చదువు-సంస్కారం

ఏ హృయంలోనయితే ధర్మశీలత, దైవభీతి ఉంటుందో అక్కడే ప్రవర్తనలో సౌందర్యం ఉంటుంది. మనుషుల్లో ప్రవర్తన అందంగా ఉన్నప్పుడే కుటుంబ జీవనంలో సామరస్యం ఉంటుంది. సంసారంలో సామరస్యం, సహిష్ణుతలు ఉన్నప్పుడే సమాజంలో క్రమశిక్షణ, గౌరవ భావం ఉంటుంది. సమాజంలో క్రమశిక్షణ, అందరి యెడల గౌరవ భావం ఉన్నప్పుడే దేశం, ప్రదేశంలోనయినా శాంతి పరిఢవిల్లుతుంది. మరే దేశం, ప్రాంతంలోనయితే ఇవన్నీ ప్రోగవుతాయో అది అల్లాహ్‌ కృపానుగ్రహాలకు ఆలవాలమవుతుంది.

ఏ హృయంలోనయితే ధర్మశీలత, దైవభీతి ఉంటుందో అక్కడే ప్రవర్తనలో సౌందర్యం ఉంటుంది. మనుషుల్లో ప్రవర్తన అందంగా ఉన్నప్పుడే కుటుంబ జీవనంలో సామరస్యం ఉంటుంది. సంసారంలో సామరస్యం, సహిష్ణుతలు ఉన్నప్పుడే సమాజంలో క్రమశిక్షణ, గౌరవ భావం ఉంటుంది. సమాజంలో క్రమశిక్షణ, అందరి యెడల గౌరవ భావం ఉన్నప్పుడే దేశం, ప్రదేశంలోనయినా శాంతి పరిఢవిల్లుతుంది. మరే దేశం, ప్రాంతంలోనయితే ఇవన్నీ ప్రోగవుతాయో అది అల్లాహ్‌ కృపానుగ్రహాలకు ఆలవాలమవుతుంది.

”చదువు నిన్ను పుట్టించిన నీ ప్రభువు నామంతో” అన్న తొలి వాణి అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌ (స) వారిపై అవతరించింది. అప్పటి సమాజం అనేక రుగ్మతలతో సతమతం అవుతూ ఉంది. అన్నింటికీ పరిష్కారంగా అల్లాహ్‌ా చదువును, ధర్మశీలమయిన చదువును పేర్కొన్నాడు. ఎందుకంటే అవిద్య, అజ్ఞానమం అంధకారాలయితే, విద్యా విజ్ఞానం వెలుగు కాంతి. మానవ సమా జాన్ని అజ్ఞానాంధకారాల నుండి వెలికి తీసి జ్ఞాన కాంతుల్లో విహ రింపజేయడానికే అంతిమ దైవగ్రంథం ఖుర్‌ఆన్‌ అవతరణ జరి గింది. ప్రవక్త (స) చదువు-సంస్కారం ప్రాముఖ్యతను తెలియజేస్తూ – ”తండ్రి తన సంతానానికిచ్చే ఉత్తమ బహుమానం గొప్ప చదువు – సంస్కారాలే” అన్నారు. అలాగే ”విద్యను అర్జించడం ప్రతి ముస్లిం (స్త్రీపరుషునిపై) తప్పనిసరి విధి” అన్నారు. (ఇబ్ను మాజహ్‌)

అల్లాహ్‌ సుబ్హానహు వ తఅలా తన మహోన్న పీఠం – అర్ష్‌ను సృష్టించిన తర్వాత విద్యా పరికరాలయిన లౌహె మహ్‌ఫూజ్‌, మరియు కలాన్ని సృష్టించాడు. తన అంతిమ గ్రంథంలో కలాన్ని ప్రమాణంగా తీసుకున్నాడు. అలాగే ఆయనకు గల పేర్లలో ఆలీమ్‌, అల్లామ్‌, ఆలిమ్‌ అనేవి జ్ఞానాన్ని సూచించే నామాలే. పూర్తి ఖుర్‌ ఆన్‌లో విద్యను, విజ్ఞానాన్ని, పరిశోధన, పరిశీలనను సూచించే పదాలు 750 సార్లు పేర్కొనబడ్డాయి. స్వయంగా అంతిమ దైవ ప్రవక్త (స) తన గురించి – ”నేను అధ్యాపకునిగా చేసి ప్రభవింప బడ్డాను” అని చెప్పడమే కాక, మస్జిదె నబవీలో అనేక కూటములు ఉండగా ‘నేర్చుకునే, నేర్పించే కూటమి’లో వెళ్ళి ఆయన కూర్చు న్నారు. అంతే కాదు, ”ఒక పండితునికి ఒక పామరునిపై గల విశిష్ఠత – చంద్రుని నక్షత్రాలపై గల ప్రాముఖ్యత వంటిది” (తిర్మిజీ) అని ఓ సందర్భంలో చెబితే, ”నాకు మీలోని సామాన్యుడిపై గల ప్రాధా న్యత వంటిది” (తిర్మిజీ) అని వేరొక సందర్భంలో పేర్కొన్నారు.
విధ్యావంతుల విషయమయి ఖుర్‌ఆన్‌ చెప్పిన మాట – ”నిశ్చయంగా విద్యావంతులే అల్లాహ్‌ా పట్ల వాస్తవమయిన భీతి, భయం కలిగి ఉంటారు”. (ఫాతిర్‌:28) అలాగే అల్లాహ్‌ా విద్యావం తులకు వారి చదువు సంస్కారాల్ని బట్టి గొప్ప హోదాను అనుగ్రహి స్తాడు అన్న మాట కూడా ఖుర్‌ఆన్‌ మనకిస్తోంది: ”మీలో విశ్వసిం చిన వారి, జ్ఞానం ప్రసాదించబడిన వారి అంతస్థులను అల్లాహ్‌ పెంచుతాడు”. (ముజాలహ్‌: 11)
ఇన్ని విశిష్థల కారణంగానే ఇమామ్‌ అహ్మద్‌ బిన్‌ హన్బల్‌ (ర) ఇలా అభిప్రాయ పడ్డారు: ”విద్యార్జన తల్లి ఒడి నుండి సమాధి ఒడి వరకూ సాగాలి” అని. ఇదే దృష్టికోణంతో పెద్దలు చెప్పిన మాట-”చినిగిన చొక్కానయినా తొడుక్కో – ఓ పుస్తకం కొనుక్కో”.

విద్యార్జన ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ ప్రవక్త (స) ఇలా అన్నారు: ”ధర్మశీలత సమ్మిళిత విద్యార్జన నిమిత్తం బయలు దేరిన వ్యక్తి దారిలో దైవదూతలు తమ రెక్కలను పరుస్తారు” అని. (అహ్మద్‌). వేరోక ఉల్లేఖనంలో – ”ధర్మశీలత సమ్మిళిత విద్యార్జన నిమిత్తం ఓ దారిన నడవడం అంటే స్వర్గ బాటన సాగిపోవడమే” అన్నారు. (ముస్లిం) అలాగే ”ధర్మశీలత సమ్మిళిత విద్యార్జన చేసే వ్యక్తి కోసం నీటిలో ఈదే చేపలు మొదలు నేలపై ప్రాకే చీమల వరకూ సృష్టిలో చరాచరాలన్నీ ప్రార్థిస్తాయ”న్నారు. (తిర్మిజీ) విద్యార్జన కోసం దుఆ చేయ వలసిందిగా సర్వజ్ఞాని అయిన అల్లాహ్‌ా అంతిమ దైవప్రవక్త (స) వారికి ఉపదేశిం చాడు: ”వ ఖుర్రబ్బి జిద్‌నీ ఇల్మా” ప్రవక్త (స) ఎప్పుడూ చేస్త్తూ ఉండే ప్రార్థన – ”ఓ అల్లాహ్‌ా నేను నీ నుండి ప్రయోజనకర విధ్యను, సం తృప్తి చెందిన మనసును, స్వీకృత మయ్యే కర్మను కోరుకుంటున్నాను” అన్నది. అలాగే ఆయన శరణు వేడుకున్న వాటిలో -”ఓ అల్లాహ్‌ా నిష్ప్రయోజనకర విద్య నుండి, ధర్మశీలత కొరవడిన హృదయం నుండి, స్వీకృతం కాని దుఆ నుండి నీ శరణు కోరుకుంటున్నాను” అన్నది. అలాగే మనిషి మరణానంతరం అతనికి పనికొచ్చే కర్మల్లో తను ఇతరు లకు నేర్పించిన విద్య కూడా ఒకటి అని పేర్కొనడమేకాక, ఖుర్‌ఆన్‌ కంఠస్థం చేసుకున్న వారి తల్లిదండ్రుల్ని అల్లాహ్‌ా రేపు ప్రళయ దినాన కీర్తి కిరీటాలు తొడిగించి సన్మానిస్తాడని, దాసుని స్వర్గ అంతస్థులు అతనికి కంఠస్థ ఉన్న ఖుర్‌ఆన్‌ వచనాలకు అనుగుణంగా ఉంటాయి అని తెలియజేశారు.
ఒక్క మాటలో చెప్పాలంటే, ”అల్లాహ్‌ ఏ వ్యక్తికి మేలు చేయాలని కోరుకుంటాడో అతనికి ధర్మశీలమయిన జ్ఞానంలో స్థితప్రజ్ఞతను ప్రసా దిస్తాడు”. (బుఖారీ, ముస్లిం) ఏ సమాజంలోనయితే ప్రయోజనకర విద్యా వెలుగు నిండుతాయో ఆ సమాజంలోనే ప్రగతి ఫలాలు పండు తాయి. ఏ హృయంలోనయితే ధర్మశీలత, దైవభీతి ఉంటుందో అక్కడే ప్రవర్తనలో సౌందర్యం ఉంటుంది. మనుషుల్లో ప్రవర్తన అందంగా ఉన్నప్పుడే కుటుంబ జీవనంలో సామరస్యం ఉంటుంది. సంసారంలో సామరస్యం, సహిష్ణుతలు ఉన్నప్పుడే సమాజంలో క్రమశిక్షణ, గౌరవ భావం ఉంటుంది. సమాజంలో క్రమశిక్షణ, అందరి యెడల గౌరవ భావం ఉన్నప్పుడే దేశం, ప్రదేశంలోనయినా శాంతి పరిఢవిల్లుతుంది. మరే దేశం, ప్రాంతంలోనయితే ఇవన్నీ ప్రోగవుతాయో అది అల్లాహ్‌ కృపానుగ్రహాలకు ఆలవాలమవుతుంది. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”ఈ బస్తీలలో నివసించే వాళ్ళే గనక విశ్వసించి, భయభక్తులతో మెలిగి ఉన్నట్లయితే మేము వాళ్ళ కోసం భూమ్యాకాశాల శుభాల (ద్వారాల)ను తెరిచి ఉండే వారము”. (దివ్య ఖుర్‌ఆన్‌-4: 147)
అంటే, చదువుకి, సంస్కారానికి, ధర్మశీలానికి, హృదయానికి, కుటుంబానికి, సమాజానికి, దేశానికి, ప్రపంచానికి, ప్రభువుకీ మధ్య – ఒకే అవిభాజ్య అనుబంధం ఉంది. అది సజావుగా నెరవేరనప్పుడే మనిషికి ఇహపర సాఫల్యం సాధ్యమవుతుంది.

Related Post