తెల్లవారితే సాయంత్రానికై నిరీక్షించకండి. నేడే…ఈ క్షణం పైనే దృష్టిని నిలపండి. గతించిన మంచీ చెబ్బరలను తలచుకుని కృంగిపోకండి. ఇంకా – రాని భవిష్యత్తును తలచుకుని ఊహాలోకాల్లో విహరించకండి. మీ ఆయుషు ఈ ఒక్క రోజే. మీకు దొరి కింది ఈ ఒక్క పొద్దే. నేడే పుట్టినట్లు, ఈ నాటి కోసమే పుట్టినట్లు, ఈనాడే తనుమ చాలిస్తున్నట్లు ఒకసారి మీ మనసులో ఊహించుకోండి. ఈ ఆలోచన వచ్చిన ప్పుడు మీ జీవితం గతకాలపు నీలి నీడల కు, భవిష్యత్కాలకు, ఆశలకు, అభిలాషల కు మధ్య ఊగిసలాడుతున్నట్లు మీకనిపి స్తుంది.
మీరు మీ శక్తియుక్తుల్ని, తెలివితేటల్ని, సర్వస్వాన్ని నేటి కోసం ధారబోయండి. నేటి మీ ఆరాధనల్లో అశక్తత అణకువ అభివ్యక్తమవ్వాలి. మీ ఉపాసనల్లో వినయ వినమ్రతలు తొణికిసలాడాలి. గ్రంథ పారా యణంలో యోచనతో పాటు భక్తీ పారవ శ్యం పరవళ్ళు త్రొక్కాలి. మీరు ఏది విన్నా జాగ్రత్తగా, సావధానంగా వినాలి. మీ ధ్యానంలో ఏకాగ్రత ఉట్టిపడాలి. మీ వ్యవ హారాల్లో సమత్వం, సమతూకం ఉండాలి. నేటి మీ దినచర్యను చక్కగా విభజించు కోండి. నిమిషాలను సంవత్సరాలుగా, సెక న్లను మాసాలుగా పరిగణించండి.
మేళ్ల విత్తనాలు నాటండి. పరోపకారం చే యండి. పాపాల మన్నింపు కోసం ప్రార్థిం చండి. దైవనామాన్ని స్మరించండి. ప్రయా ణ సామాగ్రిని సిద్ధం చేసుకోండి. ఇలా చేస్తే నేటి మీ దినం సాఫీగా, ఆహ్లాదకరం గా గడుస్తుంది. మీ మనసు కుదుట పడు తుంది. మీ కంటికి కునుకు పడుతుంది. మీ జీవనోపాధి మీకు తృప్తినిస్తుంది. మీరు మీ ఆలుబిడ్డల, ఆప్తుల మధ్య ఆనందంగా ఉండగలుగుతారు. మీ జీవితానికి సార్థకత లభిస్తుంది. ”నేను ఇచ్చిన దానిని (సంతో షంగా) పుచ్చుకో. కృతజ్ఞుడవై ఉండు”.(దివ్యఖుర్‌ఆన్- 7:144)
నేడు మీకు లభించిన ఈ రోజు సుఖంగా గడిచిపోవాలి. దుఖం, ఆవేదన, ఆందో ళన, కలవరం, వ్యాకులత, అసూయ, అక్కసు, ఓర్వలేనితనం మీ దరికి చేర కూడదు సుమా! మీరు మీ మనోఫలకంపై ఒకే ఒక వాక్యం లిఖించుకోండి – ” నేడే. ..ఈనాడే”. నేడు మీకు స్వాదిష్టమైన భోజ నం లభిస్తే నిన్నటి చద్దన్నం వల్ల మీకు ఎలాంటి హాని కలగదు. నేడు మీకు చల్లని మంచినీరు లభ్యమైనపుడు నిన్నటి ఉప్పు నీటిపైగానీ, రేపటి కలుషితనీటిపై చింతిం చవలసిన పనేమిటి? మీరు గనక వజ్ర సంకల్పులై ఉంటే – ఈ రోజు నాది. ఏ మంచి పనిచేసినా ఈ ఒక్క రోజే చేసు కోవాలి” అని తలంచుకుంటారు. అప్పుడు ఈనాటి ఒక్కొక్క గంటను, ఒక్కొక్క ఘడి యను సద్వినియోగం చేసుకుని, దాన్నుండి లబ్ది పొందటానికి యత్నిస్తారు. అప్పుడు మీరే అంటారు-ఈ రోజు నేను నా నోటిని అదుపులో పెట్టుకుంటాను. చెడు అనను. చాడీలు చెప్పను. దుర్భాషలాడను. దురు సుగా మాట్లాడను. నా ఇల్లును, నా ఆఫీసు ను నీటుగా సర్దుతాను. ఏ పనినీ పెండింగ్ లో పెట్టను. ప్రతిదీ సజావుగా నెరవేరు స్తాను. ఈ రోజు కోసం స్నానాలు ముగిం చుకుని చక్కని దుస్తుల్ని ధరిస్తాను. తైల సంస్కారం చేసుకుంటాను. మాటల్లోనూ – చేతల్లోనూ సమన్వయం సాధిస్తాను. నమా జుయందు మనసును లగ్నం చేస్తాను. దివ్యఖుర్‌ఆన్ పారాయణం చేస్తాను. పుస్త కాలు తిరగవేస్తాను. ఎందు కంటే నా జీవనం ఈ ఒక్క రోజే కదా! అందుకే హృదయమనే నందనవనంలో శుభాల మొక్క నాటుతాను. కీడు, కుట్ర, అసూయ, అహంకారం, అవినీతి, దురను
మానం లాంటి చెడులను కూకటి వ్రేళ్లతో పెకలిస్తాను. నా బ్రతుకు నేటితో ముగు స్తుంది- అందుకే ఇతరులను మేలు చేకూ రుస్తాను. సాటి జనులతో సద్వ్యవహారం చేస్తాను. నా ఉనికి వల్ల ఎవరికీ కీడు జర గనివ్వను.
నా ఆయుషు ఈ ఒక్క దినమే. అందుకే రోగులను పరామర్శిస్తాను. అంత్యక్రియల లో పాల్గొంటాను. మృతుని వారసులను ఓదారుస్తాను. దారి తప్పిన వారికి దారి చూపుతాను. ఆకలిగొన్న వానికి అన్నం పెడతాను. కష్టాల్లో ఉన్న వారి కష్టాలను దూరం చేస్తాను. బాధితులకు అండగా నిలబడతాను. అభాగ్యులకు చేయూత నిస్తా ను. బలహీనుల కొరకు సిఫారసు చేస్తాను. దుఖితులను పలకరిస్తాను. విద్వాంసులను ఆదరిస్తాను. దీనులపై దయచూపుతాను. పెద్దలను గౌరవిస్తాను.
నా జీవన యాత్ర నేటితో ముగుస్తుంది. అందుకే ఓ భూతకాలమా! ఆగకు, వెళ్ళి పో. పోయి సూర్యుని మాదిరిగా అస్తు మించు. నీ అస్తమయంపై నేనెంత మాత్రం దుఖించను. క్షణ కాలం కోసం కూడా నిన్ను స్మరించుకోను. ఎందుకంటే నీవు గతించావు. నా నుండి దూరమైపో యావు. నీవిక ఎన్నటికీ తిరిగి రావు.
ఓ భవిష్యత్కాలమా! నీవు అగోచర అవస్థ లో ఉన్నావు. అందుకే నీగురించి అట్టే కలలు గని ప్రయోజనం లేదు. నువ్వింకా ప్రభవించలేదు. అలాంటప్పుడు నిన్ను వెం టాడి సాధించేదేముంటుంది?
ఓ మానవుడా! నేటి ఈ దినమే సౌభాగ్య నిఘంటువులోని అత్యుత్తమ వాచకం. దీన్ని గురించి ఆలోచించిన వాడే జీవితంలోని సౌందర్యాన్ని, సౌకుమార్యాన్ని పరమార్ధాన్ని తనివితీరా ఆస్వాదించ గలుగుతాడు.
(ఆధారం: డా. ఆయిజ్ అబ్దుల్లాహ్ అల్ ఖర్‌నీ గారి ”లా తహ్‌జన్ ” పుస్తకం)