పిల్లల ప్రవర్తన: పిల్లల ప్రవర్తనలో రెండు ప్రధాన తేడాలుంటాయి. వైద్య పరమైన కార ణాల వలన వచ్చేెవి. పెంపకంలో లోపాల వలన వచ్చేవి. పిల్లలందరూ ఒకేలా ప్రవర్తించ రన్న విషయం విదితమే. ఒకే ఇంటి, కటుం బానికి, వంశానికి చెందిన పిల్లల ప్రవర్తనలో సయితం భేదాలుంటాయి. వారిలో కొంత మంది బుద్ధిగా వ్యవహరిస్తే, మరికొందరు చిరాకు కలిగిస్తారు. అలాగే పిల్లల విషయం లో ఏ విధంగా తేడాలుంటాయో, అలాగే పెద్దల విషయంలో, వారి చూసే, అర్థం చేెసు కునే దృక్పథంలో తేడాలుంటాయి. మనకు పిల్లలు ఎంత ప్రియమయినప్పటికీ ఒక్కోసారి వారి ప్రవర్తన మనకు కోపాన్ని తెప్పిస్తుంది. ఇలా జరిగినప్పుడు మనం పెద్దవారమనే అహంతో ఎలా పడితే అలా వ్యవహరించ కూడదు. విసుగును ప్రదర్శించకుండా సమస్య మూలాల్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి.
ఒకవేళ మన పిల్లలు నిజంగానే సమస్యయా త్మకంగా వ్యవహరిస్తుంటే నిద్రలో ఏమయినా భయంకరమయిన కలలు ఏమయినా వస్తు న్నాయోమో ఆలోచించాలి. లేదా తోడుగా ఆడుకునే, చదువుకునే పిల్లలతో వారికేమ యినా సమస్యలుండవచ్చు, లేకపోతే కొత్తగా తమ్ముడో, చెల్లో ప్రవేశించి మీ మొదటి పిల్లల్లో ఈర్ష్యాద్వేషాల్ని రగిలించి ఉండవచ్చు. అలాగే కొత్త ఇల్లు మారడం, కొత్త స్కూల్, కొత్త టీచర్ మారడం, ఆడుకునే స్నేహితులు మార డం మొదలైనవి కూడా పిల్లల ప్రవర్తనలో మార్పుకు కారణమయ్యే అవకాశం ఉంది.
ముఖ్యంగా పిల్లలు ఏ సమయాల్లో విసుగు ఎత్తించే విధంగా ప్రవర్తిస్తున్నారో గమనిం చాలి. వారికి బోర్‌గా అన్పించినప్పుడా? ఉద్వి ఘ్నంగా ఉన్నప్పుడా? ఆకలిగా ఉన్నప్పుడా? లేదా నిద్ర వచ్చినప్పుడా? అని గమనించాలి. అదే విధంగా కుటుంబ సమస్యలు, తల్లిదం డ్రుల ప్రవర్తన తదితర అంశాలను బట్టి కూడా వారు సృష్టించే సమస్యలు అటూ ఇటుగా ఉండవచ్చు. పిల్లల శిక్షణ విషయంలో తండ్రి నియమం పెడితే తల్లి దానిని నీరుగార్చకూడదు. ఏది ఎందుకు చేయకూడదో, ఏది తప్పో వివరంగా చెప్పాలేగానీ శాసనాలు జారీ చేయకూడదు.
సరే అన్నది ఎంత వరకు సరైనది?
జీవితంలో అన్నిటికన్నా పెద్ద పెట్టుబడిని సఫ లం చేెసుకోవాలంటే వారిని ప్రతి తల్లిదండ్రు లు వెన్నుముక వ్యక్తిత్వం ఉన్న మనుషుల్లా తీర్చిదిద్దాలి. ఉదాహరణకు చాలా ఇళ్ళల్లో చూడండి. పిల్లలు ఏడుస్తుంటే పెద్దలు ‘సరే’ అంటూ వారిని దగ్గరకు తీసుకుంటారు. దీని వల్ల పిల్లలకు తెలియకుండానే వారిలో ఒక విధమయినటువంటి నమ్మకం నాటుకుపో తుంది. అదేంటంటే నేను ఏదయినా పొందా లంటే ఏడ్వాలన్న మాట అనీ!
పిల్లలు తనకు కావాల్సింది పొందడానికి, తను అనుకున్నది సాధించడానికి మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, ఏడ్చినప్పుడు సాధారణంగా మన నోట వెలువడే ‘సరే’ అన్న పదం మన అవివే కానికి, మన బలహీనతకు గర్తుగా నిలుస్తు ంది. అలా ‘సరే’ అన్న పేరెంట్స్ దగ్గర నుంచి పిల్లవాడు తాను కోరింది పొందగలుగుతాడు. మన ఈ బలహీనతను తెలుసుకున్న తర్వాత తన ప్రయోజనానికి దాన్ని వాడుకుంటాడు. అంచేత మనం ఆరంభం నుంచే ఆలోచించి ‘అవును’ అనో, ‘కాదు’ అనో ఖచ్చితంగా చెప్పగలగాలి. అన్న మాట మీద దృఢంగా నిలబడి ఉండాలి. వారు ఏడ్చినా సరే, నేల మీద పడి పొర్లాడినా సరే. అదంతా ఒకసారే జరుగుతుంది.
ఎందుకంటే తనక్కావాల్సింది ఎలాగయి నా సాధించి పని కానిచ్చుకునే నైజం ఓ అల వాటుగా మారుతుంది. పెరిగి పెద్దయ్యే వరకు ఇదే భావన అంటి పెట్టుకుని ఉండి పోతుంది.
అంటే దీని ఉద్దేశ్యం – పిల్లలు ఏడిస్తే అసలు దగ్గర తీసుకోవద్దని ఎంత మాత్రం కాదు. ఇక్కడ వారి శిక్షణార్థం ఇలా చేస్తున్నామన్న విషయాన్ని గుర్తు పెట్టుకుంటే మంచిది. ఒక వ్యక్తి పది మంది పిల్లలుంటే వారిలో ఏ ఇద్దరో మగ్గురో మాత్రమే ప్రయోజకుల య్యారు అంటే కారణం ఏమిటో తెలుసుకో వాలన్నదే మా ఆకాంక్ష.
గిఫ్టుకి లక్ష్యాన్ని జోడించండి. ఈ ప్రపంచంలో ఏదీ ఉచితంగా రాదు. ఈ విషయాన్ని చిన్ననాటే పిల్లలు అర్థమయ్యేలా చెప్ప గలగాలి. మా నాన్న మాకు చదువు ఒక్కటే నేర్పించారు అన్న నిరుత్సాహభరిత మాట వారి నోట రేపు రాకుండా జాగ్రత్త పడాలి. లోకం తీరు, లౌక్యం ఆవశ్యకతను వారికి అర్థమయ్యేలా విశద పర్చాలి. ఫలానా పని చేస్తే, లేదా ఫలానా క్లాస్‌లో మంచి మార్కులతో పాసైతే వారికి ఇష్టమయినది తెచ్చి పెడతామని చెప్పడం వల్ల వారిలో మనం చెప్పిన వాటిని సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వారికి ఏది ఫ్రీగా ఇవ్వకూడదు. ఇచ్చే ప్రతి చాక్లెట్, ప్రతి గిఫ్ట్‌కు ఒక అర్థం పరరమార్థం ఉండేలా జాగ్రత్త పాటించాలి. ఉదాహరణకు, వారు ఏం మంచి పనులు చేెశారో వాటిని గుర్తు చేసి ఆ మంచి పనికి బహుమతిగా ఇస్తున్నట్టు మనం వ్యవహరించాలి. దీని వల్ల పిల్లల్లో ఏదో సాధించాలనే తపన, ఇన్స్పిరేషన్ కలుగుతాయి. ఇలాంటి తర్ఫీదు వల్ల వారికి రెండు విషయాలు బోధ పడతాయి. 1) ఈ ప్రపంచంలో ఏదీ ఉచితంగా రాదు. 2) నేను చేెసిన, చేెస్తున్న ప్రతి పనినీ, చర్యను నా తల్లి దండ్రులు గమనిస్తున్నారు. ఈ స్పృహను పిల్లల్లో కలిగించగలిగితే వారి భవిష్యత్తు బంగారుమయమవుతుంది. అప్పుడు వారి జీవితంలో వారి ఉన్నతికి ఆకాశమే హద్దయి నిలుస్తుంది.