ఈద్ అంటే సంగీతం, నృత్యాలు కాదు. అసభ్య ఆటపాటలు కాదు. వ్యర్థ మనోరంజక కార్యకలాపాలు కాదు. పైశాచిక ఆనందం, వికృత చేష్టలు అసలే కాదు. పండుగంటే కరుణామయుడైన అల్లాహ్‌ా పట్ల కృతజ్ఞతలు తెలియజేయడం, ఆయన ప్రసాదించిన వరాలను గుర్తిం చటం, ప్రభువు కరుణాను గ్రహాలను ప్రదర్శించటం, విశ్వాసుల నమ్మ కాలను స్థిర పరచటం, ఇస్లాం ధర్మాన్ని బల పర్చటం, శాంతి విఘాత కులు సృష్టించే అడ్డంకులను అవలీలగా తొలగించుకోవటం.
పండుగ రోజు కార్యక్రమాలు
ప్రతి ముస్లిం ఫిత్ర్ పండుగ నమాజుకు ముందు కొంత అల్పాహారం తీసుకోవాలి. అది ఉపవాస దీక్ష విరమణ సమయంలో తినే ఖర్జూర పండే కావచ్చు. ఇకపోతే, రమజాన్ నెలలో ఉపవాస దీక్ష విరమణ సమయంలో జరిగిన తప్పులకు, పొరబాట్లకు బదులుగా ఈ రోజు నిరు పేదలకు ‘జకాతుల్ ఫిత్ర్’ దానం చెల్లించాలి. ఇది పేదల్లో సంతోషాన్ని తెస్తుంది. ముస్లింలలో పరస్పరం దయ, సహకార గుణాలను పెంపొం దిస్తుంది. హృదయాలను శుద్ధి చేెస్తుంది. వారిలో పిసినారితనాన్ని అరి కడుతుంది.
కొత్త బట్టలు ధరించటం, సువాస పూసుకోవటం, పండుగ నాటి కార్యక్రమాలలోని అంతర్భాగమే. అల్లాహ్‌ా కారుణ్యాన్ని అర్థం చేెసుకునే సాధనమే పండుగ. అల్లాహ్‌ా అత్యంత సుందరుడు. సౌందర్యాన్ని ఆయన ఇష్టపడతాడు. కనుక సింగారమూ పండుగలో అంతర్భాగమే! అల్లాహ్‌ా అనుగ్రహాలను ప్రదర్శించే సమయమే ఈ పండుగ.
”అల్లాహ్ తన దాసునికి అనుగ్రహం ప్రసాదించినప్పుడు ఆ మనిషిపై తన అనుగ్రహం తాలూకు ప్రభావం కనిపించటాన్ని ఆయన ఇష్ట పడ తాడు” అని దైవ ప్రవక్త (స) ప్రవచించి ఉన్నారు. పండుగ ఒకరినొకరు కలుసుకునే సమయం. అభినందనలు తెలుపుకునే సందర్భం. పర స్పరం ప్రేమాభిమానాలు పంచుకునే శుభ ఘడియ. కనుక పండుగ రోజు బంధుమిత్రులతో సంబంధాలు నెలకొల్పాలి. తల్లిదండ్రుల పట్ల ప్రేమానురాగాలు చూపాలి. పేదల పట్ల దయ కనబర్చాలి. పొరుగు వారి పట్ల సానుభూతి కలిగి ఉండాలి. ఇస్లామీయ పండుగ ఈ విష యాలన్నిటినీ తన అనుయాయులకు పదే పదే ప్రబోధిస్తుంది.
ఇస్లామీయ పరిధుల్లో ఉంటూ ఆనంద సంబరాలను జరుపుకోవాలని ఇస్లామీయ పండుగ మనకు బోధిస్తుంది. ఇస్లామీయ పరిమితులకు లోబడి ఆహ్లాదాన్ని అనుభవించవచ్చంటుంది. వినయవిధేయతలు నిండిన క్రీడలను, ఇతరులకు ఏ మాత్రం హాని కలిగించని ఆటల్ని ఆనందించమంటుంది. ధార్మిక పరిమితులను గౌరవిస్తూ విహార సంతో షాన్ని ఆస్వాదించమంటుంది. సృజనాత్మకతను పెంచే కథలు విని హర్షించమంటుంది. ”గొప్ప సమీకరణ దిన”మైన పరలోక ప్రతి ఫల దినాన్ని తలపించే మహత్తర సందర్భం ఇది. వేలాది మంది ధనవం తుల్ని, పేదవారిని, పెద్దలను, పిన్నలను, పాలకులను, ఆనందంలో ఉన్నవారిని, బాధలు అనుభవిస్తున్న వారిని ఒకచోట చేరుస్తుంది పండుగ రోజు.
ఈద్ అనేది అల్లాహ్ తరఫున బహుమతులు అందుకునే రోజు. పరి పూర్ణ విశ్వాసంతో, పుణ్యఫలాపేక్షతో ఉపవాసాలు పాటించిన వారికి, పండుగ ఓ గొప్ప బహుమానం. ఘన మైన విజయం. మహా కానుక. దీనికి భిన్నంగా ఉపవాస సమయంలో పాపాలు చేసి, అల్ల్లాహ్‌ా హద్దుల నతిక్రమించి, ఆయన ఆజ్ఞల్ని నిర్లక్ష్యం చేసినవారు తమ తప్పు తెలుసు కొని పశ్చాత్తాప పడవలసిన దినమూ ఇదే. మరి అది ఏం తీవ్రమైన నష్టమో కదా?!
పండుగ రోజున నమాజు ముగించుకొని తిరిగి వచ్చేవారికి రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకరు – ఆ రోజు అల్లాహ్‌ా తరఫున బహు మతులు పొంది ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకునేవారు. పరమ ప్రభువైన అల్లాహ్‌ా ఇటువంటి వారిని ఉద్దేశించి, ”వెళ్ళండి, నేను మిమ్మల్ని క్షమించాను. మీరు నేనంటే ఇష్ట పడ్డారు. నేనూ మీరంటే ఇష్టపడ్డాను” అని అంటాడు.
ఇక రెండవ వర్గం వారు రమజాన్ మాసపు సర్వ శుభాలూ పోగొట్టు కున్న దౌర్భాగ్యులు. వీరు నష్టాలతో, పరితాపంతో అన్నీ కోల్పోయి అసంతృప్తులై తిరిగి వస్తారు.
కొంత మంది అరఫాత్ ప్రాంతం నుంచి గుర్రాలపై, ఒంటెలపై పరు గులు తీస్తున్నారు. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ (ర) వారిని చూసి, ”గుర్రాలు లేక ఒంటెలపై స్వారీ చేసి పరుగు పందెంలో గెలిచినవారు విజేతలు కారు. ఎవరి పాపాలయితే మన్నించబడ్డాయో వారే నిజమైన విజేతలు” అని చెప్పారు.
ఓ ముస్లిం! గత సంవత్సరం నీతోపాటు ఈద్ నమాజ్ చేసిన వారిని కాస్త గుర్తు తెచ్చుకో. వారిలో నీ తాతలు, తండ్రులు, నీవు ప్రేమించిన వారు, నీ బంధుమిత్రులూ ఉన్నారు కదూ! వారిలో కొందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏమైపోయారూ? రేపు నీకు బహుమతి ఇవ్వబడ నుంది. రేపు నీ కర్మల పత్రంలో నీ ఆచరణకు పరిపూర్ణ ప్రతిఫలం దాయబడు తుంది. అందులో కేవలం మంచి మాత్రమే నమోదు చేయ బడేందుకు గట్టిగా కృషి చేయి సుమా! అల్లాహ్‌ా అనుగ్రహాన్ని, ఆయన మన్నింపును, ఆయన క్షమాభిక్షను పొంద గలిగే రేపటి గొప్ప పండుగ దినం కోసం ఎదురు చూడు మరి!
”పతి ప్రాణీ మృత్యువు రుచి చూడ వలసిందే. ప్రళయ దినాన మీరు అందరూ మీ కర్మల పూర్తి ఫలితాన్ని పొందుతారు. అప్పుడు ఎవడు నరకాగ్ని నుంచి కాపాడబడి, స్వర్గంలో ప్రవేశం కల్పించబడతాడో అతడు నిశ్చ యంగా సఫలీకృతుడయ్యాడు. ప్రాపంచిక జీవితమైతే ఒక మాయావస్తువు తప్ప మరేమీ కాదు సుమా!” (ఖుర్‌ఆన్-3: 185)