ఇది మనుషులు చేసే పనియేనా?

 

''మీరు అల్లాహ్‌కు భయపడరా?...మీకు పూర్వం లోకవాసులెవరూ చేయని నీతిమాలిన పనికి మీరు పాల్పడుతున్నారే?! మీరు లోకంలోని పురుషుల వద్దకు పోతున్నారేమిటి? అల్లాహ్‌ మీ కొరకు జతగా సృష్టించిన మీ భార్యలను విడిచిపెతున్నారే! మీరు మరీ బరితెగించిన జనంలా ఉన్నారు''. (ఖుర్‌ఆన్‌: 29:161-166)

”మీరు అల్లాహ్‌కు భయపడరా?…మీకు పూర్వం లోకవాసులెవరూ చేయని నీతిమాలిన పనికి మీరు పాల్పడుతున్నారే?! మీరు లోకంలోని పురుషుల వద్దకు పోతున్నారేమిటి? అల్లాహ్‌ మీ కొరకు జతగా సృష్టించిన మీ భార్యలను విడిచిపెతున్నారే! మీరు మరీ బరితెగించిన జనంలా ఉన్నారు”. (ఖుర్‌ఆన్‌: 29:161-166)

”మీరు అల్లాహ్‌కు భయపడరా?…మీకు పూర్వం లోకవాసులెవరూ చేయని నీతిమాలిన పనికి మీరు పాల్పడుతున్నారే?! మీరు లోకంలోని పురుషుల వద్దకు పోతున్నారేమిటి? అల్లాహ్‌ మీ కొరకు జతగా సృష్టించిన మీ భార్యలను విడిచిపెతున్నారే! మీరు మరీ బరితెగించిన జనంలా ఉన్నారు”. (ఖుర్‌ఆన్‌: 29:161-166) అని తన జాతి వారినుద్దేశించి అన్నారు ప్రవక్త లూత్‌ (అ).

పై ఆయతులో పేర్కొనబడిన ‘నీతిమాలిన పని’ అంటే స్వలింగ సంపర్కం. ఈ అసహజ లైంగిక చేష్టకు మానవ చరిత్రలోనే తొట్టతొలి సారిగా పాల్పడిన పాపం లూత్‌ జాతి వారిది. ‘కామా తురా ణాం న భయం న లజ్జ’ అన్నట్లు కామంతో కన్ను మిన్ను కానక వ్యవహరించారు. దాని కోసం ప్రకృతి సిద్ధంగా నిర్దేశించబడిన సహజ పద్ధతి కూడా వారికి తృప్తినీయలేదు. బరితెగించి మరీ అస హజమైన పద్ధతి ద్వారా వారి కామ తాపాన్ని చల్లార్చుకున్నారు. వారు పాల్పడిన ఈ చేష్టకుగాను అల్లాహ్‌ా వారిని మహా భయంకరంగా శిక్షించాడు. ‘స్వలింగ సంపర్కం మరియు సహజీవనం (వ్యభి చారం) ఈ రెండూ జీవితంలోని 72 రకాల పాపాలకు ప్రేరకం’ అని హజ్రత్‌ అలీ (ర) గారు చెప్పా రంటే ఈ ముదనష్టపు వ్యవహారం ఎంత ప్రమాదకరమైనదో ఆలోచనాపరులు అర్థం చేసుకోవచ్చు.

స్వలింగ సంపర్కం అత్యంత నీతి బాహ్యమయిన చేష్టగా, అసాంఘీక కార్యకలాపంగా ప్రపంచ మతాలన్నీ పరిగణిస్తున్నప్పటికీ, నేడు 126 దేశాలు స్వలింగ సంపర్కం నేెరం కాదని ఈ ముదనష్టపు చేష్టకు చట్టబద్ధతనివ్వడం అనేది ఆయా దేశ పాలకుల ఆలోచనలు ఏ దిశకు పయనిస్తున్నాయో చెప్పకనే చెబుతుంది. ఈ దుష్కృతి విష వీచికలు కొన్నేళ్ళుగా మన దేశ వాతావరణాన్ని సయితం కలుషితం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక ఎయిడ్స్‌ వ్యాధి అనేది స్వలింగ సంపర్కులకు ఎక్కువ గా సక్రమిస్తుందనేది అందరికి విదితమయిన విషయమే.
11.12.2013న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో స్వలింగ సంపర్కం చట్టం దృష్టిలో నేరం. స్వలింగ సంపర్కం ఏ రూపంలో ఉన్నా అక్రమం, అనైతికం, అసహజమయినదేనని ఖరారు చేసింది ధర్మా సనం. ‘పరస్పర సమ్మతితో స్వలింగ సంపర్కానికి పాల్పడితే అది నేరం కాదం’టూ ఢిల్లీ హైకోర్టు 2009లో ఇచ్చిన తీర్పుకు ప్రతిస్పందిస్తూ అప్పటి నెలవంక గౌరవ సంపాదకులు ముహమ్మద్‌ అజీజు ర్రహ్మాన్‌ గారు ‘ఈ రోగ కారకాలను ప్రజా జీవితాల నుండి ఏరి వేయాలి’ అంటూ ఈ దుష్చర్యను దుయ్య బట్టారు. అప్పటికీ-ఇప్పటికీ స్పష్టంగా కానవచ్చే తేడా ఏమిటంటే, దాదాపు ఐదు సంవత్స రాల చట్టబద్ధతత, భద్రత లభించిన కారణంగా నేటి ప్రజల గళంలో మార్పు కొట్టుకొచ్చినట్లు కన బడుతోంది. దీనికి తోడు బడా బాబుల సమర్థన కూడా పెద్ద ఎత్తునే వినబడుతోంది. ‘వారూ మను షులే, వారికీ మనసుంటుంది, వారికీ మెదడుంటుంది’ అనే ప్రబుద్ధులు, ‘సహజీవనం అంతా ప్రమో దమే ప్రమాదం ఏమీ లేదు’ అని ఉద్దండగా ఉపన్యాసాలిచ్చే ఉదారవాదులు ఒక్కసారి కాదు, వంద సార్లు ఆలోచించాలి!

సహజీవన విధానంగానీ, స్వలింగ సంపర్కంగానీ వీటి వల్ల జీవన విలువలు భ్రష్టు పడతాయి. ఇవి అటు వ్యక్తికి, ఇటు సంఘానికీ అనర్థదాయకం. ఈ రెంటి వెనకాల ఎవరు ఎంత కాదన్నా కామ తాపం చల్లార్చుకోవడమే లక్ష్యంగా కొనసాగుతున్నది.’వినాశకాలే విపరీతి బుద్ధి’ అన్నట్టు వికృత చేష్టలు అవి ఏ రూపంలో ఉన్నా విపరీతమయిన ఫలితాలే ఉంటాయి. ఈ నీతి మాలి చేష్టల్లో ఓ చేష్ట పూర్తిగా అసహజమయినదయితే, మరోకటి పూర్తిగా అధర్మమయినది.

‘బుద్ధి కర్మానుసారిణి’ అంటారు. కానీ మనిషి బుద్ధే చెడ్డది. ‘పేళ్ళి అనేది పాత కాన్పెప్ట్‌’ అంటూ నైతికతకు ఉన్న ఆ కాసిన్ని వలువల్ని సయితం ఊడబెరికే ప్రయత్నంలో మంచిని సమాధి చేసేవారికి నేడు మన సమాజంలో కొరత లేదు. కఠినమయిన చట్టాలు ఉంటేనే నేరాలూ, ఘోరాలూ ఆగడం లేదు.ఇక నేరానికే చట్టబద్ధత లభిస్తే నేరగాళ్ళకు, కామాంధులకు పట్టపగ్గాలుండవు. సతీ సహగమన స్థితి నుండి వేలాది సంస్కరణల ఫలితమే నేటి మన భాతర సమాజం. నాగరికత అనేది మనిషికి మరింత మంచిని, న్యాయాన్ని అందించాలి. అంతేగాని అధఃపాతాళానికి నెట్టేదిగా ఉండకూడదు.

పోతే, 377 నిబంధన కేవలం స్వలింగ సంపర్కులకే కాదు – దీని ప్రకారం పునరుత్పత్తికి దోహ దం చేయని ఏ రకమయిన లైంగిక ప్రక్రియ అయినా శిక్షార్హమే.భారత శిక్షాస్మృతి సెక్షన్‌ 377 (అస హజ నేరాలు) ప్రకారం ప్రకృతి విరుద్ధమయిన శృంగార కార్యకలాపానికి పాల్పడిన వారికి పదేళ్ళ దాకా శిక్ష విధించేందుకు అవకాశముంది. కాగా ఇదే సమయంలో ఈ ధోరణులు ఉన్న వారినిలో చట్టం విధించే శిక్ష పట్ల భయంతోపాటు, దైవభీతిని, నైతిక రీతిని పెంపొందించే ప్రయత్నం చేయ డం మనందరి కనీస మానవీయ ధర్మం!

Related Post