బాధ్యత అనే బరువు ఒక వ్యక్తిపై మోపడం జరిగిందంటే దానికి తగ్గ బాధ్యతా భావనను, దాన్ని సజావుగా నిర్వర్తించగలిగే శక్తియుక్తులను సయితం ప్రకృతి సిద్ధంగా ప్రసాదించడం జరుగుతుంది. బాధ్యాతాయుతమయిన వ్యక్తి ఏది అనాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా ఒకటి రెండు సార్లు ఆలోచించి మరి అంటాడు, చేస్తాడు. కానీ ముస్లిం-ముస్లిమేతర వర్గానికి చెందిన అనేక మంది ప్రముఖులు బాధ్యతా రహితంగా, వారి స్థాయికి తగని విధంగా వాఖ్యలు చేస్తూ, ప్రకటనలు ఇవ్వడం విచారకరం. ముఖ్యంగా పరదాకు సంబంధించి. ‘ఇస్లాం స్త్రీల హక్కుల్ని అపహరించిందని, ఆమెను వంటింటి కుందేలును చేసిందన్నది’ వీరి వాదన.
అశ్లీలమనేది అట్టహాసంగా వికటాట్టాహాసం చేస్తున్న నేటి తరుణంలో, నీతికి విలువ, నాతికి వలువ కరువయినా నేటి సమాజంలో, మనిషిలోని మనసులోన నిదుర పోయే దానవునికి చురక పెట్టి మరి లేపి, బురద కోర్కెలు జల్లే వర్తకం ఉద్రుత స్థాయికి చేరుకున్ననేటి ఆధునికంలో ఇలాంటి వ్యాఖ్యలు వినబడటం వింతేమి కాకపోవచ్చు. కానీ దాని వల్ల వాస్తవం తన విలువ కోల్పోయిందని గానీ, సత్యం తన ఉనికి కోల్పోయిందనిగాని ఎంత మాత్రం కాదు. యదార్థం ఏమిటంటే పరదా పడతుల పాలిట ప్రకృతి పిలుపు.
వలపు వగరును, తలపుల తలుపులను నియంత్రణ లో ఉంచే కంచె పరదా. ఆరోగ్య సమాజ చిహ్నం పరదా. సంస్కారవంత జీవనానికి జీవనాడి పరదా. సర్వ మతాలలో సమాంతరంగా ఉన్న ఏకాంకం పరదా. స్వయంగా ఇటు హైందవ స్త్రీగానీ, యూద, క్రైస్తవ మహిళగానీ సంస్కారవంతమయిన దుస్తుల్నే ఇష్ట పడటం మనం గమనిస్తాం. పరదా అన్నది పడది ప్రగతిలో ప్రతిబంధకం ఎంత మాత్రం కాదు, పైగా అన్ని విధాల శ్రేయస్కరం. ”తద్వారా వారు చాలా తొందరగా (మర్యాదస్తులుగా) గుర్తించబడి, వేధింపులకు గురి కాకుండా ఉంారు. అల్లాహ్‌ా క్షమించే వాడు, కరుణించేవాడు”. (అల్ అహ్జాబ్: 59) ఈ ఆయతు దృష్ట్యా కలకంఠి పాలిట నిలువెత్తు కారుణ్యం పరదా.
స్త్రీపరుషుల్లో రక్షణ అవసరం స్త్రీలకే అధికంగా ఉంటుంది. ప్రవక్త (స) ఇలా ప్రవచించారు. ”ప్రపంచం ఒక ప్రయోజనకర సంపద. ప్రపంచలోని ప్రయోజనకర సంపదల్లోకెల్లా అత్యుత్తమసంపద సుగుణవతి అయిన స్త్రీ”. (ముస్లిం)
స్వయంగా అల్లాహ్ విధానం కుడా ఏమిటంటే, వస్తువు విలువ, నాజూకు తనాన్ని బట్టి ఆ వస్తువు రక్షణ ఏర్పాటు చేస్తాడు. ఉదాహరణకు – మనిషి శరీరంలో అత్యంత విలువైనది, నాజూకయినది మెదడు. అలాంటి మెదడును బలమయిన ఎముల పుర్రె నడుమ సురక్షితంగా ఉంచాడు అల్లాహ్. అదే మనిషి చేతుల కాళ్ళకు ఇలాంటి ఏర్పాటు మనం చూడము. దీనికి భినంగా మెదడును చాలా పాటిష్ఠమయిన, సురక్షితమయిన చోట ఉంచడం జరిగింది. గుండెకాయను ప్రక్కటెముకల నడుమ ఉంచడం జరిగింది. దానికి మంచి పద్ధతిలో రక్షణ లభించాలని. కళ్ళపై కనురెప్పలను ఉంచి కంటికి కాపలాదారునిగా చెయడం జరిగింది. ఒంటకి చర్మాన్ని తొడిగించడం కూడా ఇదే కారణంగా జరిగింది. మన ఇంటి గుమ్మానికి పరదా వ్రేలాడదీయడం వెలకాల కూడా ఇదే ఉద్దేశ్యం దాగుంది. అలా అని ఆయా వస్తువులను అవమానించట్లా? కాదు, నిజంగా వాటి విలువను, గౌరవాన్ని మరింత ఇనుమడింపజేయడమే!
తోలు లేకుండా మామిడి పండుని చేసి ఉంటే ఈగలు, ఇతర క్రీమికీటకాల నుండి తప్పించుకుని మనిషి వరకు చేరేది కాదు. బియ్యం, గోధుమల మీద పొట్టు లేకపోతే దాని ఆహారం మార్చుకోవడం మనిషికి సాధ్యమ య్యేది కాదు. అంతెందుకు ఒక దేశంలో సగటు పౌరుడు ఇష్టమొచ్చి చోట ఇష్టమొచ్చినప్పుడు తిరిగినట్లు ఒక మినిష్టర్, ఒక ప్రెసిడెంట్ తిరగ లేడు. సెక్యూరిటీ సంబంధిత సవా లక్ష సమస్యలుాంటాయి. అంటే అతన్ని అవమానించినట్టా , గౌరవించినట్టా? గౌరవించనట్లేగా. సెక్యూరిటీ గాడ్స్ దేశ ప్రధానికి రక్షణ, పొట్టు ధాన్యానికి రక్షణ, తోలు పండ్లకు రక్షణ, పుర్రె మెదడుకు రక్షణ, ప్రక్కటెముకలు గుండెకు రక్షణ, కనురెప్పలు కంటికి రక్షణ, పరదా పడతికి రక్షణ, ఇది ఆమె హక్కుల భక్షణ కాదు, ఆమె పాలిట నిలువెత్తు రక్షణ,
వ్రీడ బరువుకు వాలి ఉండే పడతి కనులకు బరి తెగించి చంచలంగా చూపు కలిపే విద్యను, పెళ్ళి, పెద్దరికం లేకుండా సహజీవనం చేసే పాడు బుద్ధిని నూరి పోసేవారు అభినేత్రులు, మహిళా హక్కుల సంఘానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటే, సిగ్గు సిరిని వదిలి వేసి, మానం మర్యాదను తగలేసి, మాననీ మణి శీల కుసుమాన్ని అంగడిలో అమ్మకానికి పెట్టక ఇంకేం చేస్తారు?
భారత రాజధాని ఢిల్లీలో నిర్భయ సంఘటనతోపాటు అటువిం లైంగిక వేధింపులకు సంబంధించిన అనేక సంఘటనలు జరిగినప్పు అక్కడి పోలీసు కమిష్ణర్ ఒకరు – ‘మహిళలు బిగువయిన దుస్తులు ధరించి, పాతిక, ముప్పాతిక నగ్న దుస్తులు ధరించి షాపింగ్ మాల్, కళాశాల, పాఠశాలలకు వెళ్ళ కూడదు’ అని ఓ నిబంధనను ప్రవేశ పెడితే, మహిళా హక్కుల సంఘాలన్ని గగ్గోలు పెడుతూ రోడ్డుకెక్కాయి. చివరికి తన నిబంధనను వెనక్కి తిసుకోవాల్సి వచ్చింది పాపం! ”ఇంటిలోన పూల వనమై వెల్లి విరియాల్సిన, ఉత్తమ పౌరుల్ని దేశానికి అందించాల్సిన వసంత రుతువును కాల రాయగ రేగుతాము,కూలదోయగ బూనుతాము” అంటే ఏం చేస్తామండీ!? గాఢమయిన ఓ నిట్టూర్పు తప్ప. ప్రకృతినీ నమ్మము, ఏ సంస్కృతినీ నమ్మము అనే దుష్కృతి ధ్వజవాహకులతో, వికృత మనస్కులతో వాదించి ఏం ప్రయోజనం చెప్పండీ!