లక్ష్య సిద్ధి దిశగా అడుగులు సాగాలి!

Originally posted 2013-07-07 15:09:47.

_ramadan
 క్రితం సారి మనం ఓ రమజానుకు వీడ్కోలు పలికాము. ఇప్పుడు పూర్తి ఓ ఏడాది తర్వాత సత్కార్యాల సమాహారమయిన రమజాను  మాసాన్ని స్వాగతించాము. ఈ మాసపు  పార్రంభం సత్సంకల్పంతో, సంకల్ప శుద్ధితో, పశ్చాత్తాపం, తౌబాతో మొదలయితే ఎంతో బాగుంటుంది! విధేయతా భావంతో మన అంతరంగం పొంగాలి. మన అణువణువు భక్తి పారవశ్యాలతో పులకించాలి. త్యాగభావంతో మన హృదయ సీమలు నిండాలి. దైవనామస్మరణలతో మన నాలుకలు నానాలి. మనలో పరివర్తనం రావాలి. అది సత్సమాజ స్థాపనకు అంకురం అవ్వాలి. ఎవరో ఎపుడో వాస్రే చరితకు మనం పునాది అవ్వాలి.
  రమజాను మాసాన్ని పొందిన సుభక్తా జనులందరికి శుభాకాంక్షలు! ‘ఈ మాసపు ఉపవాసాలను అల్లాహ్‌ విధిగావించాడు. ఈ మాసంలో స్వర్గపు ద్వారాలు తెరవబడతాయి. నరక ద్వారాలు మూసివేయబడతాయి. దుష్ట షైతానులను బంధించడం జరుగుతుంది. ఈ మాసంలో ఓ రేయి ఉంది అది వేయి నెలలకంటే ఘనతర మయినది. దాని మేలును కోల్పోయిన వ్యక్తి సకల మేళ్లకు దూరం అయినట్లే’ అని స్వయంగా మహనీయ ముహమ్మద్‌ (స) వారు సెలవిచ్చారు. ఈ మాసపు ఉపవాసాలు పాటించేవారి, తరావీహ్‌ ప్రార్థనలు సలిపేవారి, లైలతుల్‌ ఖద్ర్‌లో జాగారం చేసి దైవధ్యానంలో గడిపేవారి గత కాలపు పాపాలు మన్నించ బడతాయి. ఈ మాసంలోని పత్రి రాతిల్రో అనేక మందిని అల్లాహ్‌ నరకాగ్ని నుండి ముక్తిని ప్రసాదిస్తాడు. ఈ మాసం మరో రమజాను వరకు జరిగే తప్పులను ప్రక్షాళిస్తుంది; ఘోరపాపాలకు దూరంగా ఉన్న పక్షంలో. ఈ మాసంలో చేసే ఉమ్రా, ప్రవక్త (స) వారితో హజ్జ్‌ చేసేంతటి పుణ్యాన్నిస్తుంది. ఈ మాసంలోనే సమస్త మానవాళికి మార్గదర్శక గంథమయిన ‘ఖుర్‌ఆన్‌’ అవతరించింది. ఈ ఉద్గంథం అన్యాయాన్ని, అధర్మాన్ని, అకమ్రాన్ని అంతమొందించింది. ఈ గ్రంథరాజం మూలంగానే పీడిత ప్రజలు పాలితులయ్యారు. గొర్రెల కాపరులు మానవతా సంరక్షులయ్యారు. ఈ మాసంలోనే నియంత నమ్రూద్‌ను ఎదిరించే ‘సుహుప్‌’ ప్రవక్త ఇబ్రాహీమ్‌ (అ) వారికి ఒసగ బడ్డాయి. ఈ మాసంలోనే ఫిర్‌ఔన్‌ కబంద హస్తాల నుండి ఇజ్రాయీల్‌ జాతిని కాపాడే ‘తౌరాత్‌’ గ్రంథం ప్రవక్త మూసా (అ)పై అవతరించింది. ఈ మాసంలోనే ఉదయం సాయంతాల్రు దైవ ఘనకీర్తిని కొనియాడేందుకు ‘జబూర్‌’ గ్రంథం పవ్రక్త దావూద్‌ (అ) వారికి ఇవ్వబడింది. ఈ మాసంలోనే మార్గం తప్పిన యూద ప్రజల్ని, ఇజ్రాయీల్‌ జాతికి చెందిన పన్నెండు గోత్రముల వారిని రుజుమార్గం మీదికి తీసుకు వచ్చే ‘ఇన్జీల్‌’ ప్రవక్త ఈసా (అ) వారికి ప్రసాదించ బడింది.
 రమజాను మాసం పార్థ్రనల, పారాయణాల, దానధర్మాల మాసమే కాదు. సత్య సమర సాఫల్య పరంపరల మాసం కూడా. ఈ మాసంలో బద్ర్‌ సంగ్రామంలో విశ్వాసులకు విజయం లభించింది. ఈ దినాన్ని ఖుర్‌ఆన్‌ ‘యౌముల్‌ ఫుర్ఖాన్‌’గా అభివర్ణించింది. అవిశ్వాస భావాలను కూకటి వేళ్ళ్రతో సహా పెకళించిన మక్కా విజయం ఈ మాసంలోనే వరించింది. ఈ మాసంలోనే అమ్‌ బిన్‌ ఆస్‌ (ర) గారి సారథ్యంలో ఈజిప్టుపై విజయ ఢంకా మోగ్రించ బడింది. ఈ మాసంలోనే తారిఖ్‌ బిన్‌ జియాద్‌ ఉన్దులుస్‌ (ఫ్రాన్సు)ను జయించారు. 16 ఏళ్ళ నూనుగు మీసాల కుర్రాడు ముహమ్మద్‌ బిన్‌ ఖాసిమ్‌, రాజా దాహిర్‌ను ఓడించి సింధూ ప్రాంతాన్ని ఇస్లామీ రాజ్యంలో విలీనపర్చింది ఈ మాసంలోనే. ఈ మాసంలోనే ఇమాదుద్దీన్‌ జన్గీ శిలువ కూస్రేడులపై విజయ కేతనాన్ని ఎగుర వేశాడు. ఈ మాసంలోనే ఉస్మానీయా పరి పాలకులు’హంగదే’ ని కైవసం చేసుకున్నారు.  కాబట్టి రమజాను మనకిచ్చే సందేశం – మనం కలిసికట్టుగా ఉన్నన్నాళ్ళు గెలుస్తామని. కలిసుంటే బలపడతామని, బలపడితే నిలబడతామని, నిలబడితే కలబడతాం అని, అన్నాయాన్ని ఎదిరిస్తామని, అధార్మాన్ని  పారద్రోలుతామని.
 వ్యవస్థ-అది ఎంత బలమయినదయినా, సిద్ధాంతం-అది ఎంత ఉత్తమమైనదైనా, కేవలం అనుసరించి నందు వల్ల సమైక్యత, సాఫల్యం సిద్ధించదు. విస్తృతమయిన, ప్రగాఢమయిన ఎరుక, చైతన్యం, విప్లవ భావం ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. ఈ ఎరుక రమాజన్‌ మనలో తీసుకు రావాలనుకుంటున్న చైతన్యపు లోతుల్లోకి కూడా పోవాలి. ఊరికే పైపై ఉత్తుత్తి ఫలితాలతో తృప్తి పడితే చాలదు. ఈనాడు ఇటు మయాన్మర్‌లోనూ, అటు సిరియా, ఈజిప్టు, షామ్‌  దేశాల్లోనూ ముస్లింల స్థితి దయనీయంగా ఉందన్నది నిజమే. కానీ, ఈ సముదాయపు చరిత్రలో సమస్యల సునామీలు, పరీక్షల తుఫానులు లేని కాలమంటూ ఏదీ లేదు. ఈ సముదాయం పడుతూ పడతూ కూడా  ఉవ్వెత్తుకు లేచింది. మరణ ఘడియలు దీనికి సమీ పించాయి అని అందరూ భవిష్యవాణులు విన్పించిన సమయంలో సయితం అది జీవం పొసుకొని నిండు యవ్వనాన్ని సంపాదించుకుంది. వాస్తవంగా ఈ సముదాయం ఉనికిలోకి తీసుకురాబడిందే  ప్రజా సంక్షేమం కోసం. అధర్మ ధ్వజవాహకులపై విజయ ఢంకా మ్రోగించడం కోసం. ఇదే యదార్థాన్ని సత్య పభ్రు వయిన అల్లాహ్‌ ఇలా తెలియజేస్తున్నాడు: ”ఆయనే తన పవ్రక్తకు సన్మార్గాన్ని, సత్యధర్మాన్ని ఇచ్చి పంపాడు -దాన్ని మత ధర్మాలన్నింటిపై ఆధిక్యం వహించేలా చేయడానికి! ఈ విషయం బహుదైవారాధకులకు ఇష్టం లేకపోయినా సరే”. (అస్‌ సఫ్‌: 9)
 పాఠక మహోదయులారా! రమజాను మాసం మరోసారి మనలో మార్పును చూడకుండానే, లేదా మనలో వచ్చిన మార్పును సుస్థిర పరచడంలో మన భూమికను సముద్ధరించకుండానే, రమజాను ఆశయ సిద్ధికి మనలో సత్సంకల్పాన్ని ప్రేరేపించకుండానే వెళ్ళి పోతుందా? ఏమో? ఆలోచించుకోవలసిన ఆత్మ పరిశీలన చేసుకోవలసిన సమయమిది!

Related Post