జీవితం జయశీలం అవ్వాలంటే..!

 

ప్రపంచంలో ప్రతి వస్తువుకు ఒక నిర్థారిక ధర ఉంటుంది. ఏదీ ఉచితం గానూ, అయాచితంగానూ లభించదు. జీవితంలో మనం సాధించాలి అను కొన్న ప్రతి లక్ష్యానికీ కొంత మూల్యం చెల్లించక తప్పదు.

ప్రపంచంలో ప్రతి వస్తువుకు ఒక నిర్థారిక ధర ఉంటుంది. ఏదీ ఉచితం గానూ, అయాచితంగానూ లభించదు. జీవితంలో మనం సాధించాలి అను కొన్న ప్రతి లక్ష్యానికీ కొంత మూల్యం చెల్లించక తప్పదు.

జీవితం జయశీలం అవ్వాలంటే..!

తాళంతోపాటే తాళం చెవి కూడా తయారు చేయబడుతుంది, సమస్యతోపాటే దాని పరిష్కారం కూడా ఖచ్చితం ఉంటుంది అన్నట్టు శర వేగంగా మారి పోతున్న నేటి సమాజంలో వివేకవంతుడు తనకు ఎదురయ్యే అడ్డుగోడలను, ఆటంకాలను, ఆందోళనలను అధిగమించి, సమస్యలను ఎలా పరిష్కరించు కోగలడు అన్న అంశాన్మి మనిషి ఐ.క్యూ మరియు ఇ.క్యూ సంబంధిత కోణం నుండి తెలియజేయాలన్నదే ఈ వ్యాస ముఖ్య ఉద్దేశ్యం!
ఎవరికయినా ఉండేది రోజుకు 24 గంటలే. గెలిచేవాడు ఆ 24 గంటలు ప్రయతిస్తూనే ఉంటాడు. ఓడి పోయేవాడు ఆ 24 గంటలు ఎలా కష్ట పడలా అని ఆలోచిస్తుంటాడు. ప్రగతిని అశించడం, పురోభివృద్ధిని కోరుకోవడం, అభ్యుదయ బాటన పయనించాలనుకోవడం మానవ సహజ లక్షణం. చేపట్టినవృత్తిలో రాణించాలని, సమాజంలో గుర్తింపు పొందాలని, తన కంటూ కొన్ని పేజీలు చరిత్రలో ఉండాలని మనిషి ఆరాట పడటం ఈ సహజ లక్షణానికి లోబడే జరుగుతుంది. కానీ, వాస్తవ జీవితంలో ”నా దాసులలో కృతజ్ఞతాపూర్వకంగా మసలుకునే వారు బహుకొద్ది మంది మాత్రమే”. (సబా: 13) అన్నట్టు సాధకుల (Achievers) సంఖ్య తక్కుగానే కన బడుతుంది. అధిక శాతం మంది తమ దౌర్బల్యాల వల్లనో, స్వయం కృతాపరాధాల వల్లనో అనుకున్న స్థాయిని అందుకోలేక పోతున్నారన్నది ఎవరూ కాదనలేని నిజం. ఈ జాబితాలో విజయావకాశాలు అందుబాటులో లేనివారు, లక్ష్యాన్ని సాధించుకునే బుద్ధీ కుశలతలు లేనివారు, సోంబేరులు మాత్రమే కాదు, వారితోపాటు గొప్ప మేధావులు, విద్యార్హతలు, తెలివీతేటలు గలవారు సయితం ఉండటం, మంచి ఐ.క్యూ గల వారు సయితం భావా వేశాల (ఇ.క్యూ)పై అదుపు తప్పి, ఆవేశ పూరితంగా వ్యవహరిస్తూ, ఎదగ వలసిన స్థాయికి ఎదగలేక, ఎక్కడా ఒదగ లేక, ఒదిగి ఉండలేక అనామ కుల్లా మిగిలిపోవడం మిక్కిలి విచారకరం!
దీనికి భిన్నంగా చక్కనైన ఓర్పు, నేర్పు, సంయమనం, సమయపాలతో ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకుంటూ, అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి వివిధ రంగాల్లో జయశీలిగా నీరాజనాలందుకుంటున్న నిరుపేదలు, నిరక్షరాసులు ఎందరో. ఒక వైపు పట్టుదలను ప్రదర్శిస్తూ, శూన్య స్థితి నుంచి శిఖరాగ్ర స్థాయికి ఎగబ్రాకుతున్న సాధకులుంటే, మరో వైపు సోమరితనం, వ్యసనం, బలహీనత, క్షణికోద్రేకాల వల్ల ఉన్నత స్థాయికి చేరుకోలేక, ఉన్న స్థితిని కాపాడుకోలేక చతికిల పడుతున్న సాకురాయుళ్లు. ఈ సమర్థ-అసమర్థులను సరిపోల్చి పరిశీలిస్తే సాధకుల్లో ఉన్నదేంటో సాకురాయళ్లలో లేనిదేంటో ఇట్టే అర్థమయి పోతుంది. ఈ విశ్లేషణ మన జీవితాలను చక్కదిద్దుకునేందుకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, చేతులు కాల్చుకుని అనుభవం సంపాదించుకోవడం అవివేకుల రీతి. ఇతరుల అనుభ వాలను గమనిస్తూ పాఠం నేర్చుకుని లాభ పడటం విజ్ఞులు నమ్మిన నీతి.
మనలో చాలా మంది జీవితం ఏమిస్తే దాన్ని మాత్రమే తీసకొని సంతృప్తి పడుతుంటారు. కానీ బహుకొద్ది మంది మాత్రమే ఎంత కష్టమనిపించినా కడ కడలి దాక ఎడతెగక పోరాడి తమకు కావాల్సిన దాన్ని జీవితం నుండి పిండుకుాంరు. ఖుర్‌ఆన్‌ ఇలా అంటుంది: ”ప్రతి మనిషి దేని కోసం పాటు పడతాడో అది మాత్రమే అతనికి ప్రాప్తిస్తుంది. నిశ్చయంగా అతను పడిన శ్రమను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత శ్రమకు తగ్గ ప్రతిఫలం వొసగ బడుతుంది”. (దివ్య ఖుర్‌ఆన్‌- 53:39-42)

ప్రపంచంలో ప్రతి వస్తువుకు ఒక నిర్థారిక ధర ఉంటుంది. ఏదీ ఉచితం గానూ, అయాచితంగానూ లభించదు. జీవితంలో మనం సాధించాలి అను కొన్న ప్రతి (Goal) లక్ష్యానికీ కొంత మూల్యం చెల్లించక తప్పదు. జులాయిగా తిరుగుతూ, బలాదూర్‌గా బతికేస్తూ, (Useless Fellows) అనామకులుగా అంతరించిపోతే నష్టమేమీ లేదు అనుకునే అల్ప సంతోషులకు జీవితంలో పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేకపోవచ్చు. కానీ, ఉన్నత స్థితికి చేరుకో వాలనుకునే వారు, ఉత్తమ ఆశయాల పరిపూర్తికై బతకాలనుకునేవారి, తమ భవితను ఉజ్వలంగా మలచుకోవాలనుకునే వారు కష్టాలకు తట్టుకోవాలి, నష్టాలను ఒప్పుకోవాలి, విజయ అవకాశాలను ఒడిసి పట్టు కోవాలి. విజ యాన్నందించే దీక్షా, దక్షతలన పెంచుకోవాలి. బలహీనతలను, బలహీన వ్యక్తి త్వం గల వ్యక్తుల సావాసాలను తుంచుకోవాలి. వ్యసనపరులతో సంబంధాల ను తెంచుకోవాలి. ఆత్మ విస్వాసంతో, అకుంఠిత దీక్షతో, అవిరళ కృషితో, అవిశ్రాంత పరిశ్రమతో, ఓర్పుతో, నిగ్రహంతో ముందుకు సాగిపోవాలి. అలా ముందడుగు వేసినవారికి అసాధ్యాలు కూడా సుసాధ్యాలవుతాయి. అంసంభ వం సయితం సంభవం అవుతుంది. అలాిం వారే జీవితాన్ని జయప్రదంగా జీవించ గలుగుతారు. కాబ్టి మనం గెలవడంలో ఓడిపోవచ్చు. కానీ ప్రయ త్నించడంలో కాదు. గెలవాలన్న తపన, గెలవగలనన్న నమ్మకం, దాని తగ్గ, అర్హత-శ్రమ, అల్లాహ్‌ గెలిపిస్తాడు అన్న విశ్వాసం ఈ నాలుగే మనల్ని విజ యానికి సొంతం చేసే సాధనాలు.
జీవితంలో మన అభివృద్ధి, మనం సాధించే విజయావకాశాలు మన విద్యార్హ తల మీద, మేధా సంపత్తి మీద మాత్రమే ఆధార పడి ఉండదు. సానుకూల సమాజ వాతావరణం, మన యెడల సదాభిప్రాయం గల వ్యక్తులు, మన ఎదుగుదలను ఆమోదించి హర్షించే సుమనస్కులు, మన ప్రయత్నాలకు విఘాతం కలిగించకుండా అభయ హస్తం అందిస్తూ అడుగడుగునా వెన్ను దన్నుగా నిలిచే శ్రేయోభిలాషులు మన చుట్టూ ఎంత మంది ఉంటే మన ప్రయత్నాలు ఫలించడం అంతే సులువవుతుంది. దీనికి భిన్నంగా అహం భావం, క్షణికావేశంతో తనవారిని, పరాయి వారిని దూరం చేసుకుంటూ పోతే, వ్యక్తుల మధ్య ఉండాల్సిన అనుబంధాలు, సదవాహాగన అంతరించి పోతే మనం చేప్టిన కార్యం చిన్నదయినా ఆటంకాలు, ఆందోళనలు మనల్ని ముందుకు సాగనివ్వకుండా నిలువరిస్తాయి, నిలువ నీరుగా మార్చేస్తాయి. ప్రవహించే నీరుగా మనిషి నిరతం ఉండాలి, అందరి దాహం తీర్చే స్వచ్ఛమ యిన నీరల్లే తను మారాలి. అక్షరం అంకురం వింది. మన మాట ఎలాిం అక్షరాలతో కూడి ఉంటుందో,కాలంతోపాటు జనుల గుండెల్లో పెరిగే వృక్షాలు అలాంటివే అయి ఉంటాయి. తూటాకంటే శక్తివంతమయినది మాట. ఒకే మాటతో నిండు జీవాతాన్ని కాపాడ వచ్చు. ఒకే మాటతో జీవన జ్యోతిని ఆర్పి వేయవచ్చు. ఒకే మాటతో ఉన్న బంధాల్ని తెంచుకోవచ్చు, ఒకే మాటతో లేని బంధాల్ని పంచుకోవచ్చు. కాదు, కుదరదంటే మాత్రం సుమతీ పద్యం గుర్తుంచుకోవాలి!
”బలవంతుడ నాకేమని
పలువురతో నిగ్రహించి పలుకుట మేలా?
బలవంతమైన సర్పము
చలి చీమల చేతజిక్కి చావదే సుమతీ”
స్వయంకృషితో పైకొచ్చిన వారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది గానీ అహం కారం కాదు. సమాజంలో మనం ఎంత ఎత్తుకు ఎదగగలం అనేది ఎంత మంది మనల్ని వాళ్ళ భుజాలపై నిలబడనిస్తారు అన్న అంశంపై ఆధార పడి ఉంటుంది. మనకంటూ ఓ బలమయిన వ్యక్తిత్వం కావాలి. ఒకరితో మనల్ని మనం పోల్చి చూసుకోవడం మానుకోవాలి. ”వారిలోని పలు రకాల జనులకు మేము ఇచ్చిన ప్రాపంచిక జీవిత వైభవాల వైపు ఆశగా చూడకు”. (తాహా: 131)
మనుషులతో సన్నిహితంగా మెలగ గలగటం, ఎదుటి వారి మనసెరిగి వ్యవహరించ గలగటం, మనమంటే గిట్టని వారిని సయితం నొప్పించకుండా, నేర్పుతో ఒప్పించి మెప్పించ గలగటం వంటి సామాజిక కౌశలాలు (Social Skills), లౌకిక జ్ఞానం (Worldly Wisdom) పెంచుకున్న, భావోద్రేకాలను అదుపు ఉంచుకున్న వారు ఎవరయినా, ఏ రంగంలోనయినా జయప్రదం కాగలరు. గెలిచినప్పుడు విజయానందాన్ని అస్వాధించాలి. ఓడిపోయినప్పుడు ఆ చేదు ఔషధాన్ని స్వీకరించాలి. ఓడిపోయి విరామ సమయంలో ఉన్నప్పుడు ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని చదువుకోవాలి, గెలిచి తిరతారు. కష్టం అంటే ఎవ్వరికి ఇష్టం ఉండదు. కానీ ఆ కష్టాన్ని చిరునవ్వుతో అధిగమిస్తే అదే సౌఖ్యమయి మన సేవ చేస్తుంది. కష్ట పడే తత్వము, క్రమశిక్షణ కొరవడిన వారు తమ వైఫల్యాలకు రకరకాల సాకులు (Alibis) చూపిస్తూ ఉంటారు. స్వయంకృషితో పైకొచ్చిన వారిని చూసి అవాకులు, చెవాకులు పేల్చుతుం ారు. అడ్డ దారి త్రొక్కి ఉంటారనో, అక్రమార్కుల్లా వ్యవహరించి ఉంటారనో, అవకాశవాదుల్లాలా ప్రవర్తించి ఉంటారనో, ఏవేవో పుకార్లు సృష్టించి, పైశాచిక ఆనందాన్ని పొందుతుంటారు. వారు సాధించిన విజయాల వెనుక కడివెడు కష్టాలున్నాయనిగానీ, గంపెడు శ్రమ ఉందని గానీ, గరిటెడు అంకిత భావం ఉందనిగాని గ్రహించే స్థితిలో వారుండరు పాపం! మనందరి ఐ.క్యూ. ఇ.క్యూ విషయంలో మనందరికీ గొప్ప ఆదర్శం మహనీయ ముహమ్మద్‌ (స) వారి పవిత్ర జీవితం.

పోషకుడయిన తండ్రి అబ్దుల్లాహ్‌ను పుట్టక ముందే కోల్పోయారు. అన్నీ తానై తన్ను నడిపించిన తల్లి ఆరేళ్ల ప్రాయంలో అందుకోలేని లోకాలకు వెళ్లి పోయింది. పేరుకు తాత అబ్దుల్‌ ముత్తలిన్‌ ఖురైష్‌ తెగకు నాయకుడయినా ఆయనలో గల దాన గుణం కారణంగా చెప్పుకోదగ్గ ఆస్తి ఆయన దగ్గర లేదు. అయినా నిరాశ చెంద లేదు. నిశ్చేష్టుడిగా మిగిలి పోలేదు. అదుపు తప్పిన ఆవేదనతో ఆయనలో క్రియాశూన్యత చోటు చేసుకో లేదు. గొప్ప వంశంలో జన్మించినా, చేతికర్ర పట్టుకొని అయిదు సంవత్సరాల ప్రాయంలో నే లోయ, లోయా తిరిగి గొర్రెల్ని మేపాల్సి వచ్చింనందుకు ఆయన ఏనాడు ఖేద చెంద లేదు. ఎనిమిదేండ్ల వయసులో తాత దూరమయినందుకు వ్యధ చెంద లేదు. బాబాయి అబూ తాలిబ్‌ పోషణ క్రిందికి వచ్చిన తర్వాత ఖాళి భుజం మీద కాబా రాళ్ళు మోయాల్సి వచ్చినందుకు కృంగి పోలేదు. తన వయసు పిల్లలు వాళ్ల అమ్మానాన్నల ఆలనాపాలనలో అల్లారు ముద్దుగా పెంచ బడుతుంటే చూసి అసూయ చెంద లేదు. తనకు ఎదురయి ఉన్న స్థితి కి సమాజమే కారణం అని సంఘం పట్ల కసి పెంచుకోలేదు. నిండు యవ్వ నంలో కొందరి అనుచిత వైఖరికి విసుగు చెంది తీవ్రవాదం వైపు మొగ్గు చూప లేదు. చుట్టప్రక్కల ప్రాంతాల్లో బాధించ బడిన ప్రతి బాధితుని పక్షం వహించి అతనికి న్యాయం జరిగేలా చూస్తాము అన్న ఒప్పందం – ‘హిల్ఫుల్‌ ఫుజూల్‌’లో పాల్గొనడమే కాక, దైవ దౌత్యం ప్రసాదించబడిన తర్వాత కూడా ఆ ఒప్పందాన్ని గుర్తు చేసుకుంటూ -”దానికి బదులు ఎర్ర ఒంటెల్ని ఇచ్చినా స్వీకరించను. ఒకవేళ (మానవ హక్కులతో కూడిన) అలాంటి ఒప్పందంతో ఇప్పుడు నా వద్దకు ఎవరొచ్చినా నేనందులో పాల్గొంటాను” అన్నారు.
ధనార్జనే ధ్యేయంగా జీవిస్తున వారిని చూసి దారి తప్ప లేదు. మోసకారుల్ని చూసి మాట తప్ప లేదు. దైవ ప్రవక్త ధర్మబోధను చేప్టినప్పుడు అక్కడి ప్రజలు సృష్టించిన అడ్డంకులకు,పెట్టిన చిత్రహింసలకు బదులుగా వారి యెడల ద్వేషాన్ని పెంచుకోలేదు. ఆయన్ను కడతేర్చాలని కుట్రలు పన్నినా, ఆయన తన జన్మస్థలాన్ని వదిలి వెళ్ళేలా ఆర్థికంగా, మానసికంగా ఆయనపై ఒత్తిడి చేసినా వారి పట్ల పగ ప్రతీకారాలతో రగిలి పోలేదు. తర్వాత 10 సంవత్సరాల సుదీర్ఘ శ్రమనానంతరం దైవ సహాయంతో మక్కా విజేతగా ప్రవేశించినా అహంకారానికి లోను కాలేదు. ప్రపంచానికే అసలు అక్షరాస్యత ను పరిచయం చేసిన నిరక్షరాసి అయిన ఆయన జీవితాన్ని, బోధనల్ని ఆధ్యా యనం చేయడానికి నేడు ప్రపంచ వ్యాప్తంగా లక్షల కొలది పాఠశాలలు, వేల కొలది కళాశాలలు నెలకొల్ప బడ్డాయి. ఆయన చెప్పి వెళ్నిన జీవిత సత్యాల లో కొన్నింని, కొన్ని కోణాలను తెలుసుకున్న వారిని పండితులుగా పట్టా ఇచ్చి సన్మానించడం జరుగుతున్నది. అలాంటి మహితాత్ముని ప్రజ్ఞా లబ్ది (ఇ.క్యూ)తో ఎవరు పోటీ పడగలరు చెప్పండి. అయినా ఆయన ఒక్క క్షణం కోసం కూడా తన ఉద్వేగ లబ్ది (ఇ.క్యూ) విషయంలో అదుపు తప్పి వ్యహ రించ లేదు. కోపం, ధ్వేషం, గర్వం, నిరాశ, నిరుత్సాహం, దురంహాకారం విం హానికర, నకారాత్మక భావావేశాలు (Negative Emotions) తన దృష్టిని మరల్చకుండా, జీవితంలో అడుగడునా అల్లాహ్‌ ఆదేశాలకు కట్టుబడి జీవించారు. లేదని కృగి పోలేదు, ఉందని పొంగి పోలేదు. అన్నిం స్థిత ప్రజ్ఞునిగా వ్యహరించి, శక్తియుక్తులను, సమయాన్ని లోక కళ్యాణం అనే మహత్తర సంకల్పం వైపే కేంద్రీకరించి కృతకృతులయి, ఎందరికో కని విప్పును కలుగజేసి, కరుణా పిపాసులుగా తీర్చిదిద్ది కనులు మూసి కరుణా మయుని సన్నింధికి పయనమయ్యారు.
తెలివీతేటలు, ప్రజకు కొలమానమైన ఐ.క్యూ (Intelligence Quotient) అధికంగా ఉన్న మేధావులు మాత్రమే, పరీక్షని ఫస్టు క్లాసులో పాసయిన ప్రజ్ఞావంతులు మాత్రమే జీవితంలో రాణిస్తారని, పైకి వస్తారని మనందరిలో ఓ అభిప్రాయం ఉంది. సామాజిక పరిశోధకులు ఇది తప్పని తేల్చి చెప్పేశారు. సాధారణ తెలివీతేటలు గల వ్యక్తులు చాలా మంది అనేక రంగాలలో అద్భుతాలు చెయ్యడం, మేధావులు కొందరు విఫలమవుతూ ఉండటం ఇందుకు ప్రబల నిదర్శనం. ఏ రంగంలోనయినా ఒక వ్యక్తి వియవంతంగా రాణించడానికి అతని ఐ.క్యూ కేవలం ఇరవై శాతం మాత్రమే ఉపకరిస్తుంది. మిగతా ఎనభయి శాతం విజయం అతని ఆత్మ విశ్వాసం, ఉద్వేగ నియంత్రణ (Emotional Control) సాధనాపేక్ష, సామాజిక కౌశ లాలు (Social Skills) వంటి లక్షణాల పరిపక్వత కొలమానమైన ఇ.క్యూ (Emotional Quotient) మీద ఆధార పడి ఉంటుంది. విజయ సాధనలో మన ఇ.క్యూ ప్రధాన పాత్ర పోషిస్తుంది అనడం ఇసుమంతయిన సందేహం లేదు. మనిషి అతను ఎంతి జ్ఞావంతుడయినా (Intellectual) అవేశాల పైన అదుపు తప్పినప్పుడు అతని మతి చెడుతుంది. దాని వల్ల అతని గతి కూడా గాడి తప్పుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే విజయవంతంగా జీవించాలి అంటే మన స్థాయి పెరిగినకొద్దీ బాధ్యతలు అధికమయినకొద్దీ మన సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటూ పోవాలి. ఎందుకంటే క్రింది స్థాయిలో ఉన్నప్పుడు రాణించేందుకు అప్పగించబడిన పని మీద పట్టు ఉంటే చాలు. సాంకేతిక నైపుణ్యం (Tecnical Skills) సరి పోతుంది. కానీ, ఎత్తుకు ఎదిగినప్పుడు, ఉన్నత స్థానాలను అధిరోహించినప్పుడు మనం విభిన్న స్వభా వాలు గల వ్యక్తులతో వ్యవహరించాల్సి వస్తుంది. కొన్ని వేళల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది.అనేక మంది పనిని సమీక్షించి,సామూహిక కృషిని (Group Effort) లక్ష్యం వైపనకు మళ్ళించాల్సి ఉంటుంది.

ఇందుకు సాంకే తిక నైపుణ్యం ఒక్కటే సరిపోదు.సామాజిక కౌశలాలు(Social Skills) పెంచు కోవాల్సి ఉంటుంది. నాయకత్వపు లక్షణాలను (Leadership Qualities) అలవర్చుకోవలసి ఉంటుంది. ఏమోషనల్‌గా ఎదిగి, భావోద్రేకాలను అదుపులో ఉంచుకో వలసిన అవసరం ఉంటుంది. వయసు మీరి పోయింది. ఈ వయసులో నన్ను నేను మార్చుకోవడం, స్వభావ దిద్దుబాటుకి పూనుకోవడం సాధ్యం కాదు అని ఎవరయినా అంటే, అది వారి చేతకానితనానికి ఆనవాలు, సంకల్ప రాహిత్యానికి దృష్టాంతం. బాగు పడాలి అన్న బాధ, పైకి రావాలి అన్న పట్టుదల గల వ్యక్తులు ఎవరయిబనా సరే ఏ వయసులో ఉన్నా సరే మంచి మార్గంలోకి మారగలరు. దీనికి గొప్ప ఉపమానం – అంతిమ శ్వాస ఇంకాసేప్లో ఆగిపోతుందన్న సమయంలో నిజ దైవమయిన అల్లాహ్‌ను విశ్వసించిన యూద బాలుడు. అదే జీవితాంతం ప్రవక్త (స) వారికి అండగా నిలచిన అబూ తాలిబ్‌ అంతిమ శ్వాస అగే ముందు ప్రవక్త(స) ఎంత బతిమి లాడినా విశ్వసింకపోవాడానికి కారణం – లోకులు ఏమనుకుాంరన్నదే, ఈ వయసులో మార్పు అవసరం లేదన్న అభిప్రాయమే.
చివరి మాట: ఈ ప్రపంచంలో ఇద్దరే పరిసరాల్ని మరచి అనందిచ గలరు. ఒకరు పిచ్చివాళ్లు, మరొకరు చిన్న పిల్లలు. మనం మన గమ్యాన్ని చేరుకోవాలంటే లక్ష్యం సాధించాలన్న పిచ్చి కావాలి. సాధించాక ఆ విజయానందాన్ని ఆస్వాధించడానికి అహంకారం తెలియని బాల్యం కావాలి. వ్యక్తిత్వ వికాసం (Personality Development) ఒక నిరంతర ప్రక్రియ. ఆవేశాలు అదుపు చేసుకుంటూ, సామాజిక కౌశలాలను పెంచుకుంటూ, ఎమోషనల్‌ అత్యాచారానికి దూరంగా ఉంటూ, ఎదిగినకొద్దీ ఒదిగి ఉంటూ, కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటూ మార్పును నిరంతర ప్రక్రియగా చేసుకున్న వ్యక్తి సమస్యల త్సునామీలతో తలపడ గలడు, జీవన పోరాటంలో విజేతగా నిలబడ గలడు, తీసుకోవడమే కాదు, తిరిగి ఇవ్వగలడు కూడా.

Related Post