వ్యాధి ఓ గీటురాయి

10624801_680138215435434_1371347804156934618_n

ఇస్లాం ప్రకృతిసిద్ధమయిన ధర్మం. దాని సూత్రాలు, నియమాలు అన్నీ ప్రకృతిసిద్ధంగానే ఉంటాయి. కాబట్టి వ్యాధి ఆపద కాదు. అది అల్లాహ్‌ పరీక్ష. అది మన శ్రేయోసాఫల్యాలకు, మోక్ష సాధనకు మార్గం. దైవ ప్రవక్త (స) ఇలా తెలియజేశారు: ”అల్లాహ్‌ ఎవరికి ప్రయోజనం చేకూర్చాలని తలుస్తాడో వారిని కష్టాలకు గురి చేసి పరీక్షిస్తాడు”. (ముఅత్తా ఇమామ్‌ మాలిక్‌)

 

‘ప్రవక్త (స) వారి వైద్య విధానం’ అన్న పుస్తకం నుండి

సా ధారణంగా ప్రజలు వ్యాధిని ఓ ఆపదగా, అల్లాహ్‌ా అభిశాపంగా భావిస్తుంటారు. ఒక్కోసారి ఈ వ్యాధుల్ని భూతాలు, ప్రేతాత్మల ప్రభావ ఫలితాలని కూడా పేర్కొంటుంటారు. అంచేత భూతవైద్యులు వ్యాధిగ్ర స్తులకు వైద్యం పేరుతో అనేక బాధలకు గురి చేశారు, చేస్తున్నారు. అయితే ఇస్లాం వ్యాధిని విశ్వాసి పాలిట గీటురాయిగా పేర్కొంటుంది.

ప్రతి పురోగమనానికి ముందు మానవుడు ఓ పరీక్షను ఎదుర్కొవల సిన వస్తుందనేది అందరికీ తెలిసిందే. పరీక్ష, అవరోధాలు లేకుండా ఏ విజయమూ చేకూరదు. ఖుర్‌ఆన్‌లో ఇలా అంటుంది: ”మేము విశ్వ సించాము అన్నంత మాత్రాన తాము ఇట్టే వదలివేయబడతామనీ, తాము పరీక్షించబడమని ప్రజలు అనుకుంటున్నారా? వారికి పూర్వం గతించిన వారిని కూడా మేము బాగా పరీక్షించాము. వారిలో సత్యవం తులెవరో, అసత్యవాదులెవరో నిశ్చయంగా అల్లాహ్‌ా తెలుసుకుం టాడు”. (అన్కబూత్‌: 2,3) మరో చోటిలా సెలవియ్యబడింది: ”ఏమిటి మీరు స్వర్గంలో ఇట్టే ప్రవేశించగలమని అనుకుంటున్నారా? వాస్తవానికి మీకు పూర్వం గతించిన వారికి ఎదురయినటువంటి పరిస్థితులు మీకింకా ఎదురే కాలేదు. వారిపై కష్టాలు (కుండపోతగా), రోగాలు (విపరీతంగా) విరుచుకు పడ్డాయి. వారు ఎంతగా కుదిపి వేయ బడ్డారంటే, (ఆ ధాటికి తాళ లేక) ”ఇంతకీ అల్లాహ్‌ా సహాయం ఎప్పుడు వస్తుంది?” ప్రవక్త మరియు ఆయనతోపాటు విశ్వసించిన వారు ప్రశ్నించసాగారు. వినండి! ‘అల్లాహ్‌ా సహాయం సమీపంలోనే ఉంది’ అని వారిని ఓదార్చడం జరిగింది”. (బఖరహ్‌ా: 214)

అంతిమ దైవప్రవక్త (స) ముహమ్మద్‌ (స) హితోక్తి- అల్లాహ్‌ ఇలా అంటున్నాడు: ”నేను ఓ దాసుణ్ణి రెండు ప్రియమయిన విషయాలకు గురి చేసి బాధ కలిగించినప్పుడు అతను నిరాశ చెందకుండా ఉంటే, దానికి బదులుగా నేనతనికి స్వర్గం ప్రసాదిస్తాను. ఆ రెండు ప్రియమ యిన విషయాలంటే అతని రెండు కళ్ళు”. (బుఖారీ)
ఇస్లాం ప్రకృతిసిద్ధమయిన ధర్మం. దాని సూత్రాలు, నియమాలు అన్నీ ప్రకృతిసిద్ధంగానే ఉంటాయి. కాబట్టి వ్యాధి ఆపద కాదు. అది అల్లాహ్‌ా పరీక. అది మన శ్రేయోసాఫల్యాలకు, మోక్ష సాధనకు మార్గం. దైవ ప్రవక్త (స) ఇలా తెలియజేశారు: ”అల్లాహ్‌ా ఎవరికి ప్రయోజనం చేకూర్చాలని తలుస్తాడో వారిని కష్టాలకు గురి చేసి పరీక్షిస్తాడు”. (ముఅత్తా ఇమామ్‌ మాలిక్‌)
ఎంతటి బలశాలికయినా వ్యాధి బలహీనతకు గురి చేస్తుంది. ఎంతటి అహంభావికయినా వ్యాధి ఆలోచిమపజేస్తుంది. ఎంతటి పాషాణ హృదయుణ్ణయినా వ్యాధి కరిగిస్తుంది.

స్వర్గానికి సోపానం సహనం: అతా బిన్‌ రిబాహ్‌ా (ర) ఉల్లేఖనం- అబ్దుల్లాహ్‌ా బిన్‌ అబ్బాస్‌ (ర) నాతో- ”నేను నీకు స్వర్గ స్త్రీని గురించి చెప్పనా?’ అన్నారు. దానికి నేను ‘తప్పకుండా చెప్పండి’ అన్నాను. అప్పుడాయన ఇలా అన్నారు: ”నలుపు వర్ణం గల ఓ స్త్రీ దైవప్రవక్త (స) వారి సన్నిధికి వచ్చి – ‘ఓ దైవప్రవక్తా! నాకు మూర్ఛ వ్యాధి ఉంది. కొన్ని సార్లు బట్టలు ఊడి పోతాయి. నాకు స్వస్థను ప్రసాదించ మని అల్లాహ్‌ాను వేడుకోండి” అని విన్నవించుకుంది. దానికి దైవప్రవక్త (స) ”నీవు సహనం వహిస్తే నీకు స్వర్గం లభిస్తుంది. నీవు కోరితే నీకు స్వస్థతను చేకూర్చమని అల్లాహ్‌ాను ప్రార్థిస్తాను” అన్నారు.
అది విన్న ఆ మహిళ-‘నేను సహనం వహిస్తాను, కాని మూర్చ వచ్చి నప్పుడు నా దేహంపై గల వస్త్రం తొలగిపోకుండా ఉండేలా దీవించ మనండి’ అని చెప్పింది.దైవప్రవక్త (స) ఆమె దరఖాస్తును మన్నించి అల్లాహ్‌ాను ప్రార్థించారు’. (బుఖార, ముస్లిం)
పాప ప్రక్షాళన సాధనం జ్వరం: దైవప్రవక్త (స) ఇలా అన్నారు: ”విశ్వాసికి ఒక రాత్రి వచ్చిన జ్వరం ద్వారా అల్లాహ్‌ా అతని పాపాల న్నింటినీ క్షమిస్తాడు”. (అత్‌ తర్గీబ్‌ వత్తర్హీబ్‌)
ఓసారి దైవప్రవక్త (స) వారి సన్నిధికి వచ్చిన ఒక వ్యక్తి జ్వరాన్ని తూలనాడాడు. అది విన్న ప్రవక్త (స)-”జ్వరాన్ని తిట్టకు. నిప్పు ఇనుము తుప్నును వదలగొట్టి దాన్ని కామతిమయం చేసినట్లు, జ్వరం నీ పాపాలను ప్రక్షాళించి నిన్ను పవిత్రం చేస్తుంది” అన్నారు. (అబ్ను మాజహ్‌)
ఉమ్ముల్‌ అలా (ర.అ) కథనం – నేను జబ్బున పడినప్పుడు దైవప్రవక్త (స) నన్ను పరామర్శించడానికి వచ్చి ఇలా అన్నారు: ”ఉమ్ముల్‌ అలా! నీకు శుభాకాంక్షలు! విశ్వాసలకు వ్యాధి సోకితే నిప్పు వెండి బంగా రాల తుప్పును, మలినాల్ని వదలగొట్టినట్లు వ్యాధి వారి పాపాలను కడిగి వేస్తుంది”. (అబూ దావూద్‌)
హజ్రత్‌ యహ్యా బిన్‌ సయీద్‌ (ర) గారి కథనం – దైవప్రవక్త (స) వారి హయాంలో ఓ వ్యక్తి మరణించాడు. అప్పుడొకతను ‘ఎంత మంచి మరణం ఇతనిది. జీవితంలో ఒక్కసారి కూడా ఇతను వ్యాధికి గురి కాలేదు’ అన్నాడు. అది విన్న ప్రవక్త (స); ”నీ మాటలు విని నేను విచారిస్తున్నాను. అల్లాహ్‌ా ఎవరికయినా వ్యాధికి గురి చేస్తే దాని వల్ల అతని పాపాలు ప్రక్షాళించ బడతాయోమో నీకేం తెలుసు?” అని అన్నారు. (ముఅత్తా ఇమామమ్‌ మాలిక్‌)

చావును కోరుకోరాదు: ప్రవక్త (స) ఇలా అన్నారు: ”మీలో ఎవరూ కష్టం వచ్చినప్పుడు చావును కోరుకోకూడదు. దానికి బదులు ‘ఓ అల్లాహ్‌! మేలుకి సంబంధించిన ప్రతి విషయంలో నా జీవిత కాలాన్ని పెంచు. మరియు కీడు, చెడుకి సంబంధించిన ప్రతి విషయంలో నా మరణాన్ని నాకు విశ్రాంతి సాధనంగా చెయ్యి” అని ప్రార్థించాలి అన్నారు. (అబూ దావూద్‌)

Related Post