Originally posted 2013-04-18 09:26:24.
సమాజం మనముందున్న అద్దం వంటిది. అందులో నిత్యం మనం, మనం చేసే పనులూ పత్రిబింబి స్తూనే ఉంటాయి. మనమే సరిగ్గా గమనించం. నిశితంగా పరిశీలిస్తే మన స్వరూపమేమిటో మనకర్థమ వుతుంది. కొంత వరకయినా మన పరిస్థితులను, మనో స్థితులను బాగు చేసుకునే అవకాశం ఉం టుంది. మనం చేసిన మంచి తాలూకు అభినందనలు మరణానంతరం కూడా మనకు అందుతూనే ఉంటాయి. మనం చేసిన చెడు తాలూకు శిక్షలు కారడవిలో దాక్కున్నా, కాటి మట్టిలో కలిసిపోయినా అను భవించక తప్పదు అన్న సత్యాన్ని మనం గహ్రించాలి.
జబ్బు పడినవారికి చికిత్స ఎంత అవసరమో, సలహా అడిగే వారికి మంచి సలహా అంతే అవసరం. ”నీకు నీ సోదరునిపై గల హక్కుల్లో-అతను నీ నుండి మంచిని (సలహాను) ఆశిస్తే, నువ్వు అతని శేయ్రాన్ని కోరుతూ మంచి సలహా ఇవ్వాలన్నది ఒకటి” (ముస్లిం) అన్న అంతిమ దైవపవ్రక్త ముహమ్మద్ (స) వారి మాటల్లోని ఆంతర్యం ఇదే. మనమిచ్చే సలహాల ద్వారా ఎదుటి వారు బాగు పడాలి. వారు పగ్రతి పథాన పయనించాలి. అయితే ‘చెప్పేవాడికి వినేవాడు లోకువ’ అన్నట్టు ఎడాపెడా ఏది పడితే అది చెప్పెయ్యకూడదు. గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది ఆ బాధేంటో – వండి తినేవాడికేం తెలుస్తుంది? ఆ గుడ్డు మరింత పెద్దగా పెడితే బాగుంటుందని, మూడింతలు పెడితే ఇంకా బాగుంటుందని, బంగారు గుడ్డ్డు పెడితే మరింత బాగుంటుందని సలహాల మీద సలహాల తుంపర్లు కురిపించడం వల్ల ఎలాంటి పయ్రోజనం లేదు.
కొందరుంటారు…అనుభవజ్ఞులు, జీవితాన్ని కాచి వడబోసినవారు; సలహాలు అడిగినా ఇవ్వరు. వీరి తత్వం ఏమిటంటే, మేమెంతో కష్ట పడి చేతులు కాల్చుకుని ఈ స్థాయికి వచ్చాము. మాలాగా వారూ కష్టాలు-నష్టాలు చవి చూడని అనే రకం. చితమ్రేమిటంటే వీరు సొంత సంతాన విషయంలో సయితం ఇదే ధోరణి కలిగి ఉంటారు. నిజమే కదా అనిపించినా, నిశితంగా ఆలోచిస్తే ఇది పైశాచిక మనస్తత్వం అన్నది పచ్చి నిజం.
ఇంకొందరుంటారు…వారిచ్చే సలహాల వల్ల వారికి మాతమ్రే ఉపయోగం. ఎదుటివారు చేసే పత్రి పని తమకు అనుకూలంగా మారాలని, తమకు మాతమ్రే లాభసాటిగా ఉండాలని కోరుకునే వీరు, ఎదుటి వ్యక్తి కష్టనష్టాలను పట్టించుకోరు. పోనీలే, వారికయినా మేలు జరుగుతుంది కదా అనుకంటే ‘తప్పులో కాలేసినట్లే’. కష్టాల్ని-నష్టాల్ని కోరి తెచ్చుకున్నట్లే.
మరో రకం మనుషులుంటారు…’చేసేది చెడు పనులు, చెప్పేది శీర్రంగ నీతులు’ అన్న చందంగా వ్యవహరిస్తుంటారు. సాధారణంగా ఇటువంటి వ్యక్తుల మాటలు జనాలు వినరు. ‘వీడే ఒక వెధవ, వీడి మాటలు ఎవరికి కావా’లంటారు. ఈ విధంగా మాటలకు చేతలకు మధ్య వైరుధ్యం కనబరచే వారినుద్దే శించి అంతిమ దైవగంథం ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ా ఇలా పశ్న్రిస్తున్నాడు: ”ఓ విశ్వసించిన వారలారా! మీరు చేయనిదాన్ని గురించి ఎందుకు చెబుతారు. మీరు చేయనిదాన్ని గురించి (నీతులు) చెప్పడం అల్లాహ్ సమక్షంలో ఎంతో గర్హనీయమైనది”. (అస్సఫ్: 2,3)
అయితే, ‘ఉన్‌జుర్ మా ఖాల వలా తన్జుర్ మన్ ఖాల’ – ఏం చెప్పబడుతుందో దాన్ని చూడుగానీ, ఎవరు చెబుతున్నారన్న దాన్ని చూడకు అన్నట్టు – చెడ్డవాడు చెప్పినా నీతి నీతే కదా! ఓ సందర్భంగా దైవ పవక్త (స) వారు చెప్పిన మాట గమనార్హం! ‘అతను అసత్యవాదే కానీ; అతను చెప్పింది మాతం సత్యం’. మనం సయితం గులాబీ చెట్టు నుండి పువ్వును మాతమ్రే తీసుకుంటాం. ముళ్ళను కాదు కదా! కాబట్టి ‘నీతి మాటలు, నీతి కథలు’ ఎవరు చెప్పినా స్వీకరించడం పెద్దరికం అన్పి,చుకుంటుంది.
అంతిమంగా- ఒఠ్ఠి సలాహాలు ఇచ్చేవారు, ఒఠ్ఠి నీతులు వల్లించేవారు శుద్ధ కార్యశూన్యులయి ఉంటారు; పని చెయ్యడం కష్టమని వీరికి తెలిసినంతగా ఇంకెవ్వరికి తెలియదు గనక. అయితే వీరు పడే శమ్ర ఒకటుందోయ్! బాగా కష్ట పడేవారెవరా అని తెలుసుకొని మరీ వెళ్ళి సలహాలిచ్చేస్తుంటారు. ఏమిటి, కష్ట జీవులంటే, శామ్రికులంటే వీరికి ఇంత అభిమానమా? అని మురిసి పోదురూ! అసలు సంగతేంటంటే, కృషీవలులు సఫలీకృతులయితే ‘తమ సలహా వల్లనే’ అని డప్పాలు కొట్టుకోవడానికి. అదే వారు పరా జయం పాలయితే ‘తమ సలహాను విననందుకే’ ఇలా అయ్యారని పచ్రారం చేసుకోవడానికి. ఒక్క మాట లో చెప్పాలంటే, ఎదుటి వారు బాగు పడితే తమకు పేరు వస్తొంది కదా! లేకపోతే పోనీ, చెడిపోయేది ఎదుటి వారే కదా! అనుకునే రకం అన్న మాట.
ఇలా నేటి మన సమాజంలో అల్పులు, అసూయపరులు, స్వార్థపియ్రులు, అలగా జనాలు మన చుట్టూ చేరి కాకుల్లా ఎందుకు పనికిరాని హంగామా చేస్తుంటారు. కనుక కాకి గూటిలో కోకిల లాగా జాగత్త్రగా మసలుకుంటూ సమయాసన్నం కాగానే వారి బారీ నుండి బయట పడాలి. అనుభవజ్ఞులైన శేయ్రోభ లాషుల్ని సంపద్రించడంతోపాటు మనదైన ఆలోచన సరళిని, సమస్య పరిష్కార దృష్టిని అలవర్చుకోవాలి. మనం బాగుండాలి; అందరూ బాగుండాలని కోరుకోవాలి. మనసున్న మనీషిగా మన జన్మను అర్థవంతం గా సార్థకం చేసుకోవాలి.
అత్యాశకు పోయి అభాసుపాలు కావొద్దు నిరాశతో నిన్ను నీవు నిర్వీర్యుణ్ణి చేసుకోవద్దు.
పక్కవాని చూసి వాతలు పెట్టుకోవద్దు నీ పనిని పేమ్రించు! నీ పభ్రువుని పూజించు!!