ముస్లిం జన జాగృతి – సముద్రం ఎలాగయితే ఒకడికి ఊడిగం చెయ్యదో, తుఫాను గొంతు ఎలాగయితే ఒకడికి అమ్ముడు పోదో, పర్వతం ఎలాగయితే ఒకడికి ఒంగి దండాలు పెట్టదో-ఒక నిజ ముస్లిం సయితం నిజ దైవానికి తప్ప ఏ ఒక్కరికీ తల వంచడు, అంతరాత్మను అమ్ముకోడు, ఒకడికి గులాంగిరీ చెయ్యడు. పత్రిదానికి దాసోహమనడానికి ధన దాసుడు కాదు అతను దైవ దాసుడు. సమస్య అది ఎంత జఠిలమయినదయినా సమన్వయంతో పరిష్కరించుకోగలడు. శాంతియుత, సుహృద్భావ వాతావరణంలో సానుకూల సంపద్రింపులు, చర్చల ద్వారా ఎంతటి సున్నితమయిన అంశాల్నయినా చక్కగా సాల్వ్ చేసుకోగలడు.
‘ఒకే దేశం ఒకే ఆహారం, ఒకే చట్టం’ వంటివి ఎన్ని నినాదాలు వినబడినా, దేశం పధ్రాన సమస్యలయిన- కూడు,గూడు,గుడ్డ, విద్య, వైద్యం, రైతు ఆత్మహత్యలు లాంటివి ప్రస్తావించకుండా అజాన్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినా, ముస్లిం పర్సనల్ లాపై చర్చ లేవనెత్తినా, ముస్లిం మహిళను రాజకీయ బరిలోకి లాగినా, దేశద్రోహి అని నిందించినా అతను అదరడు, బెదరడు. భారత దేశం సొంతమయిన స్నేహపూర్వక వాతవరణానికీ భంగం వాటిల్లనివ్వడు. అతని మౌనాన్ని చేతకానితనం అనుకుంటే పొరపాటే! దేశం కోసం ప్రాణాన్ని సయితం తృణపాణ్రంగా త్యాగం చేసే దేశాభిమాని తను.
మౌనంగా, ధీర గంభీరంగా అభివృద్ధి వైపునకు అడుగులు వేస్తూ, అతనికి ఎదురయిన సమస్యలను అవలీలగా అధిగమిస్తాడన్న సంకేతమివ్వడానికే, సత్య సమర పరంపరల్లో తిరుగు లేని విజయాన్నందించిన రమజాను మాసం వచ్చింది. అది విశ్వాస జన జాగృతికి నికేతనం. ఓర్పు, సహనాల, త్యాగం, ఔదార్యాలకు పుట్టినిల్లు. పత్రి చారితక్ర ఘట్టం కొందరు వ్యక్తుల్ని కీర్తి శిఖరాల మీద కూర్చోబెడుతుంది అంటారు. ఈ రమాజన్ ముస్లిం సముదాయం పాలిట ఓ చారితక్ర మలుపే. ఇక్కడ మనం నెగ్గుతామా లేదా అన్నదే పరీక్ష!
తగిలిన కాలికే మళ్ళీ మళ్ళీ దెబ్బ తగులుందన్న చందంగా నేడు ముస్లింల పరిస్థితి ఉందన్న మాట నిజమే కావచ్చుగాక. కానీ కలిసి పోరాడితే సాధ్యం కానిదంటూ ఏది ఉండదు. ఇలారి తరుణంలో మన బాధ్యతను గుర్తు చేసే కొన్ని విషయాలను నెమరు వేసుకోవడం మనకు మేలు చేస్తుంది అనడంలో సందేహం లేదు. ”అయితే బోధనను కొనసాగించు. నిశ్చయంగా బోధన విశ్వా సులకు లాభదాయకం అవుతుంది”. (అజ్జారియాత్: 55)
బారత దేశ రాజకీయ, సామాజిక, ఆధ్యాత్మిక, నైెతిక స్థితి మరియు ముస్లింలు అన్న అంశంపై సమీక్ష జర గాలి. రోజు రోజుకి ముస్లింలలో చోటు చేసుకుంటున్న ధర్మ రాహిత్యం, పదార్థ పూజ, స్వార్థం, నైతిక పతనం, ఉమ్మడి నీతి విస్మరణం, పాధ్రాన్యతలకు పామ్రుఖ్య ఇవ్వక పోవడం, పండిత వర్గం పట్ల అనాసక్తత, ధర్మ సందేశ బాధ్యతను సజావుగా నిర్వర్తించక పోవడం వంటి వాటిపై దృష్టి సారించాలి. షరీఅతు-ధర్మశాస్త పరిరక్షణ, షరీఅతు-ధర్మశాస్త అచరణ, షరీఅతు-ధర్మశాస్త బోధనను గురుతర బాధ్యతగా నిర్వర్తించాల్సిన పండిత మహాశయులు పై విషయాల మీద దృష్టిని కేందీక్రరించడమే కాక, ఒండొకరిపై దుమ్మెత్తి పోసే ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్న స్వార్థపూరిత దుష్కృతికి తిలోదకాలిచ్చి, వారి పత్రిభా పాటవాలను నేడు ముస్లిం సముదాయానికి ఎదురయి ఉన్న ఛాలెంజెస్ను ఛేదించడంలో వ్యయ పర్చాలి.
ముస్లిం యువతలో నాస్తిక భావజాలం పెరుగుతోంది, హలాల్ హరామ్ల విచక్షణ అంతరిస్తోంది. ఇస్లాం ధర్మం మీద బురద జల్లే పయ్రత్నాలు జోరు మీదున్నాయి. ఈ సందర్భంగా జిహాద్, స్తీ, ఉగవ్రాదం, పరస్పర ఉనికి సంరక్షణ వివరణ ఆవశ్యకత ఎంతయినా ఉంది. సున్నత్, బిద్ఆత్ల అవగాహనతో పాటు తౌహీద్పై ముస్లిం జన సమూహాన్ని సమైక్య పర్చే సమిష్టి కృషికి కార్యరూపం ఇవ్వాల్సిన అవసరం ఎంతయినా ఉంది.
‘ముస్లిం పర్సనల్ లా’ అంటే ముస్లింలందరి తరఫు సారథ్యం వహించే అతి పెద్ద వ్యవస్థ అన్న మాటను జన సామాన్యానికి అర్థమయ్యేలా చెయ్యాలి. విపత్కర పరిస్థితుల్లో నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో ఇమామ్ ఇబ్ను తైమియా (రహ్మ), షా వలియుల్లాహ్ా దహ్లవీ, షా ఇస్మాయీల్ దహ్లవీ (రహ్మ) జీవితాలను స్ఫూర్తిగా తీసు కోవాలి. ఇలాంటి ఒక దశలో మౌలానా అషప్ర్ అలీ థానవీ (రహ్మ) కనబరచిన సమయస్ఫూర్తి అనుసరణీయం. ట్రిబుల్ తలాఖ్ విషయమయి మహిళా వ్యతిరేకతను నాడు ఆయన ఎంతో చాకచక్యంగా పరిష్కరించారు. మక్కా, మదీనాల నుండి మాలికీ పంథా పండితుల ఫత్వాలు తెప్పించి ‘అల్ హీలతున్నాజిజహ్ లిల్ హీలతిల్ ఆజిజహ్’ అన్న పుస్తకాన్ని పచ్రురించారు. ఇస్లాం అపహస్యం పాలవుతున్నా స్వీయ అహాన్ని సంతృప్తి పరచడానికి సొంత ధర్మానికి ద్రోహం తల పెట్టడం ఎంత మాతం హర్షణీయం కాదు అన్న విషయాన్ని ఎంత తొందరగా గ్రహిస్తే అంతే మంచిది.
చివరిగా-మానవత్వం పరిఢవిల్లిన పుడమి మన భారతావని. మనమందరం ఈ మహ వృక్షానికి చిగురించిన ఆకులం, పూసిన పువ్వులం, కాసిన కాయలం. విభిన్న సంస్కృతుల, సాంపద్రాయాల, భాషల, మతాల మేలు కలయిక మన భారతావని. ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకోవాల్సి బాధ్యత మనందరిది. వ్యక్తికన్నా వ్యవస్థ ముఖ్యం, వ్యవస్థకన్నా దేశం ముఖ్యం అన్న స్పృహ మనలో పత్రి ఒక్కరికీ ఉండాలి. వ్యక్తి కన్నా ఓటు ముఖ్యం, వ్యవస్థకన్నా కులం ముఖ్యం, దేశంకన్నా రాజకీయం ముఖ్యం అన్న ధోరణి అంతమవ్వాలి. అందుకు అందరం కంకణం కట్టాలి!