అన్నదమ్ములు అక్కాచెల్లెళ్ల అనుబంధం

అన్నదమ్ములు అక్కాచెల్లెళ్ల అనుబంధం

ఒక సామాన్యుడిగా ఈ సమాజానికి ఏమివ్వగలంరా..ప్రేమతో కూడిన ఒక మంచి కుటుంబం తప్ప. దీనికి  మించింది ఏదన్నా ఉందా. . మీరు ఒకరికి  అన్నయ్య. ఒకరు మీకు  తమ్ముడు. ఒకరు మీకు చెల్లెలు, ఒకరు మీరు అక్క. ఒకరుమీరందరికి  అమ్మానాన్న.   అలాంటి  ఇంటిలో  ఇరుకుండదు. ప్రతి మనసులోనూ  చోటుంటుంది. వారి ఉత్తమ  నడకకు నడవడికకెపుడూ అలుపుండదు. గెలుపోటముల్లో అండకు కరువుండదు. ఒక్క మాటలో చెప్పాలంటే బంధాల గ్రంధాలయమే ఉంటుంది ఆ ఇంటిలో. అలాంటి ఓ ఇల్లు మనకు కూడా ఉండాలని మనలోని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఆ దిశగా ఒక అడుగే ఈ వ్యాసం.

 

అల్లాహ్ మనకు చేసిన మేళ్ళల్లో - మనకు రక్త సంబధీకులైన సోదర సోదరీమణులను  ప్రసాదించడం కూడా ఒకటి.  వారు మన తల్లిదండ్రులకు ప్రతి రూపాలు. మన దేహంలోని అవిభాజ్య భాగాలు. కష్టాల్లో దుర్గం వంటివారు. సంతోషంలో స్వర్గం వంటి వారు. ఎడారి ఎండలో చల్లని జలం వారు. కుండపోత వర్షంలో గొడుగు వార.  మన లక్ష్య  సాధనలో ముందడుగు వారు, మన  శత్రుల పాలిట పిడుగు వారు. అసూయపరుల పాలిట నుడుగు.

అల్లాహ్ మనకు చేసిన మేళ్ళల్లో – మనకు రక్త సంబధీకులైన సోదర సోదరీమణులను  ప్రసాదించడం కూడా ఒకటి.  వారు మన తల్లిదండ్రులకు ప్రతి రూపాలు. మన దేహంలోని అవిభాజ్య భాగాలు. కష్టాల్లో దుర్గం వంటివారు. సంతోషంలో స్వర్గం వంటి వారు. ఎడారి ఎండలో చల్లని జలం వారు. కుండపోత వర్షంలో గొడుగు వార.  మన లక్ష్య  సాధనలో ముందడుగు వారు, మన  శత్రుల పాలిట పిడుగు వారు. అసూయపరుల పాలిట నుడుగు.

అన్నదమ్ములు – అక్కా చెల్లెల్లు అంటే, కేవలం ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్లు మాత్రమే కాదు.. కుటుంబ విలువలను, వారసత్వాన్ని ముందుతరాలకు అందించే వాళ్లు. అనుబంధాలు ఆప్యాయతలు పంచుకుంటూ, అమ్మనాన్నల ఆలనా పాలన చూసుకునేవాళ్లు. అలాంటి వాళ్లు అవసరం వస్తే తప్ప కలుసుకోలేని పరిస్థితులు వచ్చేశాయి. ‘తమ్ముడు, అన్నా ’ పిలుపుల కంటే ఆస్తులు, డబ్బు, హోదాలు ఎక్కువైపోయాయి. కుటుంబ చట్రాన్ని ముందుకు నడిపే అన్నదమ్ముల మధ్య పొరపొచ్చాలు పోవాలంటే.. ? విదేశాలకు ఎగిరిపోయిన బంధాలు అప్పుడప్పుడన్నా ఆప్యాయంగా కలవాలంటే..!?

కుటుంబం

అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లపై కుటుంబాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పుడు ఒకే కుటుంబంలో పుట్టి, పెరుగుతారు. దాంతో తల్లిదండ్రుల ప్రభావం వారి  మీదా పడుతుంది. ఇలా.. అనుబంధాల మధ్య జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో కుటుంబం వల్లే అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళు  మొదట తెలుసుకుంటారు. కానీ పెళ్లయిన తర్వాత ఇటు ఈ ఇద్దరికీ భార్యల వల్ల వేరువేరు కుటుంబాలతో సంబంధాలు ఏర్పడతాయి. అటు వారిద్దరికీ భర్తల వల్ల వేరువేరు కుటుంబాలతో సంబంధాలు ఏర్పడతాయి. దాంతో వాళ్ల ఆలోచనలు, అభిప్రాయాల్లో మార్పులు రావచ్చు. అలాగని పాత బంధాలను తెంచుకోకూడదు. అందరితో కలిసి ఉండాలి. చిన్నచిన్న తేడాలు వచ్చినా, పట్టించు కోకూడదు. అలాగే కుటుంబాలు వేరైనా చిన్నప్పటి రిలేషన్స్‌ ను వదులుకోకూడదు. అందరం ఒకే కుటుంబం అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఒకటిగా కలిసి కుటుంబ ఆదర్శాలు, సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లేది అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళే. స్వయంగా ప్రియా ప్రవక్త ముహమ్మద్ (స) వారి వంశ పరంపర హజ్రత్ ఫాతిమా (ర.అ) గారి కుటుంబంతోనే మూడు పూలు ముప్పయి కాయలై నేటికీ సస్సశ్యామలంగా ఉంది.

ప్రేమాభిమానాలు తర్వాతి తరానికి అందిం చేది కూడా వాళ్లే. అందుకే అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు ఒకటిగా కలిసిపోవాలి. చిన్నప్పుడే కాదు, పెద్దయ్యాక కూడా. తల్లిదండ్రుల కోసమే కాదు, ఎవరిళ్ళల్లో  ఏ అవసరం వచ్చినా ఒకరిని మరొకరు ఆదుకోవాలి. పెద్దయ్యాక చిన్నప్పటిలా కలిసి బతకడం కుదరకపోవచ్చు. పండుగలు, పెళ్లిళ్లు వంటి వేడుకలప్పుడు అయినా కలుసుకోవాలి. ఒకరితో మరొకరు ఫోన్‌‌లో మాట్లాడుకోవాలి. ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. పెళ్లిళ్లు అయ్యాక భార్యలతో వాళ్ల బంధం గురించి చెప్పి, కుటుంబ విలువలను కాపాడుకోవాలి. ఎవరిదారి వాళ్లదే అన్నట్లు ఉండొద్దు. స్నేహితులు ఒకే కంచంలో తిని, ఒకే మంచంలో పడుకున్నా మని ప్రత్యేకంగా చెప్పుకుంటారు. కానీ అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు చిన్నప్పుడు అలాగే బతుకుతారు.

పోలికలొద్దు

ఒకే ఇంట్లో పుట్టి పెరిగిన అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు  ఒకేలా ఉండరు. ఒకరు అల్లరి చేయొచ్చు. మరొకరు నిదానంగా ఉండొచ్చు. ఆటపాటల్లో ఒకరు ముందు ఉంటే.. ఇంకొకరు చదువులో ఫస్ట్‌‌  రావచ్చు. అన్నదమ్ములు అయినంత మాత్రాన అన్నింటిలో పోలిక ఉండాలనేంలేదు. ఎవరి టాలెంట్‌ తో వాళ్లు ఎదుగుతారు. తల్లిదండ్రులు ‘అన్న చూడు ఎంత బాగా చదువుతాడో, చెల్లి  చూడు ఎప్పుడూ అన్నింటిలో ముందుంటుంది’ లాంటి మాటలతో ఒకర్ని మరొకరితో పోల్చకూడదు. అలా చేయడం వల్ల వాళ్ల మధ్య అసూయ, ద్వేషం లాంటివి ఏర్పడతాయి. అన్నదమ్ముల బంధాన్ని, అక్కా చెల్లెళ్ళ అనుబంధాన్ని  చెడగొట్టే పోలికలు అసలు పనికిరావు. అవి చిన్నప్పటితో పోవు. పెద్దయ్యాక కూడా వాళ్ల రిలేషన్‌‌పై ప్రభావం చూపుతాయి. పెరిగే కొద్దీ వాళ్ల తెలివితేటలు, చదువు, ఉద్యోగం, పెళ్లి.. లాంటి వాటిని బట్టి వాళ్ల జీవితాలు మారిపోతాయి.

తల్లిదండ్రులు తమ పిల్లలందరినీ ప్రేమిస్తారు. కాని కొందరి పట్ల ఎక్కువ ఇష్టం చూపుతారు. అందుక్కారణం ఆ పిల్లల మంచి గుణగణాలు. అయితే ఈ ప్రేమాభిమానాలు వ్యక్తం చేయడంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. సంతానంలో కొందరి పట్ల ఎక్కువ ఇష్టాన్ని ప్రదర్శిస్తే మిగిలిన వారిలో అసహనం, అసూయలు జనించడానికి అవకాశం ఉంది. ఇందుకు ప్రవక్త యూసుఫ్ (అ) వారి గాధ  గొప్ప నిదర్శనం. ప్రశ్నించేవారికి యూసుఫ్‌, అతని సోదరుల గాధలో గొప్ప సూచనలున్నాయి. (యూసుఫ్: 7)

ప్రవక్త యూసుఫ్ (అ) వారి సోదరులు ఏ పాపం ఎరుగని, ఏ లోపం లేని  యూసుఫ్ (అ)ను అసహ్యించుకోవడానికి, ఆయన్ను లోతైన బావిలో విసిరేయడానికి, అంతటితో ఆగక ఆయన్ను తమ పరిసర ప్రాంతాల్లోనే లేకుండా చేయడానికి సంతలో అత్యంత చౌకబారు ధరకి అమ్మేసేలా ప్రేరేపించి ఆ విషయం ఏమిటంటే – వారి నాన్న ఆయన్ను తనకంటే ఎక్కువగా ప్రేమిస్టున్నాడన్న ఒకేఒక్క అంశం.

అప్పుడతని సోదరులు పరస్పరం ఇలా కూడబలుక్కున్నారు: “మనమంతా ఒక జట్టుగా ఉన్నా (ఏం లాభం?) మన తండ్రికి మనమీద కంటే యూసుఫ్‌ మీద, అతని తమ్ముడి మీదనే ఎక్కువ మమకారం ఉంది. అసలు మన నాన్నకు (వయస్సు బాగా మీద పడటం వల్ల) మతి భ్రమించింది. (అంచేత మనం ఏదో ఒకటి తేల్చుకోవాలి.) పదండి, యూసుఫ్‌ని చంపివేద్దాం, లేదా ఎక్కడయినా తీసికెళ్ళి పారేద్దాం గుట్టుచప్పుడు కాకుండా. అప్పుడే మీ తండ్రి మీ వైపు మరలుతాడు. ఈ పని కాస్తా ముగిశాక మనం (ఏమీ ఎరగనట్టు) మంచివాళ్ళుగా కన్పించాలి.” (యూసుఫ్: 8-9)

అసూయ వల్ల బాధలకు గురయినవానికి దేవుని రక్షణ లభిస్తుంది. యూసుఫ్ (అస) సోదరులు ఆయన్ను బానిసగా అమ్ముడుపోయేలా చేయడానికి పన్నిన కుట్ర నిజానికి ఆయన్ను జీవితంలో ఉన్నత స్థానానికి చేర్చింది.

అల్లాహ్ మనకు చేసిన మేళ్ళల్లో – మనకు రక్త సంబధీకులైన సోదర సోదరీమణులను  ప్రసాదించడం కూడా ఒకటి.  వారు మన తల్లిదండ్రులకు ప్రతి రూపాలు. మన దేహంలోని అవిభాజ్య భాగాలు. కష్టాల్లో దుర్గం వంటివారు. సంతోషంలో స్వర్గం వంటి వారు. ఎడారి ఎండలో చల్లని జలం వారు. కుండపోత వర్షంలో గొడుగు వార.  మన లక్ష్య  సాధనలో ముందడుగు వారు, మన  శత్రుల పాలిట పిడుగు వారు. అసూయపరుల పాలిట నుడుగు.

ఇందుకు గొప్ప ఉదాహరణ ప్రవక్త మూసా (అ). ధర్మబోధ మార్గాల్లో సహాయం అవసరం అయినప్పుడు ఆయన అల్లాహ్ తో తన అన్నను సహాయకునిగా చేయమని వేడుకున్నర్యు . “ప్రభూ! నాకు మనోస్థయిర్యం ప్రసాదించు. నా పనులు సులభంగా నెరవేరేలా చెయ్యి. ప్రజలు నామాట గ్రహించడానికి నాకు వాక్పటిమ ప్రసాదించు. నాకు సహాయం గా నా కుటుంబంలో ఒకరిని మంత్రిగా నియమించు. నా సోదరుడు హారూన్‌ ద్వారా నాకు బలం చేకూర్చు. అతడ్ని నా పనిలో భాగస్వామిగా చెయ్యి. మేమిద్దరం నీ పవిత్ర తను ఘనంగా కొనియాడుతాం. నీగురించి విస్తృతంగా ప్రచారంచేస్తాం. నీవు ఎల్లప్పుడూ మమ్మల్ని కనిపెట్టుకొని ఉంటున్నావు” అన్నాడు మూసా. (తాహా: 25-35)

సమాధానంగా అల్లాహ్ ఇలా అన్నాడు: మూసా! నీవు కోరినవన్నీ ఇచ్చాం. మేము నీకు మరోసారి మేలు చేశాం. (తాహా: 36)

మూసా! నేను నిన్ను నాపని కోసం యోగ్యుడిగా చేశాను. ఇక నీవు, నీ సోదరుడు నా(ఈ) నిదర్శనాలు తీసుకొని వెళ్ళండి. గుర్తుంచుకోండి, ఎట్టి పరిస్థితిలోనూ నన్ను స్మరించడంలో అలస త్వం చేయకూడదు. మీరిద్దరు ఇప్పుడు ఫిరౌన్‌ దగ్గరకు వెళ్ళండి. అతను గర్విష్ఠుడై హద్దు మీరిపోయాడు. అతనితో మృదువుగా మాట్లాడండి. దానివల్ల అతను (మా) హితవులు పాటించవచ్చు, లేదా (మాశిక్షకు) భయపడవచ్చు” అన్నాడు అల్లాహ్. (తాహా: 36-44)

ధర్మబోధ వంటి బృహత్కార్యంలో తన సోదరుణ్ణి సయితం తోడు చేయమని ప్రవక్త మూసా (అ), అన్న మీద మహా గొప్ప ఉపకారమే చేశారు. అలాగే హారూన్ (అ) కూడా – ఇక నాకు ప్రవక్త పదవి వచ్చేసింది, నేను కూడా ప్రవక్తనయిపోయాను అని మిడిసి పడలేదు. అహంకారానికి, ముఖస్తుతికి లోనుకాలేదు. మూసా (అ) వయస్సులో తనకన్నా చినవాడు అని చిన్న చూపు చూడలేదు. పరమ విధేయునిలా మసలుకున్నారు. నేడు ఒకే ప్రాంతంలో ఆధ్యాత్మిక సేవలో నిమగ్నమయి ఉన్న అనేక మందికి ఇందులో గొప్ప గుణపాఠం ఉంది.

అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లు – ఎప్పుడూ పరస్పరం ఒండొకరికి తోడు నీడగా ఉంటారు. గాయాలకు పట్టీ చుడతారు. విజయాలకు పట్టం కడతారు. తాము అమితావసరంలో ఉన్నా తనవారి అవసరాలకే ప్రాధాన్యతనిస్తారు. కాలం వేసిన కాటు తామే మందవుతారు. సమస్యల జడివానలో తామే వెచ్చదనాన్నిచ్చే  చలిమంటౌతారు. కష్టాల కడలిలో  తామే గట్టెక్కించే  పడవౌతారు

రక్త సంబంధీకుల మధ్య పుల్లలెట్టే వారు చాలా మంది ఉంటారు. “ప్రతి ఒక్కరూ అందంగానే పుడతారు. కాని కొందరు తమను వికృతంగా మార్చే అవకాశాన్ని ప్రపంచానికి ఇస్తూ ఉంటారు” అన్నట్టు కొన్ని సందర్భాలలో మనం కూడా అవకాశం ఇస్తుంటాము.

ఒక వ్యక్తి హజ్రత్ అలీ (ర) కుమారుడైన ముహమ్మద్ బిన్ హనఫీయా వద్దకు ఆయనకు ఆయన సోదరులకు మధ్య చిచ్చు పెట్టాలని  వచ్చి ఇలా అన్నాడు: అయ్యా! మీ  నాన్ననేమో హసన్ మరియు హుసైన్ (ర) చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు, కానీ నీ విషయంలోనే కాస్త ఎక్కువ అన్యాయం చేస్తున్నాడనిపిస్తున్నది నాకు అని పుల్లలెట్టే ప్రయత్న చేశాడు. ఆ కుటిల నీతిజ్ఞుడి అసూయాగ్నిపై నీళ్లు జల్లుతూ  ఆయనిచ్చిన సమాధానం – నా సోదరులైన హాసన్ మరియు హుసైన్ (ర) – మా నాన్న రెండు చేపలు, నేను ఆయన చెయ్యి. తన రెండు చెంపలకు ఏ హాని కలగకూడదని తన   రెండు చేతులను అడ్డుగా పెట్టుకున్నారు – అంటే మేమంతా ఓకే దేహపు అవిభాజ్య భాగాలం అన్న సమాధానంతో చెంప చెళ్లుమనిపించారు.

ఓ కవి ఇలా అన్నాడు: నీ సోదరుని విషయంలో కడు  అప్రమత్తంగా ఉండు. సోదరుడు లేని వ్యక్తి ఉపమానం ఆయుధం లేకుండా కదన రంగానికి బయలుదేరే వ్యక్తి వంటిది.

నీ సోదరుడు – నీవు స్వేచ్చా వాయువుల్లో విహరించేందుకు సహాయ పడే రెక్కల వంటి వాడు. మరియు ఒక గద్ద రెక్కలు  లేకుండా  ఎగర గలదా?

ఉదార స్వభావం గల  సోదరుడు ఉన్నవాడు దుఃఖించడు.  శ్రేష్ఠమైన దయా గుణం గల   సోదరుడు ఉన్నవాడు నిరాశ చెందడు.

వారు యూసుఫ్‌ దగ్గరికి చేరుకున్నారు. యూసుఫ్‌ వారిలో తన (సొంత)తమ్ముడ్ని చాటుగా తన దగ్గరకు పిలిపించుకొని “నేను నీ(తప్పిపోయిన) అన్నయ్యను. ఇప్పుడు నీవు వారి చేష్టలను గురించి బాధపడనవసరం లేదు” అని ధైర్యం చెప్పాడు. (యూసుఫ్: 69)

ఇందులో బిన్యామీను మంచి మనస్సు గల అన్నయ్యను చూసి బాధల్ని, భయాల్ని మరచిపోయాడు. సోదరుడంటే మనలో లోపం, దోషం కనిపిస్తే పరదా వేసేవాడు, మంచి కనిపిస్తే పది మందికి చెప్పేవాడు, మనలో చెడును  గమనిస్తే సరిదిద్దేవాడు.  మన ఆధ్యాత్మిక, ప్రాపంచిక జీవితంలో మనకు మేలు చేసే  సలహాలిచ్చేవాడు, ప్రతి విధమైనటువంటి కీడు నుండి మనల్ని కాపాడేవాడు. ప్రవక్త (స) ఇలా అన్నారు; ”నీ సోదరుడు దుర్మార్గుడైనా, పీడితుడైనా – అతనికి సహాయ పడు”. అది విన్న సహచరులు – ఓ అల్లాహ్ ప్రవక్తా! పీడిత సోదరుణ్ణి ఆదుకోమన్నారు బాగానే ఉంది, కానీ దుర్మారుడికి సహాయ పడమంటున్నారేమిటి? అని ప్రశ్నించారు. అందుకు ప్రవక్త (స) ఇలా సమాధానమిచ్చారు: ”నీ సోదరుడు దౌర్జన్యం చేయకుండా ఆపడమే నీవు అతనికి చేసే సహాయం”. (బుకారీ, ముస్లిం)

జీవితం ఒడిదుడుకులమయం. కొన్ని సందర్భాలలో – పౌరుషానికి పోతుంటాము, అనుకోని  కొన్ని పరిణామాల కారణంగా మాటా మంతి  పెరిగి  గొడవకు దిగుతుంటాము కూడా.  అంత మాత్రాన మన మధ్య ఉన్న అనుబంధం అంతమైపోదు. చూడండి, ప్రవక్త మూసా (అ) తూర్  పర్వతం మీద అల్లాహ్ ను కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు – హజ్రత్ హారూన్ (అ) వారికి  జాతి బాధ్యతను ఇచ్చి వెళ్లారు. అయితే ఆయన వెళ్లిన కొద్దీ రోజులు జాతి జనం ఓకే ఆవు దూడను ఆరాధ్య దైవంగా చేసుకొని మార్గభ్రష్టులయ్యారు. హారూన్ (అ) ఎంత నచ్చజెప్పడానికి ప్రయత్నించినా వారు వారి వైఖరిని మానుకోలేదు. ప్రవక్త మూసా (అ) ఆలాహ్ తో కలుసుకునే గడువు ముగియగానే జాతి వద్దకు వచ్చి – వారిని స్థితిని చూసి ఆగ్రహోదగ్రులయ్యారు. అన్న హారూన్ (అ) మీద నిప్పులు చెరిగారు. ఆ సందర్బంగా – వయసులో తానూ పెద్దయినా – సమస్య తీవ్రత దృష్ట్యా సంయమనాన్ని పాటించారు హరూన్ (అ). జాతి శ్రేయోభిలాషులైన సోదరుల మధ్య జరిగిన ఆ సంభాషణను ఖురాన్ ఇలా చిత్రీకరిస్తోంది:

(ఈ మాట వినగానే) మూసా ఎంతో ఆగ్రహం, విచారంతో కూడిన భావోద్రేకాలతో తనజాతి దగ్గరకు తిరిగొచ్చాడు. వచ్చీరాగానే “నాజాతి ప్రజలారా! మీ ప్రభువు మీకు మంచివాగ్దానాలు చేయలేదా? అది మీకు ఆలస్యమైనట్లు అన్పించిందా (సహనం కోల్పోయి ఈ నిర్వాకానికి పాల్పడ్డారు)? లేక నాకు మీరు చేసిన వాగ్దానభంగానికి మీరే మీప్రభువు ఆగ్రహాన్ని ఆహ్వానించదలిచారా?” అని అడిగాడు. (86)

హారూన్‌ (మూసా రాకకు) ముందే (నచ్చజెబుతూ) “సోదరులారా! దీని ద్వారా మీరు పరీక్షకు గురయ్యారు. మీ ప్రభువు కరుణామయుడే. కనుక మీరు నన్ను అనుస రించండి. నామాట వినండి” అన్నాడు. కాని వారు (అతని మాటలు పెడచెవిన పెడ్తూ) “మూసా తిరిగి రానంతవరకు మేము దీన్నే పూజిస్తుంటాం” అని చెప్పేశారు. (90-91)

మూసా (హారూన్‌ వైపు తిరిగి) “హారూన్‌! వీరు మార్గభ్రష్టులైపోతుంటే చూసి (నీవు మౌనంగా ఎందుకుండి పోయావు?) వారిని వారించకుండా ఏ విషయం నిన్ను అడ్డుకుంది? నీవు నా ఆదేశం ఎందుకు ఉల్లంఘించావు?” అని అడిగాడు. (92-93)

“నా తల్లికుమారుడా! నా గడ్డాన్ని, తలవెండ్రుకల్ని పట్టి లాగకు. నేను ఇస్రాయీల్‌ సంతతిలో చీలికలు తెచ్చిపెట్టానని, నీమాట ఖాతరు చేయలేదని అంటావేమోనని భయపడ్డాను. (దేవుని దయవల్ల అలా అనలేదు నీవు)” అన్నాడు హారూన్‌. (తాహా: 86-94)

అప్పుడు హారూన్‌ ఇలా అన్నాడు: “నాతలి క్లుమారుడా! వీరు నన్ను బలహీనుడిగా భావించి నానోరు నొక్కేశారు. ఇంకాస్తయితే నన్ను చంపేసేవారే. అంచేత (నన్నర్థం చేసుకో.) ప్రత్యర్థులు నన్ను చూసి హేళన చేసే అవకాశం కల్పించకు. ఈ దుర్మార్గులతో నన్ను కలిపేయకు.” (ఆరాఫ్: 150)

ఆయన సంజాయిషీ  విని శాంతించిన ప్రవక్త మూస (అ) ఇలా వేడుకున్నారు:

“ప్రభూ! నన్ను, నా సోదరుడ్ని క్షమించు. మమ్మల్నిద్దర్నీ నీ కారుణ్యాశ్రయంలో చోటివ్వు. నీవు అందరి కంటే గొప్ప కరుణామయుడవు” అని దైవాన్ని వేడుకున్నాడు. (ఆరాఫ్: 151)

గ్రహించవలసిన కొన్ని పాఠాలు

1) సహ  నాయకుల్ని తయారు చేయాలి. 

ప్రవక్త మూసా (అ) తన పెద్దన్న కోసం, ఆలాహ్ ఆయనకు అప్పగించి బృహత్కార్యంలో భాగస్వామిగా చేయమని సిఫారసు చేయడానికి వెనుకాడ లేదు. తన విజన్ లో , తాన్ మిషన్ లో తన పెద్దన్నయ్య తోడు తనకు కావాలని అల్లాహ్ ను వేడుకున్నారు.

2) పదవుల కోసం ప్రాకులాడటం మంచిది కాదు.

హారూన్ (అ)  తన సోదరుడు మోషే కంటే పెద్దవారు.    ప్రజాదరణకూడా ఆయనకు ఎక్కువ ఉండేది. అలాగే  ఇశ్రాయేలీయులకు ఆయన పై ఉన్నమీద అమితమైన ప్రేమ ఉండేది. వీటన్నింటితోపాటు ఆయన గొప్ప వాక్పటిమ, వాక్చాతుర్యం గలవారు. అయినప్పటికీ

ఆయన  తన తమ్ముడి  నాయకత్వం, అధికారం విషయమయి  ఎప్పుడూ వివాదం చేయడానికి ప్రయత్నించలేదు, పైగా  తన తమ్ముడికి విధేయుడిగా, ఆయన  ఆదేశాలకు శిరసా వహించే పరం నమ్మకస్తునిగా  ఉన్నారు. ఆయనలోని ఈ గొప్ప లక్షణాలే – తను లేని సమయంలో

తన ప్రతినిధిగా  నియమించడానికి మూసా (అ) ను  ప్రేరేపించింది, అవును  విజయవంతమైన నాయకులు, అధికారిక స్థానం కోసం లేదా  బిరుదు కోసం  అంగలార్చరు. వారి కర్తవ్యాన్ని వారు ఏంటో నిజాయితీగా నిర్వర్తిస్తారు.

3) నాయకుని ఆవేశాన్ని, కోపాన్ని అర్థం చేసుకోవడం.

చిన్నవాడై ఉండి కూడా తన తల వంట్రుకలు పెట్టుకోవడాన్ని. తన గెడ్డం పట్టి బిరబిరా లాక్కుపోవడాన్ని ఆయన తప్పు పట్ట లేదు. విషయాన్ని ఎంతో  వినయంగా , హుందాగా వివరించారు. మనం చేసే పని ఏదైనా – ఇలాంటి ఓ సందర్భం రావచ్చు. ఆ నాజూకు తరుణంలో మన టీమ్ స్ప్రిట్ ను మనం కాపాడుకోవాలి అంటే మన నాయకున్ని మనం అర్థం చేసుకోవాలి, అపార్థం కాదు.

4) గౌరవప్రదమైన జీవితాన్ని కోరుకోవడం.

సమాజంలో ప్రతి వ్యక్తికీ ఒక బ్రాన్డ్, ఒక మంచి గుర్తింపు ఉంటుంది. ముఖ్యంగా నాయకులకు, అధినాయకులకు. అది పాడు కాకుండా చూసుకునే బాధ్యత అటు నాయకునికి, ఇటు అనుయాయులకు ఉంటుంది. హారూన్ (అ) తన సోదరునితో మాట్లాడుతున్నప్పుడు, శత్రువులు తనపై సంతోషించకుండా జాగ్రత్తపడ్డారు. ఆ రకంగా తన పరువునే కాదు నాయకుని ప్రతిష్టను, కుటుంబ గౌరవాన్ని కాపాడారు. కాబట్టి సోదరుల మధ్య ఏదేని విషయంలో ఎప్పుడైనా గొడవ జరిగితే, దాన్ని చిలికి చిలికి గాలి వాన చెయ్య కూడదు. కుటుంబ పరువు బజార్రుకీడ్చకూడదు, ఆప్తుల యెడల అమానవీయంగా వ్యహరిస్తూ మానం మర్యాదలను మంట గలపకూడదు. మన ఈ వెకిలి చేష్టల వల్ల   నలుగురు మనల్ని చూసి నవ్వి పోతారు, ప్రత్యర్థులు, శత్రువులు పైశాచికానందం చెందుతారు.

Related Post