షేక్ రియాజ్
అ ల్లాహ్ మనిషిని స్వేచ్ఛా జీవిగా సృష్టించాడు. మనిషి ఈ స్వేచ్ఛను విని యోగించుకుని మంచి లేదా చెడు మార్గాలను అవలంబించవచ్చు. ”మరి మేమతనికి (మంచి, చెడుకు సంబం ధించిన) రెండు మార్గాలను చూపాము”. (అల్ బలద్ :10)
మరో చోట అల్లాహ్ ఇలా సెలవిస్తు న్నాడు: ”మేమతనికి మార్గం కూడా చూపాము. తద్వారా అతను కృతజ్ఞుడు అయినా కావచ్చు లేదా మేలును మరచిన వాడైనా కావచ్చు”. (అద్ దహ్ర్: 3)
సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ మానవునికి శక్తియుక్తులను, స్వేచ్ఛా స్వాతంత్య్రాలనిచ్చి ఇట్టే వదలిపెట్టలేదు. అతని మార్గదర్శనం కొరకు గొప్ప ఏర్పాట్లు చేశాడు. ప్రవక్తలను పంపి, గ్రంథాలను అవతరింపజేసి, వీరి ద్వారా సన్మార్గం ఏదో, దుర్మార్గం ఏదో చాలా చక్కగా వివరించాడు.
ఎవరైతే దైవవిధేయతా మార్గాన్ని అవలంబిస్తారో వారు స్వర్గ సౌఖ్యాలను అనుభవిస్తారు. మరెవరైతే దైవ తిరస్కార మార్గమైన దుర్మార్గాన్ని అవలంబిస్తారో వారు భగభగమండే నరకాగ్నికి ఆహుతి అవుతారు. కాబట్టి మానవులందరూ పరలోకంలోని శాశ్వతమైన సుఖ సౌఖ్యాల జీవనం కొరకు ఇహలోకంలో ఒకే ఒక్క సృష్టికర్త అయిన అల్లాహ్‌ాను విశ్వసించి, ఆయన చూపిన మార్గాన్ని ఎన్నుకొని ఆయనకే విధేయతను చూపుతూ, ఆయన వారించిన నిషిద్ధ (హరామ్) పనులకు దూరంగా ఉంటూ సహనంతో జీవనం గడపాలి. మనిషి కూడా వస్తూ ఉంటాయి. అదే విధంగా మంచితోపాటు చెడు కూడా వస్తూ ఉంటుంది. కాని నిజమైన విశ్వాసి (ముస్లిం) యొక్క లక్షణం ఏమిటంటే, మంచిని ఆస్వాదించి చెడు నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. సృష్టికర్త అయిన అల్లాహ్ తన దాసులను పాపాల నుండి రక్షణ పొందేందుకు ఎన్నో హెచ్చరికలు చేశాడు. ముందు జాగ్రత్తలు, సూచనలను సూచించాడు.
ఆదం హవ్వా (అ)లు తప్పు చేయటం వల్లనే స్వర్గం నుంచి తీసివేయబడ్డారు
పాప కారణంగానే మన మాతాపితలైన ఆదం, హవ్వా (తి)లను స్వర్గం నుంచి తీసివేయడం జరిగిందన్న విషయాన్ని ప్రతి మనిషీ ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండాలి. చివరికి షైతాన్ వారిని పెడ తోవ పట్టించి అక్కడి (స్వర్గం) నుంచి బయటికి తీసివేయించాడు. మేము వారిని ఇలా ఆదేశించాము: ”దిగిపోండి. మీరు ఒండొకరికి శత్రువులు. ఒక నిర్ణీత కాలం వరకు భూమిపైనే ఉండి మీరు లబ్ది పొందవలసి ఉంది”. అప్పుడు ఆదం (తి) తన ప్రభువు నుంచి కొన్ని మాటలు నేర్చుకుని పశ్చాత్తాపం చెందారు. అల్లాహ్ ఆయన పశ్చాత్తాపాన్ని ఆమోదిం చాడు. నిశ్చయంగా ఆయన పశ్చాత్తా పాన్ని స్వీకరించేవాడు, కరుణించేవాడు కూడాను”. (అల్ బఖరా: 36, 37)
అల్లాహ్ వినేవాడు, చూచేవాడు
పాపాల నుండి చాలా సులువుగా తప్పించుకోవచ్చు. అదెలా సాధ్యం? అని సందేహపడుతున్నారా! నాకు చెవులిచ్చిన ప్రభువు నా మాట వినకుండా ఉంటాడా? నాకు కండ్లనిచ్చిన ప్రభువు నేను చేసే పనులను చూడకుండా ఉంటాడా? అనే భావనను మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి.
ఉదాహరణకు:- షాపింగ్ మాల్‌లో సీసీ కెమెరాలుంటే దొంగతనం చేయాలను కునే దొంగకు కెమెరాల ద్వారా తనను చూస్తున్నారు అనే భయం అతనిలో చోటు చేసుకుంటే ఇక అతను దొంగ తనం చేయగలడా?
”భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువును గురించి అల్లాహ్‌ాకు తెలుసన్నది నీవు చూడటం లేదా? నాల్గవ వాడుగా అల్లాహ్ లేకుండా ఏ ముగ్గురి మధ్య కూడా మంతనాలు జరుగవు. అరవ వాడుగా అల్లాహ్‌ా లేకుండా ఏ ఐదుగురి మధ్య కూడా (రహస్య మంతనాలు సాగవు.) అంతకన్నా తక్కువ మంది ఉన్నా, ఎక్కువ మంది ఉన్నా, వారెక్కడ ఉన్నా – ఆయన (జ్ఞానపరంగా) వారితో ఉంటాడు. మరి వారు చేసుకున్నవన్నీ ప్రళయ దినాన వారికి తెలియపరుస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ అన్నీ తెలిసిన వాడు”. (అల్ ముజాదల:7)
కాబట్టి ఎవరిలోనయితే ”నన్ను సృష్టించి, పోషించి, పాలించే ప్రభువైన అల్లాహ్ ఎప్పుడూ నా వెంట ఉన్నాడు. నా ప్రతి క్రియను చూస్తున్నాడు. నా ప్రతి మాటను వింటున్నాడు. నా చూపుల చౌర్యాన్ని గమనిస్తున్నాడు. నా హృద యంలోని వాటిని సయితం ఎరిగిన వాడు” అనే భావన ఉంటుందో అటువంటి మనిషి పాప కార్యాలు ఎలా చేయగలుగుతాడు? తన ప్రభువు పట్ల కృతఘ్నతకు ఎలా పాల్పడగలుగుతాడు? ”అల్లాహ్‌ా కళ్ళలోని మోసాన్ని, గుండెల్లోని గుట్టును సయితం (బాగా) ఎరిగినవాడు”. (అల్ మూమిన్: 19)
దైవ దూతలు రికార్డు తయారు చేస్తున్నారు
మనిషి తను చేసే ప్రతి పనిని, తను పలికే ప్రతి పలుకునూ దైవ దూతలు వ్రాస్తున్నారు. రేపు ప్రళయ దినాన వీటిని బట్టి లెఖ్క తీసుకోబడుతుంది. ఆ తర్వాత స్వర్గమో, నరకమో ఖరారు చేయబడు తుంది. ఈ విషయాన్ని ప్రతి వ్యక్తీ స్మరించుకుంటూ ఉండాలి. ”నిశ్చయంగా మీపైన పర్యవేక్షకులు నియమితులై ఉన్నారు. (వారు మీ కర్మలను నమోదు చేసే) గౌరవనీయులైన లేఖకులు. మీరు చేసేదంతా వారికి తెలుసు”. (అల్ ఇన్ఫితార్: 10-12)
వేరొక చోట అల్లాహ్ ఇలా సెలవిస్తు న్నాడు: ”మేమే మనిషిని సృష్టించాము. వాడి మదిలో మెదిలే ఆలోచనలు సయితం మాకు తెలుసు. మేమతని ప్రాణనాళం కంటే కూడా అతి చేరువలో ఉన్నాం. అతని వద్దకు వెళ్ళిన ఇద్దరు దైవదూతలు అతని కుడి, ఎడమల వైపు కూర్చొని ఉంటారు. మనిషి నోట ఒక మాట వెలువడటమే ఆలస్యం అతని దగ్గర ఒక పర్యవేక్షకుడు (దాన్ని నమోదు చేయటానికి) సిద్ధంగా ఉంటాడు”. (ఖాఫ్: 16-18)
పాపం చేెసే ముందు మృత్యువును గుర్తు చేసుకోవాలి
పాపానికి పాల్పడే ముందు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటే కూడా తలపెట్ట బోయే పాపం నుండి మనల్ని రక్షించుకో వచ్చు. ఎందుకంటే మరణం ఒక పచ్చి నిజం. అది ఎక్కడ, ఎప్పుడు, ఎలా సంభ విస్తుందో కూడా ఎవరికీ తెలియదు. దాన్నుండి ఎవ్వరూ తప్పించు కోలేరు.
”ప్రతి ప్రాణీ మృత్యువు రుచి చూడ వలసినదే. ప్రళయ దినాన మీరందరూ మీ కర్మల పూర్తి ఫలితాన్ని పొందుతారు. అప్పుడు ఎవడు నరకాగ్ని నుండి కాపాడబడి, స్వర్గంలో ప్రవేశం కల్పించ బడతాడో అతడు నిశ్చయంగా సఫలీ కృతుడయ్యాడు. ప్రాపంచిక జీవితమైతే ఒక మాయా వస్తువు తప్ప మరేమీ కాదు”. (ఆలి ఇమ్రాన్: 185)
సోదరులారా! మనిషి పాపం చేస్తున్న ప్పుడు విశ్వాసం నుంచి తిరిగి పోతాడు.అవిశ్వాస స్థితిలో ఉంటాడు. ఒకవేళ పాపం చేస్తున్న సమయంలోనే మరణం సంభవిస్తే ఇక అతని పరిస్థితి ఏమిటి? ఎవరు అతనిని రక్షిస్తారు? పశ్చాత్తాపం చెందే సమయం కూడా దొరకదాయె!
మన శరీరావయవాలు మనకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయి
ఒకవేళ మనం పాపాలకు పాల్పడితే రేపు ప్రళయం రోజు మన శరీరా వయవాలైన కాళ్ళూ, చేతులు, నోరు, చర్మం మొదలగునవి అల్లాహ్‌ా ముందర సాక్ష్యమిస్తాయన్న సంగతి ఆలోచిస్తూ ఉండాలి. ”ఆ విధంగా వారు నరకాగ్నికి చాలా సమీపంలోకి రాగానే వారి చెవులు, వారి కళ్ళూ, వారి చర్మాలు సయితం వారు చేస్తూ ఉండిన పనుల గురించి సాక్ష్యమిస్తాయి. ”మీరు మాకు వ్యతిరే కంగా ఎందుకు సాక్ష్యమిచ్చారు”? అని వారు తమ చర్మాలనుద్దేశించి అడుగు తారు. ”అన్ని వస్తువులకు మాట్లాడే శక్తిని చ్చిన అల్లాహ్‌యే మాకు మాట్లాడే శక్తిని ప్రసాదించాడు. మరి ఆయన వైపునకే మీరంతా మరలించబడతారు” అని అవి సమాధానమిస్తాయి.(హామీమ్ అస్సజ్దహ్: 20,21)
ప్రళయం రోజున పాపాత్ములు పశ్చాత్తాపంతో కుమిలి పోతారు.
ఇహలోకంలో సృష్టికర్త అయిన అల్లాహ్‌ా ను, ఆయన ప్రవక్తలను, గ్రంథాలను తిరస్కరించి తన ఇష్టమొచ్చినట్లు పాపాల మీద పాపాలు చేస్తూ పోయే వ్యక్తి మరణ సమయంలోగానీ, ప్రళయ దినానగాని పశ్చాత్తాపంతో అల్లాహ్‌ను వేడుకుం టాడు. కాని ఏం లాభం? ఆ రోజు ఆ పశ్చాత్తాపాన్ని ప్రభువైన అల్లాహ్ అంగీ కరించడు. తిరిగి సత్కార్యాలు చేసే దానికి భూలోకంలోకి పంపించ డమూ జరుగదు. ”చివరికి వారిలో ఎవరికైనను చావు వచ్చినప్పుడు ‘ఓ మా ప్రభూ! నన్ను వెనక్కి పంపించు. నేను వదలి వచ్చిన లోకంలోకే వెళ్ళి సత్కార్యం చేస్తాను” అని అంటాడు. ముమ్మాటికి అలా జరుగదు. అది అతను అంటున్న ఒక మాట మాత్రమే. వారు మళ్ళీ సజీవులై లేచే రోజు వరకూ వారి వెనుక ఒక అడ్డు తెర ఉటుంది”. (అల్ మోమినూన్: 99,100)
వేరొక చోట ఇలా ఉంది: ”ఆ రోజు దుర్మార్గుడైన వ్యక్తి తన చేతులు కొరుక్కుంటూ ఇలా అంటాడు: ”అయ్యో! నేను దైవప్రవక్త మార్గాన్ని అనుసరించి ఉంటే ఎంత బాగుండేది! అయ్యో! నా పాడుగాను! నేను ఫలానా వ్యక్తిని స్నేహితునిగా చేసుకోకుండా ఉంటే ఎంత బాగుండేది! నా వద్దకు ఉపదేశం వచ్చిన తర్వాత కూడా వాడు నన్ను అపమార్గం పట్టించాడే! ఎంతెనా షైతాను మనిషికి (అదను చూసి) ద్రోహం చేసేవాడే”. (అల్ ఫుర్ఖాన్: 27-29)
పాపాలు శాపాలకు గురవుతాయి
పాపాల వలన మనిషి పరువు పోయి, నలుగురిలో నవ్వుల పాలవుతాడు. ఇంకా శాపానికి గురి అవుతాడు. ”ఇస్రాయీలు సంతతిలోని అవిశ్వాసులు దావూదు నోట, మర్యం పుత్రుడైన ఈసా నోట శపించబడ్డారు. ఎందుకంటే వారు అవిధే యతకు పాల్పడేవారు. హద్దు మీరి ప్రవర్తించేవారు”. (అల్ మాయిదా: 78)
శపించబడటం అంటే, దైవ కారుణ్యా నికి, శ్రేయోసాఫల్యాలకు దూరంగా ఉంచటం అని భావం. ఈ శాపానికి రెండు కారణాలు: 1) అల్లాహ్ విధించిన వాటిని నెరవేర్చకుండా ఉండటం. హరాం (నిషిద్ధ) విషయాల వెంట పడటం. 2) ధర్మం విషయంలో అతిశ యిల్లటం. లేనిపోని వాటిని ధర్మంలో జొప్పించి, దాని రూపురేఖలను మార్చి వేయటం.
(అహ్సనుల్ బయాన్ – తెలుగు – పేజీ: 524)
సోదర సోదరీమణులారా! పాపాలన్నిం టిలో అతి ఘోరమైన, క్షమించరాని పాపం సర్వ లోకాలకు ఒకే ఒక్క సృష్టికర్త అయిన అల్లాహ్‌ాను విశ్వసించకుండా, ఆయన సృష్టించిన సృష్టితాలను ఆయనకు సహవర్తులుగా (షిర్క్) చేయడటం. రెండవది: దేవుడు విధించిన ఆజ్ఞలను పాటించకుండా (హరాం) నిషిద్ధ మైన పనులు చేయటం. ఎవరైతే ఇటు వంటి పాపాలకు పాల్పడుతున్నారో వెంటనే ఆ పాపాలను వదిలేసి పశ్చాత్తాపం చేసుకొని పైన తెలిపిన విషయాలను గనక ప్రతి వేళ గుర్తు చసుకుంటూ జాగ్రత్తను వహిస్తే ఇన్షాఅల్లాహ్‌ా పాపాల నుండి రక్షణ పొందవచ్చు.