ఆది మానవులు మరియు ప్రవక్త అయిన ఆదం (అ) మొదలు అంతిమ ధర్మబోధ మనందరి బాధ్యత / Teaching the truth is the responsibility of all of us దైవప్రవక్త ముహమ్మద్ (స) వరకు దాదాపు 1లక్ష 24 నాలుగు వేల మంది ప్రవక్తలు చేపట్టిన బృహత్కా ర్యం ధర్మబోధ, అల్లాహ్ వైపునకు ఆహ్వానం. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (స) వారితో దైవదౌత్యం పరిసమాప్తమయింది గనక ఇకమీదట అల్లాహ్ ధర్మాన్ని ఆయన దాసుల వరకు చేరవేసేందుకు ఏ ప్రవక్త రాడు. ఆయన తదనానంతరం ఆ బాధ్యత మనపై మోప బడింది. దీనికి మించిన భాగ్యం మరేం కాగలదో చెప్పండి! మనం అలాంటి బృహత్కార్యంలో భాగస్తులవ్వడం నిజంగా మనందరి అదృ ష్టం,వాస్తవంగా ఈ కార్యానికి మించిన కార్యం ఈ లోకంలో మరొకటి లేదు. ఈ హోదాకు మించిన హోదా మరొకటి కాజాలదు. ఇదే విష యాన్ని అమతిమ దైవగ్రంథం ఖుర్‌ఆన్ ఇలా పేర్కొంటుంది: అల్లాహ్ వైపునకు ఆహ్వానిస్తూ, సత్కర్మల్ని ఆచరిస్తూ ‘నేను ముస్లిమును’ అనే వ్యక్తి పలుకు కంటే ఎవరి పలుకు మేలైనది కాగలదు?” (ఫుస్సిలత్: 33)
అల్లాహ్‌ా వైపు ఆహ్వనంతో మనం అల్లాహ్‌ా ప్రేమకు పాత్రులం కాగలం. అల్లాహ్‌ా వైపు ఆహ్వానంతో మనం ప్రజల్ని రుజుమార్గం వైపు పిలిచి వారి ఇహపరాల్ని బాగు చేయగలం. అల్లాహ్‌ా వైపు ఆహ్వానంతో సాటి ప్రజల మధ్య తలెత్తె తరతమ భేధాల్ని రూపు మాపగలం. అల్లాహ్‌ా వైపు ఆహ్వానంతో మనం చెల్లాచెదురుగా ఉన్న మానవ సమాజాన్ని సమైక్య పర్చగలం. అల్లాహ్ వైపు అహ్వానంతో మనం ప్రజల ప్రవ ర్తనను, నడకు, నడవడికను చక్కదిద్దగలం. ఇన్ని సత్ఫలితాలు ఇందులో దాగున్నాయి గనకే అల్లాహ్ ఇలా ఆదేశించాడు: ”మీలో ఒక వర్గం తప్పక ఉండాలి. వారు మంచిని గురించి ఆదేశించాలి. చెడు నుండి వారించాలి. ఇలా చేసినవారే నిజమయిన సాఫల్యవంతులు”. (ఆల్ ఇమ్రాన్: 104 )
దైవప్రవక్త ముహమ్మద్ (స) ఇలా ఉపదేశించారు: ”ఎవరయితే సన్మార్గం వైపునకు ప్రజల్ని ఆహ్వానించాడో అతనికి సన్మార్గాన నడిచిన వ్యక్తికి లభించిన పుణ్యం, అతన్ని అనుసరించిన వారి పుణ్యం కూడా లభిస్తుంది. అయితే వారి పుణ్యంలో ఎలాంటి కొరతా ఏర్పడడు”. ( ముస్లిం. తిర్మిజీ )
మనం చేయాల్సిదల్లా ఒకటే మనకు పరిచయం ఉన్న, పరిచయం లేని వ్యక్తుల వరకు ఇస్లాంను పరిచయం చేసే సాహిత్యాన్ని చేరవేయడమే. అలా చేరవేసిన మనం అల్లాహ్ వైపునకు ఆహ్వానించిన వారి జాబితాలో చేరగలం. ప్రవక్త (స) అన్నారు: బల్లిగూ అన్నీ వలౌ ఆయహ్’ – నా నుండి విన్న ఒకే ఒక్క మాటనయినా సరే ఇతరుల వరకు చేరవేయండి. కాబట్టి ఇందులోని ఒక కరపత్రాన్ని మనం చేరవేసినా అల్లాహ్ సందేశాన్ని ఆయన దాసుల వరకు చేరవేసిన వారమవుతాము. ఒక కరపత్ర మాధ్యమంగా ఇస్లాం స్వీకరించిన వారు ఎంత మంది లేరు. ఎవరో ఇచ్చిన పుస్తక ఆధారం గా ఇస్లాం స్వీకరించన వారు ఎంత మంది లేరు. చివరికి ఒక మంచి మాట మాధ్యమంగా ఇస్లాం స్వీకరిమచిన వారు ఎంత మంది లేరు. ఒక్క మాటలో చెప్పాలంటే మనమందరం ధర్మ బోధకులం. ధర్మబోధన మనందరి బాధ్యత.
మనలోని ప్రతి వ్యక్తి ఏదోక విధంగా ఇతరుల్ని ప్రభావితం చేస్తున్నాడు. ఇతరుల వల్ల ఏదోక విధంగా ప్రభా వితం అవుతున్నాడు. వక్తలు, రచయితలు, నాయకులు, పండితులు మాత్రమే ఇతరుల్ని ప్రభావితం చెయ్యగలరు అన్నది ఒక అపోహ తప్ప మరేమీ కాదు. వ్యక్తి ఎవరయినా తన మాట ద్వారా, తన ప్రవర్తన ద్వారా ఇతరుల్ని ప్రభావితం చెయ్యగలడు. ఇతరుల్ని ఇట్టే ఆకట్టుకో గలడు. అంటే మన మంచి ప్రవర్తన మంచి ప్రభావాన్ని చూసిపతే, చెడ్డ ప్రవర్తను చెడు ప్రభావానికి కారణం అవుతుంది. మనం మన ధర్మ సేవ ఎంత చేశామన్నది కాదు ముఖ్యం. ఎంత నాణ్యతతో చేశాము. ఎంత చిత్తశుద్ధితో చేశామన్నది ముఖ్యం. దైవప్రవక్త (స) ఒక్కో వ్యక్తి దగ్గరకు 70 సార్లకన్నా ఎక్కువ వెళ్ళేవారు అంటే, ఈ బృహత్కార్య నిర్వహణ ఫలితంగానే కొందరు ప్రవక్తలు అన్యాయంగా చంప బడ్డారు, కొందరు ప్రవక్తల్ని రంపంతో రెండుగా చీరేశారు, కొందరు ప్రవక్తలు నిప్పుల్లో నెట్ట బడ్డారు, కొందరు దూషించబడ్డారు, కొందరు చిత్రహింసలకు గురి చేయబడ్డారు అంటే మానవాళిని మాధవుని దరికి చేర్చడం, వారిని నరకాగ్ని నుండి కాపాడటం ఎంత ఘనతర కార్యమో అర్థం అవుతుంది.
ఓ సోదరుడు తన రూమ్‌మెట్‌ని ఎప్పుడూ ప్రేమతో పలుకరించేవాడు. అయితే అతను ముస్లిం అవ్వడం చేత ఆ వ్యక్తి అంతగా పట్టించుకునే వాడు కాదు. ఇస్లాం గురించి ఏదయినా చెప్పాలన్నా వినేవాడు కాదు. ఓ రోజు గిఫ్ట్ ప్యాక్ తీసుకెళ్ళి అతనికిచ్చాడు. అతను తీసుకోవడాని కయితే తీసుకున్నాడు కానీ, తర్వాత దాన్ని చెత్తకుండి పడేశాడు. అలా అనేక సార్లు జరిగింది. అయినా ముస్లిం సోదరుడు తన ప్రయత్నాన్ని మానుకోలేదు. చివరికి ఓ రోజు ఆ వ్యక్తి ఆలోచించాడు- ఇంతలా నేను అసహ్యించుకుంటున్నా, కాదంటున్నా తనెందుకు అంతలా నన్ను బతిమాలుతున్నాడు. ఆ పుస్తకాలలో ఏముందో చదివితే పోలా, అని అంతకు క్రితమే చెత్తకుండిలో పడేసి ఓ పుస్తకాన్ని తీసుకొని చదవనారంభించాడు. అల్‌హమ్దు లిల్లాహ్ తర్వాత పుస్తకాలన్నీ తిరగేసిన అతను ఇస్లాం స్వీకరించాడు.
ఇలా ఎవరు ఎవరి ఇస్లాం స్వీకరణకు కారకులవుతారో మనకు తెలియదు.ఆ విషయానికొస్తే నేడు పండితాగ్రేసర స్థాయిని అధిరో హించి, సహీహుల్ జామె అన్న హదీసు పుస్తకాన్ని 20 సంపుటాల్లో రచించిన మౌలానా జియావుర్రహ్మాన్ ఆజమీ-ఒకప్పుడు ముస్లిం కాదు. అయితే తెలుగులో ‘ఇదియే ఇస్లాం’ అన్న మౌలానా అబుల్ ఆలా మౌదూదీ (ర) గారి అన్న పుస్తకాన్ని హిందీలో చదివారు. అది ఆయన జీవితాన్నే మార్చి వేసింది. ఆ పుస్తకాన్ని ఆయనకెవరిచ్చారో కూడా ఆయనకు గుర్తు లేదు కానీ నేటికీ ఆయన ఆ వ్యక్తి గుర్తు చేసుకుంటూనే, మనస్ఫూర్తిగా దీవిస్తూనే ఉం టారు.
అలాగే డి.ఎమ్.కె వంటి నాస్తిక భావజాలం మీద ఆధార పడిన రాజకీయ పార్టీలో ప్రముఖ పాత్ర పోషించిన ఒక ప్రసిద్ద తమిళ పాత్రికే యుడు అడియార్ ఎలా ఇస్లాం స్వీకరించారనుకుంటున్నారు? ఆయన అనారోగ్యానికి గురయి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆయన అనుమతి మేరకు అందరూ అన్ని మత గ్రంథాలను ఆయనకందిం చారు. వాటన్నింటిని చదివిన ఆయన సత్య ధర్మం ఇస్లాం మాత్రమే అన్న నిర్ణయానికి రావడమే కాకుండా ‘నిరోట్టం’ అనే దిన పత్రికలో ఇస్లాం ధర్మానికి సంబంధించి వ్యాస పరంపరను వ్రాసారు. చివరకు ఇస్లాం స్వీకరించి తన పేరు అబ్దుల్లాహ్‌గా మార్చుకున్నారు.
కనుక మనందరిలో ఓ జ్వాల అనేది ప్రజ్వలిస్తూనే ఉండాలి. అనారోగ్యంతో బాధ పడుతున్న మన కుమారున్ని వైద్యుని వద్దకు తీసుకెళ్ళి వైద్యం చేయిన్చెంత వరకూ మండుతూ ఉండే మమతాగ్ని జ్వాలలా దైవ దాసుల్ని వారందరి నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ సన్నిధికి చేర్చేంత వరకూ మనలో సైతం ఆ శ్రేయాగ్ని జ్వాల మండుతూనే ఉండాలి.