ధన్ వాపసీ సాధ్య పడలేదుగానీ, ఘర్ వాపసీ గాలీ మాతం మహా జోరుగానే వీస్తోంది. ఘర్ వాపసీ యొక్క పూర్వ పరాలను పరిశీలించినట్లయితే, శుద్ధి ఉద్యమం ఈనాటిది కాదు. అయితే ఒకప్పటి స్థితి వేరు ఇప్పటి స్థితి వేరు. అసలు మత మార్పిడికి పజ్రలు ఎందుకు పూనుకుంటారు? అంటే సమాధానం కష్టమే. ఒక నిజమయిన ముస్లిం మతం మార్చుకుంటాడా?అన్నది సత్యదూరం అయినప్పటికీ సామాన్య, సగటు మనిషి పరిస్థితి దీనికి పూర్తి భిన్నం అనే చెప్పాలి. ముఖ్యంగా భారత ముస్లింల స్థితిగతులను పరికించినట్లయితే ముందుకొచ్చే కారణాలు మూడు. 1) అజ్ఞానం-అంధానుసరణ. 2) పేదరికం-కటిక దారిద్యం. 3)అపోహ-కోరికల దాస్యం. పేదరికం, అజ్ఞానం పల్లె సీమల, గామ్రాల సమస్యయితే, అపోహలు-కోరికల దాస్యానికి ధనికులు, విద్యావంతులతోపాటు అన్ని వర్గాల వారు ముఖ్యంగా యువకులు పభ్రావితం అవుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అజ్ఞానం-అంధానుసరణ:
ధార్మిక విద్యా లేమి బడికెళ్లే వారిలోనూ, వెళ్ళని వారిలోనూ అధిక శాతంలోనే ఉంది. భారత దేశంలో మారుమూల పాంతాల్లో వేలకొలది గామ్రాల్లో నివసించే ముస్లింలకు ఒక్క మస్జిద్ కుడా లేదు. మరికొన్ని గామ్రాల్లోనయినతే ఎటువంటి విద్యా ఏర్పాట్లు లేవు. ‘మనిషి తనకు తెలియని దానికి శతువ్రు’ అన్నట్టు అక్కడి ముస్లిం పజ్రలకు ఇస్లాం ఒక అపరిచిత వస్తువనే చెప్పాలి. ఎవరయినా మరణిస్తే జనాజా నమాజుక చదివించేంత అవగాహన గల వ్యక్తి కూడా లేని కారణంగా జనాజా నమాజు చదివించకుండానే ఖననం చేసిన ఉదంతాలెన్నో! సొంత చెల్లి కూతురిని మనువాడిన, ఏక సమయంలో అక్కాచెల్లెలను వివాహమాడిన సంఘటన లెన్నో! దర్గాలు-దుర్గాలంటూ దరిదరిన తలవంచిన సందర్భాలెన్నో! ఇదే స్థితి కొన్ని పట్టణాల్లోని స్లమ్ ఏరియాల్లో సయితం దర్శనమిస్తుంది. ఇటువంటి చోట్ల నివసించేవారు నామ మాతాన్రికి ముస్లింలుగా పిలవబడుతున్నా పాపం వారికి ధర్మం గురించి, నిజదైవం గురించి చెప్పే నాధుడు లేడు. ఉన్నా వారి నమ్మకాన్ని అమ్మకానికి పెట్టేవారే అధికం. ఇటువంటి పద్రేశాల్లో పూరి గుడిసెల రూపంలోనయినా సరే పాఠశాలలు, పార్థ్రనాలయాలు, బోధకుల ఏర్పాటు కోసం ఆయా ధార్మిక సంస్థలు పూనుకోవాలిస్సన అవసరం ఎంతయినా ఉంది. సప్తవాహిక సందర్శనాల ధ్వారా కూడా వారి అఖీదాను చక్కదిద్ది మంచి ముస్లింలుగా తీర్చిదిద్దవచ్చు. పవ్రక్త (స) వారు విద్యకు, ధార్మిక విద్యకు ఇచ్చిన విలువ ఎలాంటిదో తెలియనిది కాదు. ‘కుమారునితోపాటు కుమార్తెను సయితం విద్యా బుద్ధులు నేర్పిన వ్యక్తికి స్వర్గ శుభవార్తను అందజేశారు’ పవ్రక్త ముహమ్మద్ (స).
పేదరికం:
”పేదరికం అవిశ్వాస అంచున కూర్చోబెడుతుంది” అన్నారు పవ్రక్త (స)- (బైహఖీ). ఈ పరిస్థితి పల్లె పాంతాల్లోనూ, పట్టణ స్లమ్ ఏరియాల్లోనూ ఎక్కువ చోటు చేసుకునే అవకాశం ఉంది. అందరి మానసిక స్థితి, స్థాయి ఒకేలాగుండదు గనక మనిషి తన మానాన్ని, పరివారాన్ని కాపాడుకునే నిమిత్తం కొన్ని సందర్భాలలో ధర్మం తప్పడం మనం చూస్తూనే ఉంటాము. ఇటువంటి పేద పాంతాలను టార్గెట్ చేస్తూ అటు కైస్త్రవ మిషనరీలు, ఇటు వివిధ సంస్థలు పని చేస్తాయి. వారి ఆర్థిక సమస్యలను తీర్చి, వారికి ఉచిత వైద్యాన్ని అందించి, ఉచిత విద్యా పేరుతో బిగువయిన ఉచ్చులో వారిని బంధించి ధర్మమార్గం నుండి తొలగించే కుయుక్తి పన్నుతాయి. పాథ్రమిక పాఠశాలలు అధికంగా ఉండేలా చూస్తూ, చిన్నతనం నుండే పిల్లల్లో అవిశ్వాస బీజాల్ని నాటేందుకు బరి తెగిస్తాయి. ”అవసరంలో ఉన్న వ్యక్తి అవసరాన్ని తీర్చిన వారి ఇహపర అవసరాల్ని అల్లాహ్‌ా తీరుస్తాడు, వారికి విస్తృత ఉపాధి నొసగుతాడు” అన్నారు పవ్రక్త (స)- ముస్లిం). విశ్వాసం విలువ ఏమిటో తెలిసిన సహృదయులు, సంపన్నులు అలాంటి వారిని ఆదుకునే నిమిత్తం ముందుకు రావాలి. అలా జరగని పక్షంలో వారి ధర్మభష్ట్రత్వానికి వీరూ సమాన భాగస్థులవుతారని గుర్తుంచుకోవాలి. ఈ నిమిత్తం వడ్డీ రహిత రుణాలు అందజేయడం ఫలవంతం కాగలదు. ”ఒక ముస్లిం మరో ముస్లిం సోదరునికి అప్పు ఇచ్చినట్లయితే, అంతే మొత్తం రెండు సార్లు దానం చేసిన పుణ్యం అతనికి లభిస్తుంది” అన్నారు పవ్రక్త (స) – (ఇబ్ను మాజహ్‌ా). అలాగే ”దానం పుణ్యం పదింతలు, రుణం పుణ్యం పద్దెనిమిదింతలు” అని స్వర్గద్వారంపై వాయ్రబడి ఉంటుందన్నారు” పవ్రక(స). (తర్గీబ్‌వత్తర్హీబ్)
అపోహ-కోరికల దాస్యం:
నేటి విద్యావిధానం అనండి, పింటింగ్, ఎలాక్టాన్రిక్ మీడియా అనండి పజ్రల్లో ఇస్లాం మరియు ముస్లిం పట్ల అపోహల్ని, అపార్థాల్ని విస్తృత స్థాయిలో పచ్రారం చేస్తున్నాయి. ఈ విష పచ్రార బారిన ముస్లిం యువత సయితం పడుతోంది. కారణం ఆయా రంగాల్లో సరయిన పత్య్రామ్నాయం లేక పోవడమే. లక్షల్లో ఫీజులు చెల్లించి చదివించే గొప్ప ధార్మిక నేపథ్యం గల కుటుంబాల పిల్లలు సయితం అన్యమనస్కంగానయినా సరే షిర్క్ పదాలను వల్లించాల్సిన, సూర్యనమస్కారాలు చేయాల్సిన దుస్థితి అంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇట్టి తరుణంలో చదువుకొనే వాతావరణాన్ని తొలగించి చక్కగా చదువుకునే వాతావ రణాన్ని కల్పించడం సుమతుల, సమాలోచనాపరుల, సంపన్నుల పథ్రమ కర్తవ్యం. అయితే ”ధనమే మనిషిని నడిపే ఇంధనం”గా భావించబడుతున్న ఈ ఆధునికంలో ఇది అంత తొందరగా కార్యరూపం దాలుస్తందని మాతం చెప్పలేము. దీనికి తోడు యువతీయువకుల్లోని విచ్చలవిడితనం, కోరికల దాస్యం కొన్ని సందర్భాలలో ధర్మ భష్ట్రత్వానికి కారణం అవుతున్నాయనడం అతిశయోక్తి ఎంత మాతం లేదు.ఏది ఏమయినా ధర్మభష్ట్రత్వానికి దొడ్డి దారులు ఎన్నో! షైతాన్ వాగ్గానం మనందరికి గుర్తే ఉంటుంది: ”నేను వీరి కోసం (మానవుల కోసం) నీ రుజుమార్గంలో (మాటు వేసి) కూర్చుంటాను. ఆపైన వారి ముందు నుంచీ, వారి వెనుక నుంచీ, వారి కుడి వైపు నుంచీ, వారి ఎడమ వైపు నుంచీ వాళ్లపై దాడి చేస్తాను”. (దివ్యఖుర్‌ఆన్-7:16,17)
బాహ్యా అస్వస్థతలో మతిస్థిమితం కోల్పోవడం అతి పెద్ద సమస్య అయితే, ఆత్మ అస్వస్థతలో మనసు చలించి మార్గ భష్ట్రత్వానికి దారి తీయడం దానికన్నా పెద్ద సమస్య. పుట్టుగుడ్డికి చూపు లేక పోవడం పెద్ద సమస్యయే కావొచ్చుగాక, కానీ బాగా చూడగలిగిన వ్యక్తి ఒక్కసారిగా చూపు కోల్పోవాల్సి రావడం దానికన్నా పెద్ద సమస్య. కాబట్టి మన మతిని, గతిని, మనస్థితిని కాపాడుకోవడం మనందరి విద్యుక్త ధర్మం!