ఆహార పానీయాలు ఆచార నియమాలు

veg and non veg

సయ్యద్  అబ్దుస్సలామ్ ఉమ్రీ 

జైన మతం – మంచి జైన్‌ అంటే తప్పనిసరిగా శాఖహారి మాత్రమే అని, సృష్టిలో జీవమున్న ఏప్రాణి కీ హాని కలిగించకూడదని అంటారు. ఈ కారణంగా కొంత మంది నడుస్తున్నప్పుడు దారిని శభ్ర పరచుకుంటూ వెళతారు. ఇంకా గాలిలో తేలుకూంటూ వచ్చి ఏ సన్న ప్రాణి అయినా శ్వాసలో చిక్కుబడి చనిపో తుందేమోనన్న చింతనతో(?) కొంత మంది ముక్కు మీద నోటి మీద వస్త్రం అడ్డంగా పెట్టుకుంటారు. అయితే వ్యవసాయంలో నూ, దేశ భద్రత కాపాడే విషయంలోనూ వీటికి మినహాయింపు ఇస్తారు.

ఒక ప్రాణి ఉనికి, ఆ ప్రాణికుంటే ఇంద్రి యాల్ని బట్టి వర్గీకరిస్తారు. సృష్టిలో అతి సూక్ష్మ ప్రాణికి ఒకే ఒక్క ఇంద్రియం పని చేస్తుంది. అది స్పర్శ! ఈ వర్గీకరణ క్రిందికి వచ్చేవి మొక్కలు. సృష్టిలో అత్యున్నత ప్రాణి మనిషి. తర్వాత ఇతర జంతువులు. వీటికి అయిదు ఇంద్రియాలు – స్పర్శ, వాసన, రుచి,దృష్టి,వినికిడి-సమానంగా ఉంటాయి. కొన్ని ప్రాణులకు రెండు లేదా మూడు ఇంద్రియాలు మాత్రమే పని చేస్తాయి. ఉదాహరణకు: వాన పాముకి వాసన, రుచి అనే రెండు ఇంద్రియాలు మాత్రమే పని చేస్తాయి. పేలకి మూడు – స్పర్శ, రుచి, వాసన. దోమలకు నాలుగు – స్పర్శ, రుచి, వాసన, దృష్టి. మొక్కకి ఒకే ఒక్క ఇంద్రి యం పని చేస్తుంది కాబట్టి దాన్ని ఆహారం గా తీసుకోవచ్చంటారు. అలాగే దుంపల్ని తినాలంటే ఒక మొక్కని వేళ్ళతో సహా పెకలించివేయాలి గనక, దాని వల్ల చుట్టు ప్రక్కల ఉన్న అనేక జీవాలు మరణిస్తాయి గనక దుంపల్ని తినరు. పండు కూడా బాగా పండిన మీదటే తినా లంటారు. అంటే అది రాలిపోయే స్థితిలో ఉన్నప్పుడే దాన్ని తినాలన్న మాట. ఇంత తృణ ధాన్యాలు, గోధుమలు, వరి, చిక్కుళ్ళు మొదలైనవి బాగా ఎండిన మీదటే తియ్యా లి. కొందరయితే వంకాయ జామ పండు లో కొన్ని పురుగులుంటాయని తినరు. క్యాలిఫ్లవర్‌, బ్రోకోలి లాంటి వాటిని కూడా వాడని వారున్నారు. పుట్ట గొడుగులు, క్యాబేజీ, ఇతర ఆకు కూరల్ని కూడా జైనులు వాడరు. అయితే పాల ఉత్పత్తుల్ని మాత్రం వాడతారు. అలాగే ఆహార  పదా ర్థాలు పగలు మాత్రమే వండాలి. పగలు మాత్రమే తినాలి. అంటే వారికి రాత్రి భోజ నం నిషిద్ధమే. రాత్రి పూట వండితే నిప్పుకి ఆకర్షితమయిన కొన్ని పురుగులు కాలి చచ్చిపోతాయన్నది వారి వాదన.

సాధారణంగా శాఖహారమే సర్వ శ్రేష్ఠము అని బల్ల గుద్ది మరి చెప్పేవారి వాదన ఏమిటంటే, మొక్కలు, బాధల్ని, కష్టాల్ని అనుభవించవు గనక జంతువుల్ని సంపే కంటే, మొక్కల్ని చంపటం చిన్న నేరంగా పరగణించబడుతుందని. మొక్కలకు కూడా బాధ కలుగుతుందని నేటి ఆధునిక సైన్స్‌ తేటతెల్లం చేసింది. కాకపోతే వాటి బాధ ను, వాటి ఆలాపనను మనిషి వినలేడు, గ్రహించలేడు. దీనికి కారణం ఏమిటంటే మానవ కర్ణాలు 20 మొదలుకొని 20,0 00 హర్టజ్‌ ఫ్రిక్వెన్సీ మధ్యలో ఉండే శబ్ద తరంగాల్ని మాత్రమే వినగలుగుతాయి. అంటే 20 కన్నా తక్కువగానీ, లేక 20,0 00 కన్నా ఎక్కువ ఫ్రిక్వెన్సీల్లో ఉన్నవాటిని వినలేడు. ఈ పరిధి మానవుని యొక్క వినగలిగే హద్దు అనబడుతుంది.

ఒక శునకంలో 40,000 హర్టజ్‌ శబ్ద  తరంగాలు వినగలిగే శక్తి ఉంటుంది. ఒక మౌనంగా ఉన్న కుక్కలో 20,000 హర్టజ్‌ కన్నా అధికంగా, 40,000 హర్టజ్‌ కన్నా తక్కువగా ఉన్న శబ్ద తరంగాల్ని వినగలిగే యోగ్యత ఉంటుంది. ఈ కారణంగానే ఒక కుక్క తన యజమాని వేసిన ప్రత్యేక ఈల శబ్దాన్ని సునాయాసంగా విని, పరుగెత్తు కుంటూ వస్తుంది. కాని ఆ ఈల శబ్దాన్ని ఇతర మనుషులు వినలేరు. అలాగే ఒక అమెరికన్‌ రైతు మొక్కలపై పరిశోధన చేసి, మొక్కల మొర యొక్క  ఫ్రిక్వెన్సీని పెంచి, మనుషులకు వినపించేంత పరిధిలోకి తేగ లిగిన ఒక పరికరాన్ని కనుగొన్నాడు. మొక్క లు నీరు కావాలని అరచినప్పుడు, వెంటనే అతనికి తెలిసిపోతుంది.

ఇక ఎవరయితే శాఖహారాన్నే సమర్థిస్తూ, వృక్షాల్లో రెండు లేక మూడు ఇంద్రియాలే ఉంటాయని, దీనికి భిన్నంగా జంతువుల్లో ఐదు ఉంటాయని, కనుక మొక్కల్ని హత మార్చడం, పశువుల్ని హతమార్చడం కంటే చిన్న అపరాధమని వాదిస్తారో వారు తెలు సుకోవాల్సి వాస్తవం ఒకటుంది. వినడానికి వినసొంపుగా ఉన్న ఈ వాదన ఆచరణలో సాధ్యం కాదు. ఆలోచించడానికి ఒక ఉదా హరణ: ఒక వ్యక్తి పుట్టు గుడ్డి, అవిటి, చెవిటి, మూగ వాడయి ఉన్నాడు అనుకుం దాం. అతని ఇతర సామాన్య మనుషుల కన్నా మూడు ఇంద్రియాలు తక్కువ కలిగి ఉన్నాడు కాబట్టి అతన్ని హత్య చేెసిన వ్యక్తి కి తక్కువ శిక్ష విధించాలని ఏ లాయరు అయినా వాదించగలడా? వాదించలేడు. దానికి బదులుగా, హంతకుడు ఒక నిర్దోషి ని, అందులో గుడ్డి, చెవిటి, అవిటి, మూగ వ్యక్తిని హతమార్చాడని, ప్రతిగా హంతకునికి కఠినాతి కఠినమైన శిక్ష  విధిం చాలని మాత్రమే ఒక లాయరుగాని, మనము గాని కోరుకుంటాముగా!!

ఈ ప్రపంచంలో ప్రతి మనిషి శాకహారిగా ఉంటే, పశువుల్లో సంతానోత్పత్తి అధికమ వ్వడం వల్ల పశువుల సంఖ్య గణణీయంగా పెరిగిపోయేది. కాబట్టే మహోన్నత యుక్తి పరుడనయిన అల్లాహ్‌ా వాటి సంఖ్యను పరి మిత హద్దుల్లో ఉంచడానికి ఒక మార్గాన్ని సూచించాడు. అందుకని శాఖాహారాలతో పాటుగా మాంసాహారానికి అల్లాహ్‌ా అను మతించాడంటే, అందులో ఆశ్చర్య పడా ల్సింది ఏమీ లేదు. కొందరు శాఖహారాన్ని మాత్రమే తీసుకుంటూ ఉంటే వారిపై ఎలా ంటి ఆక్షేపణా లేదు. అయితే మాంసాహారు ల్ని, క్రూరులుగా భావించడం, మాంసాహా రాన్ని ఆధ్యాత్మిక వికాస మార్గంలో అవరో ధంగా తలంచడం, గర్హించడం, నిందించ డం సమాలోచనాపరుల లక్షణం కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆహారపానీయా లను మనకు అనుగ్రహించింది దేవుడే. కాబట్టి ధర్మం, అధర్మం అని ఖరారు చేసే హక్కు ఆయనకొక్కడికే ఉంటుంది.

తాతముత్తాతల సంప్రదాయాల, వ్యక్తులు ప్రవేశ పెట్టిన సిద్ధాంతాల ఆధారంగా ఎవ రికి వారుగా కొన్నింటిని హలాల్‌గా, మరి కొన్నింటిని హరామ్‌గా ఖరారు చేసుకోవ డం ఎంత మాత్రం సమంజసం కాదు. ఒకవేళ వారు చెబుతున్నది నిజమే అయితే వారి వద్ద ఏదయినా జ్ఞానం ఉన్నట్లయితే దాని ఆధారంగా ప్రమాణం చూపాల్సి ఉం టుంది. ఇది నాది అన్నంత మాత్రాన ఒక వస్తువు ఎలాగయితే మనది కాజాలదో అలాగే ఇది హరామ్‌ ఇది హలాల్‌ అని ఒకరు అన్నంత మాత్రాన అయిపోదు. దానికంటూ ఒక ఆధారం ఉండాలి.

సిక్కు మతం – హిందూ-ఇస్లాం మతాల లక్షణాలను ఉమ్మ డిగా పుణికి పుచ్చుకుని పుట్టిన మతమే సిక్కు మతం. 16వ శతాబ్దిలో ఉత్తర భారత దేశంలో గురునానక్‌ బోధనలు ఈ మతానికి పునాది. తర్వాత 9మంది గురు వులు ఈ మతం ఆలోచనా విధానాన్ని పెం పొందించారు. సిక్కులలో అత్యధిక శాతం జనాభా మన దేశంలోని పంజాబ్‌లోనే ఉంది. వీరిలో అధిక శాతం మాంసహారు లే.  వీరు మాంసాహారం తిసుకున్నాలనుకున్న ప్పుడు మస్లింల మాదిరిగా హలాల్‌ పద్ధతిని పాటిస్తారు. సిక్కుల్లో ఏ గురువునూ మాం సాహారాన్ని ఖండించలేదు. శాఖహారమే సర్వ శ్రేెష్ఠమని వారు ఎన్నడూ, ఎక్కడా ప్రస్తావించలేదు. వీరిలో కొందరు గోవు మాంసాన్ని, పంది మాంసాన్ని నిషేధించుకు న్నారు.

జొరాస్ట్రియనిజం – ప్రాచీన పర్షియా (ఇరాన్‌)లో జొరాస్టర్‌ అనే వ్యక్తి స్థాపించిన మతం జొరాస్ట్రియనిజం.   జొరాస్టర్‌ మితహారవాది అని, మరీ ఎగబడి తినడం, తినీ తిననట్టుగా  తినడం-రెండిం టినీ అతను వద్దన్నాడంటారు. అయితే జొరాస్ట్రియన్లు అందరూ శాఖహారులు కారు.

జుడాయిజం –  ఈనాడు  యూదుల ప్రధాన ఆహారం మాసం. సామాన్యంగా జరుపుకునే ‘సించా’ లాంటి చిన్నపాటి పండగల్లో కూడా చికెన్‌ కేకులు, కాలేయంతో తయారు ఆహారపదా ర్థాలు తప్పనిసరిగా ఉంటాయి. ఒక థలో వ్యవసాయ వ్యవస్థకు లోబడి కొంత కాలం మాంసాహారానికి దూరంగా ఉన్నారన్న మాట కూడా నిజమే. కాబట్టి యూదులు నేరుగా మాంసాహారాన్ని నిరాకరించలేదు గానీ, మాంసాహారాన్ని ఇతర పదార్థాలతో కలిపి తీసుకోవడాన్ని నిషేధించారు. ముఖ్యంగా పాలతో, రక్తంతో కలపకూడద న్నారు.’మేక పిల్లను దాని తల్లిపాలతో వండకూడదు” (ద్వితీయోపదేశ కాండము -14: 21)

యూద సంప్రదాయంలో కొన్ని జంతువు లు మాత్రమే ఆహారంగా తీసుకోదగినవి. పంది వంటివి నిషిద్ధం. గోవు, గొర్రెలు, మేకలు, మగ జింక మొదలైననాటి మాం సం తినవచ్చు. కొన్ని రకాల జంతువుల మాంసాన్ని తినకూడదు. 1) ఆరోగ్యానికి హానికరమయినవి. 2) యూదులకు తమ పవిత్ర వారసత్వానికి ప్రతీకలయినవి. యూదులు జంతువుని ఆహారంగా తీసు కునే ముందు ‘కష్రూత్‌’ అను క్రతువుని పాటిస్తారు.ఇది ముస్లింల పద్దతిలో హలాల్‌ వంటిదే. మాంసంలోని రక్తాన్నంతా కడిగే ప్రక్రియ ‘కొషర్‌’. దీన్ని యూదులు చాలా అవసరమైన ప్రక్రియగా భావిస్తారు.అయితే పై పేర్కొన్న వాటిలో కొన్ని ప్రామాణికమ యినవయినా, కొన్నింటికి ఎలాంటి ప్రామా ణికత లేదు.

ఉదాహరణకు: ‘ఒంటె నెమరు వేయను గాని దానికి రెండు డెక్కలు లేవు గనక అది మీకు అపవిత్రము. పొట్టి కుందేలు నెమరు వేయనుగాని దాని కి రెండుడెక్కలు లేవు గనక అది మీకు అపవిత్రము. కుందేలు నెమరు వేయనుగాని దానికి రెండు డెక్కలు లేవు గనక అది మీకు అపవిత్రము’. (లేవీయ కాండము- 11: 4-6) ‘సమద్రములలోనేమి, నదులలోనేమి సమస్త జల చరములలోను సమస్త జల జంతువులలోనూ వేటికి రెక్కలు పొలుసులు ఉండవో అవన్నియు హేయములు’. (లేవీయ కాండము-11: 10) ‘…క్రౌంచ పక్షి….నల్ల పక్షులు…. నిప్పు కోడి…..కోకిల…..హంస…గూడ బాతు…. సంకుబుడి కొంగ, ప్రతి విధమయిన కొంగ, కుకుడు గువ్వ…పక్షులలో వీటి ని హేయములుగా ఎంచవలెను’.     (లేవీయ కాండము- 11: 13-19)  పై పేర్కొన్న వస్తువులు ప్రవక్త మూసా (అ) వారికి ఇవ్వబడిన తౌరాత్‌ (తొరా)లో హరామ్‌గా పేర్కొనడం జరుగలేదని ఖుర్‌ ఆన్‌లోని నిసా సూరా ద్వారా రూఢి అవు తుంది. ఇదే విషయమయి ఖుర్‌ఆన్‌ ఇలా ప్రశ్నిస్తుంది:

”(ముహమ్మద్‌ (స) తెచ్చిన ధర్మశాస్త్రంలో అనుమతించిన) ఈ భోజన పదార్థాలన్నీ బనీ ఇస్రాయీల్‌కు-కూడా అనుమతించిన వే. అయితే తౌరాత్‌ అవతరించడానికి పూర్వమే ఇస్రాయీల్‌ స్వయంగా తనకు నిషేధించుకున్న పదార్థాలుకొన్ని ఉండేవి. వీరికి చెప్పు ఒకవేళ మీరు (మీ అభ్యతరం లో) నిజాయితీ పరులయితే తౌరాత్‌ను తీసుకు రండి. దాని వచనం ఏదయినా చదివి వినిపించండి”.(ఆల్‌ ఇమ్రాన్‌: 93)

ఈ ఆయతు దీని తర్వాతి రెండు ఆయ తులు యూదుల ఆంక్షేపణలకు సమాధా నంగా అవతరించాయి. ఇంతకీ ఆ ఆంక్షే పణ ఏమిటి? అంటే, కొంత మంది యూదులు మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) వారినుద్దేశించి: ”మీరు ఒకవైపు ఇబ్రా హీమ్‌ (అ) అనుయాయులం అని చెప్పు కుంటూనే మరోవైపు ఒంటె మాంసం తింటున్నారాయే. మరి చూడబోతే ఇబ్రా హీమ్‌ ధర్శశాస్త్రంలో ఒంటె మాంసం, ఒంటె పాలు నిషేధించబడ్డాయి” అన్నారు.

దీనికి జవాబుగా అల్లాహ్‌ా ఏమన్నాడంటే, యూదుల ఆరోపణ నిరాధారమయినది. ఇబ్రాహీమ్‌ (అ) వారి ధర్మశాస్త్రంలో ఈ రెండు వస్తువులు హరామ్‌ (నిషిద్ధం)గా లేవు. కాకపోతే ఇస్రాయీలు (యాఖూబ్‌) (అ) తనంతట తానుగా కొన్ని వస్తువులను తన కోసం మాత్రమే నిషేధించుకొన్నారు. ఆ వస్తువులే ఒంటె మాంసం, ఒంటెపాలు. (మొక్కుబడి మూలంగానో, అనారోగ్యం కారణంగానో ఆయన ఈ నిర్ణయానికి వచ్చారు అన్నది పండితుల మాట). పోతే యాఖూబ్‌ (అ) గారి ఈ నిర్ణయం కూడా తౌరాతు గ్రంథం అవతరించక పూర్వం జరిగింది. మరి తౌరాతు గ్రంథమేమో ఇబ్రాహీమ్‌, యాఖూబ్‌ (అ) చాలా కాలం తర్వాత వచ్చింది. మరలాంటప్పుడు మీరు ఇలాంటి అభ్యంతరాలను ఎలా లేవనెత్తు తున్నారు? మీకు అనుమానముంటేగ్రంథం తెచ్చి చదవండి – ఇబ్రాహీమ్‌ (అ) కాలం లో ఈ వస్తువులు నిషిద్ధంగా ఖరారు కాలే దన్న వాస్తవం మీకే అర్థమవుతుంది. అయి నా యూదులు అప్పుడు తౌరాతు గ్రంథాన్ని తెచ్చి చదివే సాహసం చేయలేకపోయారం టే అర్థం, ఈ నిషేధాజ్ఞలు తర్వాతి కాలం లో చోటు చేసుకున్నాయన్న మాట.  వాస్త వం ఏమిటంటే,  నేటి యూదు ధర్మశాస్త్ర సంకలనం క్రీ.శ. రెంవ శతాబ్ది చివరన రిబ్బీ యెహూదా చేతి మీదుగా పూర్తయిం దని చరిత్ర కూడా సాక్ష్యమిస్తుంది.   అలాగే యూదులు పాల్పడే కొన్ని దుర్మా ర్గాల, దురాగతాల కారణంగా కూడా అల్లాహ్  కొన్నింటిని వారిపై నిషేధించాడు:  ‘యూదుల దుర్మార్గం వల్ల వారికి ధర్మ సమ్మతంగా ఉన్న అనేక పరిశుద్ధ వస్తువుల ను మేము వారి కోసం నిషేధించాము. వారు ఎంతో మందిని అల్లాహ్‌ా మార్గం నుండి అడ్డుకోవడం వల్లనూ, నిషేధించ బడిన వడ్డీని పుచ్చుకోవడం వల్లనూ, జను ల సొమ్మును అన్యాయంగా స్వాహా చేయ డం వల్లనూ (వారికీ దుర్గతి పట్టింది).” (అన్‌నిసా:160,161)

నిషేధించబడిన ఆ వస్తువులు ఏమిటి? అంటే, ”యూదులకు మేము గోళ్లు గల జంతువులన్నింటినీ (అంటే వ్రేళ్ళు చీల కుండా అతుక్కుపోయినవి-నిప్పుకోడి, ఒంటె, బాతు మొదలయిన వాటిని) నిషే ధించాము. ఇంకా వారికి, ఆవు మరియు మేకలలో   వాటి  వీపులకు  తగిలి  ఉన్న కొవ్వునీ, ప్రేగులపై ఉన్న దానినీ, ఎముకల తో కలిసి ఉన్న దానిని తప్ప – మిగిలిన క్రొవ్వును కూడా నిషేధించాము. వారి తల బిరుసుతనం మూలంగా మేము వారికి ఈ శిక్ష విధించాము”. (అన్‌ఆమ్‌:146) అంటే, ప్రవక్త యాఖూబ్‌ (అ) ఈ వస్తువుల ను తమ కోసం నిషేధించినందు వల్ల, తాము కూడా ఆయన అనుయాయులుగా వాటిని నిషిద్ధంగా భావిస్తున్నామని వారు చెప్పేవన్నీ కల్లిబొల్లి కబుర్లే. ఈ శిక్ష సబ్బత్‌ దినాన్ని పోలినదే. అది అప్పటి షరీయతు వరకే పరిమితం.  ఇక్కడ విదితమయ్యే మరో విషయం ఏమి టంటే సాధారంగా దేవుడు నిషేధించిన వస్తువులు మానవ శ్రేయాన్ని కోరే ఉంటా యి. అయితే కొందరి నిర్వాకానికి గాను నిషేధించే వస్తువులు అవి స్వతహాగా అంతకు పూర్వం హలాల్‌ పరిశుద్ధమయి నవే అయినా వారిని శిక్షించే నిమిత్తం వాటిని నిషేధించడం జరుగుతుంది.

యూదులలో గల మరికొన్ని నియమాలు దిగ్భ్రాంతికి గురి చేస్తాయి. వాటిలో రెండిని ఇక్క ఇస్తున్నాము. ”నీ సంతితి వారిలో ఒక నికి కళంకమేదైనను (పుట్టుకతో వచ్చే దేహ సంబంధిత లోపము) కలిగిన యెడలఅతడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీ పింకూడదు. ఏలయనగా ఎవనియందు కళంకము (దేహలోపం) ఉండునో వాడు గ్రుడ్డివాడేగానీ, కుంటివాడేగాని, ముక్కిడి వాడేగాని, విపరీత (అదనపు) అవయములు గలవాడేగాని, గుజ్జువాడేగాని, గూనివాడే  గాని, కంటిలో పువ్వు గలవాడేగాని, గజ్జి గల వాడే గాని, చిరు గుడు గలవాడేగాని, వృషణ ములు నలిగిన వాడేగాని సమీపింప కూడదు”. (లేవీయ కాండము-21: 16-20) అంటే, పై పేర్కొనబడిన వారు దైవ సేవకు అనర్హులు అన్న మాట.

”అన్యుడు ప్రతిష్ఠితమైన దానిని తినకూడదు. యాజకుని ఇంట నివసించు అన్యుడేగాని, జీతగాడేగాని ప్రతిష్ఠితమైన దానిని తిన కూడదు……యాజకుని కుమార్తె అన్యునికి య్యబడిన యెడల ఆమె ప్రతిష్ఠితమైనవాటి లో ప్రతిష్ఠార్పణమును తినకూడదు…..ఒకడు పొరబాటున ప్రతిష్ఠితమైన దానిని తినిన యెడల వాడు ఆ ప్రతిష్ఠితమైన దానిలో అయిదవ వంతు కలిపి దానితో యాజకునికి య్యవలెను”. (లేవీయకాండము-22: 10-15)  ఈ పై రెండు ఉదాహరణల వల్ల అర్థమ య్యేది ఏమిటంటే, అల్లాహ్  అవతరింప జేసిన షరీఅతులో యూదులు ధిక్కరించి స్వయంగా తామే తమకు శాసనకర్తలయిన ప్పుడు అనేక పరిశుద్ధ వస్తువుల్ని తమ రంధ్రాన్వేషణల మూలంగా హరామ్‌ చేసుకున్నారు. ఇటువంటి నూతన కల్పి తాలు ఆహారపానీయాల విషయంలోనే కాక హక్కుల విషయంలో, ప్రవక్తల పవిత్ర జీవితాల విషయంలోనూ అనేకం మనకు దర్శనమిస్తాయి.

”వారికిలా చెప్పు: ‘పరిపూర్ణమయిన వాదన అల్లాహ్దే”. (అన్‌ఆమ్‌: 149)

Related Post