విచ్చలవిడి శృంగార సంభోగాల వల్ల, ముఖ్యంగా ఒకరికంటే ఎక్కువ మందితో సంభోగంలో పాల్గొనడం వల్ల, రక్త మార్పిడి వల్ల, తల్లి నుండి బిడ్డకు, కలుషిత సిరంజిల వల్ల, ఎయిడ్స్ అనే వ్యాధి సంక్రమిస్తుంది. ముందు ఈ వ్యాదిని ప్రాణహంతక వ్యాధిగా ( Death Sentenced Disease ) గా పరిగణించే వారు. కాని శక్తివంతమైన ART మందులు, ఏయిడ్స్ వల్ల వచ్చె ఋగ్మతలను నయం చేసె మందులు ఉన్నందున ఇప్పుడు ఈ వ్యాదిని మధుమేహం మరియు హైపర్ టెన్షన్ (రక్తపోటు)లాంటి వ్యాధుల లాగే ఈ వ్యాధిని కూడ దీర్ఘకాలిక మరియు నియంత్రించటానికి (Chronic and Manageable Disease )వీలు కలిగె వ్యాధిగా వ్యవహరిస్తున్నారు. ఇది హెచ్.ఐ.వి (హ్యూమన్ ఇమ్మ్యునోడెఫిసియెన్సీ వైరస్)అను వైరస్ వలన వస్తుంది. AIDS అనేది ఎక్యైర్డ్ ఇమ్యూన్ డెఫీసియన్సీ సిండ్రోంకు పొడి పేరు. శరీరంలో రోగనిరోధక శక్తి, బాహ్య కారణాల వల్ల తగ్గ్గడం అన్నమాట. హెచ్ఐవి వైరస్ మనుషులకు మాత్రమే సోకుతుంది.
ఎయిడ్స్ బాధితులు
1979-1995 మధ్య కాలంలో నమోదయిన ఎయిడ్స్ కేసులు
2010 వరకు ప్రపంచంలో మొత్తం HIV AIDS రోగుల సంఖ్య 3,40,00000 కాగ 2010 సంవత్సరంలో కొత్తగా నమోదయిన రొగుల సంఖ్య 27,000,000[9] [10]. ఎయిడ్స్ బాధితులలో అత్యధికులు ఆఫ్రికా ఖండంవారే. వారి తరువాత స్థానంలో భారతదేశం ఉంది. అంతే కాదు భారత దేశంలో ఎయిడ్స్ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య ఆంధ్ర ప్రదేశ్లో చాలా తొందరగా పెరుగుతుందని కేంద్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ(NACO) చెబుతుంది. 2009 లెక్కల ప్రకారం మన దేశంలొ మొత్తం HIV/AIDS రోగుల సంఖ్య 23,95,442 అలాగే 2009 వరకు మన రాష్ట్రంలో HIV/AIDS రోగుల సంఖ్య 4,99,620 గా ఉంది. ఒక్క 2011-2012 లోనే నమోదైన HIV/AIDS కేసులు 2,66,919 అదే మన ఆంధ్రప్రదేశ్‌లో అయితే 60,952. మన దేశంలొ మొత్తం NACO నుండి ఉచితంగా ART మందులు అందుకుంటున్న HIV/AIDS రోగుల సంఖ్య March 2012 వరకు 5,16,412. ఆంధ్రప్రదేశ్ నుండి 1,13,106 గా వుంది. దేశంలో 20% మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నారు.ఈ సంఖ్యలు ఎప్పటికప్పుడు మారిపోతుఉంటాయి ఈ పేజిలొ తరచుగా NACO వారు అన్ని వివరాలను పొందుపరుస్తూఉంటారు. పై సంఖ్యలన్ని అధికారిక లెక్కలు మాత్రమే, NACO లో నమోదు చేసుకొకుండా ప్రైవేటుగా చికిత్స అందే వారి వివరాలు ఇందులో కలపబడలేదు.
ఎయిడ్స్ ఎక్కడ నుండి వచ్చింది?
శాస్త్రఙుల అంచనా ప్రకారం హెచ్ఐవి వైరసు సోకిన మొదటి వ్యక్తి ఆఫ్రికా ఖండంలోనే ఉండాలి. ఇది 1915, 1941ల మధ్య జరిగి ఉండవచ్చని ఊహిస్తున్నారు. అప్పట్లో అక్కడ గ్రీన్ చింపాంజీలకు ఎస్ఐవి(SIV)సోకుతూ ఉండేది, ఇది హెచ్ఐవిగా రూపాంతరం చెంది మనుషులకు సోకటం ప్రారంభించింది అని చెబుతారు. కానీ అధికారిక లెక్కల ప్రకారం జూన్ 18, 1981న అమెరికాలో మొదటి ఎయిడ్స్ కేసు నమోదయింది. దీనిని మొదట స్వలింగ సంపర్కంలో పాల్గొనే పురుషులకు సోకే వ్యాధి అని అపోహ పడ్డారు. కాని వచ్చిన కేసులలో సగంపైగా స్వలింగ సంపర్కంలో పాల్గొనని వారు కావటం వలన అందరికీ వచ్చే జబ్బుగా నిర్ధారించారు.
మనుషుల శరీరంలో ఎయిడ్స్ ఏం చేస్తుంది?
హెచ్ఐవి వైరసు మనుషులలో చేరిన వెంటనే, రోగనిరోధకతా శక్తిని దెబ్బతీస్తుంది. తద్వారా వ్యాధి గ్రస్తులు జలుబు తదితర అంటురోగాల బారిన త్వరగా పడతారు. అంతేకాక వ్యాది నిరొదకత తగ్గినకొద్ది ఎయిడ్స్ అహ్వానిత వ్యాదులు (Opportunistic Infections ) రావటం మొదలు పెడతాయి.ఒక్కసారి గనక ART మందులు వాడటం మొదలుపెడితె ఈ వ్యాదులు రావటం అరుదు.
హెచ్ఐవి మరియూ ఎయిడ్స్
హెచ్ఐవి వైరసు ఉన్న అందరికీ ఎయిడ్స్ ఉన్నట్లు కాదు. శరీరం లోపల హెచ్ఐవి వైరస్ ఉన్నా కూడా కొన్ని సంవత్సరాల పాటు ఆరోగ్యంగానే కనిపిస్తారు. వారికి ఎప్పుడయితే ఆరోగ్యం నశిస్తుందో అప్పుడు ఎయిడ్స్ వచ్చినట్లు పరిగణించడం జరుగుతుంది. ఒక వ్యక్తి శరీరంలో హెచ్ఐవి వైరసు ఉన్నట్లయితే అతనిని హెచ్ఐవి పాజిటివ్ అని సంభోదిస్తారు.
హెచ్ఐవి ఉన్న వారికి ఎయిడ్స్ వచ్చినట్లు ఎప్పుడు నిర్ధారిస్తారంటే:
రక్త పరీక్ష చేసినప్పుడు రోగనిరోదకత బాగా క్షీణించిందని తేలినప్పుడు.CD4 కణాల సంఖ్య ౨౦౦ కంటె తక్కువ ఉన్నప్పుడు
ఎయిడ్స్ కలిగించిన రుగ్మత ( Opportunitic Infections )
ఎయిడ్స్ కలిగించే రుగ్మతలు
మనుషులలో సహజంగా రోగనిరోధక శక్తి ఎన్నో రోగాలను అడ్డుకుంటుందిటాయి. ఆ నిరోధక శక్తి నశించినప్పుడు రుగ్మతులు శరీరంలోకి చేరుకుంటాయి.ఎయిడ్స్ కలిగించే రుగ్మతలు సాధారణంగా, ఆరోగ్యవంతులెవరికీ రావు. అందుకనే వీటికి ఎయిడ్స్ కలిగించే రుగ్మతలు అని పిలుస్తారు. ఎయిడ్స్ కలిగించే కొన్ని రుగ్మతలు:
హర్ప్‌స్ జొస్టర్ ( శింగెల్స్ గజకర్ణము )Herpes Zoster Virus (shingles)
కపోసీస్ సర్కోమా (Kaposi’s Sarcoma) – సాధారణంగా చర్మానికి వచ్చే క్యాన్సరు.
సిఎంవి రెటీనైటిస్ (CMV Retinitis) – కంటి వెనుక భాగంలో సోకే ఒక వైరసు.
న్యుమోనియా (PCP) – ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులలో చాలా మందికి సోకే రోగము, ఇది ఊపిరితిత్తులకు సోకుతుంది.
టాక్సోప్లాస్మోసిస్ (Taxoplasmosis) – ఈ రోగము మెదడుకు సోకుతుంది.
క్షయ (Tuberculosis)
ఇన్వేసీవ్ సర్వికల్ క్యాన్సర్ (Invasive Cervical Cancer) – ఇది ఆడవారి గర్భకోశం కింద వ్యాపించే క్యాన్సరు.
హె.ఐ.వి. పరీక్షలు[మార్చు]
ప్రధాన వ్యాసం: HIV పరీక్ష
బాగా వ్యాధి ముదిరేవరకు తమలో జబ్బు ఉందని ఎవరూ అనుకోరు,ఊహించరు. కలిగిన అనారోగ్యానికి కారణం తెలుసుకోవడానికి జరిపే వైద్యపరీక్షలలో ఇటువంటి ప్రాణాంతక జబ్బులు బయటపడతాయి. హెచ్.ఐ.వి.కి చేసే పరీక్షలలో ముఖ్యమైనవి 1. ట్రైడాట్ ,2.వెస్ట్రన్ బ్లాట్ , 3.సి.డి సెల్ కౌంట్.
ట్రైడాట్
ఎలీసా టెస్ట్స్ లో ఇది మొదటిది. మనిషి శరీరములో ప్రవేశించిన ‘హెఐవి’ క్రిములకు ప్రతిస్పందన కణాలు(Antibodies)తయారవడానికి 3-6 నెలలు పడుతుంది. అప్పుడే ఈ పరీక్ష ద్వారా ఎయిడ్స్‌ను గుర్తించవచ్చు. ‘హెఐవి’ ఉందా? లేదా? అని మాత్రమే తెలుస్తుంది . ఈ టెస్ట్ చేయడము తేలిక, తొందరగా అయిపోతుంది. మాస్ స్క్రీనింగ్ విధానములో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది పూర్తిగా నిర్ధారణ అయిన పరీక్ష కాదు.
వెస్ట్రన్ బ్లాట్
హెచ్.ఐ.వి నిర్ధారణ కోసం ఉపయోగించే పరిక్ష ఇది. ఖర్చు ఎక్కువ. వారం రోజులు పడుతుంది. పూర్తి టెస్ట్ వివరాలకోసం వేరే చోట చూడండి.
సిడి4 కణాల సంఖ్య
మనుషుల రోగనిరోధకతకు రక్తంలో సిడి4 అనే రకం తెల్ల రక్తకణాలు ఎంతో దోహద పడతాయి. ఇవి రోగకారక జీవాలతో పోరాడి మనుషులను ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే హెచ్ఐవీ ఈ సిడి4 కణాలను చంపేస్తుంది. హెచ్ఐవి పెరుతున్నకొద్దీ ఈ సిడి4 కణాలు నశించటం ప్రారంభిస్తాయి. ఒక మైక్రోలీటరులో 200 కన్నా తక్కువ సిడి4 కణాలు ఉన్నట్లయితే అప్పుడు ఎయిడ్స్ ఉన్నట్లు ద్రువపరుస్తారు.
ఎయిడ్స్ ఎలా వ్యాపిస్తుంది?
లైంగిక సంపర్కం వలన. ప్రపంచంలోని అత్యధికులు ఈ మార్గం ద్వారానే ఎయిడ్స్ బారిన పడుతున్నారు.
రక్తం ద్వారా. పచ్చబొట్లు పొడిపించుకోవటం వలన, వ్యాధి గ్రస్తుని రక్తదానం వలన కూడా ఎయిడ్స్ వ్యాపించ వచ్చు. పచ్చబొట్టు వళ్ళ ఎందుకంటే, వారు ఒకరికి ఉపయోగించిన సూదినే మళ్ళీ ఇంకొకరికి ఉపయోగిస్తారు, అయితే ఇలాంటి కోవాకే చెందిన క్షవరం, సుంతీ, ఇంజెక్షను మొదలగునవి చేయించుకునేటప్పుడు అప్రమత్తతో మెలగ వలెను.
తల్లి నుండి బిడ్డకు. తల్లి గర్భంలో పెరుగుతున్న బిడ్డకు ఆఖరి వారాలలో ఈ వ్యాది కోకే ప్రమాదం ఉంది. అప్పుడప్పుడూ చనుబాల వలన కూడా సంక్రమిస్తుంది. సరయిన చికిత్స తీసుకోనప్పుడు ఈ రకమయిన వ్యాప్తికి ఆస్కారం 20% అయితే, సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీసి సరయిన చికిత్స ఇవ్వగలిగితే అప్పుడు ఎయిడ్స్ వ్యాప్తిని ఒక్క శాతానికి తగ్గించవచ్చు.
హెచ్ ఐ వి లక్షణాలు
సాధారణంగా వైరస్ శరీరం లో కి ప్రవేశించిన తర్వాత కొన్ని నెలల (కనీసం 3 నుండి 6 నెలల )వరకు రక్త పరీక్ష ల ద్వార వైరస్ జాడ కనుగోనలేము[14]. దీనినె Window Period అంటారు. ఈ క్రింది లక్షణాలు హెచ్ ఐ వి రోగుల లో కనిపిస్తాయి. జ్వరం, నోటి పూత, చర్మ వ్యాధులు, నీరసం, నీళ్ళ విరేచనాలు, ఆకలి తగ్గిపోవుట, అలసట, పది శాతం బరువు ని కోల్పోవడం, గ్రంథుల వాపు ( గొంతు క్రిందుగా )Swollen lymph nodes, మొదలగునవి హెచ్ ఐ వి వ్యాధి యొక్క ప్రధాన లక్షణాలు.
ఒక్కసారి మనిషి శరీరంలొ హెచ్ ఐ వి వైరస్ ప్రవేశించాక కొందరికి పై లక్షణాలలొ కొన్ని కనబడి కొద్దిరోజుల్లొ తగ్గిపోవచ్చు. కొందరిలొ అసలు ఎలాంటి లక్షణాలు కనపడకపొవచ్చు. హెచ్ ఐ వి వైరస్ చాల నెమ్మదిగా, బద్దకంగా శరీరంలో వ్యాపిస్తుంది. హెచ్ ఐ వి నుండి ఎయిడ్స్ దశకు చెరుకోవాటానికొ దాదాపు 10 సంవత్సరాలు పడుతుంది, కొందరిలొ అంతకంటె ఎక్కువ కూడ. కొందరిలో ఈ పది సంవత్సరాల కాలంలొ ఎలాంటి లక్షణాలు కనపడకపోవచ్చు. దీన్నే Asymptomatic Period అంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు హెచ్ ఐ వి టెస్ట్ చెసుకొని నిర్ధారించుకోవాలి. సరియైన సమయంలొ ART మందులు వాడటం మొదలుపెడితె జీవితకాలాన్ని 25 నుండి 30 సంవత్సరాలవరకు పొడిగించుకొవచ్చు . ప్రతి సంవత్సరం కొత్త కొత్త మందులు అందుబాటులొకి రావటం ద్వార ఎయిడ్స్ రొగుల జివితకాలం పెరుగుతు ఉంటుంది.
ఎయిడ్స్ ప్రధాన లక్షణాలు.
శిశువులలో హెచ్.ఐ.వి
సాదారణముగా హెఐవి సోకిన తల్లులకు పుట్టిన బిడ్డలకు హెచ్ఐవి సోకిందో లేదో తెలుసుకోడానికి కనీషము 18 నెలలు వ్యవధి కావాలి. హెచ్ఐవి తల్లుల సాదారణ పురుడు లో 30% వరకూ ,హెఐవి సోకిన తల్లి పాలు తాగిన పిల్లలకు 10%-15% వరకూ,సిజేరియన్ ఆపరేషన్ ద్వార పుట్టినపిల్లలకు 1% జబ్బు అంటుకునే అవకాశాలున్నాయి. హెచ్ఐవి తల్లులకు గర్భినిగా ఉన్నపుడు ‘ఎ.అర్.టి.’ మందులు వాడమువలన బిడ్డలకు ‘హెచ్ ఐ వి’ సోకే అవకాశము 1-2% వరకు తగ్గుతుంది. 18 నెలలు వ్యవధి లో బిడ్డకు హెచ్ ఐవి జబ్బు ముదిరిపోయే అవకాశము ఎక్కువే కావున మామూలు పరీక్షల తో నిర్ధారణ చేయడము కంటే వేగవంతమైన పరీక్ష ఉంటే బాగుండుననే ఉద్దేశము తో ఈ మధ్యన డిఎన్ఎ-పిసీర్ పరీక్ష ద్వారా 0-7 రోజుల వయసు లో హెచ్‌ఐవి పరీక్షలు ఇర్వహించి తొందరగా హె ఐవి ట్రీట్మెంట్ ప్రారంభించి పూర్తిగా హెచ్ఐవి లేకుండా నివారించే అవకాశాముంది. ఈ పద్దతి ద్వారా శిశువు కాలు వద్ద ప్రికింగ్ చేసి(రక్తసేకరణ) డిఎన్ఎ-పిసీర్ పరీక్షచేసి హెచైవి నిర్ధారణ చేస్తారు.
హెచ్ఐవి మరియు ఎయిడ్స్‌ల చికిత్స
HIV ని పూర్తిగా నిర్మాలిస్తాం అన్న ప్రకటన ఎంత అబద్దమో HIV కి చికిత్స లేదు అన్నది అంతె అబద్ధం. HIV కి WHO ప్రామాణికరించిన అత్యంత సమర్థవంతమైన చికిత్స ఉంది. ఈ ART మందులతొ మరియు మంచి జీవన శైలిసహాయంతొ, HIV లేని వాళ్ళు ఎన్ని రోజులు బ్రతుకుతారొ HIV ఉన్న వాళ్ళు దాదాపు అన్ని రోజులు బ్రతకడం ఈ రోజుల్లొ సుసాద్యం. కాని ఇది అన్ని వేళలా సాద్యం కాదు రోగి మందుల వేళకు వేసుకొవటం(Drug Adherence), రోగి జీవన శైలి ( ధూమపానం, మద్యపానం లాంటి చెడు అలవాట్లు), పౌష్టికరమైన అహారం (Protein Rich Food), వేళకు డాక్టరు గారు సూచించన ప్రకారం Lab Testలు, మీరు మందులు ప్రారంబించినప్పుడు ఉన్న CD4 సంఖ్య వీటన్నింటి పైన అదారపడి ఉంటుంది. ఒక్క సారి చికిత్స ప్రారంభించిన తర్వాత చికిత్సను నిలిపివేయడం అత్యంత ప్రమాదకరం ఒక్కసారి గనక చికిత్స ప్రారంబిస్తె జీవితాంతం మందులు వెసుకొవలసి ఉంటుంది. ప్రస్తుతానికయితే ఎయిడ్స్‌ని పూర్తిగా నిర్మూలించటానికి ఎటువంటి మందు కానీ టీకా కానీ తయారు చేయలేదు. కానీ దాని తీవ్రతని తగ్గించటానికి మందులు ఉన్నాయి, అవి కొంచెం ఖరీదయినవే. కొన్ని హెచ్ఐవి వైరసులు కొన్ని మందులను తట్టుకోగలవు, అలాగె ఒకే రకమైన మందులను కొన్ని సంవత్సారలు వాడుతుపోతుఉంటే హెచ్ఐవీ వైరస్ మందులను తట్టుకునే సామర్ధ్యం పెంచుకుంటాయి. అందుకనే ప్రతి కొన్ని సంవత్సరాలకు మారుస్తు ఉంటారు. కొన్నయితే ఒకటి కంటే ఎక్కువ మందులను తట్టుకోగలుగుతున్నాయి.దీనినే వైరస్ రెజిస్టన్స్ అంటారు. అందుకని వాటి చికిత్సకు ఒకేసారి రెండు మూడు రకాల మందులను వాడుతూ ఉంటారు ఈ మందులనే హెచ్ఐవి కాక్‌టెయిల్ అని లేదా Fixed Dose Combination ( ఇందులో రెండు లేదా అంతకంటె ఎక్కువ మందులు ఒకే టాబ్లెట్ గా ఉంటాయి ) అని పిలిస్తారు. కాబట్టి శాస్త్రజ్ఞులు ఎప్పటికప్పుడు హెచ్ఐవితో పోరాడటానికి కొత్త కొత్త మందులను కనిపెడుతూనే ఉన్నారు.
హెచ్ఐవి చికిత్సకు సంబంధించి ముఖ్యమయిన మందులు వీటినే ART ( Antiretroviral Therapy) లేదా ARV’s(Antiretrovirals) అని పిలుస్తారు. వీటిని అవి పనిచేసె తీరును బట్టి వెర్వెరు తరగతులుగా విభజించారు.ఇక్కడ భారతదేశంలొ దొరికె మందులను మరియు చౌకగా దొరికే వాటిని మాత్రమె పొందుపరచబడినవి. ఇవికాక మనదేశంలో దొరకని మందులు, మనదేశంలొ దొరికుతు ఖరీదైన మందులు వున్నాయి. వీటిని ఇక్కడ పొందుపరచడంలేదు.
1) ”ఆరోగ్యకరమయిన చర్మంలో ఏయిడ్స్‌ను ఎదుర్కొనే శక్తి ఎక్కువ ఉంటుంది” అన్నది నేటి శాస్త్రవేత్తల మాట. ఇక్కడ మనం ఇస్లాం ఉపదేశాన్ని నెమరు వేసుకోవాలి. అది రోజుకు అయిదు సార్లు వుజూలో మన అవయవాల్ని కడగాల్సిందిగా, కాలకృత్యాల తీర్చుకున్న తర్వాత శుద్ధ పొందాల్సిందిగా పురమాయిస్తుంది. మనిషి తన చర్మాన్ని సురక్షితంగా ఉంచుకునే విషయంలో ఇస్లాం సూచించిన ఈ విధానంకన్నా మేలయినది ఏది లేదు.
2) పరిశోధన వల్ల వెల్లడయిన విషయం – ”అసంబద్ధ రీతిలో రతిలో పాల్గొనడం (గుదము నుండి రతి జరపడం) వల్ల ఎయిడ్స్ సోకే, వ్యాపించే అవకాశం ఎక్కువ ఉంది” అని. ఈ విషయంలో సయితం ఇస్లాం గొప్ప మార్గదర్శకత్వమే వహిస్తుంది. అది హోమో సెక్స్‌ను వారించడమే కాక, పురుషు తన భార్యతో గుదము ద్వారా రతి జరపకూడదు అని హెచ్చరి స్తుంది.
3) ”సంభోగ సమయంలో రక్తస్త్రావం జరుగుతుంటే ఎయిడ్స్ సోకే అవకాశం ఎక్కువ ఉంటుంది” అన్నది నిపుణుల మాట. ఈ విషయంలో ఇస్లాం ఏమంటుందంటే, ”పురుషుడు తన భార్యతో బహిష్టు సమయంలో సంబోగించకూడదు” అని.
4) నేటి పరిశోధనలన్నీ తీర్మానించిన విషయం – ”సకల విధమయినటుంటి అక్రమ లైంగిక సంబంధాలను పరిత్యజించడం ద్వారా మాత్రమే ఎయిడ్స్‌ను నివారించగలం” అన్నది. నేడు ఇన్ని నష్టాలు, కష్టాల తర్వాత పరిశోధకులు తెలియజేస్తున్న ఈ విషయాలు 1436 సంవత్సరాల క్రితం ప్రవక్త ముహమ్మద్ (స) వారి ప్రవచనాలకు ప్రతిబింబంగా నిలువడం ఇస్లాం ప్రకృతి ధర్మం అనడానికి ప్రబల తార్కాణం!