ఇస్రా మేరాజ్ నేర్పిన పాఠం.”తన దాసుణ్ణి రాత్రికి రాత్రే మస్జిదె హరామ్ నుండి మస్జిదె అక్సా వరకు తీసుకు పోయిన అల్లాహ్ పరిశుద్ధుడు. దాని పరి సరాలను మేము శుభవంతం చేశాము. మేమతనికి మా (శక్తికి సంబంధించిన) కొన్ని సూచనలను చూప దలచాము. నిశ్చయంగా ల్లాహ్ మాత్రమే బాగా వినేవాడు, బాగా చూసేవాడు”. (బనీ ఇస్రాయీల్: 1)
ఇస్రా -మేరాజ్ భావార్థం:
ఇస్రా అన్నది పై ఆయతులోని అస్రా నుండి తీసుకోబడిన పదం. బాషా పరంగా దీనర్థం రాత్రి పూట ప్రయాణించడం. శాస్త్రీయ పరంగా-అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ (స) వారి మస్జిదె హారామ్ నుండి మస్జిదె అఖ్సా వరకు రాత్రి పూట జరిగిన ప్రయాణం. మేరాజ్ అన్నది ప్రవక్త (స) వారి ప్రవచనం ‘ఉరిజ బీ’ నుండి తీసుకో బడింది. బాషా పరంగా దీనర్థం – పైకి ఎక్కడం, ఉన్నతి. శాస్త్రీయ పరంగా ప్రవక్త (స) వారి గగన విహారం – అంటే మస్జిదె అఖ్సా నుండి ఏడు ఆకాశాల పైకి, అక్కడి నుండి సిద్రతుల్ మున్తహా వరకు, అక్కడి నుండి అల్లాహ్ దగ్గరకు వెళ్ళి సంభాషిమచడం, స్వర్గ నరకాల దర్శనం మొదలయిన సంఘటనల సమాహారం. ఖుర్ఆన్లో ఇస్రా ప్రస్తావన 17వ సూరహ్ -బనీ ఇస్రాయీల్‌లో ఉండగా, మేరాజ్ ప్రస్తావన 53వ సూరహ్‌ా అన్నజ్మ్లో ఉంది. అలాగే ఈ రెండు ప్రయాణ వివరాలు ప్రవక్త (స) వారి పలు ప్రవచనాలలో పేర్కొన బడ్డాయి.
ఇస్రా – మేర్రాజ్ నేపథ్యం:
అనాథ అయిన తనను తన అనుఁగు సంతానంగా కన్నా అధికంగా చూసుకున్న బాబాయి అబూ తాలిబ్ గారి మరణం. ఆయన బ్రతికున్నంత కాలం ప్రవక్త (స) వారికి వెన్నుదన్నుగా నిలచి, ఆపద సమయంలో ఆయన కొండంతి అండనిచ్చారు. ఆయన మరణంతో మక్కా అవిశ్వాసులు చెలరేగిపోయారు. ప్రవక్త (స) వారిని చిత్రహింసలకు గురి చేయడమేకాక, ఆయన ఇద్దరు కూతుళ్ళను విడాకులిప్పించి ఆయన్ను మానసికంగా సయితం దెబ్బ తీయాడానికి కుయుక్తులు పన్నారు. ఇది జరిగిన కొన్నాళ్ళకే సతీమణి హజ్రత్ ఖదీజా (ర.అ) గారు కూడా మరణించారు. ధర్మప్రచార మార్గంలో బయట అయ్యే గాయాలకు మందులా పని చేసిన మహిళామూర్తి ఆమె. సత్యబాంధవి అయిన ఆమె ప్రవక్త (స) వారిని ఎన్నో విధాలుగా ఆదుకున్నారు. అలాంటి ప్రియధర్మచారిణి మరణంతో ఇటు ఇంటా అటు బయట ఒంటరి అయ్యారు ప్రవక్త (స). ఈ రెండు మరణాలు ఒకటి తర్వాత ఒకటి చోటు చేసుకోవడం వల్ల ప్రవక్త (స) తీవ్ర మనస్తాపానికి గుర య్యారు. అదే సమయంలో తాయిఫ్ ప్రయాణం మిగిల్చిన చేదు అను భవం కూడా మరింతగా ఆయన్ను కలచి వేసింది. ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ను నమ్మండి – అరబ్బు, అరబ్బేతర ప్రాంతాలు మీ పాదా క్రాంతం అవుతాయి అని ప్రజల్ని ధర్మమార్గం వైపునకు ఆహ్వానించే ఆయన్ను మక్కాలో ప్రవేశించకుండా అడ్డుకున్నారు. ఒక అవిశ్వాసి రక్షణలో మక్కాలో ప్రవేశిం చాల్సిన గడ్డు స్థితి. అలాంటి నాజూకు తరుణంలో అన్నింని నిశితంగా పరిశీలుస్తున్న, వింటున్న అల్లాహ్ ఆయన కోసం గగన విహార ఏర్పాటు చేశాడు.
ఇస్రా-మేరాజ్ కానుకలు:
ఇస్రా-మేరాజ్ సందర్భంగా ఆయనకు లభించిన కానుకలు – 1) ఐదు పూటల నమాజు. 2) సూరయె బఖరహ్‌లోని చివరి ఆయతులు. 3) సత్సంకల్పానికే పుణ్యం-అది కార్య రూపం దాల్చక పోయినా ..దుస్సంకల్పానికి దండన లేదు అది కార్య రూపం దాల్చనంత వరకు).
విన్న గాథలు:
1) దైవదూతల నాయకులయిన జిబ్రీల్ (అ) వారి నోట మాషితహ్ బిన్త్ ఫిర్ఔన్ (ఫిర్ఔన్ కూతురి వెంట్రుకలు సవరించే స్త్రీ) గాథ. 2) హజ్రత్ బిలాల్ (ర) వారి గాథ.
చూసిన దృశ్యాలు:
1) బైతుల్ మామూర్ 2) సిద్రతుల్ మున్తహా 3) స్వర్గ నరకాల దర్శనం. కొందరు దుష్టులకు లభించే దండన, కొందరు ధర్మాత్ములకు లభించే ప్రతిఫలం.
కలుసుకున్న వ్యక్తులు:
1) ప్రవక్తలు మస్జిదె అఖ్సాలో. 2) ఏడు ఆకాశాల మీద ఎనిమిది మంది ప్రవక్తలు. ప్రవక్త ఆదమ్, ఈసా, యహ్యా, యూసుఫ్, ఇద్రీస్, హారూన్, మూసా, ఇబ్రాహీమ్ (అ). 3) దైవ దూత జిబ్రీల్తోపాటు ఇతర దైవ దూతలు.
సంభాషించిన వారు: 1) దైవ దూతలు 2) దైవప్రవక్తలు 3) అల్లాహ్.
మేరాజ్ పాఠాలు-మొది పాఠం-సుబ్హానల్లాహ్:
ఇస్రా గురించి ప్రస్తావిస్తూ అల్లాహ్ మొదట ‘సుబ్హానల్లజీ’ అన్నాడు. అల్లాహ్ పవిత్రుడు, పరిశుద్ధుడు అన్నది దీనర్థం. పవిత్రతకు, పరిశుద్ధతకు మూలం అల్లాహ్. మనిషి చేసే లోప సహిత ఊహాగానాలకు, కల్పించే బూటకపు భాగస్వామ్యాలకు, ఆయనకు భార్యపిల్లలు ఉన్నారన్న అపవాదుకి, ఆయన మానవాకారంలో అవతరిస్తాడన్న అపప్రదకు ఆయన అతీతుడు, పరమ పవిత్రుడు. అలాగే ఇస్రా మేరాజ్ ఈ మహత్తర సంఘటన జరిపించడంలో ఆయనకెవ్వరితో నూ పోలికలు లేవు. ఆయనకు ఆయనే సాటి. లక్షన్నర కిలోమీర్ల దూరం లో ఉన్న చందమామ వెన్నలను మనక వరకు అర సెకనులో చేరవేసే అల్లాహ్ సుబ్నాహు వ తఆలాకు రాత్రి ఒక భాగంలో ప్రవక్త (స) వారిని మస్జిదె హారమ్ నుండి మస్జిదె అఖ్సా వరకు, మస్జిదె అఖ్సా నుండి ఏడు ఆకాశాల వరకు తీసుకెళ్ళి మళ్ళీ తీసుకు రావడం ఏమంత కష్టం కాదు. సాధ్య, అసాధ్యాలు మనిషికేగానీ అల్లాహ్‌కు కావు. వెలుగు చీకట్లు, జయా పజయాలు అల్లాహ్‌కు సమానం. ”(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు-వారు చెబు తున్నట్లుగా అల్లాహ్‌తోపాటు వేరే ఆరాధ్యదైవాలు గనక ఉండి ఉంటే వారు ఇప్పికే సింహాసనాధీశుని వైపునకు వెళ్లే మార్గాన్ని అన్వేషించేవారే. ఆయన పరిశుద్ధుడు. వారు అనే మాటలకు అతీతుడు, మహోన్నతుడు”. (బనీ ఇస్రాయీల్: 42,43)
నిజంగా చెప్పాలంటే ‘అల్లాహ్ ఒక్కడే నిజ ఆరాధ్యుడు’ అన్న సాక్ష్యాన్ని సృష్టిలోని అణువణువు ఇస్తుంది. ఆయన్ను తన పద్ధతి ప్రకారం స్తుతిస్తుంది. కాకపోతే మనకు వాటి స్తోత్రగానం అర్థం కాకపోవచ్చు. ”మేము పర్వతాలను దావూద్(అ)కు స్వాధీన పర్చాము. అవి సాయంత్రం, ఉదయం అతనితోపాటు దైవస్తోత్రం చేసేవి”. (స్వాద్: 18) ఒక మాటలో చెప్పాలంటే, ”అల్లాహ్ స్తోత్రంతోపాటు ఆయన పవిత్రతను కొనయాడని వస్తువంటూ ఏదీ లేదు”. (బనీ ఇస్రాయీల్: 44)
మరి మనం ఏం చెయ్యాలి? ”ఓ విశ్వసించిన ప్రజలారా! మీరు అల్లాహ్‌ా ను అత్యధికంగా స్మరించండి. ఉదయం సాయత్రం ఆయన పవిత్రతను కొని యాడండి”. (అహ్జాబ్: 41,42) అన్న అల్లాహ్ ఆదేశాన్ని అనుసరించి ఉదయం సాయంత్రాలు వేళ విశేషాన్ని బట్టి ప్రవక్త (స) మనకు నేర్పిన దుఆలు, ప్రార్థనలు చేస్తూ నిరతం మన నాలుక అల్లాహ్ నామ స్మరణతో నానుతూ ఉండేలా చూసుకోవాలి.
దాస్య ఔన్నత్యం:
‘తన దాసుణ్ణి తీసుకు వెళ్ళాడు’ అన్నాడు అల్లాహ్. అల్లాహ్ తలిస్తే తన మిత్రుణ్ణి, తన ప్రవక్తను, తన ఆప్తుణ్ణి అని పేర్కొని ఉండొచ్చు కానీ ‘తన దాసుణ్ణి’ అని చెప్పడం వెనకాల గల దాస్య ఔన్బత్యాన్ని తెలియ పర్చడమే ఆయన అభిమతం. ఒక దాసుడు హోదా పరంగా ఏమయినా అయి ఉండొచ్చు, కానీ దైవ సమకంలో అతను దాస్య పరాకాష్టను చాటుకోవడమే అతనికి గౌరవం. మనమందరం అల్లాహ్‌ా దాసులం. అడు గడునా ఆయన అవసరం గలవారం. అవస రార్థులం, అగత్యపరులం. అనుక్షణం ఆయన అవసరం మనకుంది. మనలో మంచి వారున్నారు, చెడ్డ వారున్నారు. ధర్మాత్ములూ ఉన్నారు, దుర్మార్గులూ ఉన్నారు. సజ్జనులూ ఉన్నారు, దర్జునులూ ఉన్నారు. దాతలూ ఉన్నారు, రోతలూ ఉన్నారు. విశ్వా సులూ ఉన్నారు, అవిశ్వాసులూ ఉన్నారు. గులాంగిరీ అందరూ చేస్తున్నారు. విధానాల్లో ఆరాధ్య దైవాల్లో తేడా అంతే. కొందరు ధనానికి గులాములు, కొందరు అందానికి గులాములు, కొందరు పేరుప్రతిష్టకు గులాములు, కొందరు కోరికలకు గులాములు. ఈ దాస్య విధానాల్లో అత్యున్నత విధానం అల్లాహ్ దాస్య విధానం. దాసులందరిలో ఉత్తమోత్తములు అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించేవారు. అల్లాహ్‌ా మనల్ని స్వయంగా వీరు నా దాసులు, నా ప్రితములు అని మెచ్చుకొవాలంటే మాత్రం మనం ఆయన నచ్చిన విధంగా నడుచుకోవాలి.దాసునిగా మనం ఏ స్థాయికి చేరాలంటే స్వయం గా అల్లాహ్ అడగాలి – ‘ మీ కోరిక ఏమి?’ అని. అంతలా మనం ఆయన్ను ఆరాధించాలి.
మహోన్నత శీల శిఖరాగ్రం:
దాస్య శిఖరాల్ని అందుకున్న వ్యక్తి మహా ప్రవక్త (స). ”ఓ ప్రవక్తా! నిశ్చయంగా నువ్వు మహోన్నత శీల శిఖరాగ్రానివి” (ఖలమ్:4) అని స్వయంగా అల్లాహ్ కితాబిచ్చాడు. అలాంటి వ్యక్తి కాళ్ళు వాసి పోయేలా రాత్రంగా నిలబడి ప్రార్థనలు చేసేవారు. ”అల్లాహ్ మీ పూర్వ, వర్తమాన, భవిష్య పాపాలన్నింనీ క్షమించేశాడు కదా!” అని సతీమణి చెప్పగా, ”ఏమి, నేను ఒక కృతజ్ఞత నిండిన దాసునిగా ఉండ కూడదా?” అని సమాధానమిచ్చారు ప్రవక్త ముహమ్మద్ (స). కృతజ్ఞతా భావం నిండిన దాసులుగా, సుభక్తాగ్రేసరులుగా మనం ఎదగాలి.క్రియా జీవి తానికి సంబంధించిన ప్రతి విషయాన్ని అల్లాహ్‌కు అప్పగించాలి. ఆయన అనమన్నది అనాలి, ఆయన కనమన్నది కనాలి, ఆయన వినమన్నది వినాలి. ఆయన చేయమన్నది చేయాలి. అలా మనం చేయాల్సింది మనం చేస్తూ, షిర్క్ అడసు తొక్కకుండా జీవిస్తే తప్పక సహాయం, ఆధిపత్యం అందిస్తానని మాటిస్తున్నాడు: ”మీలో ఎవరు విశ్వసించి, మంచి పనలు చేశారో అల్లాహ్, వారి పూర్వీకులను భూమికి ప్రతినిధులుగా చేసినట్లుగానే వారికి కూడా ప్రాతినిథ్యం వొసగుతాడు. తాను వారి కోసం సమ్మతించి ఆమోదించిన ధర్మాన్ని వారి కొరకు పిష్టం చేసి, దానికి స్థిరత్వాన్ని కల్పిస్తానని, వారి కున్న భయాందోళనల స్థానే శాంతిభద్రతల స్థితిని కల్పిస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. వారు నన్ను మాత్రమే ఆరాధించాలి. నాకు సహవర్తులుగా ఎవ్వరిని కల్పించకూడదు”. (అన్నూర్: 55)
రాత్రి ఘనత:
రాత్రికి రాత్రే అని అల్లాహ్ పేర్కొన్నాడు. ఖుర్ఆన్లో అనేక చోట్ల అల్లాహ్ రాత్రిని ప్రామాణంగా పేర్కొన్నాడు. రాత్రి పూట పడకల నుండి వేరయి అల్లాహ్ ధ్యానంలో లీనమవ్వడం తన ప్రియతమ దాసుల లకణంగా పేర్కొన్నాడు. ప్రతి రాత్రి చివరి ఝాములో అల్లాహ్ భూ ఆకాశానికి తనకు శోభనిచ్చే రీతిలో దిగి వచ్చి – ”అడిగే వారున్నారా? నేను వారి కోరినది ఇస్తాను. వేడుకునే వారున్నారా? నేను వారి మొరను ఆలకిస్తాను” అంటూ ఫజ్ర్ వేళ వరకూ పిలుపునిస్తూ ఉంటాడు అని పేర్కొన్నాడు. రమజాను మాసపు ప్రతి రాత్రి ఇద్దరు దైవ దూతలు ‘మేలు కోరేవాడా త్వర పడు. కీడు కోరే వాడా! ఆగిపో’ అని పిలుపునిస్తారు అని ప్రవక్త (స) సెలవి చ్చారు. తహజ్జుద్ ప్రార్థన రాత్రి వేళలో ఉంచబడింది. విత్ర్ నమాజు రాత్రి నమాజుగా ఖరారు చెయ్య బడింది. అలాగే ఫజ్ర్, మగ్రిబ్, ఇషా నమాజులు అయిదులో మూడు రాత్రి సమయంలో ఉంచ బడ్డాయి. రాత్రి ప్రార్థనను అల్లాహ్ రహస్య సంభాషణగా పేర్కొనడం జరిగింది. ప్రజలు నిద్రిస్తుండగా లేచి అల్లాహ్ సన్నిధిలో భక్తీప్రపత్తులతో గడపడం స్వర్గ ప్రవేశానికి ప్రతీకక గా పేర్కొనడం జరిగింది. అల్లాహ్ ముందు చీకటిని, తర్వాత వెలుగును ప్టుించడం జరిగింది. చంద్రమానం ప్రకారం రోజు రాత్రితో మొదలవు తుంది. రమజాను మాసంలో రాత్రి ద్వారా ప్రవేశించడం జరిగింది. లౌహె మహ్‌ాఫూజ్ నుండి భూ ఆకాశానికి ఖుర్ఆన్ను రాత్రిలోనే అవతరింప జేయడం జరిగింది. అదే వెయ్యి మాసాలకన్నా ఘనతరమయిన రాత్రి లైలతుల్ ఖద్ర్. దైవదూతలు జిబ్రీల్ (అ)తో సహా దివి నుండి భువికి దిగి వచ్చేది రాత్రి (లైలతుల్ ఖద్ర్) సమయంలోనే. ప్రవక్త (స) హిజ్రత్ కోసం బయలు దేరడం కూడా రాత్రి వేళలో జరిగింది. సజ్జనులయిన మన పూర్వీ కులు రహస్య దానధర్మాలు రాత్రి పూట చేసేవారు. ఇస్రా మరియు మేరాజ్ మహా ఘట్టం సయితం రాత్రి వేళ సంభవించింది. అలాగే ప్రవక్త (స) వారి సహచరలు పగి పూట ధర్మయోధులుగా దర్శనమిస్తే, రాత్రి పూట గొప్ప భక్తిపరుల్లా మారి పోయేవారు. ప్రవక్త (స) ఇషా నమాజు అనంతరం అన వసరంగా మేల్కొవడాన్ని ఇష్ట పడేవారు కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే దెయ్యాలు తిరిగే వేళ కాదు రాత్రి, దైవానుగ్రహాలు కురిసే శుభ సమయం రాత్రి. కాబట్టి అల్లాహ్ దాసులయిన మనం రాత్రి ప్రార్థనా విశిష్ఠను గుర్తిం చాలి. ‘రాత్రి పూట పాపాలకు దూరంగా ఉండే వ్యక్తి పట్ట పగలు పవిత్రం గా ఉంాడు’ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ‘చీకటి తప్పు చేసేవారికి పగలంటే కూడా భయమే. చీకటిలో అల్లాహ్‌కు భయపడేవారు దేనికి భయపడాల్సి అవసరం ఉండదు’. రాత్రి ఆరాధనలో గడిపేవారు ప్రశాంత జీవితం గడిపితే, రాత్రిని పాపా కార్యాల్లో పాడు చేసుకునే వారు భయం, భయంగా జీవిస్తారు.
మస్జిద్ ప్రాశస్త్యం:
‘మస్జిదె హరామ్ నుండి మస్జిదె అఖ్సా వరకు’అని అల్లాహ్ పేర్కొన్నాడు. అంటే ఇస్రా మేరాజ్ ప్రయాణానికి ప్రారంభ స్థలం మస్జిద్. ముగింపు స్థలం కూడా మస్జిదే. భువన స్వర్గ వనాలు మస్జిద్లు. అల్లాహ్ గృహాలు మస్జిద్లు. అల్లాహ్‌ను బిగ్గరగా స్తోత్రగానం చేసే స్తుతి కేంద్రాలు మస్జిద్లు. ‘ఓ అల్లాహ్ నీ కారుణ్య తలుపుల్ని మా కొరకు తెరచు’ అన్న ప్రార్థనతో ప్రవేశించే పవిత్ర స్థలాలు మస్జిద్లు. ప్రాపంచిక పరాచికాలకు చోటు లేని ప్రదేశాలు మస్జిద్లు. ”ఏ గృహాల గౌరవ ప్రతిపత్తిని పెంచాలని, మరి వాటిలో తన నామస్మరణ బిగ్గరగా చేయాలని అల్లాహ్ ఆజ్ఞాపించాడో వాిలో ఉదయం సాయంత్రం అల్లాహ్ పవిత్రతను కొనియాడుతుంటారు. (వారు ఎలాంటి వారంటే) క్రయావిక్రయాలుగానీ, వర్తకంగానీ అల్లాహ్ నామ స్మరణ, నమాజు స్థాపన, జకాతు చెల్లింపు విషయంలో వారిని పర ధ్యానానికి లోను చేయ లేవు”. (అన్నూర్: 36) మానవ చరిత్రలో కని, విని, ఎరుగని రీతిలో జరిగిన ఈ సంఘటన ప్రారం భం మస్జిద్ (మస్జిదె హరామ్). మధ్యమం మస్జిద్ (మిస్జదె అఖ్సా), గమ్యం మస్జిద్ (బైతుల్ మామూర్), శుభ ముగింపు మస్జిద్, (మస్జిదె, అఖ్సా, మరియు హరామ్). దీన్ని బట్టి ఇస్లాంలో మస్జిద్కున్న ప్రాధాన్యత బోద పడు తుంది. స్వయంగా ప్రవక్త (స) వారు సయితం మదీనా వెళ్ళే మార్గంలో ఉండగానే మస్జిద్ ఖుబా నిర్మించారు. మదీనా వెళ్ళాక తన ఇంికన్నా ముందు మస్జిద్ నిర్మాణాన్ని చేపట్టారు. అంటే ముస్లిం జీవితంలో స్వగృహం కన్నా అల్లాహ్ గృహాలనబడే, స్వర్గ వనాలనబడే మస్జిద్లు ఎక్కువ ప్రాధాన్యం గలవి. కాబట్టి ఒక ముస్లిం తన స్వగృహంకన్నా మస్జిద్ను గౌరవించాలి, దానితో ముడి పడి ఉన్న అవసరాలను తీర్చాలి. మస్జిద్లు లేని ముస్లిం ప్రాంతాలలో మస్జిద్ నిర్మాణ శుభకార్యానికి శ్రీకారం చుట్టాలి. మస్జిద్‌లను అల్లరి మూకల నుండి కాపాడాలి. అయిదు పూటల నమాజును మస్జద్లోనే వెళ్ళి చేసే ప్రయత్నం శక్తి వంచన లేకుండా చేయాలి.
మస్జిదే హరామ్ పాశస్త్యం:
అల్లాహ్ ఈ ప్రయాణాన్ని మస్జిదె హారమ్ నుండి ప్రారంభించి మస్జిదె హరామ్తోనే ముగించాడు. ఆ విధంగా ఇస్లాంలో మస్జిదె హరామ్‌కు ఉన్న విశిష్ఠతను విశద పర్చాడు. మస్జిదె హరామ్ ఏ భూ భాగంపైనయితే ఉందో అది ప్రపంచ భూభాగాలన్నింటిలోకెల్లా మహిమాన్విత మయిన భూభాగం. ”నిశ్చయంగా ఈ పట్టణాన్ని అల్లాహ్ భూమ్యాకాశాలను పుట్టించిన నాడే పవిత్రమయినదిగా చేశాడు.ఆయన తప్ప ప్రజలెవ్వరూ దాన్ని పవిత్రమయినదిగా ప్రకటించ లేదు” అన్నారు ప్రవక్త (స). (బుఖారీ) అందు లో ఒక్క పూట నమాజు చదివితే లక్ష నమాజులు చదివినంత పుణ్యాన్ని అల్లాహ్ ప్రసాదిస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కాబా గృహం ఉన్నంత వరకే లోకం ఉంటుంది. అది చెదిరిందంటే లోకం మొత్తం చెల్లాచెదురయి పోతుంది.
మస్జిదె అఖ్సా ప్రాశస్త్యం:
ప్రవక్త (స) వారిని మస్జిదె హారమ్ నుండి మస్జిదె అఖ్సా వరకు తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ ప్రవక్త (స) ఇతర ప్రవక్తలందరి కీ నాయకత్వం వహించి నమాజు చేశారు. ఇది ముస్లింల రెండు ఖిబ్బాల్లోని ఒక ఖిబ్లా. అక్కడ ఒక్క పూట నమాజు చేస్తే 500 నమాజులు చేసేంతి పుణ్యం అల్లాహ్ అనుగ్రహిస్తాడు. ప్రస్తుతం మన వద్ద ఒక ఖిబ్లా మాత్రమే ఉంది. మరో ఖిబ్లాను కూడా యూద కబంద హస్తాల నుండి కైవసం చేసుకు న్నప్పుడే ముస్లిం సమాజం వాస్తవ కీర్తితో అలరారుతుంది.
దుఆ ప్రాముఖ్యత:
”నిశ్చయంగా అల్లాహ్ బాగా వినేవాడు, చూసేవాడు”. (ఇస్రా:1) ఈ సందర్భం అల్లాహ్ ప్రవక్త (స) వారికి ధైర్యాన్నిస్తూ, ఓ ప్రవక్తా! ప్రపంచం మీ గోడునుపట్టించుకోక పోయినా, మీపై జరిగే హింసా కాండను చూడకుండా కళ్ళు మూసుకున్నా నీకు నేనున్నాను. నీ మొరను వింటున్నాను, నీవు సహిస్తున్న చిత్రహింసల్ని గమనిస్తున్నాను. నీ ఏ కృషి వృధా కానివ్వను అని మాిస్తున్నాడు. నేడు సయితం ముస్లింపై జరుగుతున్న మారణకాండను ప్రపంచ మీడియా పట్టించుకున్నా, పట్టించుకోక పోయినా, వారి ఆక్రందనల్ని ఎవరు విన్నా వినకపోయినా అల్లాహ్ మాత్రం అంతా వింటున్నాడు, అంతా చూస్తున్నాడు. ఆయన యుక్తికి లోబడి నేడు ముస్లింలకు ఎదురయి ఉన్న భయానక వాతావరణాన్ని ప్రశాంతమయం చేస్తాడు. ఇందులో సందేహం లేదు. మనం చెయ్యాల్సిందల్లా ఒక్కడే, పరిస్థితులు ఎంత ప్రతికూలించినా ఆయన్నే ఆరాధించాలి, సహాయం కొరకు ఆయన్ను మాత్రమే అర్థించాలి. ధర్మ మార్గం మీద సహన స్థయిర్యాలను ప్రదర్శించాలి.
విశ్వాసాన్ని సాన పెట్టే ప్రక్రియ పరీక్ష:
మేరాజ్ సందర్భంగా ఏడు ఆకాశాల పైన దైవదూతల నాయకులయిన హజ్రత్ జిబ్రీల్ (అ) వారి ద్వారా దైవ ప్రవక్తల నాయకులయిన ముహమ్మద్ (స) వారికి నియంత ఫిర్ఔన్ కూతురి కేశాలంకరిణి (విశ్వాసురాలి) హృదయ విదారక గాథను విన్పించడం జరి గింది. అంటే విశ్వాస మార్గంలో పరీక్షలు సహజమే. అయితే అంతిమ విజ యం మాత్రం సత్యానికే, ధర్మానిదే.
ఇస్లాం ప్రకృతి ధర్మం:
మేరాజ్ సందర్భంగా ప్రవక్త (స) వారు పాలును ఎన్నుకుంటే, ‘మీరు సహజ నైజాన్ని ఎన్నుకున్నారు’ అని చెప్పడం జరిగింది. అంటే ఇస్లాం ప్రకృతి ధర్మం. కలుషితం కాని మానవ నైజానికి దగగ్గరగా ఉన్న ధర్మం. పుట్టే శిశువు కడుపులో మొదట ఎంతో సులభంగా వెళ్ళే ఆహారం పాలు, అంతే సులభంగా జీర్ణమయి పోతుంది కూడా. అలాగే పుట్టే పతి శిశువు ఇస్లాం ధర్మం మీదే పుడుతుంది. పెద్దయ్యాక దాన్ని పాటించడం కూడా అంతే సులభం. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ”ధర్మం సులువయినది” అన్నారు ప్రవక్త (స)
నమాజు ప్రాశస్త్యం:
ధర్మాదేశాలన్ని దాదాపు దైవదూత జిబ్రీల్ (అ) వారిని మాధ్యమంగా చేసి ఇవ్వబడినవే; ఒక్క నమాజు తప్ప. అల్లాహ్ అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ (స) వారిని ఏడు ఆకాశాలకన్నా పైకి పిలిపించుకొని ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా ప్రత్యక్షంగా ప్రసాదించిన మహదానుగ్రహం నమాజు. ఈ కారణంగానే ”నమాజు లేని మతధర్మంలో మేలు లేదు” అని ఓ సందర్భంలో అంటే, ”విశ్వాసి జీవితాన్నుండి అంతిమంగా అంతరించే మేలిమి కార్యం నమాజు” అని వేరొక సందర్భంలో పేర్కొన్నారు ప్రవక్త (స).
సామాజిక రుగ్మతల పర్యవసానం:
మేరాజ్ సందర్భంగా ప్రవక్త (స) పలు సామాజిక రుగ్మతలు, చెడు లక్షణాలకు లభించే శిక్షల్ని కూడా వీక్షించారు. వాటిలో సమాజాన్ని, కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేసే అక్రమ సంబంధ శిక్షలూ ఉన్నాయి. అక్రమార్కులకు పడే శిక్షలూ ఉన్నాయి, వడ్డీ వ్యాపారు నడ్డీ ఎలా విరగ్గొట్టబడతుందో కూడా ఉంది. పరాయి వ్యక్తి సంతానాన్ని తన భర్తసంతానంగా నమ్మించే స్త్రీ పడే దండన వివరాలూ ఉన్నాయి. నీతులు చెబుతూ నీచంగా బ్రతికే వారి దుర్గతి దృశ్యాలూ ఉన్నాయి. ఇవి మనిషికి ఇహపరాల్లో ఎంత హాని చేస్తాయో ఈ సందర్భంగా తెలుపడం జరిగింది.
ఇస్లామీయ సామ్రాజ్య స్థాపన సూత్రాలు:
మేరాజ్ సందర్భంగా ఒక ఇస్లామీ స్థాపనకు కావాల్సిన సూత్రాలను సయితం తెలుపడం జరిగింది. అలాగే భవిష్యత్తు లో యూదుల నుండి ఎదురు కాబోయే ఎత్తుగడల గురించి హెచ్చరిక కూడా ఉంది.
విశ్వాస బలంతోనే విజయం:
మేరాజ్ సంఘట జరగక ముందు, జరిగిన తర్వాత స్థితిగతులను పరిశీలించినట్లయితే-తాయిఫ్ నుండి తిరుగు ప్రయా ణంలో జిన్నుల ఒక వర్గం ప్రవక్త (స) వారిని విశ్వసించి, ఆయన మానవుల కు మాత్రమే కాదు జిన్నాతులకు సయితం ప్రవక్త అన్న మాటకు సాక్షాత్తు నిదర్శనంగా నిలిస్తే, మనుషులయిన మక్కా వాసులు మాత్రం మానవ మహోపకారి ముమహమ్మద్ (స) వారిని మక్కాలో ప్రవేశించకుండా అడ్డుకున్నారు. అప్పుడు ఆయన ఒక అవిశ్వాసి రక్షణలో మక్కాలో ప్రవేశించడం జరిగింది. అది చూసి కొందరు బలహీన విశ్వాసులు ధర్మభ్రష్టులయ్యారు. ఇక మేరాజ్ సంఘటనను వివరించిన తర్వాత అయితే సరే సరి. ఎందరో ధర్మమ నుండి వైదొలిగారు. అల్లాహ్‌ా ఇస్రా మెరాజ్ ఈ సంఘటన ద్వారా తర్వాత స్థాపించ బడే ఇస్లామీయ రాజ్యానికి కావాల్సిన మేలిమి విత్తనాల్ని ఎన్నుకొని, నాసి రకం విత్తనాల్ని ఏరి పారేయ దలిచాడు. నాడే కాదు, నేడు సయితం బల హీన విశ్వాసం గలవారికి విజయశ్రీ కాళ్లు పట్టదు. విశ్వాస బలం గలవారికే నేటికయినా, ఏనాటికయినా విజయం వరిస్తుంది.
అల్లాహ్ దర్శనం:
”మీరు మేరాజ్ సందర్భంగా అల్లాహ్‌ాను దర్శించు కున్నారా?” అని ప్రవక్త (స) వారిని అడిగితే – ”నూరున్ అన్నా అరాహు” – తను అఖండ జ్యోతి నేనెలా ఆయన్ను చూడగలను?’ అని సమాధానమి చ్చారు. ఆయన ఈ మాట వల్ల దేవుని విషయంలో ప్రజల్లో చోటు చేసుకుని ఉన్న మిథ్యా భావాలన్నీ కొట్టుకు పోయాయి. అయితే ఆయన ఇతర ఉల్లేఖనాల ద్వారా స్వర్గవాసులకు స్వర్గంలో అల్లాహ్ దర్శనాభాగ్యం దక్కుతుందని, వారు ఆయన్ను పుణ్యమి చంద్రుని చూసినట్లు స్పష్టంగా చూస్తారని తెలు స్తుంది. అల్లాహ్ మనందరికి ఆయన ప్రియతమ దాసులుగా జీవించి ఆయన స్వర్గ సీమలో ప్రవేశించి ఆయన దివ్య దర్శనంతో పునీతులయ్యే భాగ్యాన్ని ప్రసాదించుగాక! ఆమీన్.