భార్యాపిల్లలు, తల్లిదండ్రులు, అన్నాదమ్ముళ్ళు, అక్కాచెల్ల్లెళ్లు, అత్తామామలు..ఇలా ఎన్నో బం ధాలు అనుబంధాలు…అందరి మధ్య రక్త సం బంధంతో కూడిన అనురాగం, గౌరవం,మమ కారం కనిపిస్తుంది. నీది నాది అనకుండా మనది అనే అందమైన ఆప్యాయతతో కూడిన భావన అందరికీ ఉంటుంది. కానీ నేడు ఈ అను బంధాలన్నింటిలో ఎన్నో పరిమితులు, వలయాలు, పొరలు, ఆత్మవంచనలు, స్వార్థా లు, మోసాలు చోటు చేెసుకుంటున్నాయి. ఒక ప్పుడు కుటుంబం అది ఎంత పెద్దదయినా, పరస్పరం ఒకే చోట కలిసి ఉన్నా, వేర్వేరుగా నివసిస్తున్నా అందరినీ ప్రేమగా చూసుకుం టూ, అందరి పట్ల గౌరవ భావంతో మసలు కుంటూ బాధ్యతలను సమంగా పంచుకుని అందరిని ఏకత్రాటిపై నడిపించే ప్రయత్నం చేసేవారు. కానీ, నేడు సంబంధాలు, అను బంధాలకు గల అర్థాలే మారిపోయాయా అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంది నేటి స్థితి.
డబ్బు సంపాదనపైనే ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల మానవ సంబంధాల ప్రాముఖ్యత పలుచ బడిపోతున్నది.. ఒకే ఇంట్లో నివసించే వారి లో సయితం ఇది నీది, అది నాది అన్న దయ నీయ వాతావరణం నెలకొని ఉంది. ఇలా ఎవ రికివారు బిజీగా బ్రతికేస్తూ, పిల్లల పెంపకాన్ని అనామకులకు వదిలేసి, పెద్దవారిని వృద్ధాశ్ర మాలకు తరలించేస్తున్నారు. ఈ కారణంగా కుటుంబ విలువలు నీరుగారడమేకాక, తల్లిదండ్రులకు, పిల్లలకు, మనవళ్లకు మధ్య ఉండాల్సిన అనుబంధం, అనురాగం, ఆప్యా యతలు కొరవడుతున్నాయి.
ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన మరో ముఖ్య మైన విషయం – సమాచార, సాంకేతిక విప్ల వం ఈ విశాల ప్రపంచాన్ని చిన్న గదిగా మార్చేసింది. దేశవిదేెశాల మధ్య గల వేల మైళ్ల దూరాన్ని చెరిపేసి వారిని నిమిషాల్లో కలిపే పరికరాలు సహజంగానే అందరికీ అందుబాటులో ఉన్నాయి. అయినా దూరాలు తగ్గడం అలా ఉంచితే మరింత పెరుగుతున్నా యి. మానవ సంబంధాలు మెరుగవుతూ కన్పి ంచినా కుటుంబ సంబంధాలు కుంటు పడు తున్నాయి. ఒకరి మాట ఒకరికి నచ్చడం లేదు. ఒకరి ఉనికిని ఒకరు సహించడంలేదు.
ఇంట్లో ఉన్న అత్తగారితో సజావుగా నడుచుకో లేని, సరిగ్గా మాట్లాడని కోడలు ఎక్కడో విదే శాల్లో ఉండే ఫ్రెండ్స్‌తో గంటల తరబడి ముచ్చట్లు చెప్పుకుంటుంది. సమాజ సేవలో ఎంతో మందిని చేరదీసే అత్తగారికి కోడలంటే చిన్న చూపు. చాలా మంది కొత్త పరిచయాల కోసం పడే ఆరాటం, చూపే ఆసక్తి, ఉత్సాహం ఉన్న సంబంధ బాంధవ్యాలు మెరుగు పర్చు కోవడాని కి ప్రయత్నించడం లేదు. నిత్యం కలుసుకునే వ్యక్తులు, స్నేహితులు, రక్త సం బంధీకుల మధ్య ఉండే కమ్యూనికేషన్ గ్యాప్ ఇంటర్‌నెట్‌లో కలి సిన వ్యక్తుల మధ్య ఉండ టం లేదు. ఆ వ్యక్తు లు కేవలం మాటలు, రాతల ద్వారానే పరిచ యం. వాళ్లు ప్రతక్ష్యం గా కూడా కలిసింది ఉండదు. అయినా వారి మధ్య ఎంతో నమ్మ కం, ఆత్మీయత, ప్రతి బంధం ఇలానే ఉండాలని లేదు. ప్రేమ, నమ్మ కం, మోసం అనేవి వాస్తవ ప్రపంచం, మిథ్యా ప్రపంచం రెండింటిలో సమానంగా ఉన్నాయి.
అంటే ఇతరులతో మంచి సంబంధాలు కలిగి ఉండ కూడదని కాదు, ప్రాధాన్యత ముందు తన వారికివ్వాలన్నదే. మనం ఇచ్చే ఆ ప్రాధా న్యత దైవాభీష్టం ప్రకారం ఉండాలన్నదే. ఖుర్ ఆన్‌లో ఇలా ఉంది: ”వారి (విశ్వాసుల) వైఖరి ఎలా ఉంటుందం టే, స్థిర పరచండి అని అల్లాహ్‌ా ఆదేశించిన సంబంధాలను స్థిర పరు స్తారు”. (అర్రాద్: 21)
బంధుత్వ సంబంధాల ప్రాముఖ్యత నొక్కి వక్కాణిస్తూ దైవ ప్రవక్త (స) ఇలా అన్నారు: ”అల్లాహ్‌ా సమస్త సృష్టిరాసులను సృష్టించిన తర్వాత ‘బంధుత్వం’ లేచి నిలబడి – ‘(దేవా!) నేను బంధుత్వ సంబంధాల విచ్ఛిన్నం నుండి నీ శరణు వేడుకుంటున్నాను’ అని విన్నవించు
కుంది. దానికి ”అయితే నిన్ను బల పర్చిన వాడిని నేనూ బలపరుస్తాను. నీతో తెగత్రెంపు లు చేసుకున్నవాడితో నేనూ తెగత్రెంపులు చేసుకుంటాను, ఇది నీకు ఇష్టమే కదా!” అని అడిగాడు అల్లాహ్. దానికి బంధుత్వం ‘ఇష్టమే ప్రభూ!’ అని అంది. అప్పుడు అల్లాహ్‌ా ”సరే ఆ భాగ్యం నీకు దక్కుతుంది” అని దీవిం చాడు. (ముత్తఫఖున్ ఆలైహి)
ఈ విషయం పట్ల మరింత స్పష్టత కావాలను కుంటే ఖుర్‌ఆన్‌లో ఈ వాక్యాన్ని చదవండి: ”ఒకవేళ మీరు విముఖులైపోతే భూమిపై మళ్ళీ కల్లోలాన్ని రేకెత్తిస్తారు. పరస్పరం బంధుత్వాల తెగత్రెంపులు చేసుకుంటారు. అల్లాహ్‌ా శపిం చింది, అంధులుగానూ, బధిరులుగానూ చేెసింది ఇలాంటి వారినే”. (ముహమ్మద్: 22, 23)
దైవ ప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ”తన ఉపాధిలో సమృద్ధిని, ఆయుష్షులో పెరుగుదల ను కోరుకునే వ్యక్తి తన బంధువులతో సత్సం బంధాలు పెట్టుకోవాలి”.
సత్సంబంధాలు పెట్టుకోవాలంటే అర్థం – మనకు ఉపకారం చేసే బంధువులకు మనం ఉపకారం చేయడం కాదు. మనతో మంచి గా ఉండే వారితో మనం మంచిగా ఉండటం కాదు. ప్రవక్త (స) వారి మాటల్లో చెప్పాలంటే: ”ఒక బంధువు ఉపకారం చేస్తే దానికి బదు లుగా ఉపకారం చేసేవాడు నిజమైన బంధు ప్రియుడు కాడు. తన బంధువులు తనతో తెగ త్రెంపులు చేసుకున్నా వారితో సత్సంబంధాలు కొనసాగించేవాడే సిసలైన బంధుప్రియుడు”. (బుఖారీ)
మనలో చాలా మంది వారు (తల్లిదండ్రులు, బంధుమిత్రులు) మాకేం చేశారని మేము వారికి చేయడానికి అని అంటుంటారు. వారు ఈ ఉపదేశాల వేలుగులో ఆత్మ సమీక్ష చేసు కోవాలి! ఆలోచించాలి!! ఈ మాటలు ఆడ వారికి ఎంతగానయితే వర్తిస్తాయో అంతే మగ వారికి సయితం వర్తిస్తాయన్న విషయం గుర్తుంచుకోవాలి!!!