజ్రత్: అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: ”ఓ ప్రవక్తా! సత్య తిరస్కారులు నీకు వ్యతిరేకంగా వ్యూహ రచన చేసిన సంద ర్భాన్ని గుర్తు తెచ్చుకో! నిన్ను బంధీగా పట్టుకోవాలా? లేక హత్య చేసి మట్టు పెట్టాలా? లేక నిన్ను దేశం నుండి వెళ్ళ గొట్టాలా? అని వారు తమ తరఫున ఎత్తులు వేస్తుండగా, అల్లాహ్‌ా పైఎత్తు వేస్తున్నాడు. ఎత్తులు వేయడం, ప్రణాళిక పన్నడంలో, వ్యూరచన చేయడంలో అల్లాహ్ సాటి లేని మేటి ”.
ఈ ఆయతు హిజ్రత్ నేపథ్యంలో అవతరించింది, దీన్ని బట్టి తెలిసేదేమిటంటే, ప్రవక్త (స) వారి మక్కా నుండి మదీనా ప్రస్థానాన్ని ఉద్దే శించి పెట్టబడిన పేరే హిజ్రత్. ప్రవక్తలందరూ హిజ్రత్ చేసిన వారే. ప్రవక్త ఇబ్రాహీమ్ (ఆ), ప్రవక్త లూత్ (ఆ), ప్రవక్త మూసా (అ) వారి ప్రస్థానాల ప్రస్తావన స్వయంగా ఖుర్‌ఆన్‌లో పేర్కొనబడింది. కాని మానవ చరిత్రలో హిజ్రత్ పేరుతో ప్రసిద్ధి చెందిన సంఘటన మాత్రం అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (స) వారిదేట ఇది అప్పట్లో ధర్మాధర్మానికి గీటురాయిగా ఉండేది.
హిజ్రత్‌కి ముందు ఏం జరిగింది?
క్రీస్తు శకం 571లో మహనీయ ముహమ్మద్ (స) వారు జన్మించారు. నలభయి సంవత్సరాల వయసులో ఆయనకు దైవదౌత్యం ప్రసాదించ బడింది. అప్పికే ఆయనలోని అసాధార తెలివీతేటలు, సత్యసంధత, సచ్చీలతతో మక్కా మొత్తం ఆయన పేరు మారుమ్రోగుతుండేది. ఆయన్ను ఆయన పేరుతో పిలువడంకన్నా అమీన్-నమ్మకస్తుడు, సాదిఖ్-సత్య వంతుడు అని పిలవడాన్నే జాతి ప్రజలు ఇష్ట పడేవారు. అలాిం వెన్ను ముక వ్యక్తిత్వం గల ఆయన ప్రపంచంలో ఎవ్వరూ బోధించని రీతిలో సామాన్యునికి సయితం అతి సులువుగా, స్పష్టంగా అర్థమయ్యే శైలిలో నిజ ఆరాధ్యుడు ఒక్కడేనని బోధించినా వారు అర్థం చేసుకో లేదు. దాదాపు 13 సంవత్సరాలు ఆయన వారి మేలును కోరుతూ, తిట్లను భరిస్తూ, గాయాలకు ఓర్చుకుంటూ అవిరళంగా పరిశ్రమించినా గుప్పెడు జనాలు తప్ప ఆయన్ను విశ్వసించ లేదు. ప్రతి గల్లీలో ఆయన తిరిగారు. పల్లె పల్లె కు ఆయన వెళ్ళారు. ఆయన వెళ్ళని గడప లేదు, ఆయన తట్టని తలుపు లేదు. ఆయన పిలుపు విని ఇంటి తలుపులయితే తెరుచుకున్నాయి గానీ, ఒంటి , హృదదయ తలుపులు తెరుచుకోలేదు. పైగా ప్రతిఘటన, ప్రతిబంధకాలు అధికమయ్యాయి. ఆ ప్రతీకారేక్ష ప్రాణాలు బలిగొనేంతటి స్థాయికి దిగ జారింది. అలాంటి అవాంతర స్థితిలో అల్లాహ్ ఆదేశం మేరకు చేసిన ప్రస్థానమే (మక్కా నుండి మదీనాకు) హిజ్రత్.
హిజ్రీ క్యాలెండర్ రూప కల్పన: రెండవ ధర్మ ఖలీఫా అయిన హజ్రత్ ఉమర్ (ర) గారి యహాంలో హజ్రత్ ఉస్మాన్, హజ్రత్ అలీ (ర) విం ధర్మ ఉద్దండుల సమక్షంలో హిజ్రీ క్యాలెండర్ రూపొందించడం జరిగింది. పూర్వం నుండి అరబ్బుల్లో అమలులో ఉన్న చంద్రమాన నెలల్నే హిజ్రీ క్యాలెండర్‌లో చోివ్వడం జరిగింది. దాని ప్రకారం ముహర్రమ్ మొది మాసం, జుల్ హుజ్జహ్‌ా చివరి మాసం. ఇస్లామీయ క్యాలెండర్ తయారు చేసినప్పుడు ప్రవక్త (స) వారి జన్మ దినాన్ని, ఆయనకు దైవదౌత్యం లభిం చిన రోజును, ఆయన మరణించిన దినాన్ని తీసుకోకుండా ఆయన మదీనాకు హిజ్రత్ చేసిన సంఘటన మాత్రమే తీసుకోవడం జరిగింది. ఆ యేడాదికి సంబంధించిన నెలని, రోజుని కూడా కాదు. (అన్ఫాల్: 30)
ఇస్లామీయ క్యాలెండర్ ప్రత్యేకత:
ఇస్లామీయ క్యాలెండర్‌కి గల ప్రాముఖ్యత ఏమిటంటే అందులో ఉన్న మాసాలు, దినాలు పూర్తిగా షిర్క్ రహితమయినవి. అవి ఇస్లామీయ ఆదేశాలు మరియు పర్వదినాలతో ముడి పడి ఉన్నవి కాగా, అన్య క్యాలెం డర్లు షిర్క్ భావాలు గలవి. వాటిలో బహుదైవారాధనా భావాలు మస్తుగా అగుపిస్తాయి. ఉదాహరణకు: సన్ డే, మన్ డే షిర్క్ భావాలు గల దినాల యితే, ఆగస్టు షిర్క్ భావం గల నెలయితే, చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము.. ఇలా ప్రతి ఒక్కి ఒక్కో నక్షత్రం పేరు మీద ఉండటమే కాక, ఉగాది, శ్రీ రామ నవమీ, హనుమాన్ జయంతి ….విం అనేక పండుగలు బహుదైవా రాధనా భావం గలవి. కాబ్టి ఒక నిజ ముస్లిం అన్య క్యాలెండర్లను అవసరార్థం వాడినా ఇస్లామీయ క్యాలెండర్‌ని నిత్యం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉంది.
హిజ్రత్ రకాలు: 1) హిజ్రతుల్ ఔతాన్: దేశాన్ని, ప్రాంతాన్ని వదలి మరో దేశానికి, ప్రాంతానికి బదిలి అవ్వడం.
2) హిజ్రతుల్ ఇస్మి వల్ ఉద్వాన్: పాప కార్యాలను, అధర్మ విషయాలను, అశ్లీ చేష్టలను విడనాడటం. ఇది ఉత్కృష్టమయిన హిజ్రత్‌గా పిలువ బడు తుంది. తద్వారా విశ్వాసి అల్లాహ్ ప్రసన్నతా భాగ్యం దక్కుతుంది. షైతాన్ ఘోర పరాభావానికి, అవమానానికి గురవుతాడు. ‘అల్లాహ్ నిషేధించిన వాికి దూరంగా మసలుకునేవారు ముహాజిర్లు’ అని చెప్పడమే కాక, ‘అల్లాహ్ హరామ్‌గా ఖరారు చేసిన వాిని పరిత్యజించడం ఉత్కృష్ట హిజ్రత్’ గా పేర్కోన్నారు ప్రవక్త (స).
హిజ్రత్‌కు మరో విధమయిన విభజన: 1) మఅనవీ హిజ్రత్ – భావ పర మయిన హిజ్రత్. 2) హిస్సీ హిజ్రత్ – బాహ్యపరమైన హిజ్రత్.
1) మఅనవీ హిజ్రత్ – భావ పరమయిన హిజ్రత్: కుఫ్ర్-తిరస్కారం నుండి ఇస్లాం-విధేయత వైపునకు, బిద్‌అత్-వెర్రిపోకడ నుండి సున్నత్-ప్రవక్త (స) వారి సంప్రదాయం వైపునకు, షిర్క్-బహుదైవారాధన నుండి తౌహీద్-నిజ దైవ ఆరాధన వైపనకు జరిగే ప్రస్థానం. ఈ హిజ్రత్ మహోత్కృష్టమయినది కావడానికి గల కారణం – ఇది విశ్వాసి పూర్తి జీవితంలో పాటించాల్సి ఉంటుంది గనక. దీనికి భిన్నంగా బాహ్య పరమైన హిజ్రత్ జీవితంలో ఒక ట్రెండు సార్లు మాత్రమే చేయబడుతుంది.
2) హిస్సీ హిజ్రత్ – బాహ్యపరమైన హిజ్రత్: ఇది నాలుగు శ్రేణూలల్లో విభాజితం.
1) మక్కా నుండి మదీనా వైపనకు ప్రవక్త (స) వారు చేసిన హిజ్రత్. అన్నింకన్నా దీనికే అగ్ర పీఠం.
2) అవిశ్వాస అవనిని వీడి విశ్వాస వసుంధర వైపునకు తరలి వెళ్ళడం.
3) పాపపు ధరణిని వదలి పుణ్య పుడమి వైపునకు హిజ్రత్ చేయడం. (వంద వ్యక్తులను హత్య చేసిన వ్యక్తి సంఘటన వలే).
4) చివరి కాలంలో ఉపద్రవాలు పెల్లుబికినప్పుడు, కుప్పతెప్పలుగా ఆపదలు విరుచుకు పడినప్పుడు షామ్ దేశం వైపునకు హిజ్రత్ చేయడం.
హిజ్రత్ ఆదేశం: భావ పరమయిన హిజ్రత్ ముస్లిం అయిన ప్రతి స్త్రీ పురు షుని మీద తప్పనిసరి విధి. బాహ్య పరమయిన హిజ్రత్ చేయాల్సిన వారిని నాలుగు వర్గాల్లో విభజించడం జరిగింది.
1) హిజ్రత్ చేయడం తప్పనిసరి-వాజిబ్ అయిన వర్గం: చేయని పక్షంలో వీరు పాపం చేసిన వారవుతారు. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”ఎవరయితే తమకు తాము అన్యాయం చేసుకుంటూ ఉన్నారో వారి ప్రాణాలను తీసేట ప్పుడు దైవదూతలు ”మీరే స్థితిలో ఉండేవారు?” అని వారిని అడుగుతారు. దానికి వారు – ‘మేము మా ప్రాంతంలో బడుగు బలహీనులుగా ఉండే వారము’ అని బదులిస్తారు. ”ఏమి? మీరు (ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి) హిజ్రత్ చేయడానికి అల్లాహ్‌ా భూమి విశాలంగా లేదా?” అని దైవ దూతలు వారిని నిలదీస్తారు. కాబట్టి ఇట్టి వారి నివాస స్థలం నరకం. అది అత్యంత చెడ్డ నివాసం”. (అన్బియా; 97)
(అనివార్యం కాకపోయినా) ”అవిశ్వాసులు, బహుదైవారాధకుల మధ్యనే నివసించడాన్ని ఇష్ట పడే వ్యక్తితో నేను తెగత్రెంపులు చేసుకుంటున్నాను. ఇతను వారిని స్వర్గం వైపునకు ఆహ్వానిస్తుంటే, వారేమో ఇతణ్ణి నరకం వైపు నెట్టాలని చూస్తున్నారు” అన్నారు ప్రవక్త (స). (తిర్మిజీ)
2) హిజ్రత్ అనివార్యమయిన వారే కానీ నిజంగా బలహీనులు: ”అయితే నిజంగానే ఏ సాధనా సంపత్తి లేని, దారి తెలియని న్సిహాయులైన పురు షులు, స్త్రీలు, పసివాళ్ళ సంగతి వేరు”. (అన్బియా: 97)
3) ధర్మాన్ని పాటించుకునే, ప్రకించుకునే వెసులుబాటు ఉన్న వారు: హిజ్రత్ చేయడం వీరి కోసం ముస్తహబ్; తప్పనిసరి కాదు.
4) హిజ్రత్ చేయడంకన్నా అవిశ్వాస నేలనే ఉండటం మేలయిన వారు: జర్నలిస్టులు, ధర్మబోధకులు, విద్యార్థులు.
హిజ్రత్ మార్గంలో షైతాన్ మాటు వేసుకుని కూర్చొని ఉంటాడు:
ప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ”నిశ్చయంగా షైతాన్ ఆదం పుత్రునికి సంబంధించిన సకల మార్గాల మీద మాటు వేసి కూర్చుంటాడు. (అతన్ని ఎలాగయినా దొంగ దెబ్బ తీయాలనుకుంటుాండు). ముందు – ఇస్లాం మార్గంలో కూర్చుని ఇలా అంాడు: ‘ఏమి, నువ్వు ఇస్లాం స్వీకరిస్తావా? నీ తాతముత్తాతలు మొదలు వంశ పారంపర్యంగా వస్తున్న మతధర్మానికే ద్రోహం తల పెడతావా?’ అయినా మనిషి అతని మాయామాటల్లో పడక ఇస్లాం స్వీకరిస్తాడు. అప్పుడు అతని కోసం హిజ్రత్ మార్గంలో మాటు వేసి కూర్చుని ఇలా అంటాడు: ‘ఏమి, నువ్వు హిజ్రత్ చేసి వెళ్ళి పోతున్నావా? నీ భూమిని, నీ ఆకాశాన్ని వదలి వెళుతున్నావా? ముహాజిర్ ఉపమానం కాళ్ళను త్రాడుతో కట్టబడిన గుర్రం వింది. (అంటే నువ్వు ఎక్కువ స్వేచ్ఛతో తిరగలేవు, త్రాడు వదులును బట్టి నీకు స్వేచ్ఛ ఉంటుంది). అయినా మనిషి మాయావి మాట వినకుండా హిజ్రత్ చేసి వెళ్ళాడు. మరో పాచిక విసురుతూ జిహాద్ మార్గంలో కూర్చుని ఇలా అంాడు: ‘ఏంటి , నువ్వు జిహాద్ చేస్తావా? (నా మాట విను) అది తీవ్రమయిన శారీరక శ్రమ తోపాటు భారి ధన నష్టంతో కూడినది. నువ్వేమో (పరమ వీరుడిలా) పోరా డుతావు సందేహం లేదు. ఒకవేళ నువ్వు చంపబడితే, నీ భార్యను ఇంకొక్కడు పెళ్ళి చేసుకుాండు. (నీ భార్య విధవవుతుంది, నీ పిల్లలు అనాథలవుతారు). నీ ఆస్తిని వాలు వేసుకుని పంచుకోవడం జరుగు తుంది’ అని పౌరుషం తెప్పించే ప్రయత్నం చేస్తాడు. అయినా మనిషి పనికి రాని పవరుషానికి పోకుండా జిహాద్‌లో పాల్గొాండు.
ఆ తర్వాత ప్రవక్త (స) ఇలా అన్నారు: ”ఇలా ఎవరయితే చేస్తారో అల్లాహ్ తన బాధ్యత మీద అతన్ని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. ఈ మార్గంలో వధించ బడితే అతన్ని స్వర్గంలో ప్రవేశింపజేయడం అల్లాహ్‌పై తప్పని సరయి ఉంటుంది. ఒకవేళ అతను మునిగి (ఏదైనా ప్రమాదానికి గురయి) మరణిస్తే అతన్ని అల్లాహ్ తన బాధ్యత మీద స్వర్గంలో ప్రవేశింప జేస్తాడు. ఒకవేళ అతని వాహనం క్రింద పడి నలిగి మరణిస్తే అతన్ని స్వర్గంలో ప్రవే శింపజేయడం అల్లాహ్‌పై తప్పనిసరయి ఉంటుంది”. (సునన్ నసాయీ)