లాభసాటి వర్తకం

ఈ మాటలు విన్న ఆ ఇల్లాలు బాధ పడలేదు. భర్తను నిందించలేదు సరికదా, భర్త ఆజ్ఞను శిరసావహిస్తూ సంతోషంగా తోట విడిచి వచ్చేసింది. పైగా ఆ వినయవతి ఇలా అన్నది: 'ఓ అబూ దహ్‌దాహ్‌! (ర) మీరు చేసిన ఈ బేరం భలె మంచి బేరం. ఈ వర్తకం భలే లాభసాటి వర్తకం!' ఎటువంటి విధేయులు వారు!  ఎటువంటి ఆదర్శప్రాయులు వారు!! ఎటువంటి త్యాగధనులు వారు!!!

ఈ మాటలు విన్న ఆ ఇల్లాలు బాధ పడలేదు. భర్తను నిందించలేదు సరికదా, భర్త ఆజ్ఞను శిరసావహిస్తూ సంతోషంగా తోట విడిచి వచ్చేసింది. పైగా ఆ వినయవతి ఇలా అన్నది: ‘ఓ అబూ దహ్‌దాహ్‌! (ర) మీరు చేసిన ఈ బేరం భలె మంచి బేరం. ఈ వర్తకం భలే లాభసాటి వర్తకం!’ ఎటువంటి విధేయులు వారు! ఎటువంటి ఆదర్శప్రాయులు వారు!! ఎటువంటి త్యాగధనులు వారు!!!

నెలవంక సౌజన్యంతో

”అల్లాహ్‌కు మంచి రుణం ఇచ్చేవారు మీలో ఎవరైనా ఉన్నారా? దాన్ని ఆయన ఎన్నో రెట్లు పెంచి తిరిగి ఇస్తాడు”.
(అల్‌ బఖర: 245)
‘మంచి రుణం’ అంటే భావం దైవ మార్గంలో ఖర్చు పెట్టడం, ధన త్యాగం చేయటం, దైవ ధర్మ ఉన్నతి కోసం కష్టపడి చెమటోడ్చి సంపాదించిన సొమ్మును మనస్ఫూర్తిగా అర్పించటం. మహాప్రవక్త ప్రియ సహచరుల జీవితాలు దీనికి ప్రతిబింబంగా నిలిచాయి.

దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ సూక్తి అవతరించినప్పుడు అబూ దహ్‌దాహ్‌ (ర) అనే సహాబి అమితంగా ప్రభావితులై ‘ఓ దైవ ప్రవక్తా! ఏమిటి, అల్లాహ్‌ మా నుండి రుణం అడుగుతున్నాడా?’ అని ప్రశ్నించారు. ”అవున”ని ఆయన (స) చెప్పగానే ‘ఏదీ, తమరి చేయిని చాపండి దైవ ప్రవక్తా!’ అని అబూ దహ్‌దాహ్‌ (ర) కోరారు. దైవప్రవక్త (స) తన చేయిని చాపగానే, ‘నాకెంతో ప్రియమైన నా తోటను, 600 ఖర్జూర వృక్షాలు గల తోటను దైవ మార్గంలో ఇచ్చేస్తున్నాన’ని మాటిచ్చారు.

ఆ తరువాత ఆయన (ర) తిన్నగా తన తోట వద్దకు వచ్చి, ఆ తోటలోనే ఉన్న తన సతీమణిని, పిల్లల్ని కేకేశారు – ‘ఓ ఉమ్మె దహ్‌దాహ్‌! మీరంతా బయటకు రండి. ఇక ఈ తోట మనది కాదు ప్రభువు ప్రీతి కోసం నేనీ తోటను నా ప్రభువుకు ఇచ్చేశాన’న్నారు.

ఈ మాటలు విన్న ఆ ఇల్లాలు బాధ పడలేదు. భర్తను నిందించలేదు సరికదా, భర్త ఆజ్ఞను శిరసావహిస్తూ సంతోషంగా తోట విడిచి వచ్చేసింది. పైగా ఆ వినయవతి ఇలా అన్నది: ‘ఓ అబూ దహ్‌దాహ్‌! (ర) మీరు చేసిన ఈ బేరం భలె మంచి బేరం. ఈ వర్తకం భలే లాభసాటి వర్తకం!’ ఎటువంటి విధేయులు వారు!  ఎటువంటి ఆదర్శప్రాయులు వారు!! ఎటువంటి త్యాగధనులు వారు!!!

దైవ దూతలు ‘గుసుల్‌’ ఇచ్చిన వేళ.

దైవ ప్రవక్త ప్రియ సహచరులలో హజ్రత్‌ హన్సలా బిన్‌ అబూ ఆమిర్‌ (ర) ఒకరు. ఈయన పెండ్లి చేసుకున్నారు. నవ వధువుతో మొదటి రాత్రి గడుపుతున్నారు. అదే సమయంలో వీధిలో పిలుపు – ”ఓ దైవ యోధులారా! ధర్మ యుద్ధానికి బయలుదేరండి”.
అంతే! ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పడకపై నుంచి లంఘించారు హన్సలా. ఖడ్గం చేబూని, గుర్రంపై స్వారీ అయ్యారు. ఇరు పక్షాల మధ్య భీకర పోరు సాగుతోంది. శత్రు సైనికుల పంక్తుల్లోకి చొచ్చుకుపోయి వీర మరణం పొందారు ఈ యువ కిశోరం. సహచరులు హన్సలా అంత్యక్రియలకు సన్నాహాలు చేస్తుండగా దైవ ప్రవక్త (స) వచ్చి, ”మీ ఈ సహచరుణ్ణి దైవ దూతలు స్వయంగా స్నానం చేశారు. ఈ విషయాన్ని ఇతని పెళ్ళికూతురికి తెలిపి రండి” అన్నారు. ఈ సంగతి తెలిసినప్పుడు ఆ వితంతు వధువు ఇలా చెప్పింది: ”యుద్ధ ప్రకటన గురించి విన్నప్పుడు ఆయనగారు ‘జనాబత్‌’ (లైంగిక అశుద్ధావస్థ)లో ఉన్నారు. ఆజ్ఞాపాలనలో ఆలస్యం కారాదన్న ఉద్దేశంతో హుటాహుటిన బయలుదేరారు”.
అల్లాహు అక్బర్‌! అలనాడు అల్లాహ్‌ా మరియు ఆయన ప్రవక్త పిలుపుపై హన్సలా (ర) తన ఇష్ట సఖితో గడిపే మధుర క్షణాలను త్యాగం చేసి కదన రంగంలో దూకారు. దైవ దూతలచే స్వాగత సత్కారాలు అందుకుని స్వర్గానికి పయనమయ్యారు.

కాని – ఈనాడు ప్రతి రాత్రి ప్రశాంతంగా, తృప్తిగా నిక్షేపంగా నిద్రపోతున్న మనం కనీసం తెల్లవారు జామున మస్జిద్‌ లౌడ్‌ స్పీకర్‌ నుంచి వినిపించే పిలుపుకు సమాధానమిస్తున్నామా!? ఆ పిలుపు కదన రంగానికి కాదు, మన పేటలో ఉన్న మస్జిదుకే! కేవలం పావు గంట కోసమే. ‘అస్సలాతు ఖైరుమ్‌ మినన్‌ నౌమ్‌’ (నమాజు నిద్రకంటే మేలైనది సుమీ!) అని పిలిచేవాడొకడు పిలుస్తున్నాడు. ఆ పిలుపు మన కర్ణ పుటాలకు తాకుతూనే ఉంది. కాని మనం మాత్రం ప్రాక్టికల్‌గా ”అన్నౌము ఖైరుమ్‌ మినస్సలాత్‌” (నిద్ర నమాజుకన్న మేలైనది) అని సమాధానమిస్తున్నాం. శోచనీయం! మన వైఖరి కడు శోచనీయం!! ..

Related Post