స్వాతంత్య్రం పరిమళించాలంటే..

 

మేరా ముల్క్‌, మేరా దేశ్‌, మేరా యే వతన్‌ శాంతికా, ఉన్నతికా, ప్రేమ పూవనం

మేరా ముల్క్‌, మేరా దేశ్‌, మేరా యే వతన్‌
శాంతికా, ఉన్నతికా, ప్రేమ పూవనం

మేరా ముల్క్‌, మేరా దేశ్‌, మేరా యే వతన్‌
శాంతికా, ఉన్నతికా, ప్రేమ పూవనం

అవును విశ్వంలోనే విశిష్ఠమయినది మన దేశం. మనకు దేశం అంటే ఎంతటి అభిమానమంటే, రెపరెపలాడుతున్న మువ్వన్నెల జెండాను చూస్తే చాలు అన్నీ మర్చిపోతాము. ఏదో తెలియని మధురానుభూతి, మరేదో చైతన్యం వీటన్నింటికీ మించి మది నిండా పొంగి పొర్లే దేశాభి మానం. జాతీయ జెండాను చూడగానే మనం పులకించి పోతాము, పరవశించి పోతాము. బహుశా ఇదే భారతీయతలోని గొప్పతనమేమో! ప్రపంచంలో ఏ దేశానికి లేని మానవ సంపద మన సొంతం.

మన ఈ స్వాతంత్య్ర భారత దేశం ఒకరిద్దరి కృషితో సాధ్యమయింది కాదు. ఒకరి కోసం కొందరు, కొందరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు పోరాడితే వచ్చింది కాదు నేటి మన ఈ స్వాతంత్య్రం. అందరి కోసం అందరూ కలిసి ఏక త్రాటిపై నిలిచి సమిష్టి పోరాడి సాధించుకున్నది నేటి మన ఈ స్వాతంత్య్రం. ఒక్క క్షణంలోనో, ఒక్క గంటలోనో, ఒక్క రోజులోనో వచ్చింది కాదు నేటి మన ఈ స్వాతం త్య్రం. కొన్ని వందల సంవత్సరాలు కలిసికట్టుగా పోరాడితే వచ్చింది నేటి మన ఈ స్వాతంత్య్రం. ఎంతో మంది అమరవీల, వీర జవానుల, చరితార్థుల త్యాగ ఫలితం నేటి మన ఈ స్వాతంత్య్రం. అద్వితీయంగా, అపురూపంగా నాటి స్వాంతంత్ర సంగ్రామం సాగింది గనకే,ఆ మహో న్నత అధ్యాయం నేటికీ అందరి చేతా కొనియాడ బడుతోంది. స్వాతం త్య్రమనే నిధి సాకారమయిన ఆ అద్భుత ఘట్టాన్ని తల్చుకున్నప్పుడల్లా భారతీయుడయిన ప్రతి పౌరుని హృదయంలో ఉద్వేగం ఉప్పొంగు తుంది. మది దాటిన సంతోషం ‘జైహింద్‌’ అని స్మరిస్తుంది.

భారత దేశ చరిత్రలో స్వాతంత్య్రోద్యమం ఓ మహోజ్వల ఘట్టం. భార తీయుల పోరాట పటిమకు, త్యాగనిరతికి, నిరుపమాన దేశాభిమానా నికి ఈ సమరం నిలువుటద్దం.ఈ సమరాన్ని సుసంపన్నం చేసేందుకు జాతి, మత, కుల, ప్రాంతీయతలను విస్మరించి భారతీయులంతా ఏకో న్ముఖంగా ఆత్మార్పణలకు పోటీ పడటటం అమోఘం,అమేయం, అపూ ర్వం. ఒకే నినాదంగా, ఒకే లక్ష్యంతో, ఒకే మాటగా, ఒకే బాటగా కోట్లాది ప్రజానీకం ముందుకు సాగడం ప్రపంచ చరిత్రలోనే అరుదైన మహత్తర ఘట్టం.
ఈ పోరాటానికి భారత దేశపు అతి పెద్ద అల్ప సంఖ్యాక వర్గమయిన ముస్లిం సమాజం తనదైన భాగస్వామ్యాన్ని అందించింది. అపూర్వ త్యాగాలతో, అసమాన సాహసాలతో భారత ముస్లింలు మాతృభూమి విముక్తి పోరాటంలో పాల్గొని పునీతులయ్యారు. –

భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి నేటికీ 67 వసంతాలు. కొన్ని రోజుల క్రితమే మనం 65వ గణతంత్ర సంబరాల్ని జరుపుకున్నాము. ఈ సుదీర్ఘ కాలంలో భారత్‌ పరిస్థితి మూడడుగులు ముందుకు రెండ డుగులు వెనక్కి అన్న రీతిలో ముందుకు సాగుతోంది.ఇందుకు ప్రధాన కారణం-స్వార్థపరులు, అవినీతిపరులు, అక్రమార్కులు, అసమర్థుల యిన నాయకులు, అటువంటి నేతలను ఎన్నుకొన్న ప్రజలు-మనం కూడా. నేడు మనం రాజకీయంగా ఎంతో చైతన్యవం తులయినప్పటి కీ, విద్యావంతులయినప్పటికీ కుల, మత, ప్రాంత, భాష వంటి వల్ల తీవ్ర ప్రభావితులయిన కారణంగా, సదరు నేత ఎంత అవినీతిపరుడ యినా, అయోగ్యుడయినా,నరరూప రాక్షసుడని తెలిసినా, తమ కులం వాడో, తమ మతంవాడో అయితే అతని అక్రమాలను, అఘాయిత్యాలను పట్టించుకోకూడదనే ఒక మూర్ఖ సిధ్ధాంతానికి లొంగి బ్రతకడమే కాక, సదరు నేత వేల మంది ప్రాణాలు పోవడానికి కారణమయినా అతన్ని విమర్శించినవారిని ఎదుర్కొవడం తమ నైతిక బాధ్యతగా భావి స్తున్నాము గనకే అట్టి అవినీతిపరుల ఆటలు ఇంకా కొనసాగుతు న్నాయి.

కావాల్సినంత ధనదాహం…టాక్స్‌ సేవింగ్‌కి సరిపడేంత దానగుణం ..ఒంటి నిండా స్వార్థం..ఊరి నిండా లంచం..వ్యవస్థ మొత్తం అస్త వ్యస్థం..హృదయం-శ్మశానమంత విశాలం..గుణం-మానభంగం చేసే ంత పైశాచికం..చచ్చేంత భయం..చప్పేంత ధైర్యం…మౌనం కూడా సిగ్గు పడేంత చేతకానితనం..ఎప్పుడూ కలహం..అప్పుడప్పుడు ఐకమ త్యం…ఇది నేటి మన భాతరం. ఇదా మన పెద్ద ఆశించిన దేశం? ‘నా దేశం చంద్రుని మీద మనిషిని నిలబ్టెకపోయినా ఫర్వా లేదు, భూమ్మీద మనిషిని మనిషిగా చూస్తే చాలు’ అని డా.అంబేడ్కర్‌ చేప్పిన మాట అక్షరాల అచరణీయం.

మన పూర్వీకులు శ్రమకోర్చి మనకు స్వాతంత్య్రాన్ని సంపాదించి పెట్టారు…ఎంత స్వాతంత్య్రం అంటే, ఉగ్రవాదంఅనుకుంటూనే… విచక్షణారహితంగా కాల్పులు, పేలుళ్లు జిరిపేతంట, ప్రేమించలేదని ఆసిడ్‌ దాడి చేసేటంత, కట్నం తేలేదని కాటికి పంపించేటంత, అమ్మ నాన్నను వృధ్దాశ్రమానికి తరలించేంతట…ఆఖరికి సహజీవనం చేసే టంత, స్వలింగ సంపర్కానికి అధికారికంగా అనుమతి కోరేటంత, సొంత ప్రాణం తీసుకునే అంత, ఇతరుల స్వేచ్ఛను హరించేటంత స్వాతంత్య్రాన్ని సంపాదించుకున్నాము..శభాష్‌!

‘ఫ్రీడం ఈజ్‌ రెస్పాన్సిబిలిటీ’ బాధ్యతారహిత స్వేచ్ఛ ‘పిచ్చోడి చేతి లో రాయి’ చాలా ప్రమాదకరం…మనకి వద్దు. మనం ప్రశాంతంగా బ్రతుకుతూ ఇతరులను కూడా ప్రశాంతంగా బ్రతకనిస్తే అది స్వేచ్ఛ. లేకపోతే అది జంతు స్వేచ్ఛ. కాబట్టి మన ప్రవర్తనను సమీక్షించు కుంటూ ముందడుగు వేయాలి. కోట్లాది జన హృదయాల ఆశలకు అనుగుణంగా మన భారతావనిని తిర్చిదిద్ది మన దేశ శక్తికి కీర్తి కిరి టాలు తొడిగించేందుకు ఆందరు కలిసికట్టుగా ముందుకు వస్తారని ఆశిస్తూ…!

Related Post