మహిమాన్విత నగరం మక్కా పురం

Originally posted 2013-03-29 18:47:32.

the_sacred_mosque_by_yoosof_e_zahra
”నిశ్చయంగా మానవుల కొరకు ప్రప్రథమంగా ఖరారు చేయబడిన గృహం బక్కా (మక్కా) లో ఉన్నదే. అది ఎంతో శుభప్రదమైనది. సమస్తలోక వాసులకు మార్గదర్శకం కూడాను. అందులో స్పష్టమైన సూచనలున్నాయి. అందులో ప్రవేశించినవాడు రక్షణ పొందుతాడు. మరియు అక్కడికి వెళ్ళే స్థోమత గలవారికి, ఆ గృహ యాత్ర-హజ్జ్‌ చేయటాన్ని అల్లాహ్‌ విధి గా చేశాడు”. (ఆలి ఇమ్రాన్: 96<97)
 ఈ వచనాలలో కాబా గృహ ఔన్నత్యాన్ని, ప్రాస్తశ్యాన్ని పేర్కోనడం జరిగింది. కాబా గృహానికి సంబంధించిన అయిదు విశిష్ఠతలి వివరించబడ్డాయి.
1) మొదటి దైవ గృహం
పూర్తి భూమండలంపై మొదటి దైవ గృహ గౌరవం కాబాకే దక్కింది. యూదులు భావించి నట్లు ‘బైతుల్‌ మఖ్దిస్‌’ అన్నిటికన్నా మొదటి ఆరాధనాకేంద్రం కానేకాదు. ఈ విషయమై దైవ ప్రవక్త మహమ్మద్‌ (స) వారిని ప్రశ్నించి నప్పుడు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు:
  ”భూమండలం మీద మొట్టమొదట నిర్మించ బడిన దైవ గృహమేది? అని అడగ్గా – ‘కాబా’ అన్నారు. ఆ తర్వాత ఏ గృహం అని ప్రశ్నించ గా – ‘మస్జిదె అఖ్సా’ అన్నారు. ఈ రెంటికి మధ్య ఎంత కాలం తేడా ఉందని అడగ్గా – ’40 సంవత్సరాలు” అని ప్రవక్త (స) బదులి చ్చారు. (బుఖారీ, ముస్లిం)
 కొందరు ధర్మవేత్తల అభిప్రాయం ప్రకారం -ఈ గృహాన్ని తొలుత దైవ దూతలు నిర్మి చారు. తర్వాత ఆది మానవుడైన ప్రవక్త ఆదం (అ) ఈ గృహం మీద డోము కట్టిం చారు. ఆనక అది నూహ్‌ (అ) గారి కాలంలో వచ్చిన జలప్రళయంలో నేలమట్టం అవగా, తర్వాత దైవ దూత జిబ్రయీల్‌ (అ) సూచనల మేరకు ప్రవక్త ఇబాహీమ్‌ (అ) అవే పునాదు లపై ఈ గృహాన్ని పునర్నిర్మించారు అన్నది. ఏదిఏమైనా ప్రవక్త  ఇబ్రాహీమ్‌ (అ)గారి నిర్మాణం తర్వాత  నుండి మొదలు నేటి వరకు ఆ గృహం  ప్రజల్ని ఆకట్టుకుంటూనే ఉంది. నాటి నుండి మొదలు ప్రపంచ ప్రజలు ఆ గృహాన్ని ఉద్దే శ్యించి హజ్జ్‌ ఉమ్రాలు చేస్తూనే ఉన్నారు.
2) అది ఎంతో శుభప్రదమయినది సృష్టి మొత్తంలో కేవలం కాబా గృహ చుట్టు ప్రదక్షిణ చేయడం మాత్రమే సమ్మతించ బడింది. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”ఆ తర్వాత వారు (దేవుని) ఆ ప్రాచీన గృహా నికి ప్రదక్షిణ చేయాలి”. (అల్‌హజ్జ్‌ 29)
  ఈ ఆయతులో ప్రాచీన గృహం అంటే పవిత్ర కాబా గృహమే. కాబా ప్రపంచంలోని ముస్లింలందరి కోసం నమాజు చేసే దిశగా, ప్రదక్షిణ చేెసే స్థలంగా ప్రసిద్ధి. ప్రదక్షిణ కేవ    లం కాబాకు మాత్రమే ప్రత్యేకం. ఇతర ప్రార్థ నాలయాల వద్ధ ప్రదక్షిణ చేయడానికి వీల్లేదు. దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ”భూ మండలంలో కాబా ఎక్కడుందో దానికి నేరుగా ఏడు ఆకాశాలపైన బైతుల్‌ మామూర్‌ ఉంది. దానిపైన స్వర్గం ఉంది. స్వర్గ శిఖర భాగమైన ఫిర్‌దౌస్‌ పైన అల్లాహ్‌ా అర్ష్‌ ఉంది”.  (దారమీ)
 ప్రాంతం, ప్రదేశ పరంగా ఇటువంటి ప్రాస్త శ్యం మరే స్థలానికి లేదు. దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ”తవాఫ్‌ చేస్తూ మనిషి వేసే ప్రతి అడుగుకి బదులు పది పుణ్యాలు లిఖించబడతాయి.  పది  పాపాలు  మన్నించ బడతాయి. స్వర్గపు పది అంతస్థులు పెంచబడ తాయి”. (అహ్మద్)
  మరో హదీసులో ఇలా ఉంది: ”మస్జిదె హరామ్‌లో ఒక నమాజు చేయడం అనేది ఇతర మస్జిద్‌లలో లక్ష నమాజులు చేసేంతటి పుణ్యానికి సమానం” అన్నారు ప్రవక్త (స).  (ఇబ్ను మాజా)
  ”మూడు మస్జిద్‌ల వైపు తప్ప మరే ఇతర చోటుకి పుణ్యఫలాపేక్షతో ప్రయాణం చేయ కూడదు. 1) మస్జిదె హరామ్‌ (కాబా). 2) మస్జిదె అఖ్సా 3) నా ఈ మస్జిద్‌ (మస్జదె నబవీ)”  అన్నారు ప్రవక్త (స).
3) అది సమస్తలోకవాసుల కోసం మార్గదర్శక కేంద్రం.
  ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”(జ్ఞాపకం చేసు కోండి) మేము ఈ గృహాన్ని (కాబాను) మాన వులందరి పుణ్యక్షేత్రంగానూ, శాంతి నిలయం గానూ చేశాము”. (అల్‌ బఖరా: 125)
  ఈ ఆయతులో ‘మసాబతల్లిన్నాస్‌’ అంటే పుణ్యక్షేత్రం మరియు మాటిమాటికీ మరలి రావలసిన స్థలం అన్న అర్థం కూడా వస్తుంది. ఈ గృహ విశిష్ఠత ఎట్టిదంటే, ఒకసారి ఈ కాబా గృహాన్ని సందర్శించుకున్నవారు   మరో సారి, ఇంకోసారి, మళ్ళింకోసారి కూడా అక్కడి కి రావాలని ఉవ్విళ్ళూరుతుంటారు. అలా ఎన్ని సార్లు సందర్శించుకున్న వారి దాహార్తి తీరదు. అదొక శాంతి నిలయం. అక్కడ శత్రు భయం కూడా ఉండదు.  అజ్ఞాన కాలంలో సయితం ప్రజలు ఆ పుణ్య క్షేత్రం పరిధిలో శత్రువును, స్వయాన తండ్రిని చంపిన హంతకుణ్ణి సయితం సంహరించే వారు కాదు.
  ఇక్కడ మనకు ప్రవక్త ఇబ్రాహీమ్‌ (అ) గారి దుఆ గురుకొస్తుంది. ఆయన దైవాన్ని ఇలా వేడుకున్నారు: ”నా ప్రభూ! ఈ నగరాన్ని శాంతిభద్రతలు గల నగరంగా చేయి. నన్నూ, నా సంతానాన్ని విగ్రహ పూజ నుంచి కాపాడు”. (ఇబ్రాహీమ్ సూరా)
పై ఆయతులో ‘ఈ నగరం’ అంటే మక్కా అని భావం. ఇతరత్రా విషయాలను అర్థించే ముందు ప్రవక్త ఇబ్రాహీమ్‌ (అ) మక్కా నగరాన్ని శాంతియుతంగా ఉంచమని అర్థించ టం విశేషం! ఎందుకంటే నగరంలో ప్రశాం త పరిస్థితులు నెలకొని ఉన్నప్పుడే ప్రజలు దైవానుగ్రహాలలోని మాధుర్యాన్ని ఆస్వాదించ గలుగుతారు. శాంతి, సుస్థిరతలు కొరవడిన చోట మనిషికి ఎన్ని కానుకలు, లాభాలు, పురస్కారాలు ప్రాప్తించినా అవి రుచించవు. అశాంతి అలజడుల వాతావరణంలో మనిషి క్షణం క్షణం భయాందోళన చెందుతూ ఉం టాడు. నేడు ప్రపంచంలో వివిధ సమాజాల ను, వివిధ ప్రదేశాలను పరికిస్తే ఈ సంగతి అర్థమవుతుంది. అయితే మక్కాలోని పరిస్థితి దీనికి భిన్నంగా కనిపిస్తుంది. ఇది దేవుని అనుగ్రహం తర్వాత ప్రవక్తల పితామహుడు ఇబ్రాహీమ్‌( అ) చేసిన ప్రార్థనా ఫలితమే. నేటి దౌర్బాగ్య స్థితిలో సయితం సమస్త మానవాళికి శాంతి సందేశాన్ని అందజేస్తున్న ఏకైక కేంద్రం మక్కా. ఇటువంటి పవిత్ర ప్రదేశం, ప్రశాంత ప్రాంతం ప్రపంచమంత టిలో లేదంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు.
  తర్వాత ఇబ్రాహీమ్‌ (అ) చేసిన దుఆను గమనిస్తే-, ఆయన (అ) ఇలా ప్రార్థించారు: ”మా ప్రభూ! నా సంతానంలో కొందరిని ఎలాంటి పంటలు పండని కటిక లోయలో నీ పవిత్ర గృహం వద్ద వసింపజేశాను. మా ప్రభూ! వారు నమాజును నెలకోల్పేందుకు (ఇక్కడ వదలి పెట్టాను). కనుక ప్రజల్లోని కొందరి హృదయాలు వారి వైపు మొగ్గేలా చేయి. వారికి తినడానికి పండ్లు ఫలాలను ప్రసాదించు. వారు కృతజ్ఞులుగా మెలిగేందుకు”. (ఇబ్రాహీమ్‌))))
 అది ప్రపంచ ప్రజలందరికీ మార్గదర్శక కేంద్రం ఎలా అయిందో మీరే చూడండి! ప్రపంచ నలు మూలల నుంచి ముస్లింలు ఎలా భక్తీప్రపత్తులతో మక్కా వైపుకు తరలి వస్తున్నారో! ఒక్క హజ్జ్‌ సీజన్‌లోనే కాదు, ఏడాది మొత్తం వారు వస్తూనే ఉంటారు. ఏడాదిలోని అన్ని నెలల్లోనూ, అన్ని  వారాల్లో  నూ, అన్నీ రోజుల్లోనూ, అన్నీ గంటల్లోనూ, అన్నీ ఘడియల్లోనూ కాబా గృహం భక్తుల ప్రదక్షిణలతో కళకళలాడుతూ నిండు వసం తాన్ని, భూతల స్వర్గాన్ని తలపిస్తూ ఉం టుంది. అలాగే ప్రవక్త ఇబ్రాహీమ్‌ (అ) చేసిన ప్రార్థనలో పండ్లు, ఫలాల ప్రస్తావన కూడా ఉంది. అంటే- ఒక మనిషి జీవికకు శాంతి భద్రతలు ఎంత అవసరమో పుష్కలమైన జీవ నోపాధి అంతే అవసరం. అల్లాహ్‌ా ఆయన (అ) మొరను ఆలకించాడు. మీరే గమనిం చండి!  నీరూ, పచ్చికా లేని ఆ కొండ ప్రాం తంలో నేడు విశ్వమంతటి నుంచి రకరకాల పండ్లు, కూరగాయలు పుష్కలంగా వచ్చి పడు తున్నాయి. హజ్జ్‌ సీజన్‌లోనూ, రమజాన్‌ మాసంలోనూ అక్కడికి వచ్చే భక్తుల సంఖ్య లక్షలు దాటి కోటికి చేరుతున్నా ఆహార సర ఫరాలలో ఎలాంటి కొరతా ఏర్పడదు. ఇటు వంటి మహిమాన్విత నగరం మక్కా పురం మినహా లోకం మొత్తంలో మరొకటి ఉందా?
4) అందులో స్పష్టమైన నిదర్శనా లున్నాయి. జమ్‌జమ్‌ జల బావి. మకామె ఇబ్రాహీమ్‌. సఫామర్వాల మధ్య సయీ, హజ్రె అస్వద్‌ మొదలైనవి.  మకామె ఇబ్రాహీమ్‌:
”మీరు ఇబ్రాహీము నిలబడిన (మకామె ఇబ్రా హీమ్‌) ప్రదేశాన్ని ప్రార్థనా స్థలంగా చేసు కోండి”. (అల్‌ బఖరా: 125)
  మకామె ఇబ్రాహీమ్‌ అన్నది ఒక రాయి. ఈబ్రాహీమ్‌ (అ) ఆ రాతి మీదే నిలబడి కాబా గృహాన్ని నిర్మించారు. ఆ రాయిపై ఆయన పాద చిహ్నాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆ రాయి ఒక అద్దాల కేసులో సురక్షితంగా ఉంచ బడింది. హజ్జ్‌-ఉమ్రాకు వేళ్ళే ప్రతి ఒక్కరూ కాబా ప్రదక్షిణ సందర్భంగా దాన్ని చూడ వచ్చు. కాబా ప్రదక్షిణ పూర్తయ్యాక ఆ స్థలం లోరెండు రకాతుల నమాజు చేయటం ప్రవక్త (స) వారి సంప్రదాయం – సున్నత్‌.
సఫా-మర్వా: ”నిశ్చయంగా సఫా మర్వాలు అల్లాహ్‌ చిహ్నాల లోనివి”.(బఖరా: 158) హజ్రత్‌ హాజిరా (అ) వారి నిరుపమాన త్యాగానికి గుర్తు సఫా మర్వాల మధ్య సయీ. )
హజ్రె అస్వద్‌
 ఇది స్వర్గం నుండి దించబడిన ఒక రాయి. ఇది ముందు పాలకన్నా తెల్లగా ఉండేది, తర్వాత మనిషి పాప మసితో నల్లబడింది అన్నది మేధావుల మాట. ఈ రాయిని ప్రేమగా తాకడం, ముద్దాడటం సున్నత్‌. ఈ రాయి ఎవరికి ఏ విధమైనటువంటి లాభం గానీ, నష్టంగానీ చేకూర్చజాలదు.
ముస్లిం మక్కా వెళ్ళి ఈ రాయిని పూజిస్తారన్న మాట పూర్తి అవాస్తవంతో కూడినది. ఈ రాయిని శుభప్రదంగా భావించి ఈరాన్‌ దేశస్థులు తమతోపాటు పట్టుకెళ్ళి 20 సంవత్సరాలు తమ వద్దే పెట్టు కున్నారు. అప్పుడు కూడా హజ్జ్‌ఉమ్రాలు జరుగుతూణే ఉన్నాయి. అలాగే అజ్ఞాన కాలంలో సయితం కాబాలో గల 360 విగ్ర హాల్ని పూజించే సమయంలో సయితం ఈ రాయిని కొలచినట్టు ఆధారాలు లేవు. అదే విధంగా తర్వాతి కాలంలో చోటు చేసుకున్న దండయాత్రల కారణంగా ఈ రాయి ముక్క లయిపోయింది. ప్రస్తుతం అది ఎనిమిది ముక్కలుగా మరో పెద్ద రాయిలో అమర్చబడి ఉంది.
 5) అందులో ప్రవేశించిన వ్యక్తి రక్షణ పొందుతాడు. అంటే, అది మార్గదర్శక కేంద్రమే కాదు, పుణ్యక్షేత్రమే కాదు, రక్షణ కేంద్రం కూడా. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”గౌరవప్రద గృహమైన ‘కాబా’ను అల్లాహ్‌ మానవాళి మనుగడకు సాధనంగా చేశాడు”. (అల్‌ మాయిదా: 97)
‘ఖియామల్లిన్నాసి’లో మానవులు అంటే, పూర్వపు ప్రజలు, ప్రస్తుతం ఉన్నవారు, ప్రళయం వరకూ వచ్చే జనులందరు అన్న అర్థం ఒకటి.    ఈ ప్రకారం ‘కాబా’ ఉనికి సమస్త మానవాళి మనుగడకు కారభూతం అవుతుంది. ఈ గౌర వప్రదమైన గృహం ఉన్నంత కాలం మాత్రమే ప్రపంచం ఉంటుంది. ప్రపంచంలో ప్రగతి పచ్చతోరణాల కళకళలూ ఉంటాయి. అలాగే ఈ గృహం ఎప్పటి వరకు గౌరవించబడు తుందో లేెదా ఈ గృహాన్ని గౌరవింవారు ఎప్పటి వరకు బ్రతికుంటారో అప్పటి వరకే ప్రజా – తన, ధన, మానాలకు గౌరవం- రక్షణ ఉంటుంది. ఈ విశ్వాన్ని అంతం చేెయాలని విశ్వకర్త తలచినప్పుడు కాబా గృహం కూల్చివేయబడుతుందని పలు హదీ సుల ద్వారా రూఢీ అవుతుంది. ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”(ప్రళయ సమీపంలో) ఎలాంటి గౌరవ మర్యాదలు లేని పొట్టి కాళ్ళ నీగ్రో కాబాను నిర్మానుష్యంగా మార్చేస్తాడు”.       (బుఖారి, ముస్లిం)
  అంటే ఆ నీగ్రో వ్యక్తికన్నా ముందు ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా  ఈ గృహాన్ని పూర్తిగా నేలమట్టం చేయడం ఎవరి తరం కాదు. 70 వేల ఏనుగల సైన్యంతో వచ్చి అబ్రహాను నాశనం చేసినట్లే ఈ గృహానికి చెడు తలపెట్టాలనుకొని పన్నాగాలు పన్నే ప్రజల్ని, ప్రాంతాల్ని, దేశాల్ని, రాజ్యాల్ని సయితం అల్లాహ్‌ా నామరూపాల్లేకుండా చేెసే స్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గృహ రక్షణ లోక రక్షణ. ఈ గృహ వినాశనం, లోక వినాశనం.
2) కాబా గృహాన్ని ‘బైతుల్‌ హరామ్‌’ (పవిత్ర గృహం, గౌరవమర్యాదల గృహం) అని అన డానికి ప్రధాన కారణం – దాని పరిధిలో వచ్చే ప్రాంతంలో వేటాడటం, చెట్లు నరకటం ఇత్యాధివి నిషేధించబడ్డాయి. ఆఖరికి కన్న తండ్రిని చంపిన దుర్మార్గుడు తారస పడినా ఆ పరిధిలో ప్రతీకారం తీర్చుకునేందుకు అనుమతించబడలేదు. అంతేకాక, ఈ ప్రాంత జనుల నివాసానికి, మనుగడకు యోగ్యమైన ప్రాంతంగా ఖరారు చేయబడింది అంటే, ఈ పవిత్ర గృహ మూలంగా మక్కా వాసుల జీవనం సుఖప్రద మవ్వటమేకాకూండా, ఆర్థికంగా అది వారికి బలం చేకూరుస్తుంది. అనగా, మక్కా ప్రజలకు లేదా సవూదీ ప్రజల కు లభించే ఈ స్వాగతసన్మానాలు, గౌరవవా దరణలు కాబా గృహ కారణంగానే. ఈ కాబా గృహం వల్లనే మక్కాలోని జనులు సుఖశాం తులతో వర్థిల్లుతున్నారు. ప్రపంచం మొత్తం అశాంతి అల జడులమయమై ఉన్నా అక్కడ మాత్రం శాంతి సుస్థిరతలున్నాయి.
 ఇంతటి గౌరవం ఒక్క మక్కాకే ఎలా దక్కింది అంటే, దైవ ప్రవక్త (స) వారి ఈ హదీసు చదవాల్సిందే. ”నిశ్చయంగా అల్లాహ్‌, ఈ పట్టణాన్ని భూమ్యాకాశాలను పుట్టించిన నాటి నుండే పవిత్రంగా చేశాడు. అది ప్రళయం వరకూ అల్లాహ్‌ అనుగ్రహించిన ఔన్నత్యంతో పవిత్రంగానే చూడబడుతోంది”.  (బుఖారీ, ముస్లిం)
  నేడు మానవులు అనేక స్థలాలను, ప్రదే శాలను పవిత్రంగా చేసుకున్నారు. ఆ స్థలం, ఆ ప్రాంతం ఏ సమాజానికి, మరే  మతానికి సంబంధించినదైనా కావచ్చు. మక్కా అంతటి పవిత్రత, గౌరవం వాటిలో ఏ ఒక్కటికీ లేదు అన్నది మాత్రం విర్వివాదాంశం. ఎందుకంటే, మక్కాకు లభించిన పవిత్రత సనాతనం, నిత్య నూతనం, దైవ ప్రసాదితం. ఇతర ప్రాంతాల కు లభించినది మానవ కల్పితం, కృత్రిమం, క్షణికం. ఏ నిమిషం మనిషి చేసిన సిద్ధాం తాలు దేనిక కొరగాకుండా పోతాయో  మరుక్ష ణం ఆయా స్థలాలు, ఆలయాలు తమ పవిత్ర తను కోల్పోతాయి. స్వయం మనిషే తన స్వహస్తాలతో వాటిని కుప్పకూలుస్తాడు. అయితే మక్కా, మక్కాలోని కాబా అటువంటిది కాదు. దీనికి సుదీర్ఘమైన మానవ చరిత్రే ప్రత్యక్ష  సాక్షి!
 అల్లాహ్‌ ఈ పట్టణంలోని కాబా గృహం వైపు ముఖం త్రిప్పి నమాజు చేయవలసిందింగా ఆదేశించాడు: ”(ఓ ప్రవక్తా!) ఏ స్థలం నుంచి నీవు వెడలినా నీ ముఖాన్ని మస్జిదె హరామ్‌ వైపునకే త్రిప్పు. మీరు ఎక్కడ ఉన్నాసరే, మీ ముఖాలను దాని వైపునకే త్రిప్పండి-జనులు మీతో వాదులాటకు దిగకుండా ఉండటానికి (ఇలాగే చేయండి). వారిలో దుర్మార్గులకు (వారు ఎలాగూ రాద్ధాంతం చేసేవారే. అంత మాత్రాన మీరు వారికి) భయపడకండి. నాకు మాత్రమే భయపడండి నేను నా అనుగ్రహాన్ని మీపై సంపూర్తి గావించటానికి, మీరు సన్నార్గ గాములు అవటానికి”.(అల్‌బఖర: 150)
 ‘కాబా’ వైపు ముఖం త్రిప్పి నమాజు చేయండి అన్న ఆజ్ఞ ఒకటి, రెండు కాదు- మూడుసార్లు చెప్పబడింది. దీన్నిబట్టి ఈ విషయానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థమవుతుంది. ఈ దిశ మార్పును దేవుడు తన అనుగ్రహాల పరిపూర్తి గా, సన్మార్గ భాగ్యానికి ప్రతీకగా అభివర్ణిం చాడు. అలాగే దైవాదేశాలను శిరసావహించే మనిషి సదా గౌరవపురస్కారాలకు అర్హుడవు తాడనీ, సన్నార్గ భాగ్యం కూడా అతన్ని వరి స్తుందని స్పష్టం చేశాడు.  ఇన్ని విశిష్ఠతల కారణంగానే అల్లాహ్‌ ఈ పట్టణాన్ని ప్రమాణంగా తీసుకున్నాడు:
”శాంతియుతమైన ఈ నగరం సాక్షిగా!”.  (తీన్: 4)  ”ఈ నగరం తోడుగా!” (బలద్‌; 1)
 అల్లాహ్‌ ఈ ఆయతులలో మక్కా నగరంపై ఒట్టేసి విషయం చెబుతున్నాడంటే, దీన్ని బట్టి ఈ నగరం ప్రాస్తశ్యాన్ని ఊహించ వచ్చు. దైవ ప్రవక్త (స) మక్కాను వీడి వెళు తూ ‘హజ్వరా’ ప్రదేశంలో నిలబడి మక్కా నుద్దేశించి ఇలా అన్నారు: ”ఓ మక్కా! అల్లాహ్‌ సాక్షిగా చెబుతున్నాను. నీవు అల్లాహ్‌ భూభాగాలన్నింటిలోకెల్లా అత్యంత మహిమాన్వితమైన నేలవు. భూభాగాలన్నిం టిలోకెల్లా అల్లాహ్‌కు అత్యంత ప్రియ మైన భూభాగానివి. నాకూ నీవు మిక్కి ఇష్టమైన భూభాగానివే. మక్కా వాసులే (అవిశ్వాసు లే)  గనక నన్ను నీ నుండి వెలివేసి ఉండక పోతే నేను ఎన్నటికీ నిన్ను వీడి వెళ్ళేవాడను కాను. (నిన్ను వీడి మరో భూభాగంలో నివా సం ఏర్పచుకునేవాడను కాను)”.  (తిర్మిజీ)
  మహిమాన్వత నగరం మక్కా పురం అంటే అనంత కరుణామయుడైన అల్లాహ్‌ాకు, సర్వలోక కారుణ్యమూర్తి అయిన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారికి ఎంతో ఇష్టం. కాబట్టి మనం కూడా మక్కా నగ రాన్ని, అందులోని ప్రతి ప్రదేశాన్ని ప్రేమిం చాలి, అభిమానించాలి, గౌరవించాలి. స్థాయి, స్థోమత ఉంటే ఆ గృహాన్ని ఉద్దే శ్యించి హజ్జ్‌ చేయాలి. అల్లాహ్‌ా ఇలా సెలవి స్తున్నాడు: ”అక్కడికి వెళ్ళే స్థోమత గల వారికి, అ గృహ (యాత్ర) హజ్జ్‌ చేయ డాన్ని అల్లాహ్‌ విధిగా చేశాడు. మరెవర యినా (ఈ ఆజ్ఞను శిరసావహించటానికి)  నిరాకరిస్తే అల్లాహ్‌ాకు సమస్త లోకవాసుల అవసరం ఎంత మాత్రం లేదు”. (ఆలి ఇమ్రాన్: 97)
 ఈ కారణంగానే దాదాపు ప్రవక్తలు తమ శేష జీవితాన్ని ఈ పట్టణంలో జీవించి కన్ను మూయాలని ఆశ పడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే, మనిషి మరింత మంచి సౌక ర్యాలతో బ్రతకటానికి జీవనోపాధిని వెతు క్కుంటూ ప్రపంచ నలుమూలలా వేళతాడు. కానీ మక్కా వెళ్ళే వారు మాత్రం అక్కడే మర ణించాలని, అక్కడ మరణం రావడం తమ భాగ్యమని బయలుదేరతారు. అంటే, భూ ఇతర భాగాలు మనిషిని పదార్థ పూజారిగా, దానవుడిగా మార్చితే, మక్కా పురం మనిషిని పరమాత్మ దాసుడిగా, మనసున్న మనీషిగా తీర్చిదిద్దుతుంది.
 అల్లాహ్‌ మనందరి మక్కాకెళ్ళి హజ్జ్‌ ఉమ్రాలు చేసే భాగ్యాన్ని మళ్ళి మళ్ళీ అనుగ్రహించుగాక! అమీన్‌.

Related Post