విజయం మనదే; కానీ….!

victory

విజయం మనదే! మొదటిలో ప్రపంచం నిన్ను గుర్తించదు, తరువాత నిన్ను చూసినవ్వుతుంది, నీమీద యుద్దంచేస్తుంది. కానీ చివరికి నువ్వే గెలుస్తావు అంటాడు గాంధీజీ.

1) STOP WORRYING: చింతలకు స్వస్తి చెప్పండి – జరిగిపోయిన దాని గురించి గానీ, జరగబోయే దాని గురించిగానీ చింత పడటం మానుకోవాలి. దాని వల్ల మంచి కన్నా చెడే ఎక్కవ జరుగుతుంది. కొత్త ఆలోచనలను, సృజనాత్మకతను కోల్పోతాము.

2) ENERGIZE YOURSELF: శక్తిసామర్థ్యాలను పెంచుకోండి – ఎప్పటికప్పుడు మనల్ని మనం ఉత్తేజ పర్చుకుంటూ, మనలోని స్కిల్స్‌ను పెంచుకునే ప్రయత్నం చేయాలి. నిరాశ నిస్పృహలకు లోను కాకూడదు.

3) LOVE YOURSELF: స్వీయ గౌరవం – “IF YOU DON’T RESPECT YOURSELF, DON’T EXPECT OTHER TO RESPECT YOU”

మనల్ని మనం గౌరవించుకోనప్పుడు, ఇతరులు మనల్ని గౌరవిస్తారనుకోవడం అవివేకం అవుతుంది. కాబట్టి మనల్ని మనం ఏనాడు తక్కువగా అంచనా వేసుకోకూడదు. మన వ్యక్తిత్వాన్ని, మన కుటుంబాన్ని, మన మత ధర్మాన్ని, మన పరిసరాల్ని, దేశాన్ని మనం ప్రేమించాలి.

4) FEEL ASSERTIVE:నిక్కచ్చిగా ఉండండి – మొహమాటానికి పోయి మొదటికే మోసం తెచ్చుకో కూడదు. నిర్మోహమాటంగా, నిర్భయంగా చెప్పదలచుకున్నది సూటిగా, స్పష్టంగా చెప్పాలి. మనం తప్పు చేస్తే తప్ప, మనల్ని చులకన చేసే హక్కు ఎవరికీ లేదు.

5) EXCUSE CRITICS:విమర్శకులను క్షమించండి -మనం ఎందులోనూ పరిపూర్ణులం కాదు కాబట్టి మనం చేసింది మంచి పనే అయినా విమర్శించేవారు కొందరు ఉండనే ఉంటారు. తప్పు ఉంటే దిద్దుకోవాలి. లేదంటే క్షమించాలి.

6) BE SELF CONFIDENCE: మన వెంట ఎవరున్నా లేకపోయినా ఆత్మవిశ్వాసం ఉండాలి. బ్రతుకు బండిని నడిపే ధనం లేకపోయినా ఫర్వాలేదు ధర్మ రథాన్ని లాగగలిగే ధైర్యం ఉండాలి. మన మీద మనం విశ్వాసాన్ని పెంచుకోవాలి.

7) THINK POSITIVE: సాత్విక దృక్పథం అలవర్చుకోండి – సకారాత్మకంగా, సానూకూలం గా ఆలోచించడం అలవాటు చేెసుకోవాలి. నకరాత్మక ఆలోచనల వల్ల ఎన్నో సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

8) EXCEL YOURSELF: అద్భుతాలు చేయండి – జీవితంలో మనం సాధించిన చిన్న చిన్న విజయాలతో తృప్తి చెందకూడదు. మరిన్ని గొప్ప కార్యాలు చేసేందుకు ప్రయతిస్తూనే ఉండాలి.

9) EVALUATE YOURSELF: మీ స్థాయిని గుర్తించండి – లక్ష్యసాధనలో మన వల్ల తెలిసో తెలియకో తప్పులు జరగవచ్చు. వాటిని ఇతరులు అలుసుగా తీసుకోవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని బట్టి మారడానికి ప్రయత్నించాలి. ఆత్మస్తుతికి స్వస్తి పలికి ఆత్మ పరిశీలన చేెసుకోవాలి. ఎప్పటికప్పుడు మన బలగాలను, బలహీనతలను బెరీజు వేసుకుంటూ ఉండాలి.

10) MOTIVATE YOURSELF: ప్రేరణ కలిగించుకోండి – స్వీయ గౌరవానికి ఇది వెన్నుముక లాంటిది. ఎవరో వస్తారనీ ఏదో ప్రేరణ కలిగిస్తారని ఎదురు చూడటం నిష్ప్రయోజనం అన్న సత్యాన్ని గుర్తించి స్వయం ప్రేరణ కలిగించుకోవాలి. విజయం మనదే.

Related Post