ముస్లిం గృహ మర్యాదలు

విశ్వసించిన ఓ ప్రజలారా! మీ అధీనంలో ఉన్న మీ బానిసలు గానీ, ఇంకా ప్రాజ్ఞ వయస్సుకు చేరని మీ పిల్లలు గానీ మూడు వేళల్లో మాత్రం మీ అనుమతి పొందిన మీదటే మీ వద్దకు రావాలి. ప్రజ్‌ నమా జుకు పూర్వం. మధ్యాహ్నం (జుహ్ర్‌ా) వేెళ మీరు బట్టలు విడిచినప్పుడు, ఇషా నమాజు తర్వాత! ఈ మూడు వేళలు మీరు ఏకాంతంలో ఉండే వేళలు. ఈ మూడు వేళలన్ని మినహాయిస్తే (రాక పోకలు సాగించడంలో) మీపై గానీ, వారిపైగానీ ఎలాంటి దోషం లేదు.

విశ్వసించిన ఓ ప్రజలారా! మీ అధీనంలో ఉన్న మీ బానిసలు గానీ, ఇంకా ప్రాజ్ఞ వయస్సుకు చేరని మీ పిల్లలు గానీ మూడు వేళల్లో మాత్రం మీ అనుమతి పొందిన మీదటే మీ వద్దకు రావాలి. ప్రజ్‌ నమా జుకు పూర్వం. మధ్యాహ్నం (జుహ్ర్‌ా) వేెళ మీరు బట్టలు విడిచినప్పుడు, ఇషా నమాజు తర్వాత! ఈ మూడు వేళలు మీరు ఏకాంతంలో ఉండే వేళలు. ఈ మూడు వేళలన్ని మినహాయిస్తే (రాక పోకలు సాగించడంలో) మీపై గానీ, వారిపైగానీ ఎలాంటి దోషం లేదు.

”ఓ విశ్వసించిన ప్రజలారా! మీరు మిమ్మల్ని మరియు మీ కుటుంబీకుల్ని నరకాగ్ని నుండి కాపాడుకోండి. మనుషులు మరియు రాళ్ళు దాని ఇంధనంగా ఉంటారన్న (విషయాన్ని విస్మరించకండి)”. (తహ్రీమ్‌: 6)

ఇంట్లో అల్లాహ్‌ స్మరణ:

”అల్లాహ్‌ స్మరణ చేయ బడే గృహం మరియు అల్లాహ్‌ా స్మరణ చేయ బడని గృహం ఉపమానంజీవ కళ, మరియు మరణ ఛాయ వింది” అన్నారు ప్రవక్త (స). (ముస్లిం-1859)

పిల్లలు మరియు అనుమతి:

అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: ”విశ్వసించిన ఓ ప్రజలారా! మీ అధీనంలో ఉన్న మీ బానిసలు గానీ, ఇంకా ప్రాజ్ఞ వయస్సుకు చేరని మీ పిల్లలు గానీ మూడు వేళల్లో మాత్రం మీ అనుమతి పొందిన మీదటే మీ వద్దకు రావాలి. ప్రజ్‌ నమా జుకు పూర్వం. మధ్యాహ్నం (జుహ్ర్‌ా) వేెళ మీరు బట్టలు విడిచినప్పుడు, ఇషా నమాజు తర్వాత! ఈ మూడు వేళలు మీరు ఏకాంతంలో ఉండే వేళలు. ఈ మూడు వేళలన్ని మినహాయిస్తే (రాక పోకలు సాగించడంలో) మీపై గానీ, వారిపైగానీ ఎలాంటి దోషం లేదు. (ఎందుకంటే) మీరు తరచూ ఒండొకరి దగ్గరకు వస్తూ పోతూ ఉండ వలసిన వారే. ఈ విధంగా అల్లాహ్‌ తన ఆజ్ఞల ను మీకు స్పష్టంగా విడమరచి చెబుతున్నాడు. అల్లాహ్‌ సంపూర్ణ జ్ఞాని మరియు పరిపూర్ణ వివేక వంతుడు. మరి మీ పిలల్లలు (కూడా) ప్రాజ్ఞ వయస్సుకు చేరుకున్న తరువాత వారి పెద్దలు అనుమతి పొందినట్లే వారు కూడా అనుమతి పొంది మరీ రావాలి. అల్లాహ్‌ ఈ విధంగా తన ఆదేశాలను మీకు విశద పరుస్తున్నాడు. అల్లాహ్‌యే సర్వజ్ఞాని, వివేక సంపన్నుడు. పెళ్ళి కోరిక లేని వృద్ధ మహిళలు – తమ అందాలంకరణలు ప్రదర్శించే ఉద్దేశ్యం లేకుండా – తమపై దుప్పట్ల ను తీసేసినా తప్పు లేదు. అయినా కూడా వారు జాగ్రత్త వహిస్తే అది వారికే శ్రేయస్కరం. అల్లాహ్‌ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు”. (అన్నూర్‌: 58-60)

వారి పడకలను వేరు పర్చండి:

అమ్ర్‌ బిన్‌ షుఐబ్‌ తన తండ్రితో, ఆయన తన తండ్రితో అందించిన కథనం – దైవప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ”మీరు మీ పిల్లల్ని ఏడేండ్లు నిండగానే నమాజుకై ఆదేశించండి. పదేండ్లకు చేరుకొని కూడా వారు నమాజు చేయకపోతే వారి ని మందలించండి. అలాగే వారి పడకలను వేరు పర్చండి”. (అబూ దావూద్‌-495)

ముస్లిం గృహంలో మీడియా పరికరాలు:

మీడియా అనుగ్రహము మరియు అనర్థమూను. ఈనాడు మీడియా పరికరాలు – రేడియో, పత్రికలు, వ్యాసాలు) లేని ముస్లిం ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. ఇవి ఒక ఇంటిని, ఇంటి వారిని బాగు చేయడంలో, పాడు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ప్రతి ముస్లిం వీలయినంతగా తన ధర్మాన్ని, పరివా రాన్ని వీటి కీడు నుండి కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అల్లాహ్‌ ఇలా ఉపదేశిస్తున్నాడు: ”ఓ విశ్వసించిన ప్రజలారా! మీరు మిమ్మల్ని మరియు మీ కుటుంబీ కుల్ని నరకాగ్ని నుండి కాపాడు కోండి. మనుషులు మరియు రాళ్ళు దాని ఇంధ నంగా ఉంారన్న (విషయాన్ని విస్మరించకండి)”. (తహ్రీమ్‌: 6)

ఈ పరికరాల మాధ్యమంగా చేెరవేయబడే సమాచారం క్రింద ఇవ్వబడిన విధంగా ఉంటుంది:

1) ప్రయోజనకరమయిన కార్యక్రమాలు, సమా చారం – దీని ద్వారా దాసుడికి పుణ్యం లభి స్తుంది.
2) అనుమతించబడిన కాలక్షేపం. దీని వల్ల పణ్యమూ లభించదు, పాపమూ అంటదు.
3) రేపు ప్రళయ దినాన శాపాలుగా పరిణమించే కార్యక్రమాలు, సమాచారం. కాబట్టి యుక్తిపరుడ యిన ముస్లిం ప్రధానమయిన, ప్రయోజనకర మయిన వాటి కోసం పాటు పడాలి.అనుమతించ బడిన వాటి అవసరం ఉంటే తప్ప అలవాటు పడకూడదు. నిషేధించ బడిన వాటి దరిదాపులకు సయితం పోకుండా జాగ్రత్త వహించాలి.

నిద్రకు ముందు ఇంట్లో నిద్రకు ముందు పాటిం చాల్సిన హదీసుల్లో పేర్కొనబడిన అంశాలు:

సాలిమ్‌ (ర) తన తండ్రితో, ఆయన ప్రవక్త (స) తో చేసిన కథనం-ప్రవక్త (స) అన్నారు: ”మీరు పడుకునేటప్పుడు మీ ఇళ్ళల్లో నిప్పును కాలుతూ వదలకండి”. (మత్తఫఖున్‌ అలైహి)
హజ్రత్‌ జాబిర్‌ బిన్‌ అబ్దుల్లాహ్‌ (ర) గారి కథనం – దైవప్రవక్త (స) ఇలా ప్రవచించారు:”పాత్రలకు మూత పెట్టండి. తలుపులు మూసి వేయండి. దీపాలు ఆర్పి వేయండి. కొన్ని సందర్భాల్లో చిట్టెలుక చేష్టల వల్ల ఇల్లు, ఇంటి వారు తగుల బడిపోయే ప్రమాదం ఉంది”. (సహీహ్‌ బుఖారీ – 6295)


డిజిటల్‌ సేఫ్‌ లాకర్‌ బిస్మిల్లాహ్‌:

హజ్రత్‌ జాబిర్‌ (ర) గారి కథనం – దైవప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ”రాత్రి మీరు పడుకునే టప్పుడు దీపాలు ఆర్పి వేయండి. తలుపులు మూసి వేయండి. కూజాలకు మూత పెట్టండి. ఆహార పానీయాలను కప్పి ఉంచండి”. (సహీహ్‌ బుఖారీ-5624)
ముస్లిం హథీసు గ్రంథంలో ఇలా ఉంది: ”ఒకవేళ మీలో ఎవరికయినా పాత్రపై మూత పెట్టడానికి ఏమి దొరకనప్పుపడు ఒక్క కర్రను అయినా సరే ‘బిస్మిల్లాహ్‌’ స్మరించి పెట్టగలిగితే పెట్టండి. నిశ్చయంగా చిట్టెలుక ఇంటివారి సమేతంగా ఇల్లును తగుల బెడుతుంది”.

నిద్రకు ఉపక్రమించేటప్పుడు చేసే కొన్ని దుఆలు:

హజ్రత్‌ అబూ హురైరా (ర) కథనం: ”నిశ్చయంగా దైవప్రవక్త (స) ఇషాకు ముందు పడుకోవడాన్ని, ఇషా తర్వాత మ్లాడాన్ని ఇష్ట పడేవారు కాదు”. (సహీహ్‌ా బుఖారీ)

సంకల్పానికనుగుణంగా పుణ్యం:

హజ్రత్‌ అబుద్దర్దా (ర) కథనం: ”నిద్రకు ఉపక్రమించ డానికి వస్తూ రాత్రి లేచి ప్రార్థన చేస్తానన్న సంక ల్పం చేసుకొని తర్వాత ఫజ్ర్‌ వేళ వరకు నిద్ర లేవ లేకపోతే అతని సంకల్పానికనుగుణంగా అతనికి పుణ్యం లభిస్తుంది. అతని నిద్ర అతని ప్రభువు తరఫు నుండి అతని కి సత్కార్యంగా పరిణమిస్తుంది” అన్నారు ప్రవక్త (స). (సహీహ్‌ అత్తర్‌గీబ్‌ వత్తర్హీబ్‌)

నిద్ర సన్నాహాలు:

హజ్రత్‌ అబూ హురైరా (ర) కథనం: దైవప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”మీలో ఎవరయిన తన పడక మీదకు చేెరాలను కుంటే దాన్ని-దుప్పిని బాగా విదిలించాలి. దాని లోపల ఏముందో బహుశా అతనికి తెలియక పోవచ్చు”. (సహీహ్‌ బుఖారీ-6320)

నిద్రించే, నిద్ర నుండి మేల్కొనే దుఆ:

హజ్రత్‌ హుజైఫా (ర) కథనం: దైవప్రవక్త (స) పడకపై మేను వాల్చిన మీదట ”బిస్మిక అమూతు వ అహ్యా” అనేవారు. నిద్ర నుండి మేల్కొన్న తర్వాత ”అల్‌హమ్దు లిల్లాహిల్లజీ అహ్యానా బఅద మా అమాతనా వ ఇలైహిన్నుషూర్‌” అనేవారు.

సహజ నైజం మీద మరణం: హజ్రత్‌ బర్రా బిన్‌ ఆజిబ్‌ గారి (ర) కథనం: దైవప్రవక్త (స) ఇలా ఉపదేశిం చారు: ”నీవు నీ పడక మీదకు చేరకోవాలనుకున్నప్పుడు నమాజు కోసం వుజూ చేసేలా వుజూ చేసుకో. తర్వాత నీ కుడి ప్రక్కకు తిరిగి పడుకో. పిదమ ”అల్లాహుమ్మ అస్లమ్తు వజ్హీ ఇలైక, వ ఫవ్వజ్‌తు అమ్రీ ఇలైక. వ అల్‌జ అతు జహ్రీ ఇలైక. రగ్‌బతవ్‌ వ రహ్బతన్‌ ఇలైక. లా మల్జఅ వలా మన్‌జఅ ఇల్లా ఇలైక. అల్లాహుమ్న ఆవసున్తు బికితాబికల్లజీ అన్‌జల్‌త, వ నబియ్యి కల్లజీ అర్‌సల్‌త”. ఇది చదివి ఆ రాత్రే నీకు మరణం వస్తే నీవు ప్రకృతి ధర్మంపై మరణించినట్లు. కాబ్టి నీ చివరి పలుకులు ఇవి అయి ఉండేటట్లు చూసుకో!”. ఉల్లేఖకులు అంటున్నారు -నేను ఈ దుఆ చదువుతూ ”అల్లాహుమ్న ఆమన్తు బికితాబి కల్లజీ అన్‌జల్‌త”కు చేెరుకున్న ప్పుడు ‘వ బి రసూలిక’ అన్నాను. అందుకాయన (స) లేదు, వ బి నబియ్యికల్లజీ అర్‌సల్‌త’ అనే చెప్పు” అన్నారు. (ముత్తఫఖున్‌ అలైహి)

షైతాన్‌ మంత్రిస్తాడు జాగ్రత్త!

హజ్రత్‌ అబూ హురైరా (ర) కథనం- దైవ ప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ”మీలో ఒకరు నిద్రించే సమ యంలో షైతాన్‌ అతని తల వెనుక భాగం మీద మూడు ముడులు వేస్తాడు. ప్రతి ముడి మీద ”నీ దగ్గర సుదీర్ఘ రేయి ఉంది, గాఢంగా నిద్రపో” అని మంత్రిస్తాడు. దాసుడు నిద్ర మేల్కొని అల్లాహ్‌ను స్మరిస్తే ఓ ముడి విప్పుకుంటుంది. తర్వాత వుజూ చేస్తే మరో ముడి విప్పుకుం టుంది. ఆనక అతను నమాజు చదివితే ఉన్న ఆ ఒక్క ముడి కూడా పాపంచలవుతుంది. అప్పుడు దాసుడు స్వచ్ఛమయిన మనస్సతో రెట్టింపు ఉత్సాహంతో ఉదయం చేస్తాడు. అలా జరగని పక్షంలో అశుద్ధ మనస్కుడయి, పరమ సోంబేరిలా ఉదయం చేెస్తాడు”. (ముత్తఫఖున్‌ ఆలైహి)

ఖుర్‌ఆన్‌ పారాయణం:

హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ (ర) కథనం: నిశ్చయంగా దైవప్రవక్త (స) తన సతీమణి (అబ్దుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ (ర) పిన తల్లి) హజ్రత్‌ మైమూనా దగ్గర రాత్రి బస చేశారు. ఆయన అంటున్నారు: ”సగం రాత్రి గడిచాక, దానికన్నా కొంచెం ముందు లేదా కాస్త తర్వాత – దైవప్రవక్త (స) మేల్కొన్నారు. తన ముఖం నుండి నిద్ర మత్తును దూరం చేసిన మీదట సూరతుల్‌ ఆల్‌ ఇమ్రాన్‌లోని చివరి పది ఆయతులు చదివారు”. (సహీహ్‌ బుఖారీ-183)

మిస్వాక్‌ శుభం:

హజ్రత్‌ హుజైఫా (ర) కథనం: ”రాత్రి దైవప్రవక్త (స) నిద్ర మేల్కొంటే ముఖాన్ని తుడుచుకొని, మిస్వాక్‌తో పల్లు తోమేవారు”. (మ్తుఫఖున్‌ అలైహి)

సాధారణ మర్యాదలు: 

కనీస సంస్కారం: హజ్రత్‌ అబూ హురైరా (ర) కథనం-ఆయన ఇలా అన్నారు: ‘ఓ వ్యక్తి ప్రవక్త (స) వారి గదికి గల రంధ్రం గుండా తొంగి చూస్తున్నాడని తెలుసుకున్న ఆయన చేతిలో తల గీకేందుకు ఉపయోగించే కర్ర ఉంది. అతన్నుద్దేశించి ఇలా అన్నారు: ”నువ్విలా తొంగి చూస్తున్నా వని నాకు తెలిసి ఉంటే ఈ కర్రతో నీ కంటిలో పొడిచేవాడను. నిశ్చయంగా అనుమతి కోరడం అనేది ఈ చూపు కోసమే పెట్ట బడింది” అని మందలిం చారు. (సహీహ్‌ బుఖారీ-6241)

మర్యాద ముఖ్యం:

హజ్రత్‌ అబూ మస్‌వూద్‌ (ర) కథనం- మమ్మల్ని ఉద్దేశించి ప్రవక్త (స) ఇలా అన్నారు:”మీలో ఎవరు ఇంకొరి ఇంటికెళ్ళిన ప్పుడు అనుమతి లభిస్తే, అనుమతి ఉంటే తప్ప ఇమామత్‌ చేయించడంగానీ, అధికారిగా వ్యవహరించడం గానీ, ఆ ఇంటి యజమాని ప్రత్యేక పరుపు (చాప, కుర్సీ) మీద కొలువుదీరడంగానీ చెయ్యకూడదు సుమా!”. (సహీహ్‌ ముస్లిం-1566)

మరిది వదిన పాలిట మరణం:

హజ్రత్‌ ఉక్బా బిన్‌ ఆమిర్‌ (ర) కథనం – ప్రవక్త (స) ఇలా అన్నారు: ”జాగ్రత్త! స్త్రీలున్న చోట మీరు వెళ్ళకండి”. అది విన్న అన్సారులలోని ఓ వ్యక్తి – ‘ఓ దైవప్రవక్తా! మరిది గురించి మీ అబి ప్రాయం ఏమిటి?’ (అంటే మరిది వెళ్ళొచ్చా? అని.) అందుకు ప్రవక్త (స) వారన్నారు: ”మరది (వదిన పాలిట) మరణం”. (సహీహ్‌ బుఖారీ-5232)

Related Post