♠బొట్టు: ‘బిందు’ అనే సంస్కృతి పదం ఇది బిందీ నుండి వచ్చింది, దీని అర్ధం బొట్టు. సాదారణంగా ఇది కుంకుమ పౌడర్ నుండి తయారు చేయబడిన ఒక ఎర్రటి బొట్టు బిళ్ళ. హిందూ ధర్మానికి చెందిన మహిళలు దీనిని తమ రెండు కన్నబొమ్మల మధ్య నుదిటి మీద పెట్టుంకుంటారు. వారు దీనిని పార్వతి దేవి చిహ్నంగా పరిగణిస్తారు. మహిళలను వారి భర్తలను కాపాడే స్త్రీశక్తి ని సూచిస్తుందని కొందరి హిందువుల నమ్మకం. సాంప్రదాయంగా ఇది పెళ్ళి అయిందని సూచించే ఒక చిహ్నం. దీనిని హందూ వివాహిత స్త్రీలు పెట్టుకుంటారు. దీనినే టిక్క అని కూడా పిలుస్తారు.
ఈ రోజుల్లో ఆకర్షణీయమైన బొట్టు బిళ్ళలు పెట్టుకోవడం ఒక ఫ్యాషన్ గా మారి పోయింది మరియు పెళ్ళికాని కన్యలు మరియు స్త్రీలు కూడా దీనిని పెట్టుకుంటున్నారు. ఈనాటి బొట్టు వృత్తాకారానికి పరిమితం కాకుండా అండాకారం ,నక్షత్రాకారం, గుండె ఆకారం మొదలైన వివిధ ఆకారాల్లో లభిస్తున్నది.
?మంగళసూత్రం: హిందూ ధర్మంలో మంగళసూత్రం అంటే శుభాన్ని కలుగజేసే ఒక దారపు తాడు. ప్రత్యేకంగా దీనిని తమ పెళ్ళి అయిందని సూచించే చిహ్నంగా హిందూ ధర్మ స్త్రీలు మెడలో ధరిస్తారు. నల్లపూసలు నిండిన రెండు దారపు తాళ్ళు కలిగి ఉండి మధ్యలో మామూలుగా ఒక బంగారం బిళ్ళ ఉంటుంది. చెడు నుండి కాపాడే రక్షణ కవచంగా నల్లపూసలు పనిచేస్తాయని వారి నమ్మకం. ఇంకా అవి ఆ స్త్రీ వివాహాన్ని మరియు ఆమె భర్త ప్రాణాన్ని కాపాడుతాయని వారి నమ్మకం. దక్షిణ భారతదేశంలో, మంగళ సూత్రాన్ని తాళి అని పిలుస్తారు.
పెళ్ళైన హిందూ మహిళలు ఎట్టి పరిస్ధితులలోనూ మంగళ సూత్రాన్ని తొలగించకూడదు. ఆమె విధవరాలు అయినప్పుడు మాత్రమే అది తొలగించబడుతుంది.
♣ముస్లిమ్ ల విషయానికి వస్తే వారు కేవలం అల్లాహ్ ను మాత్రమే సంరక్షకుడిగా భావిస్తారు:
మానవజాతిని సర్వలోక ప్రభువైన అల్లాహ్ కంటే ఉత్తమంగా ఎవ్వరూ రక్షించలేరు. చెడు నుండి కాపాడు కునేెందుకు ఎర్రటి బొట్టు లేక నల్లపూసల దారం మనకు అవసరం లేదు.
?ఖుర్ఆన్ 6వ అధ్యాయము 14వ వచనము లో అల్లాహ్ ఇలా ఉపదేశించాడు.
قُلْ أَغَيْرَ ٱللَّهِ أَتَّخِذُ وَلِيًّۭا فَاطِرِ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ وَهُوَ يُطْعِمُ وَلَا يُطْعَمُ ۗ قُلْ إِنِّىٓ أُمِرْتُ أَنْ أَكُونَ أَوَّلَ مَنْ أَسْلَمَ ۖ وَلَا تَكُونَنَّ مِنَ ٱلْمُشْرِكِينَ
”ఆకాశాలను, భూమినీ సృష్టించినవాడు, అందరికీ తినిపించేవాడూ, ఎవరి నుండి కూడా ఆహారం పుచ్చుకోనివాడూ అయిన అల్లాహ్‌ను వదలి నేను వేరొకరిని ఆరాధ్యునిగా చేసు కోవాలా?” అని ఓ ప్రవక్తా! వారిని అడుగు.”అందరికంటే ముందు నేను ఇస్లాం స్వీకరించాలని నాకు ఆదేశించబడింది” అని నీవు వారికి తెలియజెయ్యి. ”ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు బహుదైవారాధకులలో చేరిపోకూడదు” (అని కూడా నాకు ఆదేశించబడిందని చెప్పు). ?(Quran – 6 : 14)
?ఇంకా ఖుర్ఆన్ లోని అనేక చోట్ల ఇదే విషయం తెలుపబడింది;
بَلِ ٱللَّهُ مَوْلَىٰكُمْ ۖ وَهُوَ خَيْرُ ٱلنَّٰصِرِينَ
వాస్తవానికి అల్లాహ్‌యే మీ రక్షకుడు, ఆయనే అత్యుత్తమ సహాయకుడూను. ?(Quran – 3 : 150)
♣బొట్టు పెట్టుకోవటం లేదా మంగళసూత్రాన్ని ధరించడమనేది మనల్ని అత్యంత ఉత్తమంగా రక్షించే శక్తిగల ఆ సృష్టికర్త శక్తి సామార్ద్యాలను మనం నమ్మటం లేదని నిరూపిస్తుంది.
బరకత్ ఇచ్చువాడు అల్లాహ్. శుభాలు ఇచ్చువాడు అల్లాహ్ అని నమ్ముతాడు ముస్లిం. ఈ నమ్మకాన్ని తీసి మంగళసూత్రం పైన బొట్టు పైన పెట్టుకుంటే అది షిర్క్(బహుధైవరాదన) క్రిందకి వస్తుంది. ఇస్లాంలో షిర్క్ చేయడం క్షమించరాని నేరము.
అది ఈ హదీసుకోవలోనికి వస్తుంది.??
من علَّق تميمةً فقد أشركَ .
ప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా అన్నారు “ఎవరైతే తాయత్తు వ్రేలాడ దీస్తాడో, అతను షిర్క్ చేసాడు” అని అన్నారు. ?- అహ్మద్.
అందువలన ముస్లిం స్త్రీలు హిందూ స్త్రీల లాగా బొట్టు, మంగళసూత్రాలను ధరించరు.
-దీని గురించి ఇస్లాం సందేశాన్ని చదవండి! ?
مَنْ تَشَبَّهَ بِقَومٍ فَهُوَ مِنهُم (أبي داود: 4031 حسن صحيح )
దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు:
“ఎవరు ఏదైనా జాతి(సమూహం) వారి పోలికను అవలంబిస్తారో (లేదా వారి ఆచారాన్ని/ విధానాన్ని అనుసరిస్తారో) వారు వారిలోని వారే అయిపోతారు.” (? అబూదావూద్ – హసన్ సహీహ్).
♣ముస్లింలో ఎవరైనా యూదుల, క్రైస్తవుల లేక బహుదైవారధకు(హిందువు)ల పద్ధతిని అవలంబిస్తారో వారు అదే సమూహానికి చెందిన వారవుతారని ప్రవక్త(స) గారు హితబోధన చేసివున్నారు.
♣ఇస్లామీయ వస్త్రధారణకు వ్యతిరేకం; బొట్టు పెట్టుకోవటం లేదా మంగళసూత్రాన్ని ధరించడమనేది హిందువుల సాంప్రదాయం. ముస్లిమేతరులు ప్రత్యేకంగా ధరించే ఎలాంటి చిహ్నాలైనా, గుర్తులైనా, సంకేతాలైన లేదా మచ్చలైనా ధరించేందుకు ఇస్లామీయ వస్త్రధారణ నియమాలు అనుమతించవు.
?అల్లాహ్ మనందరికీ సధ్బుధ్ధిని మరియు సంపూర్ణ ఇస్లామ్ ఙ్ఞానాన్ని మరియు దాని మీద జీవించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.