మితం – హితం

''మితం, మితం సర్వదా హితం. దాని మాధ్యమంగానే మీరు మీ లక్ష్యాన్ని చేరుకోగలరు'' అన్నారు ప్రవక్త (స). (బుఖారీ)

”మితం, మితం సర్వదా హితం. దాని మాధ్యమంగానే మీరు మీ లక్ష్యాన్ని చేరుకోగలరు” అన్నారు ప్రవక్త (స). (బుఖారీ)

”మితం, మితం సర్వదా హితం. దాని మాధ్యమంగానే మీరు మీ లక్ష్యాన్ని చేరుకోగలరు” అన్నారు ప్రవక్త (స). (బుఖారీ)
ఖర్చు విషయంలో పొదుపు, భావావేశాల విషయంలో అదుపు చాలా అవసరం అంటుంది ఇస్లాం.మనిషి ఏ విషయంలోనయినా ఆదా చెయ్యాలే గానీ, ఓదా చెయ్యకూడదు అన్నది అల్లాహ్‌ా ఆదేశం: ”ఓ ఆదమ్‌ సంతతి వారలారా! …. తినండి, త్రాగండి. కానీ మితిమీరకండి. మితిమీరి ప్రవర్తించే వారిని ఆయన (అల్లాహ్‌) ప్రేమించడు అన్నది ఖచ్చితం”. (ఇస్రా: 31)
పై ఆయతులో ఇస్రాఫ్‌ అన్న పదం వాడబడింది. ఇస్రాఫ్‌ అంటే సంక్షేమ హద్దుల్నిదాటి సంక్షోభ హద్దుల వైపు వెళ్ళడం. దుబారా అనే మాట ఎక్కువ శాతం డబ్బు విషయంలో వాడబడినప్పికీ, శృతి మించి వ్యవహరించడం అనేది మనిషి ప్రతి మాట, ప్రతి చేష్ట విషయంలోనూ జరుగుతుంది. అతి ఒక్క అన్నపానీయాల విషయంలో మాత్రమే కాదు మనిషి సకల వ్యవహారా ల్లోనూ ఉంటుంది. అలాగే హక్కుల విస్మరణను సయితం అరబీలో సరఫ్‌గా వ్యవహరిస్తారు. అంటే ఓ వ్యక్తి ఆలుబిడ్డల్ని బాగానే చూసుకుంటున్నాడు గానీ, అమ్మానాన్నలను ప్టించుకోవడం లేదంటే అతను మితిమీరుతున్నాడు. ఖర్చు ప్టోల్సిన చోట ఖర్చు ప్టోల్సిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టడం, లేదా అసలు ఖర్చు పెట్టక పోవడం రెండూ మితిమీరడం (ఇస్రాఫ్‌) క్రిందికే వస్తాయి. ఇక ఖర్చు పెట్టకూడని చోట ఒక్క పైసా ఖర్చు ప్టిెనా అది వృధా ఖర్చు క్రిందికి వస్తుంది. ”బంధువుల, నిరుపేదల, ప్రయాణీకుల హక్కును వారికి ఇస్తూ ఉండు. వృధా ఖర్చు చేయకు. నిశ్చయంగా వృధా ఖర్చు చేసే వారు షైతాను సోదరులు. మరి షైతానేమో తన ప్రభువుకు కృతఘ్నడు”. (ఇస్రా: 26,27)
పై రెండు వచనాల్లో ఆర్థిక, వైద్య శాస్రాలు ఇమిడి ఉన్నాయి. ఇదే అర్థాన్ని ఇచ్చే ప్రవక్త (స) వారి ప్రవచనం: ”మీకిష్టమైనది (ధర్మసమ్మతమయినది) తినండి. మీకు నచ్చిన వాిని తొడగండి. కాని రెండు విషయాలకు మాత్రం దూరంగా ఉండండి. అవేమంటే: 1) అతి 2) గర్వం”. (సహీహ్‌ బుకారీ)
అతి దానం వల్ల దిక్కుమాలిన స్థితికి లోనయినవారు కొందరు. అతి లోభం వల్ల అప్రతిష్ట పాలైనవారు కొందరు. అతి కోపం వల్ల నష్టపోయిన వారు కొందరు. అతి ఆశ వల్ల నిందల పాలైన వారు కొందరు. అతిశయిల్లడం వల్ల అపమార్గం పాలైన వారు ఎందరో! అతి ఎక్కువయినా తక్కువయినా మన గతి మాత్రం తప్పడం ఖాయం. కాబ్టి ఖుర్‌ఆన్‌ ఇలా ఉపదేశిస్తుంది: ”నీ చేతిని నీ మెడకు క్టి ఉంచకు. (పరమ పిసినిగొట్టుగా కూడా తయా రవ్వకు). అలాగని దానిని విచ్చలవిడిగానూ వదలి పెట్టకు. (ఉన్నదంతా ఊరి కి పంచి పెట్టకు).నువ్వు అలా చేశావంటే నిందల పాలవుతావు, దిక్కుమాలిన స్థితికి లోనయి కూర్చుాంవు”. (ఇస్రా: 29)
దానికి బదులు మనిషి ప్రతి విషయంలోనూ మితాన్ని పాించడమే అన్ని విధాలా హితం అని నొక్కి వక్కాణిస్తుంది: ”వారు ఖర్చు పెట్టే సమయంలో కూడా అటు మరీ దుబారా ఖర్చు చేయకుండా, ఇటు మరీ పిసినారితనం కూడా చూపకుండా – రెండింకీ మధ్య – సమతూకాన్ని (మిత విధానాన్ని) పాటిస్తారు”. (అల్‌ ఫుర్‌ఖాన్‌: 67)

దుబారా ఖర్చు గురించి ప్రముఖుల అభిప్రాయం:

”ఇహంలో ఎవరు ఎంత పుష్టిగా భోంచేస్తారో వారు పరలోకంలో అంతే ఆకలికి గురవుతారు” అన్నారు హజ్రత్‌ సల్మాన్‌ ఫారసీ (ర).(ఇబ్ను మాజహ్‌)
”కింకి ఇంపైనదల్లా తినేయడమే అతి” అన్నారు హజ్రత్‌ అనస్‌ (ర),
”అల్లాహ్‌ా విధేయతా మార్గంలో పది వేల దిర్హమ్‌లు ఖర్చు చేసినా అది దుబారా క్రిందికి రాదు. దైవ అవిధేయతా మార్గంలో ఒక్క దిర్హమ్‌ ఖర్చు చేసినా అది వృధా ఖర్చుగా పరగణిమచబడుతుంది” అన్నారు ముజాహిద్‌ (ర)
”న్యాయ బద్ధమయిన రీతిలో సంపాదించి ఖర్చు పెట్టకూడని చోట ఖర్చు పెట్టడమే వృధా ఖర్చు” అన్నారు ఇమామ్‌ మాలిక్‌ (ర).
”అల్లాహ్‌ా హక్కుల విషయంలో విస్మరణ కూడా అతికి పాల్పడటమే” అన్నారు ఇయాస్‌ బిన్‌ ముఆవియా.
”వృధా కార్యాల్లో, దుబారా ఖర్చులో మంచి లేదు. మంచి కార్యం ఏదీ వృధా కాదు” అన్నారు ఇబ్ను ఆషూర్‌ (రహ్మ).

దుబారా ఖర్చు ఎందుకు చేస్తారు?

1) సంపన్న కుటుంబంలో జన్మించడం. 2) లేమి తర్వాత కలిమి లభించ డం.3) దుబారా ఖర్చు దొరలతో సావాసం చేయడం. 4) ఆలు బిడ్డలు ఒత్తిడి చేయడం. 5) తర్వాత చోటు చేసుకునే పరిణామాల పట్ల అవగాహన లేకపోవడం. 6) పరలోక జీవితం వియంలో విస్మరణకు లోనవ్వడం. 7) స్వయం సుఖానికి అలవాటు పడటం. 8) పాోపం కోసం. 9) ధర్మ అవగాహనా రాహిత్యం. 10) హృదయ కాఠిన్యం. 11) సామాజిక స్పృహ లోపించడం. ఉదాహరణకు-సంపన్న వర్గాలు జరిపే పెళ్ళి ఖర్చుతో (వందల కోట్లలో ఉంటుంది గనక) పది గ్రామాలను దత్తకు తీసుకోవచ్చు. ధనికులు జరిపే పెళ్ళి ఖర్చుతో వెయ్యి జంటలకు ఉచితంగా వివాహం చెయ్యవచ్చు. మధ్యతరగతి వారు చేసే పెళ్ళి ఖర్చుతో యాభై మంది పేద జంటల పెళ్లి జరించవచ్చు. ఎవరి సొమ్ము వారిష్టం అని చెప్పొచ్చు. దానం చెయ్యాల్సి అవసరం ఏముంది? అని అడగవచ్చు కూడా. ఇదే విధమయిన వాదన పూర్వం ప్రవక్తతో కూడా చేశారు. ”వారిలా అన్నారు: ‘ఓ షుఐబ్‌! మేము మా తాతముఆత్తతలు పూజిస్తూ వస్తున్న దైవాలను వదలి ప్టోలనీ, మా సొమ్ములను మా ఇష్ట ప్రకారం ఖర్చు పెట్టడం మానుకోవాలనీ నీ నమాజు నీకు ఆజ్ఞాపిస్తొందా? నువ్వు మరీ ఉదాత్త హృదయునిలా, రుజువర్తనునిలా ఉన్నావే”. (హూద్‌: 87) ఇదంతా ఒకే రోజులో జరిగే అనవసరపు ఖర్చు కాబ్టి. ఎవరి సొమ్ము వారిష్టం అయినా – అది వారి పాలిట ఇహ పరాల అరిష్టంగా మారకూడదు కాబట్టి.

దుబారా ఖర్చు వల్ల కలిగే అరిష్టాలు:

1) అప్పుల పాలవడం ఖాయం. 2) హృదయ కాఠిన్యం చోటు చేసుకుం టుంది. 3) స్వార్థ చింతన అధికమయి సాత్వికత లోపిస్తుంది.4)ఆర్థిక సంక్షో భాల్లాింవి చోటు చేసుకున్నప్పుడు పరిస్థితులకు తాళ లేక ఆత్మహత్య చేసుకుాంరు.5) మనిషి ఆలోచనా ధార తప్పుత్రోవ పడుతుంది. 6) అగత్య స్థితి దాపురిస్తుంది.

7) తర్వాతి తరాల హక్కుల అపహరణ జరుగుతుంది. 8) అల్లాహ్‌ ప్రసన్నతకు దూరం అవుతారు. 9) అల్లాహ్‌ా ఆగ్రహానికి లోనవు తారు. ”మేము ఏదైనా ఒక పట్టణాన్ని నాశనం చెయ్యాలని సంక ల్పించుకు న్నప్పుడు, అక్కడి శ్రీమంతులకు (కొన్ని) ఆజ్ఞలు జారీ చేస్తాము. కానీ వారేమో అందులో అవిధేయతకు పాల్పడతారు. ఆ విధంగా వారిపై (శిక్షకు సంబంధించిన) మాట నిరూపితమవుతుంది, ఆపై మేము ఆ పట్టణాన్ని సర్వ నాశనం చేస్తాము”. (బనీ ఇస్రాయీల్‌: 16) అతికి మొదట స్థితిమంతులు ఒడిగడితే వారిని అనుకరిస్తూ స్థితి గతి లేని వారు కూడా అతికి పాల్పడ తారు. అప్పుడు సమాజంలో చెడుగు సర్వ సామాన్యం అయి పోతుంది. అప్పుడు అందరూ శిక్షకు అర్హులవుతారు.
8) ప్రళయ దినాన ఎక్కడ నుంచి సంపాదించామో, ఎక్కడ ఖర్చు ప్టోమో వివరణ ఇచ్చుకోనంత వరకూ అడుగు ముందుకు వేయ లేము.

Related Post