ముహర్రం

దురాచారాల నోట్లో దూది కుక్కి మార్గభ్రష్టత్వ ముఖాన మట్టి కొట్టి పంజాల పాడె శాశ్వతంగా ఎత్తి దిద్దుబాటుకు శ్రీకారం చ్టుాలి

దురాచారాల నోట్లో దూది కుక్కి
మార్గభ్రష్టత్వ ముఖాన మట్టి కొట్టి
పంజాల పాడె శాశ్వతంగా ఎత్తి
దిద్దుబాటుకు శ్రీకారం చ్టుాలి

ఎన్ని ముహర్రమ్‌లు రాలేదు ఇం
కెన్ని ఆషూరాలు పోలేదు
ఎక్కడి బ్రతుకులు అక్కడే
ఎక్కడి గొంగళి అక్కడే

ఈ ముహర్రమ్‌ మహోదయ వేళ
ఈ వసంతం నవోదయ వేళ
విప్లవ శంఖం పూరించుదాం
విజయభేరి మ్రోగించుదాం

విజయం దేనిపైన?
విప్లవం ఎందుకని?
విజయం అవిచ్చిన్నంగా సాగుతున్న అవినీతిపై
విప్లవం అసందర్భంగా రేగుతున్న అధర్మాలపై

ఈ ముహర్రమ్‌ శుభోదయ వేళ
పంచుదాం ప్రేమానురాగాలను
ఈ వసంతం దినోదయ వేళ
పాతేద్దాం ఖురాఫాతులను

ఆనాడు-
14 శతాబ్దుల కిందట
నిరంకుశత్వాన్ని అడ్డుకోవడానికి
దమన నీతిపై ధ్వజమెత్తడానికి
ప్రతిఘటన సమరం సాగింది

మరి నేడు-
14 శతాబ్దుల తర్వాత
గూడు క్టిన మూఢ విశ్వాసాలు
కొరుకుడు పడని కొంగ్రొత్త పోకడలు
వింత విడ్డూర విశృంఖలత్వాలు
సత్సమాజాన్ని కాటేసే విష వాయువులు

పంజాలకు పూలేస్తారు, పీర్లతో ఊరేగుతారు

బ్లేడ్ కా మాతం జంజీర్ కా మాతం  చేస్తారు
గల్లీల్లో గలాటాలు, బస్తీల్లో ఉరుసులు చేస్తారు
మస్తాన్‌ వలీకి రొట్టెలు విడుస్తారు
గరీబ్‌ నవాజ్‌ సమాధి పటం కట్టిపొగుడుతారు
గౌసె ఆజమ్‌ పేరు వింటేనే భయం పుట్టి వణుకుతారు!

ఇంతకీ ఎవరు?
వీరు ఎవరు?
అధర్మాల పెట్టుబడితో
అంధ విశ్వాసాల రాబడితో
మాయామంత్రాల గారడితో
దురాచారాల పేరడితో
ప్రతిమల్ని మోసుకుంటూ
మోసపుచ్చుతున్న వీరు
మనవాళ్ళే!

ఈ వ్యక్తులెవరూ మన
శత్రువులు కారు
వారిలో పేరుకుపోయిన అజ్ఞానం
ఏళ్ళ తరబడి పెనవేసుకున్న మౌఢ్యం
మార్గ భ్రష్టత్వం – వాటికి
ఆజ్యం పోసే ఆసాములు
ఇవే మన ప్రథమ శత్రువులు
అవే మన అవస్థలన్నింటికీ
కారణభూతాలు

మరీ మరీ ఉద్ఘాటిస్తున్నాను
బిద్‌అతులకి గోరీ క్టాలని
దర్గాల నుంచి దర్స్‌గాహ్‌ల వైపు రావాలని
అసత్యం చితికి చితిలో కాలి భస్మం అవుతుందని
సత్యం గెలిచి విజయఢంకా మ్రోగిస్తుందని

ఎందరడ్డుకున్నా, ఇంకెందరు వద్దన్నా
మార్పు వచ్చి తీరుతుంది. ఎందుకంటే –
కాలం పరిణామ శీలం
దాన్ని ధర్మానికనుగుణంగా మలచుకోవడమే ముఖ్యం
దురాచారాల నోట్లో దూది కుక్కి
మార్గభ్రష్టత్వ ముఖాన మట్టి కొట్టి
పంజాల పాడె శాశ్వతంగా ఎత్తి
దిద్దుబాటుకు శ్రీకారం చ్టుాలి

ఈ దురాచారాల ముళ్ళ
పరికి కంప పొదల నుండి
బైట పడటం ఎలా సాధ్యం?
అందుకొకటే మార్గం
మనమే మన ధర్మాన్ని మననం చేసుకోవాలి
అనవరతం అంతర్మధనం చెందాలి
మధురాతి మధురంగా తీర్చి దిద్దుకోవాలి
ఖుర్‌ఆన్‌ వచనాల ఓడలో
హదీసు ప్రవచనాల నీడలో

ఇదే నా ముహర్రమ్‌ అభిజ్ఞత
ఇదంతా ఓపిగ్గా విన్నందుకు
మీ అందరికీ నా కృతజ్ఞత!

Related Post