”మన్ దల్ల అలా ఖైరిన్ ఫలహు క అజ్రి ఫాయిలిహి” – మంచికి మార్గం చూపిన వ్యక్తి మంచి చేసే వ్యక్తి లభించినంత పుణ్యం లభిస్తుంది అన్నారు మహనీయ ముహమ్మద్ (స). (ముస్లిం) మంచి చెయడానికి మనం పండితులం కానవసరం లేదు. మంచి మనసున్న మనుషులమయితే చాలు. నిజంగా మంచి చేయాలన్న సద్బుద్ధి కలగడమే గొప్ప విషయం. కాబ్టి అలాిం గొప్ప ఆలోచన వచ్చినప్పుడు గోరంతి ఆలస్యం కొండంతి నష్టానికి దారి తీయగలదన్న స్ప్రుహతోి మంచి చేసెయ్యాలి. ఎందుకంటే ఆ తర్వాత పరి స్థితులు ఎలా ఉంటాయో ఎవరికీ తెలీదు గనక. ప్రవక్త (స) ఇలా అన్నారు ”కాళ రాత్రి కటిక చీకట్ల వలే ఉపద్రవాలు విరుచుకు పడక మందే సదాచరణలో త్వర పడండి. అప్పి ఆ దుర్దశ ఎలా ఉంటుందంటే, మనిషి విశ్వాసిగా ఉదయం చేస్తే సాయంత్రానికల్లా అవిశ్వాసిగా మారి పోతాడు”. (ముస్లిం)
ఉదాహరణకు దానాన్ని తీసుకుందాం! ప్రవక్త (స) ఇలా అన్నారు: ”సబఖ దిర్హమున్ అలా మిఅతి అల్ప్ దిర్హమిన్”-ఒక దిర్హమ్ లక్ష దిర్హమ్‌లను మించి పోయింది. అది విన్న సహచరులు అదెలా సాధ్యం? ఓ దైవప్రవక్తా! అని అడిగినప్పుడు ఆయన ఇలా సమాధానమిచ్చారు: ”ఒక వ్యక్తి దగ్గర రెండు దిర్హమ్‌లు మాత్రమే ఉన్నాయి. అతనో దిర్హమ్ దానం చేశాడు. మరో వ్యక్తి దగ్గర అపార సంపద ఉంది. అతను అందులోంచి ఒక లక్ష తీసి ఇచ్చాడు. పేదవాడు ఇచ్చింది తన మొత్తం ఆస్తిలోంచి సగం అయితే, ధనికుడిచ్చింది అతని సంపదలోని కొంత”. (ముస్లిం)
దైవ మార్గంలో ఖర్చు చేయడం వల్ల కలిగే ప్రయోజనం-దానం మాధ్యమం గా సంతాన రక్షణ ప్రాప్తింస్తుంది. మనం ఎవరమయినా ఏదోకనాడు ఈ అశాశ్వత లోకాన్ని వీడి పరలోకానికి ఏగాల్సిందే. మన సంపదను, సంతా నాన్ని ఎంత ఇష్టం లేకున్నా వదలి వెళ్ళాల్సిందే.మనం మన ధనాన్ని అల్లాహ్ మార్గంలో ఖర్చు చేస్తే అల్లాహ్ మన తర్వాత మన సంతానాన్ని రక్షిస్తాడు. ఖుర్‌ఆన్‌లో సూరతల్ కహఫ్‌లో మీరు చదివే ఉంటారు. ఇద్దరు అనాథల ఆస్తిని కాపాడే నిమిత్తం అల్లాహ్ హజ్రత్ ఖిజర్ (అ)ను నియమించాడు. కారణం ఏమిటో తెలుసా? ”కాన అబూహుమా సాలిహా”-వారిరువురి నాన్న సజ్జనుడు, పుణ్యాత్ముడు. చరిత్రలో చోటు చేసుకున్న రెండు యదార్థ గాథల ను తెలుసుకుందాం!
ఆయన అయిదో ఖలీఫాగా ప్రజల నీరాజనాలందుకున్న ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ (ర). ఆయనకు మరణ ఘడియలు సమీపించినప్పుడు తన కుమారుల్ని పిలిపించి ఇలా అన్నారు: ”ప్రియ కుమారుల్లారా! నేను మీ కోసం ఎలాంటి ఆస్తిని వదలి వెళ్ళడం లేదు. కానీ, అల్లాహ్‌ను మీ కోసం వదలి వెళుతున్నాను. మీరు గనక సత్ప్రవర్తన, దైవభీతి కలిగి జీవిస్తే ఆయన మిమ్మల్ని తప్పక కాపాడుతాడు అన్న నమ్మకం నాకుంది. ఒకవేళ మీరు దర్నడతకు అలవాటు పడితే మీ వ్యవస పరిపూర్తికిగానూ నేను ఎలాంటి ఆస్తిని వదలి వెళ్ళడం లేదు అని తెలుసుకోండి”. చరిత్రకారులు భధ్ర పరచిన సత్యం ఏమిటంటే, అల్లాహ్ ఆ సజ్జన సంతానాన్ని ఎంతగా అనుగ్ర హించాడంటే వారు ఆ కాలపు కుబేరుల్లో ఎంచబడేవారు.
దీనికి భిన్నంగా – అబ్బాసీ ఖలీపా అల్ ఖాహిర్ బిల్లాహ్ -అతను రాజుగా ఉన్నప్పుడు – ఓ చెరువును తవ్వించి ఆ చెరువును వెండి బంగారాలు, వజ్ర వైఢూర్యాలు, మణిమాణిక్యాలతోి నింపేశాడు. అతను తన తర్వాతి తరాల కోసం ఆ చెరువులో దాచి ప్టిెన ధన సంపద ఎంతంటే అప్పి ప్రజల్లో దాన్ని పంచేసి ఉంటే అందరూ కోీశ్వరులయి పోతారు. కానీ అతను ధర్మాన్ని పాటించ లేదు. అధికారం చేతికందాక చెలరేగిపోయాడు. ఫలితం గా ప్రజా విప్లవం చోటు చేసుకుంది. అతన్ని ఖలీఫా పదవి నుండి తొల గించి, అతను చేసిన అఘాయిత్యాలకు శిక్షగా అతని రెండు కళ్ళలో మండుతున్న రెండు సూదులు గుచ్చి అతన్ని అంధుడిగా చేయడం జరిగింది. అతని సకల సంపదను జబ్తు చేసుకోవడంతోపాటు అతను నివసించే కోట కూడా లాక్కోవడం జరిగింది. ఒకప్పుడు నియంతలా ప్రవర్తించి బీరాలు పోయిన అతనే ఈ పరిణామాల అనంతరం బాగ్దాద్ మస్జిద్ దగ్గర నిబడి ‘అల్లాహ్‌ా మీకు ఇచ్చిన దాని లోంచి, ఏదైనా దానం చేయండి బాబూ!’ అని భిక్షమెత్తు కునేవాడు.
కాబట్టి ధర్మమార్గంలో ఖర్చు చేసే అవకాశం రావడం, ధర్మకార్యాల్లో పాల్గొనే సద్బుద్ధి కలగడం, ప్రజా సేవలో జీవించాలన్న ఆలోచన రావడం అల్లాహ్ కృప అని గ్రహించాలి. జీవితం నుండి ఎంత తీసుకున్నాము, ఎంత అనుభవించాము అన్నదాన్ని ప్రజలు మనల్ని గుర్తు పెట్టుకోరు. జీవితం నుండి ఎంత ఇచ్చామన్న దాన్ని బట్టే, ఎంత చిత్తశుద్ధి కలిగి వ్యహరించా మన్న దాని బట్టే ఇటు ప్రజల దృష్టిలో గొప్పవారుగా, అటు ప్రభువు దృష్టిలో ఆయన ప్రియతమ దాసులు మన పేర్లను పదిల పర్చుకోగలం. మనందరి మనుగడకు మార్గం ఒక్కటే. అది – ”పురములో నివసించే వారు మంచి పనులు చెస్తున్నప్పుడు మేము అలాిం పుణ్య పురిని అన్యాయంగా తుద ముట్టించము”. (ఖుర్‌ఆన్-11: 117).
ప్రాపంచిక మనుగడ మాత్రమే కాదు, పారలౌకిక మనుగడ సయితం మనం చేసే పాపం, పుణ్యాల మీదే ఆధార పడి ఉంటుంది. ప్రవక్త (స) అన్నారు”నీడ ఎక్క కారాని మాడ్చి వేసే ఎండ మహ్షర్ మైదానానిది. అక్కడ ఆ గడ్డు స్థితిలో మనిషి తన దానం నీడన ఉంాడు”. (అహ్మద్)
‘మీలో మంచోడెవరో? మీలో చెడ్డోడెవడో? నేను మీకు తెలుపనా?’ అన్నారు ప్రవక్త (స). ప్రజలు మౌనం దాల్చారు, ప్రవక్త అదే మాటను మూడు సార్లు అడిగారు. అప్పుడు వారన్నారు తప్పకుండా తెలియజేయండి ఓ దైవప్రవక్తా !అని. ”ఇతని వల్ల మంచే జరుగుతుంది, చెడు జరగదు అని ఆశించబడే వ్యక్తి మీలో మంచోడు. ఇతని ద్వారా ఎలాంటి మేలును ఆశించలేము, ఇతని చెడు నుండి రక్షణ పొంద లేము అని భావించబడే వ్యక్తి మీలో చెడ్డోడు” అన్నారు ప్రవక్త (స). (తిర్మిజీ)
వేరోక సందర్భంలో – ”నిశ్చయంగా ప్రజల్లో కొందరు మంచికి మార్గా లయి ఉంారు. చెడును నిర్మూలించే వారయి ఉంటారు. మరికొందరు చెడుకి మార్గాలయి ఉంారు. మంచిని రూపుమాపే వారయి ఉంారు. ఎవర్నయితే అల్లాహహ్ మంచికి మార్గాలుగా చేసి, వారి చేతుల మీదుగా మంచి పనులు చేయిపిస్తాడో వారికి శుభవార్త! మరెవరయితే చెడుకి మార్గా లుగా ఉంటూ, చెడు కార్యాలను, అశ్లీల విషయాలను ప్రవేశ పెడతారో వారు నాశనం అవుగాక!” అని అన్నారు. (ఇబ్ను మాజహ్)
ఎవరికి చెందాల్సిన మేలు వారికి చేరి తీరుతుంది. కానీ, ఆ మేలు చేర్చే మార్గంగా అల్లాహ్ మనల్ని ఎంచుకోవడం నిజంగా మన అదృష్టం! ఒక్క మాటలో చెప్పాలంటే అల్లాహ్‌ా మనల్ని దాతగా చూడాలనుకుంటున్నాడు. మనం ఆయన ఇవ్వగోరుతున్న, చూడగోరుతున్న ఆ స్థానాన్ని దక్కించు కోవాలి, కాపాడు కోవాలి. అలా చేయని పక్షంలో ఒఠ్ఠి రోతగా మిగిలి పోవడం ఖాయం. అల్లాహ్ మనందరిని మంచికి మార్గాలను చేయుగాక! అమీన్.